జనసేన నేత కిరణ్ రాయల్ వివాదంలో కొత్త కోణం..!
తిరుపతి కిరణ్ రాయల్ అంశంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పలువురు జనసేన, వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా సంచలన నిజాలను బయటపెట్టింది. తన ఫొటో, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసారని వైసీపీ నేత సురేష్ పై ఆరోపణలు చేశారు. సురేష్ కు జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరిశంకర్ సహకరించారని కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఉన్న మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాలని లక్ష్మీ రెడ్డి కోరింది. ఫిర్యాదులో వైసీపీ నేత సురేష్ ఫొటో, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సురేష్‌కు జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరి శంకర్ సహకారం అందించారు. సోషల్ మీడియాలో ఉన్న మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాలని అనేకమార్లు కోరాను. టైం వచ్చినప్పుడు డిలీట్ చేస్తామని.. ఇప్పుడు సైలెంట్‌గా ఉండాలని జనసేన, వైసీపీ నేతలు ఒత్తిడి పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియాల్లో తనపై జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ వీడియో, ఫొటోలను వైరల్ చేసిన వ్యక్తులపై కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. ఇక, కిరణ్ రాయల్ పై గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు లక్ష్మీ రెడ్డి… కిరణ్ అవసరాలకు తన నుంచి తీసుకున్న రూ.1.20 కోట్లు రూపాయలు తీసుకుని ఇవ్వాలేదని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో చెప్పుకొచ్చారు..
ముంబై పర్యటనకు మంత్రి లోకేష్..
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు.. టాటా గ్రూప్ ఛైర్మెన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రాఫిగురా సీఈవో సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ ESR group హెడ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ సాదత్ షా, హెచ్‌పీఐఎన్‌సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ Blue star Limited డిప్యూటీ ఛైర్మెన్ వీర్ అద్వానీతో సహా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్నారు మంత్రి నారా లోకేష్.. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముంబైలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగనుంది.. సాయంత్రం ముంబైలో నిర్వహిస్తున్న 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొననున్నారు లోకేష్… ఇక, ఈ ఏడాది నవంబర్‌లో విశాఖ వేదికగా జరిగే పార్టనర్షిప్ సమ్మిట్ లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్.. రాష్ట్రంలో కాగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పినే ధ్యేయంగా.. వివిధ సంస్థలను పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానిస్తూ వస్తుంది ఏపీ సర్కార్.. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పలు కీలక సంస్థలను రాష్ట్రానికి రండి అంటూ ఆహ్వానించిన విషయం విదితమే..
తల్లిని కొడుకు హత్య చేసిన కేసులో షాకింగ్ ట్విస్ట్..! తాను దేవుడిని అంటే నమ్మలేదు.. అందుకే..!
మానసిక స్థితి సరిగా లేని కొడుకు చేతిలో కన్నతల్లిని దారుణ హత్య చేసిన ఘటన ప్రొద్దుటూరులో కలకలం రేపింది. ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి, భాస్కర్ రెడ్డి దంపతులకు యశ్వంత్ కుమార్ రెడ్డి ఒక్కడే కుమారుడు. ఒక్కడే కుమారుడు కావడంతో చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్న దంపతులు యశ్వంత్ కుమార్ ను బీటెక్ వరకు చదివించారు. బీటెక్ పూర్తి చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంతవరకు యశ్వంత్ కుమార్ కు ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోనే ఒక్కడే రూమ్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు యశ్వంత్ కుమార్. యశ్వంత్ కుమార్ నెల ఖర్చులకు తల్లిదండ్రులు డబ్బు పంపించేవారు. అయితే, ఇటీవల యశ్వంత్ కుమార్ మానసిక స్థితిలో మార్పు గమనించిన తల్లిదండ్రులు యశ్వంత్ కుమార్ ను పలుమార్లు ఇంటికి రమ్మని పిలిచిన రాలేదు. కేవలం డబ్బులు పంపించమని మాత్రమే యశ్వంత్ కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడని పోలీస్ విచారణలో చెప్పినట్లు సమాచారం.. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న యశ్వంత్ వచ్చిన వెంటనే తాను అడిగిన డబ్బు ఎందుకు పంపించలేదని, తాను ఒక దేవుడునని తాను అడిగినప్పుడు డబ్బు పంపించాలంటూ తల్లితో గొడవపడినట్లు సమాచారం. ఇంట్లోనే పక్క గదిలో స్నానం చేస్తున్న తండ్రి భాస్కర్ ఎందుకు గొడవ పడుతున్నావు అంటూ పక్క గదిలో నుండి బయటకు వస్తున్న క్రమంలో తండ్రిని లోపలికి నెట్టి బయట గడియ పెట్టేశాడు.. ఆ తర్వాత తల్లి లక్ష్మీదేవిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అయితే, తాను ఒక దేవుడిని.. ఈ విషయం తన తల్లికి చెప్తే నమ్మడం లేదని, అందుకే దేవుడు వద్దకే పంపించాను అంటూ యశ్వంత్ కుమార్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. యశ్వంత్ మానసిక స్థితిపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో యశ్వంత్ పెరిగిన పరిస్థితులు.. గతంలో ఇతని మానసిక స్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లక్ష్మీదేవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పడంతో సోమవారం ఉదయం లక్ష్మీదేవి మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హంతకుడైన కొడుకును తలకొరువి పెట్టడానికి పంపించాలంటూ పోలీసులను తండ్రి భాస్కర్ కోరారు.
కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీ..! పల్లె పల్లెకి కల్తీ లిక్కర్..!
ప్రతిచోట కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారి కోసం ఏర్పాటు చేశారు.. పల్లె పల్లెకి నకిలీ మద్యాన్ని పంపిన ఘతన టీడీపీ నేతలదే అని ఆరోపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. మా మీద లిక్కర్ కేసు అంటూ అసత్య ప్రచారం చేశారు.. జైల్లో పెట్టారు.. కానీ, ప్రతిచోట కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారి కోసం ఎర్పాటు చేశారని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు.. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం వాళ్ల పార్టీ తరపున పోటీ చేసి వ్యక్తి నకిలీ మద్యం కోసం ఒక డెన్ పెట్టి దొరకడం అన్నారు.. ప్రతి బ్రాందీ చాలు ఇక బెల్ట్ షాపు గా మారిపోయింది… నకిలీ మద్యాన్ని పల్లె పల్లెకి టీడీపీ నేతలు పంపారని ఫైర్ అయ్యారు.. ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టిటిడి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి ఇవ్వడం ఏంటి.. ? అని ప్రశ్నించారు భూమన.. బీజేపీ నేత అన్నామలై ఈ కంపెనీ పై చాలా రకాల అవినీతి ఆరోపణలు చేశారు.. ఈడీ దర్యాప్తు కోరారు… అలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో టీటీడీ ఆలయం ఎలా కడుతారా ? అని నిలదీశారు. ఇలా అయితే రోజుకొక రియల్ ఎస్టేట్ కంపెని టీటీడీ ఆలయం కట్టాలని అడుగుతుందన్నారు.. ఇక, హిందువులు మనోభావాలను దెబ్బతినేలా టీటీడీ వ్యవహారం ఉందన్నారు టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి..
అల్లు అర్జున్పై ప్రెస్మీట్ పెట్టిన ఏసీపీ మృతి.. ఎలానో తెలుసా..?
హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మీడియా సమావేశంలో నటుడు అల్లు అర్జున్‌ను ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి తాజాగా కన్నుమూశారు. ఆయన సుదీర్ఘకాలంగా పోలీస్ శాఖలో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. ప్రజలకి అందించే సేవలో, విధుల్లో కట్టుబడి, నిఖార్సైన పోలీస్ విధానాలతో ప్రజల భద్రత కోసం నిత్యం కృషి చేశారు. అయితే, హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో మరణించారు. ఇక, పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలను, సామాజిక, కార్య నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభను స్మరిస్తూ పలువురు నివాళులు ఆర్పిస్తున్నారు.
రైతులకు శుభవార్త.. MSP ధరకే పత్తి కొనుగోలు
తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు సమస్యలపై సీసీఐ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశం అయ్యారు. సీసీఐ కొనుగోళ్లపై సమావేశంలో కీలక చర్చలు జరిపారు. పత్తి రైతులకు మద్దతు ధర దక్కే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
దగ్గు సిరప్‌పై తెలంగాణ ఆరోగ్యశాఖ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల
దగ్గు సిరప్ ప్రస్తుతం దేశంలో మృత్యువుగా వెంటాడుతోంది. దగ్గు సిరప్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిన్నారులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో నలుగురు పిల్లలు ప్రాణాలు వదిలారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో కూడా చిన్నారులు చనిపోయారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. దగ్గు సిరప్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. రెండేళ్లలోపు పిల్లలకు కఫ్, కోల్డ్ సిరప్‌లు ఇవ్వొద్దని సూచించింది. కఫ్, కోల్డ్‌లు తాత్కాలికం మాత్రమేనని… ఎక్కువ శాతం కేసులు స్వయంగానే తగ్గుతాయని డీఎంహెచ్‌వోలకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులన్నింటికీ ఆదేశాలు చేరవేయాలని సూచించారు.
