NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు.. అది రద్దు.. రిషికొండ చేరిక..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విజయనగరం షెడ్యుల్ రద్దు అయ్యింది. దీంతో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం అనకాపల్లి జిల్లాకు మారింది. శ్రీకాకుళం నుంచి నేరుగా పరవాడ ఫార్మా సిటీలోని లారస్ ఫార్మా కంపెనీ అడ్మిన్ బిల్డింగ్ కు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ అధికారులతో సమీక్ష, ఫొటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు చంద్రబాబు. అక్కడ నుంచి వెన్నెల పాలెం గ్రామానికి చేరుకుని రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రుషికొండకు చేరుకుంటారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం నిర్మించిన వివాదాస్పద టూరిజం భావనల్ని పరిశీలిస్తారు. సుమారు 500కోట్ల రూపాయలతో కట్టిన ఈ భావనాలను ఏ విధంగా వినియోగంలోకి తేవాలనే కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆకస్మికంగా వెళ్లి ఆ భవనాలను పరిశీలించిన విషయం విదితమే.. ఇక, ఇప్పుడు సీఎం చంద్రబాబు షెడ్యుల్ లో మార్పులు చోటు చేసుకోగా.. రుషికొండ యాడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 100 రోజుల ప్రభుత్వ పాలన , విశాఖ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఎలివెటెడ్ కారిడార్ ల నిర్మాణం, వైజాగ్ మెట్రో, నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంటు, వైజాగ్ ఐటీ వంటి కీలకమైన అంశాలపై సమీక్ష జరిగే అవకాశం వుంది.

ఏపీలో మరో దారుణం.. వివాహితపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం.. ఆపై హత్య..!
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి.. గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేసిన కడియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుర్రిలంకకు చెందిన దేవర యేసులోకి జయప్రసాద్, వెలుబుడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా మద్యం మత్తులో ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేసి ఆ తర్వాత హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుపై మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. చొప్పెల్ల లాకులు వద్ద మృతదేహం లభించాక అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారించడంతో.. కామాంధుల డొంక కదిలింది. దీనిపై అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపంగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. భర్త ఫిర్యాదుపై మొదట మిస్సింగ్ కేసు, మృతదేహం లభించిన తర్వాత అనుమానస్పద మృతి కేసు, పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత హత్య కేసుగా నమోదు చేసి కడియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించనున్నారు. రామాలయంతో పాటు, అన్నపూర్ణతో పాటు కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతి కార్తీక సోమవారం నాడు జ్యోతిర్లింగ, ఆకాశ దీపోత్సవాలు, నీరాజన మంత్ర పుష్ప పూజలు నిర్వహిస్తారు. 4న స్వామివారికి భస్మాభిషేకం, 11న చందనోత్సవం, 15న రుద్రాభిషేకం, 17న స్వామివారికి కల్యాణ మహోత్సవం, 18న పుష్పోత్సవం, 25న మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం ప్రసాద వినియోగం, ప్రవచనాలు ఉంటాయి. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నిర్దేశిత ప్రత్యేక రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు, 27న నాడి హారతి నిర్వహిస్తారు. దేవస్థానం ఆధ్వర్యంలో వ్యాపారాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వేదపండితులు సన్యాసి శర్మచే కార్తీక పురాణ ప్రవచనం, 6.30 గంటలకు లలిత సహస్రనామార్చన, రాత్రి 7 గంటలకు భద్రాచలం వాస్తవ్యులు లలిత, వాణిలచే భక్తి సంగీతం, రాత్రి 7.30 గంటల నుంచి నృత్య ప్రదర్శనలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.

