Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ట్రోలింగ్స్..! హైకోర్టులో బెంచ్ మీదనే న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హైకోర్టులో బెంచ్ మీదనే న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి.. గత వారం సింగయ్య కేసులో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ పిటిషన్ ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన వ్యవహారంపై స్పందించిన ఆయన.. ఈ రోజు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిస్‌ శ్రీనివాస్‌రెడ్డి.. నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్ అని వ్యాఖ్యానించారు.. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్‌కు బాగా పనికి వస్తాయంటూ కామెంట్ చేశారు.. అయితే, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి.. తన ముందున్న బెయిల్ కేసుల అన్ని వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్‌రెడ్డి..

షాకింగ్‌..! బిచ్చగాళ్ల ముసుగులో క్రిమినల్స్‌..
నంద్యాల జిల్లాలో జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య.. ఎంతో మంద్రి క్రిమినల్స్‌ బిచ్చగాళ్ల రూపంలో తిరుగుతున్నారనే సంచలన విషయాన్ని బయటపెట్టింది.. బిచ్చగాళ్ల ముసుగులో కొందరు క్రిమినల్స్ తిరుగుతున్నారు.. వీరికి షెల్టర్ జోన్లుగా రైల్వే స్టేషన్, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు మారిపోయాయి.. బిచ్చగాడు దస్తగిరి హత్య తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. బిచ్చగాళ్లను విచారించారు.. బిచ్చగాళ్ల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, టెక్నికల్ సిబ్బందికి పంపించారు.. దీంతో, షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.. 120 మంది బిచ్చగాళ్లలో 30 మందికి నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులకు నివేదిక అందింది.. డేటా సేకరించి పోలీసులు.. వారిని మందలించి పంపినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఆయా ప్రాంతాల్లో పోలీస్ పికెట్, సీసీ కెమెరాలు, ఫ్లడ్ లైట్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు పోలీసులు..

వైఎస్‌ జగన్‌ భద్రతపై పిటిషన్‌.. హైకోర్టులో కీలక వాదనలు
వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. జగన్ నెల్లూరు పర్యటనలో హెలిపాడ్‌ అనుమతి పిటిషన్‌ కూడా దాఖలు కాగా.. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించారు మాజీ ఏజీ శ్రీరాం.. హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వడం లేదని కోర్టులో పిటిషన్‌ వేసిన వెంటనే హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి, ఇదే హెలిప్యాడ్‌ అన్నారు. హెలిప్యాడ్‌కోసం సూచించిన స్థలంలో మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉందని.. తుప్పలు, డొంకలు ఉన్నాయి.. హెలిప్యాడ్‌ కోసం సిద్ధం చేయాలంటే మూడు నాలుగు రోజులు పట్టేలా ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు..

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. హరీష్ రావు, కేటీఆర్ లెక్కలోకి రారు..
తెలంగాణలోని ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న రోడ్లకు మొదటి ప్రియార్టీ.. హ్యామ్ మోడల్ లో రోడ్ల నిర్మాణం జరపాలని నిర్ణయించాం.. మా ప్రభుత్వం వచ్చాక రూ. 6500 కోట్లతో రూరల్ రోడ్స్ టెండర్లు పిలిచాం.. రోడ్ల నిర్మాణం జరుగుతుంది అన్నారు. పెండింగ్ రోడ్స్ పూర్తి చేయాలని నిర్ణయించాం.. తెలంగాణలో మా శాఖ రోల్ మోడల్ గా ఉండేలా చర్యలు చేపట్టామని తేల్చి చెప్పారు. రోడ్లు మా కోసం, కాంట్రాక్టర్ల కోసం కాదు ప్రజల కోసం అన్నారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేలా రోడ్ల నిర్మాణం చేపడుతాం.. రూరల్ రోడ్లన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు.

ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్.. మంత్రి ఆదేశాలతో నిధులు విడుదల
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. జూన్ 16వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ ను విచారణ చేసింది. ఈ కేసులో A2గా అరవింద్ కుమార్, A1గా కేటీఆర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణలో కీలక అంశాలు ప్రస్తావించారు. అప్పటి మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ తెలిపారు. HMDW ఖాతా నుంచి FEO కంపనీకి నిధులు మల్లింపుపై నా ప్రమేయం ఆయన లేదని తేల్చి చెప్పారు.

సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు.. కాటన్ బాక్సుల్లో కార్మికుల శరీర భాగాలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని ఫార్మా కారిడార్ లోని పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో సుమారు 45 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. అయితే, పేలుడు ధాటికి ఘటన స్థలంలో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి. చెల్లాచెదురుగా పడిపోయిన సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. సుమారు 20 కాటన్ బాక్సులలో అధికారులు తీసుకు వచ్చారు. ఈ కాటన్ బాక్సులను మార్చురీలో ఆస్పత్రి సిబ్బంది భద్రపరిచారు. DNA పరీక్షలు నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్‌లో పాక్ క్షిపణుల్ని దెబ్బతీసిన “ఆకాష్ సిస్టమ్‌”పై బ్రెజిల్ కన్ను..
భారతదేశ రక్షణ పరిశ్రమ ప్రతీ ఏడాది అభివృద్ధిని నమోదు చేస్తోంది. భారత ఆయుధ ఎగుమతులు కూడా గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ఆయుధ మార్కెట్‌లోకి భారత్ నెమ్మదిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తయారు చేసిన పలు ఆయుధ వ్యవస్థలను కొనేందుకు ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల, పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత ఆయుధ వ్యవస్థలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయి. మన ఆయుధ వ్యవస్థల ముందు చైనా తయారీ మిస్సైళ్లు కూడా తట్టుకోలేకపోయాయి. పాకిస్తాన్ ప్రయోగించి డ్రోన్లు, క్షిపణనును సమర్థవంతంగా అడ్డుకున్నాయి.

హరిహర ట్రైలర్ పై చిరు – చరణ్ రియాక్షన్ ఇదే
అనేక బాలారిష్టాల అనంతరం ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 24వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులకు కూడా బాగా నచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ గురించి సెలబ్రిటీలు అభిప్రాయాలు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “వాట్ అన్ ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్! తర్వాత దాదాపు పవన్ కళ్యాణ్ మూవీ స్క్రీన్‌లపై తన ఫైర్ చూపించడం చాలా ఆనందంగా ఉంది. హరిహర వీరమల్లు టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇన్ స్టాలో ఆ సౌత్ హీరో టాప్.. ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్లు..?
ఇప్పుడు అంతా ఇన్ స్టా గ్రామ్ హవానే నడుస్తోంది. సెలబ్రిటీలకు అత్యధిక ఫాలోవర్లు కూడా ఇన్ స్టాలోనే ఉంటున్నారు. మరి సౌత్ లో ఏ హీరో టాప్.. ఏ స్టార్ హీరోకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ లో చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాడు. ఈయనకు ఏకంగా 28 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప తర్వాత క్రేజ్ భారీగా పెరగడంతో ఫాలోవర్లు ఎక్కువగా పెరిగారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఈయనకు 25.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మూడో స్థానంలో 21.9 మిలియన్ ఫాలోవర్లతో విజయ్ దేవరకొండ ఉన్నాడు.

ఓటీటీలోకి ‘భైరవం’.. ఎక్కడ చూడాలంటే?
ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో అందరినీ ఆకట్టుకుంది. ZEE5 లోకి వచ్చిన వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చూసి దూసుకుపోతోంది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ భారీ విజయం తరువాత ZEE5 సంస్థ మరో క్రేజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భైరవం’ త్వరలోనే ZEE5లోకి రాబోతోందని ప్రకటించారు. ప్రస్తుతం ZEE5లో ‘విరాటపాలెం’ సిరీస్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కెవి శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌ను కృష్ణ పోలూరు డైరెక్ట్ చేశారు.

విజయ్ కోసం రూ.2 కోట్ల సెట్..?
విజయ్ దేవరకొండ ఇప్పటికే కంగ్ డమ్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టైమ్ లోనే మరో మూవీని లైన్ లో పెట్టేశాడు విజయ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878 కాలంలో జరిగిన యదార్థ సంఘటలన ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని జులై రెండో వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీని కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో రూ.2 కోట్లతో భారీ సెట్ వేశారంట.

Exit mobile version