మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులే కొనాలి.. మళ్లీ స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలి..
మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. విజయవాడలో సారథ్యం యాత్రలో భాగంగా కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టి కి తెచ్చారు ప్రజలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ప్రజలు.. ఇక, ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. అనేక ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్య కు ఆయినా పరిష్కారం దొరుకుతుందన్నారు.. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధిపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం.. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, అక్కడి విశిష్టతను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం.. టీ తాగుతూ… ప్రజలు ఆలోచనలు, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం.. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తాం అన్నారు.
భయపెట్టిన దేవుడు..! దొంగిలించిన సొత్తు మళ్లీ గుడిలో పెట్టి..!
దొంగతనాలకు అడ్డూ అదుపు లేదన్నట్టుంగా పరిస్థితి ఉంది.. అయితే, కాస్త సమయం తీసుకున్నా.. ప్రస్తుత టెక్నాలజీతో ఏ దొంగనైనా పట్టుకుంటున్నారు పోలీసులు.. సిటీలు, పట్టణాల వరకు ఈ పరిస్థితి ఉన్నా.. గ్రామాల్లో దొంగతనం జరిగితే.. పట్టుకోవడం కాస్త కష్టమే.. మరోవైపు, దేవాలయాలను కూడా టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు కొందరు దొంగలు.. అయితే, ఆ దేవుడు అంటే భయంతో.. కొందరు దొంగలు.. తాము దొంగిలించిన సొమ్మును.. తిరిగి ఆ గుడిలోనే పెట్టివెళ్లారు.. ఆ సొత్తుతో పాటు.. ఓ లెటర్‌ను కూడా వదిలివెల్లారు.. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయంలో నెల రోజుల క్రితం హుండీ చోరీ జరిగింది.. అయితే, అనూహ్యంగా చోరీ సొత్తును నిన్న రాత్రి ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లారు దొంగలు.. ఇక, సదరు దొంగలు పడేసి వెళ్లిపోయిన నగదును వెలికితీసి పోలీసుల సమక్షంలో లెక్కించారు స్థానికులు.. ముసలమ్మ గుడిలో దుండగులు వదిలి వెళ్లిన అమ్మవారు హుండీ సొమ్ము లెక్కించగా రూ.1,86,486గా తేలింది. ఆ సొత్తుతో పాటు ఓ లేఖను కూడా పెట్టారు దొంగలు.. హుండీని నలుగరం కలసి చోరీ చేశామని లేఖలో పేర్కొన్నారు.. అయితే, దొంగతనం చేసినప్పటి నుంచి తమ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండడం లేదని.. భయంతో అమ్మవారి డబ్బును ఆలయం దగ్గర వదిలేసి వెళ్లినట్లు… లేఖ రాసి నగదు పెట్టిన సంచిలో వేశారు దొంగలు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. విచారణ చేపట్టారు పోలీసులు..
మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు.. భక్తులకు నో టెన్షన్.. !
శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా అటవీప్రాంతాల్లో వన్యప్రాణుల పర్యవేక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, తిరుమలలో నిరంతరం చిరుతపులులు సంచరిస్తున్నాయి. అందుకే.. అవి ఎన్ని ఉన్నాయి… ఎక్కడెడక్కడ తిరుగుతుంటాయి అనే విషయాలపై ఫారెస్ట్ డిపార్టుమెంట్ దృష్టి పెట్టింది. వాటితో పాటు ఇతర జంతువుల సంచారాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకుంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్లమార్గంలో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో 30కిపైగా సోలార్ పవర్ లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలున్నాయి. వాటితో పాటు AI ఆధారిత పర్యవేక్షణ, ప్రిడిక్టివ్ అనాలిసిస్.. డ్రోన్ నిఘా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక, ఏర్పాటు చేసిన టెక్నాలజీ సత్ఫలితాలిస్తోంది. శేషచల అటవీప్రాంతం లోపల అటవీశాఖ చిరుత పులుల సంచారాన్ని గుర్తించింది. కెమెరాలలో ఎనుగులు గుంపు దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య డివిజన్లలో డే అండ్ నైట్ పర్యవేక్షణ, డ్రోన్లు, GPS, గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఏనుగుల కదలికల అంచనా వేస్తున్నారు. ఏనుగు దాడులను అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో స్మార్ట్ ఫెన్సింగ్, SMS హెచ్చరికలు పంపేలా చర్యలు చేపట్టారు. 24 గంటల పర్యవేక్షణ సెల్ బయోలాబ్ ద్వారా ఏనుగుల డేటా సేకరిస్తున్నారు. కమ్యూనికేషన్.. హెచ్చరికలు.. వాట్సాప్, లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. తాజా లెక్కలు ప్రకారం తిరుపతి డివిజన్‌లో 40కిపైగా ఏనుగులు ఉన్నట్లుగా గుర్తించారు. ట్రాప్ కెమెరాలో చిరుతపులి వీడియోలు రికార్డయ్యాయి. డ్రోన్ కెమెరా, ట్రాప్ కెమెరాల్లోనూ ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీకి వస్తామంటే ప్రభుత్వం తోక ముడుస్తుంది..!
ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని విమర్శించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆక్రమాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో లూటీలు గృహ దహనాలు మానభంగాలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇలాంటి పద్ధతులు కొనసాగితే మంచిది కాదని హితవు పలికారు. రెడ్ బుక్ రాజ్యాంగాలు పనికిరావని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని అన్నారు తమ్మినేని సీతారాం.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్‌లో కలిశారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఆయనతో పాటు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్.ఆర్ విశ్వనాథన్ , టీటీడీ బోర్డు మాజీ డైరెక్టర్ సి. విష్ణు రెడ్డి ఉన్నారు.. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి అన్నారు. నిర్దోషులను దోషులుగా చిత్రీకరించి జైల్లో పెడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి నిర్దోషి , కచ్చితంగా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకొని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు ? ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఏమీ పనికిరావని అన్నారు. ఇది ప్రభుత్వానికి పద్ధతి కాదని, దీనిని సీరియస్ గా పరిగణిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలపై అసెంబ్లీలో చర్చించడం ఎందుకు..? అంటూ ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో ప్రజలే చెప్తారని అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
ఖైరతాబాద్ మహా గణపతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..
ఖైరతాబాద్ మహా గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు అర్చకులు.. సీఎం రేవంత్ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు.. దేశంలోనే గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.. ఖైరతాబాద్ గణేశుని కి ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది.. 1 లక్ష నలభై వేల విగ్రహాలు ఈ సారి నగరంలో ప్రతిష్టించారు.. గణేష్ మండపం నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము.. గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారుల సేవలు మరచి పోలేము.. ప్రజలందరికి మనవి ప్రశాంతంగా గణేష్ ముగింపు ఉత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాను.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తెలంగాణ రాష్టానికి పేరు తీసుకొచ్చింది.. నేను టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఖైరతాబాద్ గణేశున్ని దర్శించుకున్నాను.. ప్రజలందరు సంతోషంగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించాను అని తెలిపారు.
ఎన్నికల ముందు శశికళ సరికొత్త రాజకీయ ఆట.. ఆసక్తిరేపుతోన్న తమిళ పాలిటిక్స్
వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో తమిళ పాలిటిక్స్‌లో నెచ్చెలి శశికళ యాక్టివ్ అయ్యారు. చిన్నమ్మ సరికొత్త రాజకీయ ఆట షురూ చేశారు. ఇప్పటికే ఎన్డీఏ నుంచి పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ తదితరలంతా బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో కీలకమైన సీనియర్ నేత, మాజీ మంత్రి సెంగోట్టయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పళనిస్వామికి డెడ్‌లైన్ విధించారు. పార్టీకి దూరమైన పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ సహా ఇతర నాయకులను కలుపుకుని పోవడానికి పళనిస్వామికి ఇష్టం లేదని.. ఇది జయలలిత ఆశయాలకు విరుద్ధం అని చెప్పారు. అందరిని కలుపుకుని వెళ్లాలని.. అలా కాదని వెళ్తే జయలలిత ఆశయాలు సాధించలేమని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని.. బహిష్కరించిన నాయకులను 10 రోజుల్లో తిరిగి చేర్చుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. జయలలిత మరణం తర్వాత పార్టీ క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని.. అన్నాడీఎంకే విడిపోకుండా ఉండటానికి తాను అనేక త్యాగాలు చేసినట్లు గుర్తుచేశారు. పార్టీకి పునర్ వైభవం రావాలంటే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరినీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని సూచించారు. అందరూ జయలలిత ఆశయాల కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంజీఆర్, జయలలితతో సెంగోట్టయన్ పనిచేశారు. దాదాపు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