జమ్మూకాశ్మీర్లో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదుల దాడి..
జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన సోఫియాన్ (25), ఉస్మాన్ మాలిక్ (25) శ్రీనగర్‌లోని జెవీసీ ఆసుపత్రి బెమీనాలో చేర్చారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కాగా, ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సహరాన్‌పూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే, సోఫియాన్, ఉస్మాన్ అనే కార్మికులు జలశక్తి శాఖలో రోజువారీ కూలీగా పని చేస్తున్నారు. ఇక, కాల్పుల గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత 12 రోజుల్లో సెంట్రల్ కశ్మీర్‌లో స్థానికేతరులపై ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి. అయితే, ఇంతకు ముందు.. జమ్మూ కాశ్మీర్‌లో స్థానికేతరులపై దాడి గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక వైద్యుడితో పాటు ఆరుగురు వలస కార్మికులు మరణించిన 12 రోజులు అయింది. ఆ ఘటనలో దాడికి గురైన డాక్టర్, కార్మికులు సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని గగనీర్‌ను సోనామార్గ్‌కు కలిపే Z-మోర్హ్ సొరంగంపై పని చేస్తున్న నిర్మాణ బృందంలో భాగం. అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. తరచుగా వలస కార్మికులపై ఉగ్రదాడులు జరగడంపై భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇండియన్ నేవీకి కొత్త ఆయుధం.. సిబ్బంది లేకుండా 600కి.మీ ప్రయాణించిన ‘మాతంగి’
దేశంలోనే తొలి అటానమస్‌ సర్ఫేస్‌ బోట్‌ మాతంగి శుక్రవారం కొత్త రికార్డు సృష్టించింది. ఈ బోటు డ్రైవర్ లేకుండా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సాగర్ డిఫెన్స్ కంపెనీ నిర్మించిన ఈ బోటు ముంబై నుంచి తమిళనాడులోని టుటికోరిన్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. మొదటి స్టాప్‌లో ఈ పడవ అటానమస్ మోడ్‌లో 600 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ బోట్ ప్రత్యేకత ఏంటంటే.. డ్రైవరు ఉన్నా లేకున్నా కూడా వాడుకోవచ్చు. ఢిల్లీలో స్వావలంబన్ 2024 కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేవీ సాగరమాల పరిక్రమను జెండా ఊపి ప్రారంభించారు. సిబ్బంది లేని ఈ బోటును కూడా ఈ కార్యక్రమంలో చేర్చారు. నౌకాదళంలో చేరడం కొత్త బలాన్ని అందిస్తుంది. రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద విజయం. ఇది దేశంలోనే తయారు చేయబడిన మొట్టమొదటి స్వయంప్రతిపత్త ఉపరితల పడవ, ఇది ఎటువంటి సిబ్బంది లేకుండా నడుస్తుంది. దాని మిషన్‌ను పూర్తి చేస్తుంది. ఇది నిఘా, భద్రత కోసం ఉపయోగించబడుతుంది. ఇందులో అనేక రకాల హైటెక్ సెన్సార్లు, ఆయుధాలు, డ్రోన్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఈ పడవను విభిన్నంగా చేస్తాయి. ఈ పడవలో చాలా ఆయుధాలు అమర్చబడ్డాయి. ఇవి దూకుడు మిషన్లకు అనుకూలంగా ఉంటాయి. అవసరమైతే ఈ పడవ శత్రువుపై కూడా దాడి చేయవచ్చు. ఇందులో ఎయిర్ డ్రోన్‌లతో పాటు ఏడు నీటి అడుగున డ్రోన్‌లు కూడా ఉన్నాయి. ఎయిర్ డ్రోన్లు గాలిలో దాని పరిధిని పెంచుతాయి. ఇది పర్యవేక్షణను సులభతరం చేస్తుంది.

