డీప్ టెక్ సమ్మిట్ 2024.. సీఎం చంద్రబాబు కొత్త నినాదం..
విశాఖపట్నంలో జరగుతోన్న డీప్ టెక్ సమ్మిట్ 2024లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ వేదికగా కొత్త నినాదం అందుకున్నారు.. ఏఐ, ఎంఐ, క్వాంటం కంప్యూటింగ్‌తో ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో మార్పులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయులు, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిందన్నారు.. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతోందన్న ఆయన.. సాంకేతికతతో అనేక మార్పులు వస్తున్నాయన్నారు.. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని అనుకుంటున్నాం అన్నారు.. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణగా అభిర్ణించారు.. ఇక, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎం.. పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేయటమే కొత్త టార్గెట్ అన్నారు సీఎం చంద్రబాబు.. ఐటీ గురుంచి ఎవరు మాట్లాడినా హై టెక్ సిటీని ప్రస్తావించకుండా ఉండలేరని పేర్కొన్నారు.. ఐటీ గురుంచి అప్పుడప్పుడే మాట్లాడుతున్న సమయంలోనే ఆ అవకాశాలను అంది పుచ్చుకోగలిగాం.. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి అధునాతన అన్వేషణలను పరిపాలనలో భాగస్వామ్యం చేసి మెరుగైన సేవలు అందించడమే కొత్త టార్గెట్‌గా పెట్టుకున్నాం అన్నారు.. డ్రోన్ లు కీలక భూమిక పోషిస్తున్నాయని.. టెక్నాలజీ వృద్ధి తర్వాత వైద్య ఖర్చులపై అయ్యే వ్యయం బాగా తగ్గుతుందన్నారు.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం.. జనాభా ఇప్పుడు ఆస్తిగా పరిగణించే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.. పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారిందని సూచించారు.. పాపులేషన్, టెక్నాలజీ ఆధారంగా గ్లోబల్ హబ్ గా ఇండియా మారుతుందనే నిమ్మకాన్ని వ్యక్తం చేశారు..
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. ఫలితాలపై ఎవరి లెక్కలు వారివే..!
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మరణంతో బైఎలక్షన్ జరిగిన విషయం విదితమే కాగా.. బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్య జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు టీచర్లు బారులు తీరారు. యూనియన్ల వారీగా విడిపోయి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు మద్దతు ఇచ్చారు. ఆరు కొత్త జిల్లాల పరిధిలో ఓటర్లు.. ఎమ్మెల్సీ ఎవరు అనేది డిసైడ్ చేస్తున్నారు. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, అల్లూరి జిల్లాలో 11 మండలాల్లో ఓటర్లు ఉన్నారు. అయితే, పోల్ అయిన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓటు వస్తే వాళ్లు విజయం సాధిస్తారు. అలా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. గత ఎన్నికల్లో షేక్ సాబ్జీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో పీడీఎఫ్ తరఫున విజయం సాధించారు. ఈ సారి కూడా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కాకినాడ జేఎన్టీయూకు తరలించారు. ఇక, ఈ నెల 9వ తేదీన అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ జరగనుంది. కాగా, గురువారం రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన విషయం విదితమే.. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 16,737 మంది టీచర్లు ఉండగా.. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదు అయ్యింది..
భూ సమస్యల సత్వర పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు..
ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను.. సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.. కూటమి ప్రభుత్వ వచ్చాక భూ వివాదాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇక, ప్రతీ రైతన్న.. తమ భూమికి సంబంధించిన వివరాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని చెక్ చేసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. రీ సర్వే పేరుతో గత ప్రభుత్వం హయాంలో పలు లోటు పాట్లు జరిగాయి. జిల్లాలో 9 వేల దరఖాస్తులు భూ సమస్యలుపై వచ్చాయి.. ఇకపై భూ సమస్యలు రాకుండా చూసే విధంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.. ఈ అవకాశం మరలా మీకు రాదు.. రెవెన్యూ అధికారులు మీ వద్దకు వచ్చేటప్పుడు.. మీ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
కేంద్ర మంత్రి నోట తెలుగు పాట.. తెలుగు సినీ పరిశ్రమపై సురేష్ గోపీ ప్రశంసల వర్షం..
