NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

వింత వేషధారణ.. ఆకట్టుకున్న పెళ్ళి

కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు ఆహ్లాద కరమైన పచ్చ పచ్చని పైర్లు, ఆకు పచ్చని కొబ్బరి చెట్లు వాటి చుట్టూ కాలువలు, అక్కడక్కడ అందమైన గోదావరీ నదీ పారే సెలయేర్లు, దానికి మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిళ్ల సందడి అంతా అంతా కాదని చెప్పాలి. పంజాబీ వేషధారణలో మేళ తాళాలుతో పెళ్లి కొడుకు జోడి గుర్రాల రథంలో రాజకుమారుడిలా ఊరేగుతుంటే మహారాష్ట్ర సంస్కృతిలో అమ్మాయిలు చీరలు కట్టి బుల్లెట్ల బండ్లపై పెళ్ళికొడుకు రథానికి ముందు ఆహ్వానం పలకడం పల్లె వాసులను ఆకట్టుకుంటుంది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలో జరిగిన గోకవరపు వారి కల్యాణ వేడుకలో అవినాష్ వెడ్స్ లక్ష్మి పెళ్లి వేడుకలో ఈ వినూత్న ఊరేగింపు బాణాసంచాలు, పంజాబీ మేళాలు, తాళాలు. రాజులు కాలం నాటి జోడు గుర్రాల రథంపై పెళ్ళికొడుకు ఊరేగింపులు, బుల్లెట్ల బైకులపై మహారాష్ట్ర సంస్కృతిలో వస్త్రధారణ చేసి మహిళలు ఊరేగింపులు.పల్లెవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలాంటి వివాహం ఈమధ్యకాలంలో చూడలేదంటున్నారు స్థానికులు.

స్మార్ట్‌గా ర్యాలీ తీసిన స్టాక్స్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ లాభాలతో ఎండ్‌ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి అనుకూల సంకేతాలు వెలువడటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని బలపరిచింది. లార్జ్‌ క్యాప్స్‌ అయిన ఎస్‌బీఐ, రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మరియు భారతీ ఎయిర్‌టెల్‌ విశేషంగా రాణించాయి. సెన్సెక్స్‌ 899 పాయింట్లు పెరిగి 59 వేల 808 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17 వేల 594 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ల వారీగా చూసుకుంటే.. అన్ని రంగాల కంపెనీల షేర్లు లాభాల్లోనే నడిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌లు మూడు శాతం వరకు పెరిగాయి. వ్యక్తిగత స్టాక్స్‌ పరిశీలిస్తే.. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు 14 శాతం దాక ర్యాలీ తీశాయి. నాలుగు కంపెనీల్లో వాటాలను విక్రయించటం కలిసొచ్చింది. అలెంబిక్‌ ఫార్మా సంస్థ స్టాక్స్‌ విలువ 52 వారాల గరిష్టానికి చేరింది. 10 గ్రాముల బంగారం ధర 99 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 55 వేల 838 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు 478 రూపాయలు లాభపడింది. అత్యధికంగా 63 వేల 734 రూపాయలు పలికింది. క్రూడాయిల్‌ ధర స్వల్పంగా 43 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్‌ ముడి చమురు 6 వేల 394 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 36 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 25 పైసల వద్ద స్థిరపడింది.

రాహుల్ గాంధీ ఇక్కడ గెలవలేక.. విదేశాల్లో విమర్శలు చేస్తున్నారు..

రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తాను ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిఘాలో ఉన్నానని యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. అనురాగ్ ఠాకూర్, రాహుల్ గాంధీ విమర్శలను శుక్రవారం తప్పుపట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విదేశీ గడ్డపై భారతదేశాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, తనతో పాటు ఇతర రాజకీయ నేతలపై ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసస్ తో నిఘా పెట్టారని ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ కమిటీకి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లను ఎందుకు సమర్పించలేదని ఠాకూర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పట్ల రాహుల్ గాంధీకి ఉన్న ద్వేషాన్ని అర్ధం చేసుకోగలం, అయితే విదేశీ స్నేహితుల సాయంతో దేశాన్ని కించపరిచే కుట్రకు కాంగ్రెస్ తెరతీసిందని ఆయన ఆరోపించారు.