అమెరికాలో మళ్లీ కాల్పులు.. హాలోవీన్ పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి
అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌కు ఉత్తరాన ఉన్న నార్త్‌గ్లెన్ నగరంలో హాలోవీన్ సందర్భంగా ఇంట్లో జరిగిన పార్టీలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. నార్త్‌గ్లెన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు అర్ధరాత్రి తర్వాత ఇంటి పార్టీకి స్పందించారని, ఒకరు చనిపోయారని, మరో ఐదుగురు తుపాకీ గాయాలతో బాధపడుతున్నారని కనుగొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా ఇద్దరు మృతి చెందారని తెలిపారు. ఇప్పటి వరకు అనుమానితులను అదుపులోకి తీసుకోలేదని, అయితే ఈ ఘటన వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణకు సహాయపడే ఏదైనా సమాచారం అందించాలని ప్రజలను కోరారు. నిజానికి అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడం లేదు. ఇప్పుడు అమెరికాలోని అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు అధికారి సమాచారం అందించారు. బర్మింగ్‌హామ్‌లోని ఫైవ్ పాయింట్స్ సౌత్ జిల్లాలో రాత్రి 11 గంటల తర్వాత ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని పోలీసు అధికారి ట్రూమాన్ ఫిట్జ్‌గెరాల్డ్ మీడియాకు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. కాల్పులు జరిగినప్పుడు క్లబ్ పోషకులు మాగ్నోలియా అవెన్యూలోని హుక్కా, సిగార్ లాంజ్ వెలుపల వరుసలో నిలబడి ఉన్నారు.

టీమిండియాకు వైట్‌వాష్‌ తప్పాలంటే.. రెండోరోజు ఆటే కీలకం!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే భారత్‌ కోల్పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ వైట్‌వాష్‌ కాకుండా చూసుకోవాల్సిన దానిపై టీమిండియాపై ఉంది. అందుకు తగ్గట్టుగానే ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు బాగా రాణించారు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో మొదటిరోజు కివీస్‌ను 235 రన్స్ కే ఆలౌట్‌ చేశారు. బ్యాటింగ్‌లో మాత్రం ఇప్పటికే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 86/4 స్కోరుతో భారత్ కొనసాగుతోంది. ఇంకా 149 రన్స్ వెనకబడి ఉంది. ఈక్రమంలో ఇవాళ (శనివారం) ఆట అత్యంత కీలకమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ఆధిక్యం సాధిస్తేనే మ్యాచ్‌ విజయంపై టీమిండియాకు ఆశలు ఉంటాయి. అలా జరగాలంటే మొదటి సెషన్‌ అత్యంత కీలకం కానుంది. ఈ సెషన్‌లో వికెట్లు పడకుండా.. న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు చేరువవ్వాలి. ఇక, తొలిరోజు భారత బౌలర్లు దాదాపు 66 ఓవర్లు వేయగా.. 11 ఓవర్లు మాత్రమే పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్‌ సంధించారు. మిగతా 55 ఓవర్లను స్పిన్నర్లు రవీచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వేశారు. 10 వికెట్లలో 9 వికెట్లు ఈ స్పిన్ దయం పడగొట్టారు. ఇక కివీస్‌ స్పిన్నర్ అజాజ్‌ పటేల్‌ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 14 వికెట్లలో ఒకటి రనౌట్‌ కాగా.. మిగతా 11 వికెట్లను స్పిన్నర్లే తీసుకున్నారు. తొలిరోజు నుంచే స్పిన్‌దే ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రోజులన్నింట్లోనూ మరింత సవాల్‌ ఎదురుకానుంది. నాలుగో ఇన్నింగ్స్‌ ఆడటం మరింత కష్టంగా మారే అవకాశం ఉంది.

