NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఘనంగా దీపావళి వేడుకలు.. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోన్న ఒంగోలు వాసులు
ఒంగోలు పండుగలకు ఎంతో ప్రత్యేకం.. దసరా సంబరాల్లో కళారాలు.. దీపావళికి సత్యభామ.. నరకాసుర వధ.. వంటి సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా దీపావళి రోజున సత్యభామ, నరకాసుర వధ వీధి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.. 1902 వ సంవత్సరం నుంచి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న యువజన మిత్ర మండలి నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమం ఇంకెక్కడా కనిపించదు.. దీంతో పాటు ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆద్వర్యంలో 39.5 అడుగుల నరకాసురుని బొమ్మను బాణసంచాతో తయారు చేసి దీపావళి అందరి జీవితాల్లో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపాలని కోరుకుంటూ నరకాసుర వధ చేశారు. భారతదేశంలో కోల్ కతా తరువాత ఒంగోలు లోనే నరకాసుర వధ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒంగోలులో నరకాసుర వధ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. 1902 నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారే వరకూ ఈ నరకాసుర వధ ఘట్టం కొనసాగుతుంది. ఒంగోలులో తొలుత శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి. అనంతరం కొంతమంది మిత్రులు కలిసి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి 39.5 అడుగుల భారీ నరకాసురుని బొమ్మను ఏర్పాటు చేశారు. నగరంలోని సివియన్‌ రీడింగ్‌ రూం సమీపంలో చెన్నకేశవస్వామి ఆలయం దగ్గర ఈ బొమ్మను రోడ్డుపై నిలబెట్టారు. అనంతరం బాణాసంచా పేల్చి బొమ్మను కాల్చారు.

పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ఇండియాస్పోరాకు లోకేష్‌ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇండియాస్పోరా, యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా వెల్లడించారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయం అన్నారు.. యూఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ స్టార్టప్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు కాబోతోంది. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నాం. ఎటువంటి జాప్యం లేకుండా అనుమతుల కోసం ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, వైద్యపరికరాల తయారీ, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలని నిర్ణ

పేదల తిరుపతి.. కురుమూర్తి బ్రహ్మోత్సవాల ప్రత్యేకం..
తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒక టిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయాని కి పోలికలున్నాయి. అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురు మూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఇక, పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల మండపాలంకరణంతో వేడుకలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రావడానికి రెండు రకాల పురాణ గాథలు ఉన్నాయి. ఇందులో.. తిరుపతి నుంచి కురుమూర్తికి రావడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి. తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో.. సుగంధభరిత నానాఫల వృక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. దాదాపు 900 సంవత్సరాల నుండి స్వామి వారు పూజలు అందుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత దేవరకద్ర నియోజక వర్గంలోని అమ్మాపూర్ ప్రాంతంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపు రుషుడు గోపాలరాయుడు నిర్మించగా.. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపరచగా, సోమ భూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సంప్రదాయం అమలులోకి తెచ్చారని తెలుస్తోంది. 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల ఊరేగింపు ప్రధాన ఘట్టంగా ఉంటుంది . ఉద్దాలు అంటే పాదుకలు అని అర్ధం. స్వామి వారి పాదుకలను ఊరేగింపు చేసే కార్యక్రమాన్ని, పవిత్రంగా, ప్రాధాన్యతతో నిర్వహిస్తారు.

నాకు ఓటేస్తే మహిళలకు జ్యూసర్ మిక్సర్లు.. వివాదంతో ‘మహా’ ఎమ్మెల్యే..
మహారాష్ట్ర ఎన్నికల వైపు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన కూటములు పోటీ పడుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ, శివసేన కూటమి ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల ‘‘మహా వికాస్ అఘాడీ’’ కూటములు పోటీలో ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులంతా తమతమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, తాజాగా చండీవాడీ ఎమ్మెల్యే దిలీప్ లాండే ఇచ్చిన హామీ వివాదాస్పదంగా మారింది. గతంలో రూ. 12.50 కోట్ల ప్రెజర్ కుక్కర్ స్కాన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న లాండే, తాను గెలిస్తే తన నియోజకవర్గంలోని మహిళలకు జ్యూసర్లు మిక్సర్లు పంపిణీ చేస్తానని ప్రకటించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని ఆరోపిస్తూ న్యాయవాది నిఖిల్ కాంబ్లే బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. మహిళా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గృహోపకరణాలు పంపిణీ చేస్తానని వాగ్దానం చేయడం ద్వారా చండీవలి నియోజకవర్గంలోని ఓటర్లను అనవసరంగా ప్రభావితం చేయడమే లాండే లక్ష్యమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది మోడల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)కి విరుద్ధంగా ఉందని ఆరోపించారు.

