ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం.. ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను బాధితురాలు వీణా రోజుకొకటి విడుదల చేస్తోంది. అసెంబ్లీలో వీడియో కాల్‌లో మాట్లాడిన వీడియోను కూడా వీణా బయటపెట్టింది. ఈ మొత్తం వ్యవహారం పై ఇప్పటికే పార్టీ నియమించిన విచారణ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. బాధితురాలు విడుదల చేస్తున్న వీడియోలు, వాటి వివరాలను విచారణ కమిటీ సేకరిస్తోంది. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో విచారణ కమిటీ రైల్వే కోడూరులో పర్యటించనుంది. ఈ సందర్భంగా బాధితురాలు వీణా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పాటు మరికొందరిని కూడా కమిటీ కలవనుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనుంది. ఇక, విచారణ కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మొన్న జరిగిన జనసేన శాసనసభ సమావేశంలో ఈ వ్యవహారంపై పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక మరోవైపు, వీణా చేస్తున్న ఆరోపణలు, మాట్లాడుతున్న తీరు అనుమానాస్పదంగా ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కేసీఆర్ను విచారణకు పిలవడం మీ అహంకారం కాకపోతే మరేమిటి?.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ రే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అన్నారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అని అడిగారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు.. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా?.. లేక మీ చేతిలో కీలు బొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని కేటీఆర్ మండిపడ్డారు. అయితే, చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు.. కానీ మాకు వాటి మీద పూర్తి విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తాం.. మీ ప్రతి తప్పుడు పనిని వెలికి తీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని పేర్కొన్నారు. మీరు ఎన్ని వేధింపులకు పాల్పడుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధి చెబుతారని కేటీఆర్ ఎక్స్ లో పెట్టిన పోస్టులో రాసుకొచ్చారు.
డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్.. ఎలాంటి సమాచారం లేదన్న శరద్ పవార్..!
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. NCP అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో.. ఆయన భార్య సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న ప్రచారంపై సీనియర్ నేత శరద్ పవార్ స్పందించారు. సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనే ప్రశ్నకు శరద్ పవార్ స్పందిస్తూ, దీనిపై నాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ నిర్ణయం ఆమె పార్టీ స్థాయిలో తీసుకుని ఉండాలి. ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అంతర్గతంగా ఏదో నిర్ణయం జరిగి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. రెండు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల (NCP) విలీనంపై కూడా శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటువంటి పరిస్థితిలో ఎలా ముందుకు వెళ్లాలో అందరూ ఆలోచించాలి. ఎవరైనా బాధ్యత తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అయితే, గత నాలుగు నెలలుగా రెండు NCPల విలీనంపై చర్చలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియకు అజిత్ పవార్, జయంత్ పాటిల్ నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. అయితే ఈ విలీనం ఖచ్చితంగా జరుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదన్నారు. రెండు పార్టీలు కలవాలనేది అజిత్ పవార్ కోరికగా ఆయన పేర్కొన్నారు.
“నేను, ఆసిమ్ మునీర్ విదేశాలకు వెళ్లి అడుక్కునే వాళ్లం”.. ఒప్పుకున్న పాక్ ప్రధాని..
పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్, చైనా, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి అప్పులు కోరుతోంది. అప్పుల కోసం తాము ఎలా విదేశాలకు తిరుగుతున్నామనే విషయాన్ని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించిన వీడియో వైరల్‌గా మారింది. తాము విదేశాల్లో భిక్షాటన చేస్తున్నామనే విషయాన్ని పాక్ ప్రధాని అంగీకరించారు. తాను, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కలిసి ఇతర దేశాలకు వెళ్లి ఎలా అడుక్కుంటున్నామనే విషయాన్ని షరీఫ్ బహిరంగంగా చెప్పారు. ఈ వీడియోలో ఐఎంఎఫ్ ప్యాకేజీ గురించి ఎలాంటి షరతులకు అంగీకరించాల్సి వచ్చిందో వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని షహబాజ్ షరీప్ తన దుస్థిని ప్రజలకు వివరించారు. ‘‘మాకు సహాయం చేసిన దేశాలకు నేను థాంక్స్ చెబుతున్నా. కానీ అప్పు తీసుకోవడం అనేది బాధ్యతతో కూడిన విషయం. నేను మీకు ఎలా వివరించాలో తెలియదు. నేను, అసిమ్ మునీర్ కలిసి సైలెంట్‌గా ఇతర దేశాలకు వెళ్లి, పాక్ పరిస్థితి, ఐఎంఎఫ్ రుణాల గురించి వివరించి, బిలియన్ డాలర్ల అపపు కోరాల్సి వచ్చింది. అప్పు అడిగే వ్యక్తి తల ఎప్పుడూ వంగే ఉంటుంది’’ అని అన్నారు. అప్పులు తీసుకున్న తర్వాత కొన్ని షరతులకు అంగీకరించాల్సిందే అని షరీఫ్ అన్నారు.‘‘ఒకసారి అప్పు తీసుకుంటే, ఆ దేశాల నుంచి కొన్ని డిమాండ్లు రావడం సహజం. గౌరవాన్ని కాపాడుకుంటూ అప్పు తీసుకోవడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో వారి షరతులు అంగీకరించాల్సిందే’’ అని అన్నారు. కష్టకాలంలో పాకిస్తాన్‌కు చైనా చాలా సాయం చేసిందని, అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ కూడా సహకరించాయని చెప్పారు.