పురుగులు తింటూ, మూత్రం తాగుతూ.. 31 రోజులు అమెజాన్ అడవిలో బతుకుపోరాటం

ప్రపంచంలోనే అతిపెద్ద దట్టమైన అడవి అమెజాన్. దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ పాటు చుట్టుపక్కల దేశాల్లో విస్తరించి ఉన్న మహారణ్యం. ఇక్కడ తప్పిపోవడం అంటే చావుతో సమానమే. ఎటువెళ్లాలో తెలియదు, ఎటుచూసినా కనుచూపు మేరలో చెట్లు తప్పితే ఇంకేం కనిపించవు. ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండలు, చిరుతపులులు, మొసళ్లకు, విష కీటకాలకు అమెజాన్ అడవి ప్రసిద్ధి. ఇలాంటి సమయంలో వాటి నుంచి తప్పించుకుని బతికిబట్టకట్టడం అంటే అదృష్టమని చెప్పవచ్చు. బోనటన్ అకోస్టా అనే వ్యక్తికి మాత్రం ఇంకా భూమిపై నూకలు ఉన్నాయి. అమెజాన్ అడవిలో తప్పిపోయి 31 రోజుల తర్వాత రక్షించబడ్డాడు. బొలీవియాకు చెందిన అకోస్టా తాను ఎలా బతికాననే విషయాలను వెల్లడించారు. అకోటస్టా(30) తన స్నేహితులతో కలిసి జనవరి 25న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో వేటకు వెళ్లాడు. అయితే తన స్నేహితుల నుంచి విడిపోయిన అతను ఏకంగా 31 రోజలు పాటు మనుగడ పోరాటం సాగించాడు. బతికేందుకు తనమూత్రం తానే తాగి, కీటకాలను తింటూ జీవనం సాగించాడు. తన సోదరుడు ఓ అడవి పందితో పోరాడాల్సి వచ్చిందని, పులి నుంచి తప్పించుకున్నట్లు అకోస్టా సోదరి వెల్లడించారు. వర్షం సమయంలో తన రబ్బరు ట్యూబులో నీరు నింపుకుని తాగేవాడు. వర్షాలు లేని సమయంలో తన మూత్రాన్ని తానే తాగేవాడు. జనవరి నెల చివర్లో బోనటన్ అకోస్టా తప్పిపోయాడని చెప్పడంతో రెస్య్కూ టీం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. 31 రోజుల తర్వాత గత శనివారం ఆయన్ను గుర్తించారు. నెల రోజుల్లో 17 కిలోల బరువు తగ్గడంతో పాటు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నాడు బొనటన్ అకోస్టా. తిరిగి తనవారిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని అకోస్టా చెబుతున్నాడు.

బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మధ్య గ్యాంగ్ వార్..

విజయవాడ నగరం నేరాలకు అడ్డాగా మారుతోంది. గతంలో స్టూడెంట్ల మధ్య గ్యాంగ్ వార్ లు కలకలం రేపాయి. తాజాగా విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే రెండు బ్లేడ్ బ్యాచ్ ల మధ్య గ్యాంగ్ వార్ స్థానికులను టెన్షన్ పెట్టింది. గత రాత్రి గని అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడు మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉండి గలాటా చేస్తున్న గని బ్యాచ్ సబ్యులని పట్టుకొని పోలీసులకు అప్పగించారు హరి బ్యాచ్ సభ్యులు. పోలీసులకు అప్పగించారనే కక్ష పెంచుకున్న హరి బ్యాచ్ సభ్యులపై దాడికి దిగారు గని బ్యాచ్ సభ్యులు. ఆంజనేయ వాల్ సెంటర్ కొండ ప్రాంతంలో గని బ్యాచ్ సభ్యుడైన అఖిల్ మరో ఆరుగురితో అక్కడికి చేరుకొని బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్ర గాయాలు పాలైన అఖిల్, శీను అనే యువకులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు గ్యాంగ్ వార్ కి పాల్పడిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు. ఈ గ్యాంగ్ వార్ కారణంగా స్థానికంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి

ఆపిల్ భాగస్వామి ఫాక్స్ కాన్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు ఇది పెద్ద దెబ్బగా నిపుణులు పరిగణిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు భారత్ తో కొత్తగా సుమారు 700 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా రూ.5700 కోట్లతో ఫ్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక బెంగళూర్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగళూర్ విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల్లో ఈ ఫ్లాంట్ నిర్మించనున్నారు.ఐఫోన్ విడిభాగాలను తయారు చేసేందుకు ఈ ఫ్లాంట్ ను నిర్మించాలని యోచిస్తున్నారు. అయితే ఈ ఫ్లాంట్ లో ఐఫోన్ హ్యాండ్ సెట్ల అసెంబ్లింగ్ ను కూడా చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఫాక్స్ కాన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అనుకుంటోంది. దీనికోసం కొన్ని భాగాలను ఉత్పత్తి చేసేందుకు ఈ ఫ్లాంట్ ను ఉపయోగించే అవకాశం ఉంది.

కన్నతల్లిని చంపి.. దండేసి కీర్తించే బాపతు కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లిని చంపి, దండేసి కీర్తించే బాపతు కేసీఆర్ అని ఆరోపించారు. బతికినన్నాళ్లు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను కేసీఆర్ అవమానించారని.. వాళ్లు చనిపోయాక దండేసి కీర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి నీర్వీర్యం చేస్తున్నారని.. అసెంబ్లీలో మాత్రం ఆ ఇద్దరిని ఆకాశానికెత్తేస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచ్‌లు సహా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు నిరూపించే దమ్ముందా? అని ప్రశ్నించారు. మొక్కలు ఎండిపోతే సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తున్నారని, మరి నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దని అడిగారు. రామరాజ్యం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉచిత విద్య, వైద్యంతో పాటు పేదలకు ఇళ్లు, రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..

ప్రపంచం చాలా చిన్నది.. ఎక్కడ తిరిగినా మనకు తెలిసినవాళ్ళు.. ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటారు. ఒకరికి ఒకరు మధ్య బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిచయమవుతారు.. ఎవరు కలుస్తారు అనేది ఎవరికి తెలియదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్ళికి కరీనా కపూర్ గెస్ట్ గా వెళ్ళింది. అప్పుడు తెలియదు ఆమెకు.. జీవితంలో అతడే తన భర్తగా వస్తాడని.. భవిష్యత్తు ను ఎవరు ముందు చెప్పలేరు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనాలు. ఇక ప్రస్తుతం సైఫ్- కరీనా జంట లానే మంచు మనోజ్- మౌనిక రెడ్డి కూడా ఒకటి అవుతున్నారు. మనోజ్- మౌనిక ఈరోజు సాయంత్రం వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరికి అంతకుముందు పెళ్లిళ్లు అయ్యాయి. ఇక ఇంకా చెప్పాలంటే.. మౌనిక మొదటి పెళ్ళికి మంచు మనోజ్ గెస్ట్ గా వెళ్ళాడు. 2015 లో మౌనిక.. బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహమాడింది. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్ళిలో మనోజ్ సందడి చేశాడు. వారి పెళ్ళికి హాజరయ్యి.. వధూవరులకు శుభాకాంక్షలు కూడా చెప్పాడు. అప్పుడు మనోజ్ కు కూడా తెలిసి ఉండదు. ఆ పెళ్లి కూతురితోనే ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడు ఆమె పెళ్ళికి గెస్ట్ గా వెళ్లిన మనోజ్ ఇప్పుడు ఆమెకు హస్బెండ్ గా మారాడు. అందుకే అంటారు పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి