హస్తినలో ఏపీ సీఎం బిజీబిజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు.. రాష్ట్ర జీఎస్‌టీ సంబంధిత సర్చార్జి ఒక శాతం పెంచవలసిందిగా కోరారు ఏపీ సీఎం.. ఇక, గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. నదుల అనుసంధానంతో వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్ లోని క్షామ పీడిత ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు త్రాగు, సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు.. ఇక, అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు మరియు భారత ఆర్థిక రంగంపై ప్రభావం గూర్చి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించడానికి వెళ్తుండడంతో వారిపై అమెరికా నూతన ప్రభుత్వ విధానాల ప్రభావం గూర్చి చర్చించారు. దేశ ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి.. పెట్టుబడులు ఆకర్షించడంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ సహకారాలను కోరారు.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ సమస్యలను విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెవెళ్లారు. మరోవైపు.. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించమని కోరారు. ఇక, నేడు ఉదయం హిందుస్థాన్ టైమ్స్ పత్రిక శత వార్షిక వేడుకలలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్.. రెండు రోజుల షెడ్యుల్ ఇదే..
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు పవన్.. మొత్తంగా మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఏపీ డిప్యుటీ సీఎం.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్.. 16న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షెడ్యూల్.. నాందేడ్ జిల్లా డెగ్లూర్ లో బహిరంగ సభలో పాల్గొననున్న పవన్.. భోకర్, లాతూర్‌లలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. షోలాపూర్ లో రోడ్ షో నిర్వహించనున్న ఏపీ డిప్యూటీ సీఎం.. 17న చంద్రపూర్ జిల్లా బల్లార్‌పూర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు.. సాయంత్రం పూణె కంటోన్మెంట్ లో రోడ్ షో నిర్వహిస్తారు.. కస్భాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న పవన్ కల్యాణ్..
కార్తిక శనివారం శుభవేళ.. కోటిదీపోత్సవం వేదికపై వరసిద్ధి వినాయకుడి కల్యాణం..
ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఈ రోజు జరనున్న విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. శ్రీ సుబ్రహ్మణ్యమఠం మాఠాధిపి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు.. ప్రవచనామృతం.. వేదికపై కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన.. భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన.. కోటి దీపోత్సవ దేదికపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడికి మూషిక వాహన సేవ నిర్వహించనున్నారు.. కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. కార్తిక మాసం శుభవేళ కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచన టెలివిజన్ ప్రైవెట్ లిమిటెడ్.. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రి కూడా భక్తి టీవీ ఉచితంగా అందజేస్తోన్న విషయం విదితమే కాగా.. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోన్న విషయం విదితమే..
నేడు మరోసారి మహారాష్ట్రకు సీఎం.. రెండు రోజులు షెడ్యూల్ ఇదే..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ కు బయలుదేరనున్నారు. అక్కడ చంద్రాపూర్ లో నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరుసగా రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. ఇక రెండోరోజు ఆదివారం ఉదయం నాగ్‌పూర్ నుంచి నాందేడ్ చేరుకుంటారు. నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్ కు తిరిగి రానున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపధ్యంలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్డీయే నుంచి కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో సందడి చేశారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ముంబైలో బీజేపీ నేతలు తమ మిత్రపక్షం ఏపీ సీఎం చంద్రబాబు బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ప్రచారానికి ఆహ్వానించారు. ఈనేపథ్యంలో నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లనున్నట్లు సమాచారం.
రైతులు ఆదాయం వచ్చే పంటలు వేయండి.. పొన్నం సూచన..
రైతులు సన్న ధాన్యం పండిస్తున్నారు.. ఆదాయం వచ్చే పంటలు వేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటుందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉంటే మాకు అధికారంలోకి వచ్చేటప్పటికి ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఎక్కడ భూములు అమ్మకుండా ఇబ్బందులు పెట్టకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు ఆర్టీసీ ఉచిత బస్సు,10 లక్షల ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల విద్యుత్ ,500 కి గ్యాస్ అందిస్తున్నామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు. రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ అయింది… 2 లక్షల పైన ఉన్న వారికి 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. వడ్ల కొనుగోలు లో దిఫాల్టర్ లేని వాళ్ళ నుండి ఇబ్బందులు లేవు.. వడ్ల కొనుగోలు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. డిఫాల్టర్ లకు ధాన్యం ఇవ్వందం లేదు మీరు గత బకాయిలు చెల్లించాలన్నారు. మీరు డి ఫాల్టర్ నుండి రెగ్యులర్ గా రైతు ల దగ్గర ధాన్యం తీసుకోవాలని తెలిపారు. రైతులు కొనుగోలు చేసిన ధాన్యం కొంత ఇబ్బంది అయిందన్నారు. సన్న ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులు సన్న ధాన్యం పండిస్తున్నారని అన్నారు. ఆదాయం వచ్చే పంటలు వేయాలన్నారు. ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ఇ వరంగల్ లో మహిళా సదస్సు ద్వార పెద్ద కార్యక్రమం చేపడుతుందన్నారు. ఈనెల 20న వేములవాడలో దర్శనం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయన్నారు. చివరి వారంలో మహబూబ్ నగర్ లో రైతు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రైవేట్ వీడియోలు లీక్.. ఖాతాలన్నీ డీయాక్టివేట్
వ్యక్తుల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా.. ఇటీవల పాకిస్థానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టిక్‌టాకర్ ఇమ్షా రెహ్మాన్ యొక్క ప్రైవేట్ వీడియోలు (MMS) వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసింది. ఇమ్షా ఒక ప్రైవేట్ వీడియోలో ఒక అబ్బాయితో అభ్యంతరకరమైన స్థితిలో కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియా సైట్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ పాకిస్తాన్‌లో చాలా ప్రసిద్ధి చెందాయి. రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇమ్షా చురుగ్గా పాల్గొంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జీవనశైలి, ఫ్యాషన్ కంటెంట్‌ని సృష్టించడం ద్వారా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. క్రమంగా ఆమె అనుచరులు పెరుగుతూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆమె పాకిస్థాన్ సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారింది. ఇమ్షా టిక్‌టాక్‌లో ఎంత ఫేమస్ అయ్యిందో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అంతే ఫేమస్. ఆమె ఎదైన ఒక అంశానికి సంబంధించిన వీడియో కంటెంట్‌ను పోస్ట్ చేస్తే.. దానికి వేల సంఖ్యలో లైక్‌లు, వీక్షణలు వస్తాయి. 2024లో, ఇమ్షా తన టిక్‌టాక్ వీడియోలపై 12.1 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. దీన్నిబట్టి పాకిస్థాన్‌లో ఆమె సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అర్థమవుతోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితా విడుదల.. 13 ఏళ్ల వయస్సులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించనున్న మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ భారీ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మెగా వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. బీసీసీఐ మెగా వేలంలో వేలం వేయడానికి 204 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో రెండు సెట్ల మార్క్యూ ప్లేయర్‌లను తయారు చేశారు. ఇది కాకుండా, వేలంలో ఎంపికైన 204 మంది ఆటగాళ్లలో, అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు భారత్‌కు చెందినవాడు కాగా, అత్యంత వయోవృద్ధుడు ఇంగ్లండ్‌కు చెందినవాడు. మెగానే వేలంలో పాల్గొనే ఈ ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం. ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ అత్యంత వయసున్న ఆటగాడు.. అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్.. జేమ్స్ ఆండర్సన్ కాకుండా వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనే అతి పిన్న వయస్కుడైన ఆటగాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వైభవ్ వయసు 13 ఏళ్లు మాత్రమే. 13 ఏళ్ల వైభవ్ బీహార్ తరఫున ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, భారత అండర్-19 జట్టు తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. గత నెలలో ఆస్ట్రేలియా అండర్-19పై కూడా సెంచరీ సాధించాడు.
రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ బీసీసీఐ నుంచి సెలవును అభ్యర్థించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది. రోహిత్, రితిక 13 డిసెంబర్ 2015న వివాహం చేసుకున్నారు. దీనికి క్రికెట్, క్రీడలు, వినోద ప్రపంచంలోని పెద్దలు హాజరయ్యారు. మూడేళ్ల తర్వాత, 2018లో ఈ జంట కూతురు సమైరాకు స్వాగతం పలికారు. ఇప్పుడు, ఆరేళ్ల తర్వాత, రోహిత్-రితిక మళ్లీ తల్లిదండ్రులు అయ్యారు.
స్వదేశంలో సఫారీలు చిత్తు.. 135 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు టీమిండియా విజయంతో మెరిశారు.వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే అవుట్ అయిన తర్వాత, దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో T20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ బలమైన పునరాగమనం చేసి 109 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్‌కి ఇది మూడో సెంచరీ. సంజూ శాంసన్ మాత్రమే కాదు, తిలక్ వర్మ కూడా 120 పరుగుల బలమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకే పరిమితమై భారత్ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్ చేసుకున్న ‘మెకానిక్ రాకీ’
ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. త్వరలో మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాకి ట్రైలర్ రిలీజ్ అయి అద్భుతమైన స్పందన అందుకుంది. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నవంబరు 22న రిలీజ్ కానుంది. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కాస్త వెనుకబడింది అనే విశ్వక్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మెకానిక్ రాకీ కోసం సూపర్ వీక్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాడు విశ్వక్ సేన్. విడుదల వారం ముందు నుండి ప్రమోషన్లు మొదలపెట్టి రిలీజ్ రోజు వరకు ఏకధాటిగా సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లలేందుకు మాస్ ప్లానింగ్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగంగా నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రెడీ అయిపోయింది. ఈ నెల 17న సాయంత్రం 5 గంటల నుండి ఈ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లోని జెఎన్ఎస్‌డబ్ల్యూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
మరోసారి నాగ చైతన్యతో రొమాన్స్ చేయబోతున్న బుట్టబొమ్మ.. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అట
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీ తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఆ సినిమా భారీ ధరకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంది.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. త్వరలోనే ఆ సినిమా కూడా రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.. కార్తీక్ దండు దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. అంజిష్ లోకానాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు.. ఈ సినిమాను త్వరలోనే పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో నాగచైతన్య ఉన్నారు. టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి క్రేజ్ నెలకొంటుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య, పూజా హెగ్డే కాంబో కూడా ఒకటి. ‘ఒక లైలా కోసం’ సినిమాలో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో సినిమా ఏదీ రాలేదు. అయితే, ఇప్పుడు త్వరలోనే వీరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించనున్న ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాలో నాగచైతన్య నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను మేకర్స్ తీసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారట. దీంతో వీరిద్దరి కాంబినేషన్ త్వరలోనే సెట్ కానుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంతో నిజంగానే చైతూ-పూజా కాంబో ఫిక్స్ అవుతుందా లేదా అనేది చూడాలి.