డ్రైవర్ హత్య కేసులో ట్విస్ట్..! ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు సిట్ నోటీసులు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ చేయాలని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు సిట్ అధికారులు. పునర్విచారణ చేసి 90 రోజుల్లోపు అడిషనల్ చార్జీ షీట్ దాఖలు చేయాలని న్యాయస్థానం గత నెల 22న ఆదేశాలు ఇచ్చింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ గన్ మెన్ ను విచారణ చేశారు… మరోవైపు అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గతో పాటు ఇద్దరు అనుచరులు గంగాధర్, ప్రవీణ్ లను కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.. దానిపై వాళ్లు హైకోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తుంది.. దీనికి సిట్ కూడా కౌంటర్ వేయాల్సి ఉంటుంది.. ఏ కారణం చేత వాళ్ళని విచారణ చేయాలని అనుకుంటున్నారు అనేది కోర్టుకు స్పష్టం చేయాల్సి ఉంటుంది.. నోటీసులు ఇచ్చిన వ్యవహారంలో కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు సిట్ బృందం.. దానికి అనుగుణంగా గతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన కొన్నిరోజుల తర్వాత అనంతబాబుని అదుపులోకి తీసుకుని ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. కానీ ఆ సమయంలో ఫోన్ నుంచి ఎటువంటి వివరాలు తీసుకోలేదని సిట్ బృందం ప్రాథమికంగా అంచనాకి వచ్చింది… హత్య జరగక ముందు ఎమ్మెల్సీ ఎవరెవరితో మాట్లాడారు అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.. వాట్సాప్ కాల్స్ ఆడియో వీడియో కాల్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.. గతంలో ఫోన్ స్టేట్ ఫోరెన్సీక్ ల్యాబ్ కి పంపిన పాస్ వర్డ్ ఇవ్వలేదు.. అప్పుడు ఆ ఫోన్ లాక్ తీయాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలి.. ఆ దిశగా కూడా కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతుంది సిట్… హత్య జరిగినప్పుడు అనంతబాబు తో పాటు కారులో ఎవరూ లేరని గత విచారణలో తేల్చారు అధికారులు. దానికి అనుగుణంగా కూడా మరింత సమగ్రంగా సమాచారం సేకరిస్తున్నారు .. అవసరమైతే మరింత మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తామని అధికారులు అంటున్నారు.. ఇప్పటికే కోర్టు ఇచ్చిన గడువులో ఒక నెల అయిపోయింది కాబట్టి మరింత త్వరితగతిన విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.. దానికి అనుగుణంగా అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు
కుబేర మూవీ తరహాలో భారీ స్కామ్.. లబోదిబోమంటున్న బాధితులు..
కుబేర సినిమా చూశారుగా .. సేమ్ అచ్చం అలానే స్క్రిప్ట్‌తో కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు నిందితులు. ఫేక్ సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టి, అందులో అమాయకులను ఉద్యోగులుగాచూపించి, వారి పేరు మీద లక్షలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు చెల్లించాలంటూ .. బాధితులకు నోటీసులు వస్తున్నాయి. అంతేనా.. ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో తమను రక్షించాలంటూ బాధితులు.. పోలీసులను వేడుకుంటున్నారు. ఈ కేసును ముత్తుకురు పోలీసులు విచారణ చేస్తుండగా.. లోన్ చెల్లించాలని బాధితులకు నోటీసులు వస్తుండడం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. డబ్బులు రికవరీ చేయడానికి చెన్నైలోని ఓ ప్రయివేటు ఏజెన్సీతో బ్యాంకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితులకు నోటీసుల మీద నోటీసులు అందుతున్నాయి. అయితేపోలీసులు మాత్రం కేసు విచారణలో ఉందంటున్నారు. యాక్సెస్ బ్యాంకు కుంభకోణంలో సూత్రదారులు దర్జాగా తిరుగుతూ ఉంటే.. బాధితులు లబోదిబో అంటున్నారు. ఆన్‌లైన్ లోని లొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు ఈ భారీ స్కామ్ కి పాల్పడ్డారు. వ్యక్తులకూ సంబంధం లేకుండా నేరుగా.. ఆన్‌లైన్ ద్వారా లోన్స్ ఇవ్వొచ్చని RBI తీసుకొచ్చిన పాలసీని నిందితులు పక్కాగా ఉపయోగించుకుని స్కామ్ చేశారు. జాలే వాసుదేవ నాయుడు, అల్లాభక్షు మరో ఇద్దరు కలిసి ఫేక్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు సృష్టించారు. అందులో అమాయక ప్రజల్ని ఉద్యోగులుగా చూపించి.. వారి ఆధార్ కార్డులతో ఆన్‌లైన్‌లో లోన్లు తీసుకున్నారు. ఒక్కో వ్యక్తి పేరుతో 14 లక్షల నుంచి 50 లక్షలు దాకా రుణాలు తీసుకున్నారు.
మూసీ వైపు దారితీసిన రహస్య ప్రయాణం
ప్రేమించి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకుని.. గొప్పగా జీవించాలనుకున్న తాపత్రయంతో సంసారం హైదరాబాద్‌లో పెట్టాడు. కోరి పెట్టుకున్న కాపురంలో కలహాలు మొదలయ్యాయి. చీటికిమాటికి భార్య, భర్త గొడవ పడ్డారు. పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టుకున్నారు. తిట్టుకున్నారు… కొట్టుకున్నారు.. కేసులు కూడా పెట్టుకున్నారు. కానీ.. మళ్లీ ఒకటయ్యారు. కలిసుంటారు లే అనుకున్న పెద్దలకు ఊహించని షాక్ తగిలింది..!! ఈసారి జరిగిన గొడవ ఏకంగా భార్యను హత్య చేసే వరకు వెళ్లింది. హత్య కూడా మామూలుగా కాదు… చంపి, ఆపై ముక్కలుగా నరికి.. మూట కట్టి మూసీలో వేశాడు. హర్రర్ క్రైమ్ కథా చిత్రాన్ని తలదన్నేలా ప్లాన్ చేసి మరీ చంపాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకి చెందిన స్వాతి అలియాస్ జ్యోతిది యాదవ సామాజిక వర్గం. అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి.. స్వాతి ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకుని వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. కానీ.. పెద్దలను ఎదిరించారు. పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని.. తమను కాదన్న వాళ్లముందే గొప్పగా బతకాలని నిర్ణయించుకుని మకాం హైదరాబాద్‌కి మార్చారు. స్వాతి ఓ కాల్ సెంటర్‌లో టెలీకాలర్‌గా ఉద్యోగంలో చేరింది. మహేందర్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా చేయసాగాడు…
బీహార్‌కు సీఎం రేవంత్, మంత్రులు.. ఎందుకంటే..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌లోని ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా బీహార్లో చేరారు. ఈ యాత్ర రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీహార్‌లో జరుగుతున్న ఓటర్ అధికార ప్రాజెక్టుకు మద్దతు వ్యక్తం చేయడం లక్ష్యంగా ఉంటుంది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రుల సమూహం బీహార్ లోని వివిధ ప్రాంతాల్లో ప్రజలతో సైనికంగా కలిసే అవకాశాన్ని అందుకుంటారని అధికారులు తెలిపారు. రాహుల్ గాంధీ యాత్రకు తెలంగాణ నేతల మద్దతు పార్టీ ఒక భాగస్వామ్య సూచనగా, ఎన్నికల ప్రభావాన్ని పెంచే విధానంలో చూడబడుతోంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కూడా యాత్రలో భాగంగా ఉంటారని సమాచారం తెలుస్తోంది.
రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!
భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా భారత్‌పై మరో 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. దీంతో ఆసియాలోనే భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టింది.
వరకట్న పిశాచికి మరొకరు బలి.. కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం
వరకట్న పిశాచికి మరొకరు బలి అయ్యారు. ఒక లెక్చరర్.. కుమార్తెతో సహా సజీవదహనం అయింది. ఈ ఘోర విషాద ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. సంజు బిష్ణోయ్… జోధ్‌పూర్ జిల్లాలో లెక్చరర్‌గా పని చేస్తోంది. అయితే ఇంట్లో నిత్యం భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారు. ఈ వేధింపులు రోజురోజుకు మరింత తీవ్రం కావడంతో విసుగెత్తిపోయింది. దీంతో మూడేళ్ల కుమార్తె యశస్వితో కలిసి పెట్రోల్ పోసుకుని సజీవదహనం అయ్యారరు. ఘటనాస్థలిలోనే కుమార్తె ప్రాణాలు వదలగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజు శనివారం మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.
బడా నిర్మాత చేతికి నైజాం ‘OG’ థియేట్రికల్ రైట్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో మాకంటే మాకు అని పోటీ పడి మరి కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రాలో రాజకీయ పార్టీలకు చెందిన ఓ ఎంపీ OG రైట్స్ ను కొనుగోలు చేసారంటే అర్ధం చేసుకోండి పవర్ స్టార్ సినిమా క్రేజ్ ఎలా ఉందొ. ఇక నైజాంలోను ఓజి కోసం పోటీ ఎక్కువగానే ఉంది. అనేక బేరసారాల అనంతరం రూ. 46కోట్లకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతికి OG నైజాం రైట్స్ వెళ్లాయి. వచ్చే నెల 25న OG రిలీజ్ కాబోతుంది. పోటీగా వస్తుందనుకున్న బాలయ్య – బోయపాటిల అఖండ 2 డిసెంబరుకి వెళ్ళింది. దాంతో పవర్ స్టార్ సినిమాకు సోలో రిలీజ్ దొరకడంతో నైజాంలో సింగిల్ స్క్రీన్స్ మొత్తం ఓజి వేసేలా భారీగా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. నైజాంలో ఓజి ఓపెనింగ్స్ భారీ నెంబర్ కనిపించే అవకాశం ఉంది.
సుందరకాండ.. ఇన్ సైడ్ టాక్ చాలా బాగుందట?
హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో ఈ చిత్రం రానుంది. శ్రీ దేవి విజయ్ కుమార్ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా గతేడాది సెప్టెంబరు 6న థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో కాస్త గట్టిగానే చర్చించుకుంటున్నారు. సుందరకాండ చాలా బాగా వచ్చిందట. సత్య, నారా రోహిత్ కామెడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని పండగకు హాయిగా నవ్వుకునే సినిమా అవుతుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటరైనర్ గ తెరకెక్కించాడట. నారా రోహిత్ కు సాలిడ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ సుందరకాండ అని చర్చించుకుంటున్నారు. శ్రీ దేవి విజయ్ కుమార్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మంచి స్టార్ట్ దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ బుధవారం వినాయక చవితి కానుకగా 27న విడుదల అవుతోంది సుందరకాండ. మరి నారా రోహిత్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తెలుస్తుంది.