రష్యన్ అమ్మాయితో సె*క్స్, బిల్ గేట్స్‌కు STD.. ఎస్‌స్టీన్ ఫైల్స్ సంచలనం..
అమెరికాలో ఎప్‌స్టీన్ ఫైల్ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన మరికొన్ని పత్రాలు సంచలన విషయాలను వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు ఇందులో ఉంది. బిల్ గేట్స్ రష్యన్ మహిళతో సె*క్స్ చేసిన తర్వాత, ఆయన లైంగిక సంక్రమణ వ్యాధి(STD)తో బాధపడ్డారని వెల్లడించింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అప్పటి భార్య మెలిండా గేట్స్‌కు తెలియకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వాలని ప్రయత్నించడాని ఆరోపించాయి. అయితే, ఆ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎలాంటి ధ్రువీకరణ లేదు. తాజాగా, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ శుక్రవారం లక్షలాది పత్రాలను విడుదల చేసింది. 2013లో ఎప్‌స్టీన్ తనకు తాను రాసిన ఇమెయిల్‌లలో ఈ ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ పత్రాలు విడుదలైన తర్వాత బిల్ గేట్స్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదం అని అన్నారు. బిల్‌గేట్స్‌ను అపఖ్యాతి పాలుచేసేందుకు ఎప్‌స్టీన్ ఎంత దూరం వెళ్లాడనే విషయాన్ని ఇవి సూచిస్తున్నాయని గేట్స్ ప్రతినిధి డైలీమెయిల్‌కు తెలిపారు.
అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఏపీ సహా టాప్ 10 స్టేట్స్ ఇవే..
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నాయి. అయితే ఈ వృద్ధి మధ్యలోనే అనేక రాష్ట్రాలు తీవ్రమైన అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన 2025 ఆర్థిక సంవత్సర గణాంకాలు ఈ ఆందోళనకర నిజాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. RBI డేటా ప్రకారం, దేశంలోని కొన్ని పెద్ద రాష్ట్రాలు తమ పన్ను మరియు పన్నుయేతర ఆదాయంలో 40 శాతం వరకు కేవలం రుణాలపై వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నాయి. దీనివల్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలకు సరిపడా నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది. అప్పుల భారంతో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సుమారు రూ.1.09 లక్షల కోట్ల ఆదాయం పొందగా, అందులో రూ.45,000 కోట్లకు పైగా వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చింది. అంటే మొత్తం ఆదాయంలో దాదాపు 42 శాతం వడ్డీకే వెళ్లిపోయింది. ఇక, రెండో స్థానంలో ఉన్న పంజాబ్ తన ఆదాయంలో 34 శాతం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. రూ.70,000 కోట్ల ఆదాయంలో సుమారు రూ.24,000 కోట్లు వడ్డీగా చెల్లించింది. ఆ తర్వాత బీహార్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం సంపాదించిన రూ.62,000 కోట్ల ఆదాయంలో సుమారు రూ.21,000 కోట్లు వడ్డీ చెల్లింపులకు వెళ్లాయి.. ఇది మొత్తం ఆదాయంలో 33 శాతం.
లాంచ్‌కి సిద్ధమైన Tecno Pova Curve 2.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు..
టెక్నో త్వరలో భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Tecno Pova Curve 2ను లాంచ్ చేయనుందని అధికారికంగా ధృవీకరించింది. లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఇప్పటికే విడుదలైన టీజర్లు మరియు సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ద్వారా ఫోన్ డిజైన్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. మే 2025లో విడుదలైన Tecno Pova Curve 5Gకు ఇది సక్సెసర్‌గా రానుండగా, అదే కర్వ్‌డ్ డిజైన్ భాషను మరింత మెరుగుపరిచి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. X (ట్విట్టర్)లో టెక్నో షేర్ చేసిన తాజా టీజర్ ప్రకారం, Tecno Pova Curve 2 త్వరలోనే భారత్‌లో లాంచ్ కానుంది. టీజర్‌లో ఫోన్‌కు సంబంధించిన ఒక భాగం యొక్క పారదర్శక రెండర్‌ను చూపించారు. ఖచ్చితమైన లాంచ్ తేదీని త్వరలో వెల్లడిస్తామని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. టీజర్ ఇమేజ్ ప్రకారం, ఫోన్‌లో కర్వ్‌డ్ ఎడ్జ్ డిజైన్ ఉండనుంది. వెనుక భాగంలో వృత్తాకార కెమెరా కటౌట్‌తో కూడిన పెద్ద కెమెరా మాడ్యూల్ కనిపించే అవకాశం ఉంది. ఇది Tecno Pova Curve 5Gకు సమానమైన డిజైన్‌ను కలిగి ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత మార్కెట్‌లోకి Haier Lumiere Colourful 4 Door Refrigerator.. దీని ప్రత్యేకత, ధర ఏంటంటే..?