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి సురేష్ గోపీ నోట తెలుగు పాట వచ్చింది.. సామజవరగమనా.. అంటూ పాట పాడుతూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు కేంద్ర సహాయమంత్రి సురేష్ గోపీ… విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్నారు సురేష్ గోపీ.. మూడు రోజుల పాటు సాగనున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం.. అయితే, ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్, ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్ పర్సన్ తేజస్విని పొడపాటి, ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సురేష్ గోపీ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.. తెలుగు సినిమా చాలా అద్భుతం అన్నారు సురేష్ గోపీ.. తెలుగు వాళ్లకి నేను అవకాశాలు ఇస్తాను.. తెలుగు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటులు చాలా ప్రభావం చూపిస్తారంటూ ప్రశంసలు కురిపించారు.. తెలుగు స్క్రిప్ట్ కూడా చాలా అర్ధవంతంగా ఉంటుంది.. తెలుగు సినిమాల క్వాలిటీ ప్రభావం మళయాల సినిమాలపై ఉంటుందన్నారు.. సామజవరగమనా.. అంటూ పాడారు సురేష్ గోపీ.. ఇక, ఒక సంవత్సరం నుంచి కృష్ణవేణి సంగీత నీరాజనం జరుపుకుంటున్నాం.. ఈ గొప్ప సంప్రదాయ సంగీతాన్ని గౌరవించుకోవడం చాలా అద్భుతం.. సీఎం చంద్రబాబు సరికొత్త ఏపీని తయారు చేస్తున్నారు.. ఇక్కడకు వస్తే నా సొంత భూమిలో ఉన్నట్టు ఉంది.. నా ఆదాయం, నా గ్లామర్ మూడో వంతుకు పైగా ఏపీ, తెలంగాణల నుంచి వచ్చినవే అన్నారు.. మైసూరు సంగీత సుగంధ ఫెస్టివల్ కి నేను హాజరయ్యాను.. దైవికమై కృష్ణానదీ తీరాన ఈ కార్యక్రమానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు.. సంగీత టూరిజంకు గ్లోబల్ హబ్ గా ఏపీని అభివృద్ధి చేస్తున్నారు.. ఎంతోమంది అద్భుతమైన సంగీతకారులు తెలుగులోనే ఉన్నారని తగుర్తుచేశారు.
తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ ను ఎవరో వచ్చి ఆహ్వానిస్తే ఎలా..
ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్‌ను ఎవరో వచ్చి ఆహ్వానిస్తే ఎలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేసేది.. తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి యా.. కాంగ్రెస్ తల్లి యా? తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగిన రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు. ఇప్పుడు కొత్తగా విగ్రహం ఆవిష్కరణ చేస్తామని అంటున్నారని తెలిపారు. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే వేల విగ్రహాలు ప్రతిష్టించి ఉన్న తెలంగాణ తల్లి రూపుని మారుస్తాం అంటే ఎలా? అని మండిపడ్డారు.
నాకు పేరు వస్తుందనే కేసీఆర్ నిధులు విడుదల చేయలేదు..
నాకు పేరు వస్తుందనే ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేపు నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా.. గ్రామంలో ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న నార్కెట్ పల్లి మండలానికి ఈ ప్రాజెక్టు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నాలుగు నియోజకవర్గాలలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మార్చి, ఏప్రిల్ లోగా ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. తన కల నిజం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును సాధించడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర చాలా కీలకం అన్నారు. ఆయన కలల ప్రొజెక్ట్ 18 ఏళ్లకు సాకారం అవుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. రేపు సీఎం చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంలా ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరు వస్తుందని గత ప్రభుత్వం బ్రాహ్మణ వెళ్ళంలా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఎస్‌ఎల్‌బిసి కూడా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభలో దుమారం.. కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్టలు..
నేడు రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సభ వాయిదా పడిన తర్వాత నిన్న సాధారణ తనిఖీల్లో భద్రతా అధికారులు ప్రస్తుతం అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ తెలిపారు. రూ.500 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్‌ఖర్ తెలిపారు. ఆ నోట్ల అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందన్నారు. డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ నోట్లను స్వీకరించడంపై మాట్లాడిన వెంటనే, ప్రతిపక్ష ఎంపీలు రచ్చ సృష్టించడం ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. “ఈ వ్యవహారంపై విచారణ కొనసాగి.. అంతా తేలిపోయే వరకు ఛైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ పేరు ప్రస్తావించకుండా ఉండాల్సిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖర్గే ప్రకటనపై అధికార పార్టీ ఎంపీలు రచ్చ సృష్టించారు. ఆదే సీటు వద్ద దొరికాయని మీరు ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించారు.
టీ బ్రేక్.. స్టార్క్ దెబ్బకు పెవిలియన్‌కు స్టార్ బ్యాటర్లు!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో మొదలైన రెండో టెస్టులో భారత్ కుదేలైంది. పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. డే/నైట్ టెస్ట్ మొదటిరోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్ (4), రోహిత్ శర్మ (1) ఉన్నారు. యశస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డక్ కాగా.. విరాట్ కోహ్లీ (7) పరుగులే చేసి అవుట్ అయ్యాడు. గులాబీ టెస్టులో టాస్ నెగ్గిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే ఎల్బీగా అవుట్ అయ్యాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) క్రీజ్‌లో పాతుకుపోయారు. ముందుగా గిల్ అటాక్ చేయగా.. ఆపై రాహుల్ ఆడాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్‌కు జీవనాధారం లభించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
పుష్ప ఓవర్సీస్ వసూళ్లు ఆల్ టైమ్ టాప్ – 3
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో డిసెంబరు 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదట ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మొదటి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నంబర్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఉండేలా కనిపిస్తోంది. డే -1 కలెక్షన్స్ పై అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు మైత్రీ మూవీ మేకర్స్. అటు ఓవర్సీస్ లో పుష్ప రికార్డు స్థాయి ఓపెనింగ్ అందుకుది. నార్త్ అమెరికాలో కేవలం అడ్వాన్స్ సేల్స్ లో 3.33 మిలియన్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన 3వ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ రోజు 1.1 మిలియన్ కొల్లగొటట్టింది పుష్ప -2. మొత్తంగా ఇప్పటివరకు 4.4 మిలియన్ వసూళ్లు రాబట్టి పుష్ప రూల్ మొదలెట్టింది, నేడు రేపు వీకండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. భాషల వారిగా డే -1 ఏ లాంగ్వేజ్ లో ఎంత కలెక్ట్ చేసింది అంటే తెలుగు : $757K, హిందీ – $242K, తమిళ్ – $17K, మలయాళం – $పుష్ప ఓవర్సీస్ వసూళ్లు రికార్డు బ్రేకింగ్4K, కన్నడ – $66 వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఇప్పటికి ఆ రికార్డ్ ప్రభాస్ నటించిన బాహుబలి -2 పేరిట ఉంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 1,977,132 డాలర్స్ టాప్ 1 లో ఉంది.
అటు ఇటు తిరిగి ఆఖరికి ‘శక్తిమాన్’ ఎవరు అవుతారో ?
బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’. ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ సీరియల్ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హీరో ఫ్రాంఛైజీల ప్రారంభ దశలోనే శక్తిమాన్ పాత్ర భారతీయ బుల్లితెర ప్రేక్షకుల్లో ఒక సంచలనం. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులను సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. శక్తిమాన్ పాత్ర అనగానే ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా గుర్తుకు వస్తారు. ఆయన అద్భుత నటన, అభినయం వెంటనే అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆయన వయసు మీద పడింది. దీంతో శక్తిమాన్ పునరాగమనంలో ఆ పాత్రలో నటించే స్టార్ ఎవరన్న చర్చ కొనసాగుతోంది. దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ విశేషాలను తెలియచేస్తూ, అధికారికంగా ఓ చిన్న వీడియోను సోనీ పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది. మాజీ ఫిల్మ్ జర్నలిస్టులు ప్రశాంత్ సింగ్, మాధుర్య వినయ్ తో పాటు ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేష్ ఖన్నా సైతం ఈ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. నిజానికి శక్తిమాన్ పాత్రలో నటించాలని రణవీర్ సింగ్ కలలు కన్నాడు. అతడు నేరుగా హక్కుదారు అయిన సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నాను కలిసి అభ్యర్థించాడు. కానీ శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ సరిపోడని అతడు భావించారు. రణవీర్ ప్రవర్తన అంతగా సూట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కంగువ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.