Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో ఈవెంట్..!
ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు… సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు.. 3 లక్షలకు పైగా టీచర్లు.. కోటి 50 లక్షల మంది తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డ్ దిశగా జరగనుంది.. పాజిటివ్ పేరెంటింగ్.. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు.. విద్యార్థుల ప్రోగ్రెస్ పై ప్రధానంగా చర్చ జరగనుంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది.. స్కూలు అంటే కేవలం తరగతి గదిలో కూర్చో బెట్టి పాఠాలు చెప్పడం కాదని.. పిల్లల్లో నైతికత పెంచడం… ఉపాధ్యాయులు.. తల్లిదండ్రుల పాత్ర సూచించడం ప్రధాన ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ… ప్రైవేట్ స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించే కార్యక్రమంగా నిర్వహించనుంది ప్రభుత్వం.

ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి.. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలతో హరిత వర్ణ ఆభరణాలతో దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గమ్మ.. కూరగాయలు, ఆకు కూరలతో ఆలయం అలంకరించారు.. పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా దర్శనమిస్తున్నారు దేవతామూర్తులు.. మరోవైపు, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. ఇక, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు సిద్ధమవుతున్న భక్తులు.. కాసేపట్లో శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుండి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది.. ఉదయం 8 గంటల తర్వాత నుంచి పారాయణాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నియ.. 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ప్రసాద వితరణ తర్వాత ఉత్సవాలు ముగియనున్నాయి..

లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. రిటైర్డ్‌ ఐఏఎస్‌కు సిట్‌ నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి నోటీసులు జారీ చేసింది సిట్‌.. గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన రజత్‌ భార్గవ.. కొద్ది నెలల క్రితం రిటైర్‌ అయ్యారు.. అయితే, ఆయనకు నోటీసులు జారీ చేసిన సిట్‌.. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.. కాగా, వైసీపీ పాలనలో జరిగిందని చెబుతున్న మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. ఇప్పటికే ఎంతో మందిని విచారించింది.. మరికొంతమందిని అరెస్ట్‌ చేసింది.. ఇప్పుడు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు నోటీసులు జారీ చేసి, శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీ మరియు ధరల నిర్ణయాల్లో జరిగిన భారీ అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తులో ఈ పరిణామం కీలక మలుపుగా చెబుతున్నారు.. సీనియర్ బ్యూరోక్రాట్ అయిన డాక్టర్ రజత్ భార్గవ.. తన పదవి కాలంలో..ఎక్సైజ్, పరిశ్రమలు మరియు ఆర్థిక శాఖల.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సహా కీలక శాఖలను నిర్వహించారు. ప్రైవేట్ మద్యం సిండికేట్‌లతో కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. దానిపై సిట్ ఆయనను ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తోంది..

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో గత మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష చేయడం ప్రధాన అజెండాగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అనేక మంత్రివర్గ భేటీలు జరగగా.. అందులో తీసుకున్న నిర్ణయాలు ఎన్ని అమలయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అన్న అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చ జరగనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రంలో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై కూడా క్లారిటీ వచ్చే సూచనలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించే ఈ భేటీలో అమలుకాని, ఆలస్యమైన నిర్ణయాలకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే దిశగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను రూపొందించనున్నారు. మంత్రుల దగ్గరి నుంచి అధికారుల వరకూ ఎక్కడ సమస్య ఉందో గుర్తించి, ఆ వివరాలపై పూర్తి సమీక్ష జరగనుంది. ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సవరణ చట్టం, ఉద్యోగాల భర్తీ, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, గోశాలల నిర్మాణం, మహిళల సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గత క్యాబినెట్ భేటీలో ప్రతి మూడు నెలలకోసారి సమావేశాన్ని “స్టేటస్ రిపోర్ట్ మీటింగ్”గా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో.. ఈ రోజు సమావేశంలో ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌’ను సమర్పించి చర్చించే అవకాశం కనపడుతోంది.

నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు..!
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ మరింత వేగం పుంజుకుంటోంది. ఈ కేసులో A1గా ఉన్న ఆయనను ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ప్రశ్నించారు. తాజాగా, నేడు మరోసారి ఆయన సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో ఈ రోజు (జులై 10) విచారణ జరగనుంది. ఇప్పటికే సిట్ అధికారులు నిందితులు, సాక్షుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని ఆధారంగా చేసుకుని ప్రభాకర్ రావును మరింత లోతుగా ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఈ కేసులో ట్యాపింగ్‌కు గురైన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి నేడు సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఆధారంగా కూడా ప్రభాకర్‌ రావుపై మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజానిజాలపై స్పష్టత రాబట్టేందుకు సిట్ అడుగులు వేగంగా సాగుతోంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అధికారులు ప్రతి అంశాన్ని క్షున్నంగా పరిశీలిస్తున్నారు.

