NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

బీబీసీపై దాడులు.. యూకే మంత్రికి జైశంకర్ స్ట్రాంగ్ రిప్లై

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం అయింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపధ్యంలోొ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీపై ఆరోపణలు గుప్పిస్తూ రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ వివాదం ఇటు భారత్ లో అటు యూకేలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారత్ ప్రభుత్వం అయితే దీన్ని ఏకంగా ‘‘ వలసవాద మనస్తత్వం’’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. ఈ పరిణామాల తర్వాత ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేసింది. భారత చట్టాలకు అనుగుణంగా అకౌంట్స్ నిర్వహించడం లేదని అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం యూకే విదేశాంగ మంత్రి జెమ్స్ జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఇరువురి మధ్య బీబీసీ వ్యవహారం చర్చలోకి వచ్చింది. అయితే దీనిపై ఎస్ జైశంకర్ యూకేకు ఘాటు రిఫ్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో పనిచేసే ఏ సంస్థ అయినా భారతీయ చట్టాలకు లోబడి ఉండాలని సూటిగా చెప్పారు. భారత్ లో పనిచేస్తున్న సంస్థలు ఇక్కడి చట్టాలు, నియమాలను పాటించాలని యూకే విదేశాంగ మంత్రికి చెప్పారు.

నేను ఎక్కడి నుండైనా పోటీ చేస్తా..ఆపేదెవరు?

కాంగ్రెస్ పార్టీలో రెబల్ నేతగా పేరున్న మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఏం మాట్లాడినా సంచలనమే. విజయవాడ వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆమె మాట్లాడారు. అమరావతి రైతులు ఎన్నో రోజులుగా క్రమశిక్షణతో నిరసనలు చేస్తుంటే కనికరించలేని కఠిన మనస్సు ఉన్నోడికి రాజకీయాలు ఏమి తెలుసు..ముఖ్యమంత్రి రౌడీయిజంతో, అందరిపైనా దాడులు చేస్తూ అసలు ప్రగతి అనేది ఎక్కడా కనపడని పరిస్థితుల్లో ప్రజలు వేధిస్తున్నాడని మండిపడ్డారు.రోజుకో స్కీం అంటూ బంగారం లాంటి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్న ముఖ్యమంత్రిని చూస్తే పిచ్చోడి చేతిలో రాయి అనే సామెత మనకు గుర్తుకు వస్తుందన్నారు రేణుకా చౌదరి. ఏదైనా ప్రశ్నిస్తే కులాలను అడ్డుపెడుతున్నారు..ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రజలు నన్ను ఆహ్వానిస్తున్నారు..ఏమి చేయాలనేది ఆలోచిద్దాం.. ఆయన ఆస్తిలో వాటా కాదు.. ప్రజాస్వామ్యంలో హక్కు. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు నిలబెట్టుకునేందుకు ప్రజలు, అమరావతి రైతులు వాళ్లకి వేసే ఓటు తిరస్కరించి న్యాయంగా ఓటు వేసుకుని గెలవాలన్నారు.

మూడు భాషల్లో మురిపించిన కథ

దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల కథలతో హిందీ సినిమాలు రూపొంది అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాభై ఐదేళ్ళ క్రితం హిందీలో ‘దో కలియా’ అదే తీరున సందడి చేసింది. ఈ చిత్రానికి మాతృక తమిళంలో తెరకెక్కి విజయం సాధించిన ‘కుళందైయుమ్ దైవముమ్’. 1965లో రూపొందిన ఈ చిత్రంలో జమున నాయికగా నటించారు. 1966లో ఇదే కథతో తెలుగులో జమున కథానాయికగానే ‘లేతమనసులు’ రూపొంది, ఇక్కడా ఘనవిజయం సాధించింది. ఈ రెండు చిత్రాలలోనూ కుట్టి పద్మిని బాలనటిగా ద్విపాత్రాభినయం చేసి మురిపించారు. ఆ తరువాత 1968లో హిందీ చిత్రం ‘దో కలియా’ రూపొంది, అక్కడా జయకేతనం ఎగురవేసింది. మూడు భాషల్లోనూ ఏవీయమ్ సంస్థ ఈ కథను తెరకెక్కించింది. అసలు ఈ కథకు 1961లో తెరకెక్కిన అమెరికన్ మూవీ ‘ద పేరెంట్ ట్రాప్’ ఆధారం. ఆ కథకూ 1949 వెలుగు చూసిన జర్మనీ నవల ‘లిసా అండ్ లొట్టీ’ మూలం. ఇలా పాశ్చాత్య దేశాల్లో వెలుగు చూసిన ఈ కథ మన భారతదేశంలో ఉత్తర, దక్షిణ భేదం లేకుండా మురిపించడం విశేషం! ‘దో కలియా’ చిత్రం 1968 మార్చి 1న విడుదలయింది. ఇందులో జమున పాత్రను మాలా సిన్హా ధరించగా, హీరోగా బిశ్వజిత్ నటించారు. ఈ నాటి మేటి హీరో రణబీర్ కపూర్ తల్లి నీతూ సింగ్ ఈ చిత్రంలో బాలతారగా గంగ, జమున పాత్రల్లో భలేగా ఆకట్టుకున్నారు.

వైసీపీకి వచ్చేవి 175 సీట్లు కాదు

ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనం వైసీపీకి బుద్ధి చెబుతారన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రధాన మంత్రి నొక్కిన బటన్ కి మరోసారి నువ్వు నొక్కుడేందయ్యా…లక్షల కోట్లు ఇస్తే రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు.గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయి 8నెలలు దాటింది.జగన్ పరిపాలనలో బాధ్యత కలిగిన అధికారులు పారిపోయారు.పులిచింతలకి , గుండ్లకమ్మ కి గేట్లు పెట్టడం చేతకాదు.ఈ బిడ్డకి 175 సీట్లు కావాలంట.జగన్ కి వచ్చిన 151 సీట్లలో రెండు ఒకట్లు తీసేసి వచ్చే ఎన్నికల్లో ఐదు సీట్లే ప్రజలు ఇస్తారు.ఇప్పటికి ఆరు లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు.తాడేపల్లి నుండి తెనాలి వెళ్లాలంటే హెలికాఫ్టర్ కావాలి.రోడ్ల మీద గుంటలు కనపడతాయని హెలికాఫ్టర్ లో తిరుగుతున్నాడు.ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు, వ్యవసాయ శాఖ మంత్రి సీబీఐ ఫైల్స్, కాకాని కోర్టు ఫైల్స్.బాబాయి హత్య కేసులో దోషుల్ని కాపాడే వ్యక్తి పరిపాలనకి అర్హుడా అని ఆయన ప్రశ్నించారు.

ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ ట్వీట్ వార్

ఏపీలో ఈమధ్యకాలంలో ట్వీట్ల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. గతంలో టీడీపీ , జనసేన నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి ఒక రేంజ్ లో ట్వీట్లు చేసేవారు. విజయసాయి ట్వీట్ కి ప్రతిస్పందిస్తూ టీడీపీ నేతలు, జనసేన నేతలు కూడా ట్వీట్ల కౌంటర్లు వేసేవారు. తాజాగా బీజేపీ నేతలు, వైసీపీ నేతల మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది.ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీటుకు సోము వీర్రాజు కౌంటర్ ట్వీట్ వేశారు. నరేంద్ర మోడీ బ్రెయిన్ ఛైల్డ్ పీఎం కిసాన్ స్కీంకు రూ.6వేల కోట్లు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. పీఎం కిసాన్ నిమిత్తం రూ. 6 వేల కోట్లే కాదు.. చాలా పథకాలు అమలు చేస్తున్నారంటూ సోము ట్వీట్ చేశారు. మొత్తంగా 24 స్కీంల వివరాలను కోట్ చేస్తూ సోము ట్వీట్ వదిలారు.

