NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ప్రాణాలు తీసిన ఫ్లెక్సీలు.. నలుగురు స్పాట్‌ డెడ్‌
ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.. విగ్రహావిష్కరణ ఇప్పటికే వివాదాస్పదం కాగా.. విగ్రహావిష్కరణ రోజునే విషాదం మిగిల్చింది. విద్యుత్ షాక్ నలుగురిని విగత జీవులుగా మార్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.. అయితే, గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాల మయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది.. చివరికి జిల్లా కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారుల చొరవతో సమస్య తీరింది. ఎట్టకేలకు సోమవారం విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసుకున్నారు నిర్వాహకులు. ఈ ఏర్పాట్లే నలుగురి ప్రాణాలను బలిగొంది. భారీ ఏర్పాట్ల నేపథ్యంలో ఫ్లెక్సీలు కడుతున్న నలుగురు యువకులకు కరెంట్ షాక్ తగలడంతో స్పాట్‌లోనే మృతిచెందారు.. మృతులను బొల్లా వీర్రాజు (25), కాశగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య(29)గా గుర్తించారు.. ఘటనా స్థలంలోనే నలుగురు యువకులు మృతిచెందడంతో విషాదచాయలు అలుముకున్నాయి.. మరో వ్యక్తి కోమటి అనంత రావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుజాము 3 గంటలకు జరిగిన ఈ ఘటనతో గ్రామంతో పాటు యావత్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం.. దర్శనానికి 4 గంటల సమయం
శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వెలిగించి.. మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం క్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనతో.. భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.. ముందస్తుగా ఆలయంలో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసింది.. భక్తులందరికి శ్రీమల్లికార్జునస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు..

గోదావరి తీరంలో దుర్గంధ ఘటన.. సిబ్బందితో వర్థ్యాలు తొలిగింపు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం కంపు కొడుతుందని ఎన్టీవీలో ప్రసారమైన వార్తకు గ్రామపంచాయతీ అధికారులు స్పందించారు. వెంటనే గోదావరి తీరం వద్ద చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి తీరంలో వ్యర్థాలు, భక్తుల‌ దుస్తులు, అస్థికల కుండలతో దర్శనమిస్తూ దుర్గంధ వాసనతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్టీవీ లో వార్త ప్రసారం అయ్యింది. దీంతో గ్రామపంచాయతీ అధికారులు స్పందించారు. వెంటనే సిబ్బందితో గోదావరి వద్దకు వచ్చి వర్థ్యాలను తొలిగిస్తున్నారు. గోదావరి తీరం పరిశుభ్రంగా చేస్తుండడంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం వద్ద వ్యర్థాలు,భక్తుల‌ దుస్తులు,కుండలతో దర్శనమిస్తూ దుర్గంధంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కావడంతో కాళేశ్వరానికి తెలంగాణ, ఏపి, మహరాష్ట్ర చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండే ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాంటి గోదావరి వద్ద స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించెందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయాన్ని దర్శించేముందు త్రివేణి సంగమమైన గోదావరి నదిలో పుణ్యస్నానాలు అచరించడం ఆనవాయితి. దీంతో పున్యస్నానాలకు వెళ్ళే భక్తులకు గోదావరి తీరంలో దుర్గంధం స్వాగతం పలుకుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎన్టీవీ ప్రచురించిన కథనంతో అధికారులు దిగివచ్చారు. వెంటనే గాదావరి తీరం మంతా దుర్గంధాన్ని ఉదయం నుంచే సిబ్బందితో తొలగించే పనిలో పడ్డారు. ఇది చూసిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వెంటనే స్పందించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు..
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. రాష్ట్రంలోని వేములవాడ, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి గోపూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భద్రాచలం వద్ద భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. హైదరాబాద్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

చెన్నైలో పారిశ్రామికవేత్త ఇంట్లో 16 ఏళ్ల బాలిక మృతి.. ఆరుగురు అరెస్ట్!
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పని చేస్తున్న 16 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక హత్య కేసులో పారిశ్రామికవేత్త ఆయన భార్య సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పాత కార్ల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం చేసే పారిశ్రామికవేత్త మహమ్మద్ నిషాద్.. గత ఏడాదిగా చెన్నై అమింజికరైలోని ఆయన ఇంటిలో పని చేస్తున్న తంజావూరుకు చెందిన 16 ఏళ్ళు బాలిక.. ఇంటి పనులు సక్రమంగా చేయడం లేదని బాలికను భార్యభర్తలు ఇద్దరు చిత్రహింసలకు గురి చేశారు. అయితే, దీపావళి రోజున బాలికకు ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టి, సిగరెట్ తో కాల్చి చిత్రహింసలకు గురి చేసి దారుణంగా కొట్టారు ఆ పారిశ్రామిక వేత్త కుటుంబ సభ్యులు. అయితే, వారు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక బాలిక మృతి చెందింది. భయంతో బాలికను బాత్ రూంలో పడేసి పారిశ్రామికవేత్త కుటుంబం పరారీ అయింది. ఇక, బాలిక కోసం అక్కడికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు విగత జీవిగా పడి ఉన్న మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పారిశ్రామిక వేత్త ఆయన భార్య సహా ఆరుగురిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు.

రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
ఉత్సాహంగా అమెరికా ఓటర్లు కనిపిస్తున్నారు. పోలింగ్‌ తేదీ కంటే ముందుగానే ఓటు వేసేందుకు కోట్ల మంది యూఎస్ పౌరులు ముందుకు వస్తున్నారు. రేపే (మంగళవారం) పోలింగ్‌ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇక, ముందస్తు ఓటింగ్‌కు ఓటర్లు గతంలో కంటే ఈసారి ఎక్కువగా వస్తుండటంతో పోలింగ్‌ కేంద్రాలను పెంచాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని 42 బ్రాడ్‌వేలో ఉన్న బోర్డు ఆఫ్‌ ఎలక్షన్స్‌ ఆఫీసు ఈ ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్, ఆయన డిప్యూటీ విన్సెంట్‌ ఇగ్నిజియో ఎన్నికల పనుల్లో స్పీడ్ పెంచారు. ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే న్యూయార్క్‌ రికార్డు సృష్టించగా.. అది ఇంకా కొనసాగుతోందని ర్యాన్‌ వెల్లడించారు. న్యూయార్కే కాదు.. అమెరికా మొత్తం ఇదే ట్రెండ్‌ నడుస్తుంది. మెయిల్స్, పోలింగ్‌ కేంద్రాల ద్వారా వారంతా ఓట్లు వేస్తున్నారు. ఇక, గత ఎన్నికల్లో న్యూయార్క్‌లో ముందస్తు పోలింగ్‌ కేంద్రాలను 100 ఏర్పాటు చేయగా.. ఈసారి 50 శాతం అధికంగా ఏర్పాటు చేశారు. అయితే, అసాధారణ వాతావరణ పరిస్థితులు, పోలింగ్‌ రోజున భారీ క్యూలతో ప్రజల ఇబ్బందులు, ఎన్నికల రోజున గొడవలు.. ముందస్తు ఓటింగ్‌కు కారణాలుగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌.. తనకు అనుకూలమైన నార్త్‌ కరోలినాలో మకాం వేశారు. డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రేపటి (మంగళవారం) వరకూ నార్త్‌ కరోలినాలో ఉండి ర్యాలీలు నిర్వహించాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా నజర్ పెట్టారు.

అన్నమయ్య ‘నటి కస్తూరి’ వివాదస్పద వ్యాఖ్యలు…
తమిళ సీనీ నటి కస్తూరి మరో సారి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలుగా ఉన్న నటి కస్తూరి ఆ పార్టీ నిర్వహించిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.  కస్తూరి మాట్లాడుతూ ” రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు. ‘ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు, ఇతరుల భార్యలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది.  నేను నాలుగేళ్ళుగా హైదారాబాద్ లో ఉంటున్న.ఇక్కడున్న కోందరిని మీరందరూ ద్రావిడ వాదుల అని అడిగితే అంటే ఎంటి అని అడిగారు. మీకంటే ఎక్కువగా తెలుగు మాట్లాడేవారు తమిళనాడులో పదవుల్లో ఉన్నారంటే. అవును కధ వారు కూడా రెడ్డిగారు కధ అని అంటున్నారు. అలా ఐదుగురు మంత్రులు తెలుగువారు డిఎంకే ప్రభుత్వం ఉన్నారు’ అని కస్తూరి పేర్కొన్నారు.

ఇప్పటికి 1500.. లెక్క తగ్గేదేలే..
పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప-2’ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ సినిమా రిలీజ్ ను తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉండనుంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లో వేరే ఏ సినిమా లేకుండా అన్ని థియేటర్స్ లో పుష్ప ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి దసరా నాడు తెలుగు స్టేట్స్ థియేటర్స్ అగ్రిమెంట్స్ మొదలు పెట్టారు. కాగా ఇప్పుడు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో మరో సెన్సేషన్ కు తెరలేపారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి ఓవర్సీస్ లో  1500 పైగా ప్రీమియర్స్ ను ఫిక్స్ చేసారు. ఈ రిలీజ్ దగ్గర పడే కొద్దీ పెరుగుతుంది తప్ప తగ్గేది లేదని తెలుస్తోంది. మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో పుష్ప – 2 ను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రీమియర్ రూపంలోనే దాదాపు 3 మిలియన్ కు పైగా వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ పై ఇండస్ట్రీ లో భారీ అంచనాలు ఉన్నాయి.