టీమిండియాకు వైట్‌వాష్‌ తప్పాలంటే.. రెండోరోజు ఆటే కీలకం!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే భారత్‌ కోల్పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ వైట్‌వాష్‌ కాకుండా చూసుకోవాల్సిన దానిపై టీమిండియాపై ఉంది. అందుకు తగ్గట్టుగానే ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు బాగా రాణించారు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో మొదటిరోజు కివీస్‌ను 235 రన్స్ కే ఆలౌట్‌ చేశారు. బ్యాటింగ్‌లో మాత్రం ఇప్పటికే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 86/4 స్కోరుతో భారత్ కొనసాగుతోంది. ఇంకా 149 రన్స్ వెనకబడి ఉంది. ఈక్రమంలో ఇవాళ (శనివారం) ఆట అత్యంత కీలకమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ఆధిక్యం సాధిస్తేనే మ్యాచ్‌ విజయంపై టీమిండియాకు ఆశలు ఉంటాయి. అలా జరగాలంటే మొదటి సెషన్‌ అత్యంత కీలకం కానుంది. ఈ సెషన్‌లో వికెట్లు పడకుండా.. న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు చేరువవ్వాలి. ఇక, తొలిరోజు భారత బౌలర్లు దాదాపు 66 ఓవర్లు వేయగా.. 11 ఓవర్లు మాత్రమే పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్‌ సంధించారు. మిగతా 55 ఓవర్లను స్పిన్నర్లు రవీచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వేశారు. 10 వికెట్లలో 9 వికెట్లు ఈ స్పిన్ దయం పడగొట్టారు. ఇక కివీస్‌ స్పిన్నర్ అజాజ్‌ పటేల్‌ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 14 వికెట్లలో ఒకటి రనౌట్‌ కాగా.. మిగతా 11 వికెట్లను స్పిన్నర్లే తీసుకున్నారు. తొలిరోజు నుంచే స్పిన్‌దే ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రోజులన్నింట్లోనూ మరింత సవాల్‌ ఎదురుకానుంది. నాలుగో ఇన్నింగ్స్‌ ఆడటం మరింత కష్టంగా మారే అవకాశం ఉంది.

వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ.. దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ
జానీ మాస్టర్.. గత రెండు నెలలుగా ఈ పేరు తెగ వినపడుతున్న విషయం తెలిసిందే. ఆయన దగ్గర పనిచేసే ఓ మహిళ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయిన జాని.. ఈ మధ్యనే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇక జైలు నుంచి విడుదలైన ఈ స్టార్ కొరియోగ్రాఫర్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. ఎక్కువగా ఆయన తన కుటుంబ సభ్యులతోనే సమయం కడుగుతున్నట్లు సమాచారం. ఈ మధ్యనే పండగను చేసుకోవడానికి జానీ తన కుటుంబంతో కలిసి నెల్లూరుకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కాస్త ఘనంగానే దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేశారు. ఈ పోస్టులో అతడు తన కుటుంబం దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. వాళ్ల కేరింతలే మన సంతోషం అంటూ రాసుకోవచ్చాడు. ఈ పండుగనాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి అంటూ రాసుకోవచ్చాడు. జానీ మాస్టర్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే.. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ ద్వారా ఆయన అభిమానులు, కొందరు సోషల్ మీడియా వినియోగదారులు జానీ మాస్టర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరైతే జానీ మాస్టర్ ఇలా సంతోషంగా చూసి చాలా రోజులైంది అంటూ కామెంట్స్ చేశారు.

కూతురికి నామకరణం చేసిన రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులు.. పేరేంటంటే?
దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్‌ సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు అయ్యారు. దీపికా కుమార్తెకు జన్మనిచ్చింది. అప్పటి నుండి అభిమానులు వారి కుమార్తెను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే దీపావళి సందర్భంగా దీపిక, రణవీర్ తమ ఇంటి లక్ష్మి ఫోటోను పంచుకున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం తమ కుమార్తె ఫోటోను పంచుకున్నారు. ఇందులో కూతురి ముఖం కనిపించక పోయినా.. ఆమె పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కూతురు రెడ్ కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ ధరించి ఉండటం ఫోటోలో కనిపిస్తోంది. దీంతో పాటు ఇద్దరూ తమ కుమార్తె పేరును కూడా ప్రకటించారు. సోషల్ మీడియాలో ‘దువా పదుకొనే సింగ్’ అని రాసుకొచ్చారు. దువా అంటే ప్రార్థన. ఎందుకంటే, పాప మా ప్రార్థనలకు సమాధానం. మా హృదయలు ప్రేమతో నిండి ఉన్నాయి అంటూ తెలిపారు. ఈ పోస్ట్‌పై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అలియా భట్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. డయానా పెంటీ కూడా చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చింది. రణవీర్ చాలా సార్లు కూడా ఇంటర్వ్యూలలో దీపిక గర్భం గురించి మాట్లాడటం కనిపించింది.

Show comments