నాగ శౌర్య.. బ్యాడ్ బాయ్ కార్తీక్ టీజర్ రిలీజ్.. ఇలాంటి సినిమాలు అవసరమా
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చిన నాగశౌర్య కొంత కాలంగా సైలెంట్ అయ్యాడు. చివరిగా 2023 లో రంగబలి అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులని అలరించటానికి వస్తున్నాడు. నూతన దర్శకుడు రామ్ దేశిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు శౌర్య. ఎప్పటినుండో సెట్స్ పై ఉన్న ఈ సినిమా టీజర్ ను ఈ రోజు రిలీజ్ చేసారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా బ్యాడ్ బాయ్ కార్తీక్ టీజర్ ను రిలీజ్ చేసారు. భారీ ఫైట్స్, రొటీన్ డైలాగ్స్ తో నింపేసారు. ఇక చివర్లో వెన్నెల కిషోర్ తో ఎదో కామెడీ అని ట్రై చేసారు. ఓవరాల్ గా చూస్తే బ్యాడ్ బాయ్ కార్తీక్ ఒక రొటీన్ కమర్షియల్ టీజర్ లానే అనిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు సముద్రకని, సీనియర్ నరేష్, సాయికుమార్, మరియు శ్రీదేవి విజయ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా తమిల్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. నాగ శౌర్య కు జోడిగా వీధి హీరోయిన్ గా నటిస్తుండగా వైష్ణవి ఫిలింస్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎట్టకేలకు శుభవార్త చెప్పిన సమంత.. అందరూ అనుకున్నదే చేసిందిగా!
స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కి రాబోతున్నారు. హెల్త్ ప్రాబ్లం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన సమంత తర్వాత ప్రోడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి తన ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరిట ‘శుభం’ మూవీతో నిర్మాతగా తన అడుగులు పెట్టి మొదటి చిత్రం తోనే హిట్ అందుకుంది. ఇర ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’తో ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. గతేడాది ఈ మూవీ నుండి విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో సమంత గన్, మెడలో తాళి బొట్టు, రక్తంతో నిండిన ముఖంతో ఫుల్ డ్రామా లుక్‌లో కనిపించారు. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ “ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?” అని ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఆ అప్‌డేట్ కోసం సోషల్ మీడియా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు “ఈ నెలలోనే ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ప్రారంభం అవుతుంది” అంటూ సమంత స్వయంగా తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. చాలా రోజుల తర్వాత సమంతను మళ్లీ స్క్రీన్‌లో చూడబోతున్నాం అంటూ మురిసి పోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వార్త ట్రెండ్ అవుతోంది.
ఇదేం క్రేజ్ బాబోయ్.. మూసేసిన థియేటర్స్ కూడా కాంతార కోసం తెరిచారు..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 ను హోంబాలే ఫిల్మ్స్ భారి బడ్జెట్ పై నిర్మించింది. దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. అక్కడ ఇక్కడా అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లోను మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే కర్ణాటకలో ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. కర్ణాటకాలో ఇటీవల చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఆక్యుపెన్సీ లేక మూసేసారు. కన్నడలో స్టార్ హీరోలు సినిమాలు ఏవి లేకపోవడం ఉన్న సినిమాలు అంతగా రెవెన్యూ రాబట్టలేక పోవడంతో స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేక కొద్దీ నెలలుగా మూసేసారు. కానీ ఇప్పడూ ఆ థియేటర్స్ సైతం తలుపులు తెరిపించింది కాంతార చాఫ్టర్ 1. మారుమూల పల్లెటూర్లో కూడా మూతపడిన థియేటర్స్ ను కూడా కాంతార చాఫ్టర్ 1 కోసం తిరిగి ఓపెన్ చేసారు. రిలీజ్ రోజు నుండి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ వసూళ్లు తెచ్చిపెడుతోంది. మరో ఏడాది పాటు థియేటర్స్ ను రన్ చేసేలా ఊరటనిచ్చింది కాంతార చాప్టర్ 1. దసరా సెలవులు ముగిసిన కూడా నేడు కర్నాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 7 కోట్ల మార్క్ అందుకుని సాలిడ్ గా దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ నాటికి కర్నాటకల లో రూ. 80 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది కాంతార చాప్టర్ 1.
