పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్.. మధ్యాహ్నం బెంగళూరుకు మాజీ సీఎం..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రెండవ రోజు పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల చేరుకున్నారు వైఎస్ జగన్.. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా.. ఈ రోజు ఉదయం 9 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో ఉన్న వైయస్సార్ పౌండేషన్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునికరించిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 12. 20 గంటలకు పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు.. మార్చి 3 లేదా ఆ తర్వాత బెంగళూరు నుంచి తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారట వైఎస్ జగన్..
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భక్తజనసంద్రంగా కోటప్పకొండ..
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు, శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం స్వామి, అమ్మవార్లు పుష్ప పల్లకిలో విహరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వేడుకలతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు.. సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు నందివాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారికి పాగలంకరణ ఉండగా.. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..
నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10.30కు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం భేటీ కానున్నారు. బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. అలానే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంను పూర్తిస్థాయిలో ప్రధానికి వివరించనున్నారు. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మోడీతో సీఎం రేవంత్ ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ సమాచారం రావడంతో.. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్.. దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం అవుతున్నారు. నేటి భేటీలో మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడం లాంటి విషయాలు చర్చించనున్నారు. అలానే విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను ప్రధానికి సీఎం విన్నవించనున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. కారులోని ఐదుగురు సజీవదహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న ముసిరి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పిన అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అరంతంగి నుంచి తిరుపూర్ వెళ్తున్న ప్రభుత్వ బస్సును కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం.. పొలిటికల్ ఎంట్రీపై నిశాంత్ ఏమన్నారంటే..!
బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు జేడీయూ-బీజేపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. ఈసారి ఎక్కువ సీట్లు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై పోస్టర్లు వెలిశాయి. నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ‘‘బీహార్ కరే పుకార్, ఆయే నిశాంత్ కుమార్’’ అనే నినాదంతో పాటు ఆయన చిత్రంతో కూడిన జేడీ(యూ) పోస్టర్లు రాష్ట్రంలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నిశాంత్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
నేటితో ముగుస్తున్న కుంభమేళా.. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా మహా శివరాత్రి పండుగతో ముగుస్తోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా దాదాపు 45 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో 63.36 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళా నిలిచింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దగ్గర కోట్లాది మంది భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించారు. ఇదిలా ఉంటే ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం ప్రగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక గుడారాలు, టాయిలెట్లు ఏర్పాటు చేసింది. అలాగే ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసింది. ఇక తప్పిపోయిన వారి సమాచారం తెలియజేసేందుకు 24 గంటలు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వైద్య సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
మెరిసిన సచిన్, యువరాజ్.. ఇంగ్లాండ్‌పై భారత్ విజయం!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ‘ఇండియా మాస్టర్స్’ దూసుకెళుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. సచిన్ 21 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. యువరాజ్ సింగ్ 14 బంతుల్లో 27 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంక మాస్టర్స్‌పై ఇండియా మాస్టర్స్ గెలిచిన విషయం తెలిసిందే. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసింది. ధవళ్ కులకర్ణి (3/21), పవన్ నేగి (2/16), అభిమన్యు మిథున్ (2/27)ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఇయాన్ మోర్గాన్ (14), మస్టర్డ్ (8), అంబ్రోస్ (23), మాడీ (25), బ్రెస్నన్ (16)లు పరుగులు చేశారు.
అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్‌లో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. విదాముయార్చి తో నిరాశపడిన అజిత్ ఫ్యాన్స్ కు GBA భారీ హిట్ ఇస్తుందని ధీమాగా ఉన్నారు. మార్క్ ఆంటోని విజయం తర్వాత, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్ ను ఫ్యాన్స్ కోరుకున్న విధంగా చూపిస్తున్నాడు. కాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకిటించారు మేకర్స్. ఈ నెల 28న గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ వీడియో రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష కృష్ణన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. రమ్య పాత్రలో త్రిష కనిపించనుందని ఇటీవల రిలిజ్ చేసిన వీడియో ఆకట్టుకుంది. కోలీవుడ్ సీనియర్ నటుడు ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సౌండ్‌ట్రాక్ అందించగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏప్రిల్ 10, 2025న విడుదలవుతున్న ఈ చిత్రం వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
నా మొదటి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకం : సమంత
సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో తనకు కావలసినంత స్టార్ డమ్‌ను తాను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ వంటి ఇండస్ట్రీ లో నటించి తన కంటూ తిరుగులేని ఫ్యాన్స్ బేస్ ఏర్పర్చుకుంది. ఇక ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలల పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న సామ్ తిరిగి కెరీర్ మొదలు పెట్టింది.కానీ ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా ఎక్కువ తన పర్సనల్ లైఫ్ ద్వారా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సమంత నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘మా ఇంటి బంగారం’ ఒకటి.ఈ సినిమాలో ఆమె నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా మరోపక్క ఈ సినిమానే కాకుండా, ప్రముఖ దర్శకులు రాజ్-డీకే తెరకెక్కిస్తున్న ‘రక్త బ్రహ్మాండం’ వెబ్ సిరీస్‌లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘సినిమాలు నా మొదటి ప్రేమ. నేను ఇకపై నటనకు దూరంగా ఉండలేను. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చాను. తిరిగి మీ సామ్ మీ ముందుకు వరుస చిత్రాలతో వస్తుంది’ అంటూ భావోద్వేగంగా తెలిపింది. ఈ మాటలకు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. మేము కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘కాంచన 4’ లో పూజా హెగ్డే ఛాలెంజింగ్ రోల్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలోనే దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తెలుగులో పూజ కనిపించి సుమారు మూడేళ్లు అవుతోంది. చివరిసారిగా ఆమె ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లో కనిపించి తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే ఇప్పుడు తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. కేవలం తమిళ్‌లో మాత్రం పలు క్రేజీ ప్రాజెక్టులను క్యూలో పెట్టింది. ఇప్పటికే స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘రెట్రో’ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్న పూజా, తమిళ స్టార్ హీరో విజయ్ ‘జన నాయగన్’ మూవీలోనూ నటిస్తోంది. అలాగే ఈ రెండు మూవీస్ తో పాటుగా రాఘవ లారెన్స్ హారర్ సిరీస్ మూవీ ‘కాంచన 4’లోనూ పూజా హెగ్డే నటిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీలో తన పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఏంటి అంటే..