భారత గృహ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైయర్ (Haier) కొత్తగా Lumiere Colourful 4 Door Refrigerator ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఆధునిక వంటగదులకు సరిపోయే ప్రీమియం డిజైన్, అధునాతన టెక్నాలజీతో ఈ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. హైయర్ లూమియర్ 4 డోర్ రిఫ్రిజిరేటర్ 520 లీటర్ల సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో పాటు గ్లోస్, మ్యాట్ ఫినిష్‌లలో లభిస్తుంది. ఈ సిరీస్‌ను పెర్ల్ వైట్, పింక్, రోసెట్ వైట్ అనే మూడు ఆకర్షణీయ రంగుల్లో మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఈ రిఫ్రిజిరేటర్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ కన్వర్టిబుల్ జోన్. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మొత్తం స్టోరేజ్‌లో 85 శాతం భాగాన్ని ఫ్రెష్ లేదా ఫ్రోజన్ స్టోరేజ్‌గా మార్చుకునే సౌలభ్యం ఉంది. మిగిలిన 15 శాతం భాగం ఫ్రీజర్‌కు కేటాయించారు. బాహ్య నియంత్రణ ప్యానెల్ ద్వారా రిఫ్రిజిరేటర్ తెరవకుండానే ఉష్ణోగ్రత నియంత్రణ.. డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ ద్వారా సమానమైన శీతలీకరణ.. పండ్లు, కూరగాయల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్.. తక్కువ శబ్దంతో పనిచేసే డిజైన్.. 95 డిగ్రీల యాంటీ-టిప్పింగ్ డోర్ రాక్స్, బాటిళ్లు పడిపోకుండా రక్షణ దీని సొంతం..
జీఎస్టీ మినహాయింపులు.. ఆటో రంగానికి బూస్ట్..
కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న వేళ, భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రభుత్వం నుంచి భారీ ఆశలు పెట్టుకుంది. గత ఏడాది అమలులోకి వచ్చిన GST 2.0 సంస్కరణలు ఆటో రంగానికి గణనీయమైన ఊతమిచ్చిన నేపథ్యంలో, ఈసారి బడ్జెట్‌లో మరింత స్థిరమైన విధానాలు, పన్ను ఉపశమనాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) ప్రోత్సాహకాలు అందిస్తారని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన తొమ్మిదవ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు దేశంలోని అన్ని రంగాలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తుండగా, ఆటో పరిశ్రమ కూడా కీలక సూచనలతో ముందుకొచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో అమలైన GST కోతలతో వాహన ధరలు తగ్గాయి. ఫలితంగా వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ICE (పెట్రోల్, డీజిల్) వాహనాల విక్రయాల్లో స్పష్టమైన వృద్ధి కనిపించింది. ఈ మార్పులు ఆటోమేకర్లకు ఊరటనిచ్చినప్పటికీ, రంగం పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే తాజా బడ్జెట్‌లో మరింత మద్దతు అవసరమని పరిశ్రమ భావిస్తోంది. ఆటో పరిశ్రమ ప్రభుత్వం నుంచి కోరుతున్న ప్రధాన అంశం విధానాల్లో స్థిరత్వం. వాహనాల అభివృద్ధి, తయారీకి సంవత్సరాలు పడుతుండటంతో, తరచూ నిబంధనలు మారితే దీర్ఘకాల ప్రణాళికలు దెబ్బతింటాయని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థిరమైన విధానాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, దేశీయ తయారీ, సాంకేతిక అభివృద్ధికి దోహదపడతాయని పరిశ్రమ విశ్వసిస్తోంది.
టీ20 వరల్డ్‌కప్‌కు అంపైర్ల టీమ్ రెడీ.. భారత్- పాక్ మ్యాచ్కి మళ్లీ ఆ ఇద్దరే!
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్‌లకు సంబంధించిన అంపైర్ల జాబితాను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌లకు మొత్తం 24 మంది ఆన్‌ఫీల్డ్ అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలు విధులు నిర్వర్తించనున్నారు. ఈ టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షించే భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు అనుభవజ్ఞులైన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, కుమార్ ధర్మసేనలను ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా నియమించారు. కీలక మ్యాచ్‌లను నిర్వహించిన అనుభవం ఉన్న ఈ ఇద్దరి నియామకం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్- నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కుమార్ ధర్మసేన, వేన్ నైట్స్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. వేన్ నైట్స్‌కు ఇది తన తొలి టీ20 ప్రపంచకప్ అనుభవం కాగా, ఈ మ్యాచ్ అతనికి 50వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌గా కానుంది. మరోవైపు ధర్మసేన టీ20 ప్రపంచకప్‌లలో విశేష అనుభవం కలిగిన అంపైర్. ఇప్పటివరకు 37 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు. 2016, 2022 ఫైనల్స్‌కూ సైతం విధులు నిర్వర్తించారు.
