సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం బిజీ బిజీ.. మూడో రోజు షెడ్యూల్ ఇదే..
సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండు రోజుల పాటు కీలక సమావేశాలు, చర్చల్లో పాల్గొన్న ఆయన.. మూడు రోజు సింగపూర్ అధ్యక్షుడు, మంత్రులు, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. ముఖ్యంగా నేడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు.. క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతో చర్చలు జరపున్నారు.. సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు.. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం.. సింగపూర్ పర్యటనలో మూడో రోజూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం కాబోతున్నారు.. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు సాగనున్నాయి.. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్ తోనూ భేటీ అవుతారు.. సింగపూర్ లోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం.
నాసా-ఇస్రో కీలక ప్రయోగం.. భూమిపై అణువణువు స్కాన్..!
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. నాసాతో కలిసి కీలక ప్రయోగానికి రెడీ అయ్యింది.. రేపు జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ను ప్రయోగించనుంది.. దీని కోసం ఇవాళ మధ్యాహ్నం 2.10 గంటలకి కౌంట్ డౌన్‌ను ప్రారంభించనుంది.. కౌంట్‌డౌన్ ప్రక్రియ పూర్తి చేసి.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండో లాంచ్ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5.40 గంటలకి ప్రయోగాన్ని చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి నిసార్ ఉపగ్రహాన్ని పంపించనున్నారు.. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన 2,393 కిలోల బరువుగుల నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నారు.. భూమి అణువణును 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయగల సామర్థ్యం ఈ నిసార్ సొంతం.. అడవులు, మైదానాలు, కొండలు పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటిని అధ్యయనం చేయనుంది నిసార్.. ఇందులో నాసాకి చెందిన ఎల్-బ్యాండ్, ఇస్రోకి చెందిన ఎస్-బ్యాండ్ ర్యాడార్లని అమర్చారు శాస్త్రవేత్తలు.. ఇక, జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్ ప్రయోగం నేపథ్‌యంలో శ్రీహరికోటకి రానున్నారు నాసా శాస్త్రవేత్తలు..
9వ క్లాస్ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. గర్భవతి కావడంతో..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం వెలుగు చూసింది.. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు.. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు.. ఇదే అదునుగా భావించి.. విద్యార్థినిపై జయరాజు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది.. అయితే, ప్రస్తుతం పదోవ తరగతి చదువుతుంది ఆ విద్యార్థిని.. 3 నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు నిర్వహించి.. గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్ లో బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు.. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
లండన్ మేయర్ దుష్టుడు.. బ్రిటన్ ప్రధాని పక్కన ఉండగానే ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నోటికి పని చెప్పారు. ఇటీవల న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మమ్దానీ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ అంగీకరించలేదు. తాజాగా స్కాట్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్.. పక్కన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఉన్న విషయం కూడా లెక్క చేయకుండా లండన్ మేయర్‌పై దూషణ పర్వం కొనసాగించారు. లండన్ మేయర్ దుష్టుడు అని.. అతడు చేయకూడని పని చేశాడంటూ మండిపడ్డారు. సెప్టెంబర్‌లో లండన్‌లో పర్యటించనున్నారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా ట్రంప్ సమాధానం ఇచ్చారు. తానేమీ మేయర్ అభిమానిని కాదని.. అతడు చేయకూడని పని చేశాడంటూ వ్యాఖ్యానించారు.
కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష రద్దు!.. గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ధృవీకరణ
నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠ. పరాయి దేశంలో భారతీయ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష రద్దవుతుందా లేదా? అని.. రద్దు అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. మొత్తానికి ప్రభుత్వ కృషి, ప్రజల ప్రార్థనలతో నిమిషా ప్రియకు మరణ శిక్ష తప్పింది. యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేశారు. దీనికి సంబంధించి గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక లిఖిత పూర్వక ధృవీకరణ రాలేదని కూడా ప్రకటనలో స్పష్టం చేశారు. గతంలో సస్పెండ్ చేయబడిన నిమిషా ప్రియ మరణశిక్షను ఇప్పుడు పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.