‘కరాళ’గా రాబోతున్న కన్నడ ‘బీగా’!

రవిశంకర్, జాది ఆకాశ్, సయ్యద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా ‘బీగా’. ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో ‘కరాళ’ పేరుతో అనువదించి, విడుదల చేయబోతున్నారు. కన్నడ మాతృక ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెలుగు వర్షన్ ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”దర్శకుడు సాగర్ శిష్యుడు శ్రీనందన్. ఆయన తెరకెక్కించిన ఈ సినిమాలో రవిశంకర్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఉన్నారంటే ఆ సినిమా గ్రాండ్ గానే ఉంటుంది. ఇది కూడా అలాంటి చిత్రమే అని ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది” అని అన్నారు.తెలుగులో ఈ సినిమాను శ్రీ లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు విడుదల చేస్తున్నారని, ఆయన పక్కా ప్లానింగ్ ఉన్న పంపిణీదారుడని నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చెప్పారు. ఈ సినిమాలో తాను ఓ మంచి వేషం వేశానని, తనకిది తొలి కన్నడ చిత్రమని ‘జబర్దస్త్’ ఫేమ్ నవీన్ తెలిపాడు. ఈ సినిమాలో మూడు పాటలున్నాయని, నేపథ్య సంగీతం కొత్తగా ఉంటుందని సంగీత దర్శకుడు శ్రీగురు అన్నారు.

హమ్మయ్యా.. 8రోజుల ఊపిరి పీల్చుకున్న స్టాక్ మార్కెట్లు

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌కి మార్చిలో శుభారంభం లభించింది. ఈ నెలలో మొదటి రోజైన ఇవాళ బుధవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలోనూ ప్రాఫిట్స్‌ కొనసాగాయి. దీంతో సాయంత్రం సైతం లాభాలతో ముగిశాయి. ఫలితంగా.. వరుసగా 8 రోజుల నుంచి వస్తున్న నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్‌ పడటం వల్ల ఇన్వెస్టర్లు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ మరియు మారుతీ సుజుకీ వంటి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ విలువ పెరగటం కలిసొచ్చింది. సెన్సెక్స్‌ 448 పాయింట్లు పెరిగి 59 వేల 411 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 17 వేల 450 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది.సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో ఏకంగా 28 కంపెనీల షేర్లు ర్యాలీ తీశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఆయిల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు రాణించగా పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాక్స్‌ విలువ పడిపోయింది. సెక్టార్ల వారీగా పరిశీలిస్తే.. అన్ని రంగాల్లోని కంపెనీల షేర్ల విలువ గరిష్ట స్థాయిలో ఎండ్‌ అయింది.

బీరు తాగడం వల్ల ఐదు అద్భుత ప్రయోజనాలు

ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య నష్టాలు ఉంటాయని అంతా చెబుతుంటారు. అయితే కొన్ని సార్లు మితంగా తీసుకునే ఆల్కాహాల్ కూడా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంటుంది. ముఖ్యంగా బీర్ వల్ల 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీర్ ను మితంగా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాల్లో బీర్ కూడా ఒకటి. ఇక వేసవి కాలంలో అయితే బీర్ వినియోగం తారాస్థాయికి చేరుకుంటుంది. బీర్ ను మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయి.

1) ఎముకల ఆరోగ్యానికి మంచిది: ఎముకల ఆరోగ్యానికి బీర్ మంచిది. బీర్ అనేది డైటరీ సిలికాన్ యొక్క మూలం. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. మితంగా బీర్ తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు పలుచబడటాన్ని నిరోధిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

2) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.బీర్‌లో ఉండే కరిగే ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దీనిని జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి. దీంతో పాటు బీర్ లో చేదుగా ఉండే ఆమ్లాలు ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఆహారం జీర్ణం అవడాన్ని మెరుగుపరుస్తాయి.