సీఐడీ విచారణ వేగవంతం.. కస్టడీలోకి ఐదుగురు కీలక వ్యక్తులు..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఐపీఎల్ టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఐపీఎల్ టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని తెలుస్తుండటంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, CEO సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలబడనున్నాయి. ప్రత్యేకంగా SRH (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఫ్రాంచైజీపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌ లకు ఇప్పటికే కేటాయించిన 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లతోపాటు, అదనంగా HCA మరికొన్ని టికెట్లు ఇవ్వాలంటూ SRH ను బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ టికెట్లు ఇవ్వకపోతే మ్యాచ్ జరగనివ్వమని బెదిరించినట్టు SRH ఆరోపించింది.

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. భారీగా ట్రాఫిక్ జామ్.. విమాన రాకపోకలకు అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి. ఇక విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక గురు, శుక్రవారాల్లో భారీగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం సాయంత్రం నుంచే ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం వరకు భారీగా వర్షం కురిసింది. దీంతో నగర వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. గురువారం ఉదయమే ఉద్యోగాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇక విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు తెలిపింది.

మెక్సికోను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు
అగ్ర రాజ్యం అమెరికాలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న టెక్సాస్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గల్లంతయ్యారు. ఈ వరదల నుంచి ఇంకా తేరుకోక ముందే.. ఇంకోవైపు మెక్సికోను భారీ వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలు కారణంగా వరదలు అమాంతంగా ముంచెత్తాయి. దీంతో ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయాయి. అలాగే వాహనాలు, పెద్ద పెద్ద వృక్షాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక ప్రవాహాంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రజలు గల్లంతయ్యారని మేయర్ లిన్ క్రాఫోర్డ్ వెల్లడించారు. రియో రుయిడోసో నది 20 అడుగుల ఎత్తు కంటగే నది ప్రవహిస్తోంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరదల్లో ఇళ్లులు కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బ్రెజిల్ సహా మరో 7 దేశాలపై భారీగా సుంకాలు.. పోర్చుగీస్పై మాత్రం 50 శాతం టారిఫ్స్!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్‌ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారోకు సపోర్టుగా.. ఆ దేశంపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్టన్లు ప్రకటించారు. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది అంతర్జాతీయ ప్రపంచానికి అవమానంగా పేర్కొన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు ట్రంప్‌ రాసిన లేఖలో ఈ కేసును కొనసాగించొద్దని తెలిపారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై అమెరికా విచారణ ప్రారంభిస్తుందని హెచ్చరించారు. ఇక, బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తనకు బాగా తెలుసు.. అతడితో కలిసి తాను పని చేశానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆయన పదవీకాలంలో ప్రపంచ నేతలు బోల్సోనారోను ఎంతో గౌరవంగా చూశారని వెల్లడించారు. అతని విషయంలో ప్రస్తుతం బ్రెజిల్ సర్కార్ అనుసరిస్తున్న విధానం చాలా అవమానకరమని చెప్పుకొచ్చారు. కాగా, బోల్సోనారో తిరుగుబాటు కేసుపై ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ ఇటీవల ఘాటుగా రియాక్ట్ కావడంతో భారీ సుంకాలతో బ్రెజిల్‌కు బిగ్ షాకిచ్చాడు.

ట్విస్ట్ ఇచ్చిన కళ్యాణ్ శంకర్ – సోషియో ఫాంటసీలోకి మాస్ మహారాజా రవితేజ!
మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుండగా, మరోవైపు ఆయన తన తదుపరి సినిమాను కామెడీ స్పెషలిస్ట్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘MAD’, ‘MAD స్క్వేర్’ వంటి యువతను ఆకట్టుకున్న హాస్య చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్ – ఇప్పుడు రవితేజతో కలిపి ఓ సోషియో ఫాంటసీ జానర్‌లో సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇది ప్రేక్షకులకు ఒక రకమైన షాక్‌గా మారింది. ఎందుకంటే, కళ్యాణ్ శంకర్ అంటే కామెడీకి కేరాఫ్, రవితేజ అంటే మాస్ యాక్షన్. అయితే ఈసారి వాళ్లిద్దరూ కలిసి కామెడీకి కాకుండా, విభిన్నమైన కాన్సెప్ట్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సమాచారం ప్రకారం సోషియో ఫాంటసీ సినిమాలకు వీఎఫ్ఎక్స్ కీలకం. అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను చాలా డీటైల్‌గా ప్లాన్ చేస్తున్నారు.

బన్నీ – రష్మిక కాంబో రిటర్న్స్!
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ మరోసారి తెరపై మళ్లీ మెరిపించబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ‘పుష్ప’ సిరీస్‌లో ‘శ్రీవల్లి’ పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక, బన్నీ సరసన ముచ్చటగా మూడోసారి నటించనున్నట్లు సమాచారం. తాజా బజ్ ప్రకారం, అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మాస్ అండ్ హైటెక్ ఎంటర్టైనర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. ‘పుష్ప’ సిరీస్‌లో బన్నీతో ఆమె కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో చూశాం. అదే మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ కాంబినేషన్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘శ్రీవల్లి’ పాత్ర రష్మికను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. మాస్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా ఆమె నటన, అభినయం బాగా నచ్చింది. పుష్పరాజ్ పాత్రతో సమానంగా శ్రీవల్లి క్యారెక్టర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ ఇదే విషయాన్ని చెబుతోంది. ఇక అట్లీ వంటి మాస్ కమర్షియల్ స్పెషలిస్ట్ డైరెక్టర్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా ఐకాన్, రష్మిక మందన్న వంటి నేషనల్ లెవెల్ స్టార్ కలిస్తే, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ వార్త సినీ వర్గాల్లో ప్రస్తుతం బర్నింగ్ హాట్ టాపిక్‌గా మారింది.

అదును చూసి నయనతారపై రివెంజ్ తీర్చుకుంటున్నారు
నయనతార సినిమా ఓపెనింగ్స్‌కు రాదు, ప్రమోషన్స్ చేయదు. లేడీ సూపర్ స్టార్‌తో వర్క్ చేయించుకోవాలంటే కష్టం. ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ. ఇలా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి సౌత్ క్వీన్ పై బలంగా వినిపించిన మాటలు. కానీ వాటన్నింటినీ ఈ మధ్య కాలంలో చెక్ పెట్టింది భామ. ప్రమోషన్లే కాదు ఓపెనింగ్‌కు వచ్చి  బౌండరీలను చెరిపేసింది. కానీ అప్పటికే లేడీ సూపర్ స్టార్ కోలీవుడ్‌లో టార్గెట్ అయ్యింది. ఎప్పుడూ దొరుకుతుందా అనుకునే టైంలో ఆమెను చిక్కుల్లో పడేసింది డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్‌. నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ రిలీజ్‌కు ముందే నుండే కాంట్రవర్సీలో చిక్కుకుంది. కాదు కాదూ కొని తెచ్చుకుంది నయన్. నానుమ్ రౌడీ ధాన్ సీన్స్ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వినియోగించారంటూ ధనుష్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కాడు. రూ. 10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇక ధనుష్‌పై మండిపడుతూ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది నయన్. అలాగే భర్త విఘ్నేశ్ శివన్ కూడా కౌంటరిచ్చాడు. ప్రజెంట్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది నయనతారకు. చంద్రముఖిలో కొన్ని సీన్స్ అనుమతి లేకుండా యూజ్ చేశారంటూ ఏబీ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. రూ. 5 కోట్లు చెల్లించాలంటూ కోరింది. ఇప్పుడే కాదు గతంలో కూడా చంద్రముఖి నిర్మాతలు నోటీసులు పంపారంటూ వార్తలు రాగా.. వాటిని ఖండించారు శివాజీ ప్రొడక్షన్స్. కానీ ఇప్పుడు ఈ సినిమా కాపీ రైట్స్ కలిగి ఉన్న ఏబీ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలు చేయడం చూస్తే కావాలనే ఆమెను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమౌతోంది. గతంలో ప్రమోషన్లకు, ఈవెంట్లకు రాకుండా కోలీవుడ్‌ను ఇబ్బంది పెట్టిన నయనతారపై ఇలా రివేంజ్ స్టార్ట్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ డాక్యుమెంటరీ వల్ల లేడీ సూపర్ స్టార్ వెయిట్ పెరగడం కన్నా డ్యామేజే ఎక్కువగా జరిగింది. ప్రజెంట్ ఎనిమిది ప్రాజెక్టులతో బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్ ఈ వివాదాలకు ఫుల్ స్టాఫ్ పెడుతుందా. మళ్లీ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేస్తుందో లెట్స్ సీ.

Exit mobile version