ఇది కదా కావాల్సింది.. మెర్క్యురీ నుంచి బంగారం ఉత్పత్తి.. అమెరికన్ స్టార్టప్ సంచలనం
బంగారం అలంకరణ కోసం మాత్రమే కాదు.. పెట్టుబడిదారులకు మొదటి ప్రాధాన్యతగా మారింది. దీనికి గల కారణం గోల్డ్ ధరల పెరుగుదల. ఇదే సమయంలో సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పసిడి ధరలు తగ్గుతే బావుండు అని ఆలోచించే వారు లేకపోలేదు. ఇలాంటి వారికి బిగ్ రిలీఫ్ ఇవ్వబోతోంది ఓ అమెరికన్ స్టార్టప్ కంపెనీ. పాదరసాన్ని బంగారంగా మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నట్లు ఓ అమెరికన్ స్టార్టప్ పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ అణు సంలీన ప్రక్రియ ద్వారా పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయవచ్చని తెలిపింది. స్టార్టప్ ప్రకారం, బంగారం తయారీ ఫ్యూజన్ ప్లాంట్ ఒక గిగావాట్ థర్మల్ పవర్‌కు ఒక సంవత్సరంలో ఐదు వేల కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని తెలిపింది.
‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?
అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సతీ లీలావతి’. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా నుంచి, మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను.. జూలై 29 ఉదయం 10:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ఆకట్టుకునే పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. సినిమాలో లావణ్య – దేవ్ మోహన్ మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్, కామెడీ పంచులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని, టీజర్ మాత్రం ఫుల్ ఫన్ రైడ్ గా ఉండబోతుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు నాగ మోహన్ వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి గత కొన్ని చిత్రాల్లో సీరియస్ రోల్స్ చేసినప్పటికీ, ఈ సినిమాతో మళ్లీ ఫన్ & ఫ్రెష్ గ్లామర్ లుక్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశముంది. ఇక జూలై 29న టీజర్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జేమ్స్ కామెరూన్ అవతార్ 3 ట్రైలర్ ఇంకా చూడలేదా.. ఇక్కడ చూసేయండి
జేమ్స్ కెమెరూన్ సినిమాలకు వరల్డ్ సినిమాలో ఓ స్పెషల్ పేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్సాఫీసును షేక్ చేశాడు కామెరూన్. ఆయన సినిమాలు స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా కలెక్షన్స్ రాబడతాయి. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ అవతార్ ద వే ఆఫ్ వాటర్ భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అవతార్ ఫ్రాంచైజీ నుండి టూ ఫిల్మ్స్ రాగా, ఇప్పుడు థర్డ్ మూవీ రాబోతుంది.
మరో వివాదంలో నటి కల్పిక.. రిసార్ట్‌లో హంగామా..
టాలీవుడ్ సినీ నటి కల్పిక మరోసారి వివాదం సృష్టించింది. ఈసారి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన రిసార్ట్ సిబ్బందిని పూర్తిగా అయోమయంలోకి నెట్టింది. ఒక్కసారిగా మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖంపై విసరడం, అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడటం వంటివి కల్పిక చేయడంతో.. సిబ్బంది ఆశ్చర్యంగా, అసహ్యంగా చూసారు. అంతే కాకుండా, సిగరెట్లు కావాలంటూ పని చేస్తున్న సిబ్బందిపై కూడా దుర్బాషలాడినట్లు తెలిసింది. మొత్తం 40 నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో నానా నాటకాలు, వేధింపులతో న్యూసెన్స్ సృష్టించింది కల్పిక.దీని కారణంగా, ఇతర అతిథులు కూడా అసౌకర్యానికి గురయ్యారని సిబ్బంది చెబుతున్నారు. ఆమె ప్రవర్తన చూస్తుంటే ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలు ఉన్నాయేమో అన్న అనుమానాలు సిబ్బందిలో వ్యక్తమయ్యాయి.