దేశంలో టెస్లా కారు మొదటి డెలివరీ.. మోడల్ Yని అందుకున్న మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్
ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా భారత్ లో తన మొదటి డెలివరీని ప్రారంభించింది. టెస్లా జూలై 15న తన ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ SUV, టెస్లా మోడల్ Yని విడుదల చేయడంతో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ధర సుమారు రూ. 60 లక్షలు. జూలై 15న ప్రారంభించబడిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ‘టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్’లో మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ వైట్ కలర్ మోడల్ Y కారును డెలివరీ తీసుకుంటున్నట్లు వార్తా సంస్థ ANI వీడియో షేర్ చేసింది. ఈ కారు రెగ్యులర్ మోడల్ అవునా లేక లాంగ్ రేంజ్ అవునా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. RWD ధరలు రూ. 59.89 లక్షల నుంచి, లాంగ్ రేంజ్ RWD ధరలు రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.(ఎక్స్-షోరూమ్). ఇప్పటివరకు, టెస్లాకు 600 బుకింగ్‌లు వచ్చాయని బ్లూమ్‌బెర్గ్ మంగళవారం నివేదించింది. టెస్లా ఈ సంవత్సరం భారతదేశానికి 350 నుంచి 500 కార్లను రవాణా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటిలో మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో షాంఘై నుంచి వస్తుంది.
భారత్‌లో పెట్టుబడులు ఆపండి.. వైట్‌హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా మరోసారి రుజువైంది. ఇప్పటికే సుంకాల పేరుతో భారీ బాదుడు బాదుతున్నారు. తాజాగా వైట్‌హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. భారత్‌లో పెట్టుబడులు ఆపి.. స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆపిల్ సీఈవోతో ట్రంప్ సంభాషించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గురువారం వైట్‌హౌస్‌లో టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఒక పొడవాటి టేబుల్‌పై ట్రంప్ దంపతులు, సీఈవోలంతా కూర్చున్నారు. ఈ సందర్భంగా గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సీఈవోలతో ట్రంప్ సంభాషిస్తూ ఇతర దేశాల్లో పెట్టుబడులు ఆపి యూఎస్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. గత మే నెలలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ఆపిల్ ఉత్పత్తులను భారత్‌లో నిలిపివేయాలని చెప్పారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని మళ్లీ లేవనెత్తారు.
120 దేశాల్లో విడుదలకు ప్లాన్.. రాజమౌళి కొత్త రికార్డు
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ #SSMB 29 (వర్కింగ్ టైటిల్)పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కెన్యాలో జరిగిన షూటింగ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వ సహకారానికి రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. కెన్యా సందర్శన తనకు గొప్ప అనుభవమైందని, అక్కడ గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన, తనయుడు కార్తికేయతో కలిసి కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ముసాలియా, రాజమౌళి టీమ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. శక్తివంతమైన కథనాలు, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో రాజమౌళి అసాధారణ ప్రతిభ కనబరుస్తారని కొనియాడారు. తూర్పు ఆఫ్రికా అంతటా పరిశీలించిన అనంతరం షూటింగ్ కోసం తమ దేశాన్ని ఎంచుకోవడం గర్వకారణమని అన్నారు. మాసాయి మారా మైదానాలు, నైవాషా సరస్సు, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రసిద్ధ ప్రాంతాలు సినిమాలో భాగమవనున్నాయని ఆయన వెల్లడించారు.
మూడోసారి ముచ్చటగా జంటగా స్క్రీన్ షేర్..!
టాలీవుడ్‌లో క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్లీ ముచ్చటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించిన ఈ జంట, ఇప్పుడు మూడోసారి స్క్రీన్ షేర్ చేయనుంది. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం, యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్-ఎమోషనల్ డ్రామా రూపొందుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్లో కనిపించడం, గత కొంతకాలంగా వీరి రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం, ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని ఇచ్చింది.
