Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. ఆర్థిక నేరస్తుడి అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆర్ధిక నేరస్తుడు అనిల్ చోఖరాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబైలో అనిల్ చోఖరాను అరెస్ట్ చేసిన సిట్.. స్థానిక కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ తీసుకువచ్చారు. సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కామ్‌ డబ్బులో 77 కోట్ల రూపాయాలు షెల్ కంపెనీలకు మళ్లించి.. ఆ డబ్బును సిండికేట్ గా ఆదించినట్టు గుర్తించారు. 35 షెల్ కంపెనీలను అనిల్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. Adaan, లీలా, Spy డిస్టలరీస్ నుంచి డబ్బును తీసుకుని 4 షెల్ కంపెనీల్లో మళ్లించినట్టు గుర్తించిన సిట్ అధికారులు.. గతంలో అనిల్ పై ED కేసు నమోదైనట్టు కూడా చెబుతున్నారు.. అతను మనీ లాండరింగ్ కూడా చేసి కమీషన్లు వసూల్ చేసినట్టు గుర్తించారు సిట్‌ అధికారులు..

పరకామణి కేసులో కీలక సాక్షి మృతి.. హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు..
అనంతపురం జిల్లా‌లో కలకలం రేగింది.. పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కుమార్ మృతి చెందిన ఘటన సంచలనంగా మారగా.. ఈ ఘటనపై గుత్తి రైల్వే పోలీసులు హత్యగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యాలాటి హరి ఫిర్యాదు మేరకు పరకామణి కేసులోని ప్రత్యర్థులే సతీష్ కుమార్‌ను హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు.. ఈ ఫిర్యాదు ఆధారంగా గుత్తి జీఆర్పీ పోలీసులు BNS 103(1)(B) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, నిన్న రాత్రి అనంతపురంలో సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సమావేశం నిర్వహించారు. పరకామణి కేసుతో సంబంధం ఉండవచ్చన్న కోణంలో పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేపట్టారు రైలు కోచ్‌లో ప్రయాణికుల జాబితా సేకరించారు.. సతీష్ కుమార్ హత్య జరిగిన సమయంలో ఆయన ప్రయాణించిన A1 కోచ్‌లోని సహప్రయాణికుల వివరాలను సేకరించేందుకు రైల్వే పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రయాణ రికార్డులు, CCTV ఫుటేజ్, రైలు స్టేషన్ల ట్రాకింగ్ డేటా ఆధారంగా నిందితుల జాడ కోసం ఆరా తీస్తున్నారు..

గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు.. ఐదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభించిన ఇండిగో..
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు ఇండిగో సేవలు పునఃప్రారంభం అయ్యాయి.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణలో మరో ముఖ్యమైన పురోగతి సాధించినట్టు అయ్యింది.. ఐదేళ్ల విరామం తర్వాత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇకపై viability gap funding లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు.. అంటే మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్‌ సర్వీసులు నడపనుంది. ఈరోజు ఉదయం 7:30 గంటలకు గన్నవరం నుంచి మొదటి రీ-లాంచ్ ఫ్లైట్ సింగపూర్‌కు బయల్దేరింది.. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న రామ్ మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఇండిగో సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో వ్యాపార రంగం, విద్యార్థులు, ఎన్ఆర్‌ఐలు మరియు టూరిజానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ సర్వీసుల పునఃప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ విమాన కనెక్టివిటీలో మరో కీలక అడుగు ముందుకు వేసినట్టు అయ్యింది..

ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం..! యనమల సంచలన వ్యాఖ్యలు..
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తునిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఎప్పుడూ ప్రతిపక్షం మీద ఒక కన్నేసి ఉంచాలని, ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పని చేయగలమని అన్నారు యనమల రామకృష్ణుడు.. ప్రతిపక్షం ఏముందిలే ఊదితే ఎగిరిపోతారు అనుకుంటే పొరపాటు అని.. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామని కార్యకర్తలను హెచ్చరించారు.. అయితే, మెడికల్ కాలేజ్ ల నిరసనలో ప్రతిపక్షంలో కసి పెరిగిందని.. ర్యాలీ కోసం గ్రామాలు నుండి తీసుకుని వచ్చారని అన్నారు యనమల.. కాగా, తుని టీడీపీ కార్యకర్తల సమావేశంలో యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి..

ఏరియా ఆసుపత్రిలో దారుణం.. వైద్యం వికటించి 15 చిన్నారులకు తీవ్ర ఆస్వస్థత..!
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్యం వికటించింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న 15 మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇంజెక్షన్‌ వికటించడంతోనే పిల్లలకు వాంతులు, విరోచనాలు, చలి, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పిల్లల పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి సిబ్బంది వారిని అత్యవసరంగా ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రిల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు ఆస్పత్రి నిర్లక్ష్యాన్ని కారణంగా పేర్కొంటూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

అలర్ట్.. రేపటి నుంచి మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.. టైమింగ్స్ ఇవే..
మేడారం మహజతర నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 16 నుంచి హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడిపించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. హనుమకొండ బస్టాండ్‌ నుంచి ప్రతిరోజు ఉదయం 6.10, 7.00, 8.00, 9.00, మధ్యాహ్నం 12.10, 1.00, 1.40, 14.30; రాత్రి8.30గంటలకు మేడారానికి బస్సులు బయలుదేరనున్నాయి. ఇక మేడారం నుంచి ఉదయం 5.45, 9.45, 10.15, 11.15, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 4.00, 5.00, 5.30, 6.00 గంటలకు బస్సులను హన్మకొండకు నడిపేలా ఏర్పాట్లను చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంది. పల్లెవెలుగు బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80గా ఖరారు చేశారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో పెద్దలకు రూ.180, పిల్లలకు రూ. 110గా ఛార్జీలను వసూలు చేయనున్నారు.

శ్రీనగర్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు..
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు శబ్ధం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. పోలీస్ స్టేషన్ భవనంలోని ఓ భవన భాగం కూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. మానవ అవశేషాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. నౌగామ్ పేలుడు తర్వాత జమ్మూకశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. డీజీపీ నళిన్ ప్రభాత్ హైబ్రిడ్ భద్రతా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం రాత్రి 11:22 గంటలకు జరిగిన ఈ పేలుడులో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించినట్లు తెలుస్తోంది. గాయపడిన 30 మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. మంటలు, పొగ ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా రెస్క్యూ బృందాలు దాదాపు గంటసేపు లోపలికి ప్రవేశించడానికి ఇబ్బంది పడ్డాయి.

బీహార్ తదుపరి సీఎం ఎవరు? ఎక్స్ నుంచి జేడీయూ పోస్ట్ తొలగింపు!
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక ఢిల్లీ వేదికగా బీజేపీ కార్యాలయంలో సంబరాలు చేసుకోగా.. ఇటు బీహార్‌లో జేడీయూ కార్యకర్తలు కూడా వేడుకలు జరుపుకున్నారు. ఎన్డీఏ కూటమికి విజయమైతే దక్కింది గానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది సందిగ్ధం నెలకొంది. గత 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎక్స్‌లో పోస్ట్ చేసిన దాన్ని తొలగించడంతో కొత్త చర్చ మొదలైంది. శుక్రవారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక జేడీయూ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది. కానీ అంతలోనే తొలగించింది. దీంతో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరన్నది కొత్త చర్చ మొదలైంది.

బీహార్ ఎన్నికల ఎఫెక్ట్.. కాంగ్రెస్- టీఎంసీ పొత్తుకు బ్రేక్..?
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన అఖండ విజయం కోల్‌కతాలో సంచలనం సృష్టించింది. ఈ అంశంపై శుక్రవారం మోడీ మాట్లాడుతూ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్ అని తెలిపారు. అడవి రాజ్యాన్ని కూల్చివేసినట్లు ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెడు వార్త వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యం లేదని టీఎంసీ వర్గాలు ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపినట్లు సమాచారం. తమకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని వారు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది! మమతా బెనర్జీ 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తారని టీఎంసీ స్పష్టమైన సంకేతాలు కనబరుస్తుంది.

బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ బ్యాక్ టు టాలీవుడ్
ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీస్ టబు అండ్ రవీనా టాండన్. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన భామలు 50 క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. తల్లి పాత్రలకు షిఫ్టైనా కూడా ఇప్పటికీ హీరోయిన్‌, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది టబు. ఇక రవీనా కూడా కీ రోల్స్ చేస్తూ సీనియర్ బ్యూటీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కూలీ నెంబర్ వన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టబు తెలుగులో చేసినవీ కొన్ని సినిమాలే అయినా గుర్తిండిపోయే పాత్రలే చేసింది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. పాండురంగడు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి అలా వైకుంఠపురంతో మదర్ రోల్స్‌లో పలకరించిన టబు మళ్లీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత పూరీ జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే నాగ్ 100మూవీలోనూ నటించబోతుందన్న టాక్.

బాలీవుడ్ హీరోయిన్ కన్నుమూత..
బాలీవుడ్ తొలి తరం హీరోయిన్‌ల్లో తనదైన రేంజ్‌లో పేరు తెచ్చుకున్న సీనియర్ నటి కామినీ కౌశల్ (98) ఇక లేరు.  ముంబయిలోని తన ఇంట్లో ఆమె చివరి శ్వాస విడిచారు. లాహోర్‌లో జన్మించిన కామినీ అసలు పేరు ఉమా కశ్యప్. చిన్నప్పటి నుంచి రేడియో నాటకాలతో ప్రజలను ఆకట్టుకున్న ఆమెను.. దర్శకుడు చేతన్ ఆనంద్ 1946లో ‘నీచా నగర్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఇదే సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడం అప్పట్లో సెన్సేషన్. ఆ తర్వాత కామినీ వరుసగా ఏడాదికి ఐదు ఆరు సినిమాలతో బిజీ అయిపోయారు. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, రాజ్ కపూర్, అశోక్ కుమార్ లాంటి టాప్ హీరోల సరసన నటించి 40లలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు. ఆగ్, దో భాయ్, నదియా కే పార్, అర్జూ లాంటి ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్లయ్యాయి. హీరోయిన్‌గా 1963 వరకు రాణించిన ఆమె తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టి దో రాస్తే, పురబ్ ఔర్ పశ్చిమ, రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాల్లో తల్లి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. షారుక్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్లో అమ్మమ్మగా, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ లో అతిథి పాత్రలో కనిపించి కొత్త తరం ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వ్యక్తిగత జీవితంలో కూడా కామినీ కౌశల్ ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. తన అక్క మరణంతో..

Exit mobile version