మహిళలకు ‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పథకాల్లో మహిళలకు ‘‘ఫ్రీబస్’’ సదుపాయం ఒకటి. ప్రభుత్వం ఇప్పుడు ఈ ‘‘శక్తి’’ పథకాన్ని కొనసాగించడంపై పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీసీఎం డీకే శివకుమార్ బుధవారం చెప్పారు. లగ్జరీ కాని KSRTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే శక్తి పథకం, కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీల్లో ఒకటి. జూన్ 11, 2023న కర్ణాటక ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. ఇదే పథకాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే, బుధవారం కేఎస్ఆర్టీసీ ఐరావత్ క్లబ్ క్లాస్ 2.0 బస్సుల్ని ప్రారంభించింది. ఈ సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది మహిళలు తమ టిక్కెట్లు కొనుక్కోవడానికే మొగ్గు చూపిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా, ఈమెయిళ్ల ద్వారా ఈ విషయాన్ని మాకు తెలియజేశారని, దీనిపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు వెల్లడించారు. సుమారుగా 5-10 శాతం మంది మహిళలు తాము స్వచ్ఛందంగా డబ్బులిచ్చి టికెట్ కొనుగోలు చేస్తామని చెబుతున్నా, కండక్టర్లు తీసుకోవడం లేదని చెప్పారని తెలిపారు. త్వరలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశమై ఈ విషయమై చర్చిస్తామని డీకే చెప్పారు.

పండగ రోజు షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే
బంగారం ధర మాటల్లో చెప్పలేని స్థాయికి పెరుగుతోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అంతే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ బాగా పెరగడం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 7455 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 59,640 గా ఉంది. అలాగే 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 74,550 గా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 150 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ఒక గ్రాము ధర రూ. 8133 గాను, 8 గ్రాముల ధర రూ. 65,064 గాను, అలాగే 10 గ్రాముల ధర రూ. 81,330 గా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 170 పెరిగింది..

ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో చోరీ.. విలువైన వస్తువులతో పాటు అవార్డు మాయం
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొందరు ముసుగు ధరించిన దొంగలు ఆయన ఇంటిని టార్గెట్ చేశారు. అయితే, పాకిస్థాన్ ప‌ర్యట‌న‌లో ఉన్నారు బెన్ స్టోక్స్‌.. అస‌లే సిరీస్ ఓట‌మి బాధ‌లో ఉన్న అతడికి మరో దెబ్బ తగిలింది.. ఇంట్లో దొంగ‌లు పడి ఎన్నో విలువైన వ‌స్తువులు ఎత్తుకెళ్లారు.. స్టోక్స్‌ భార్య, పిల్లలు ఇంట్లో ఉండగానే ఈ ఘటన జరిగింది.. అయితే, తన కుటుంబానికి భౌతికంగా ఎటువంటి హాని జరగలేదని, అయితే వారి విలువైన వస్తువులు.. సెంటిమెంట్‌తో కూడకున్న వస్తువులు కూడా దొంగిలించబడ్డాయని పేర్కొన్నారు.. బెన్ స్టోక్స్ తనకు లభించిన.. 2020 OBE అవార్డు, మూడు గొలుసులు, ఒక ఉంగరం మరియు డిజైనర్ బ్యాగ్‌తో సహా దొంగిలించబడిన కొన్ని వస్తువుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.. ‘అక్టోబర్ 17 గురువారం సాయంత్రం కాజిల్ ఈడెన్ ప్రాంతంలోని నా ఇంటిలోకి పలువురు ముసుగులు ధరించిన వ్యక్తులు చొరపడ్డారు.. ఆ సమయంలో నా భార్య కార్లే, పిల్లలు లేట‌న్, లిబ్బిలు ఇంట్లోనే ఉన్నారు. అయితే.. వాళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా దొంగలు.. విలువైన న‌గ‌లు, ఖ‌రీదైన ఆభ‌ర‌ణాలు.. నాకు బ్రిటన్ ప్రభుత్వం బ‌హూక‌రించిన ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అవార్డును ఎత్తుకెళ్లిపోయారని.. అదంటే నాకు చాలా ఇష్టం అంటూ రాసుకొచ్చాడు.. వారు నగలు, ఇతర విలువైన వస్తువులు మరియు చాలా వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్లిపోయారు.. వాటిలో చాలా అంశాలు నాకు మరియు నా కుటుంబానికి నిజంగా సెంటిమెంట్.. విలువను కలిగి ఉన్నాయి.. అవి భర్తీ చేయలేనివి అంటూ భాగోద్వేగాని గురయ్యాడు.. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించగలం. ‘నేను దొంగిలించబడిన కొన్ని వస్తువుల ఛాయాచిత్రాలను విడుదల చేస్తున్నాను – వాటిని సులభంగా గుర్తించగలమని నేను ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌.

లక్కీ భాస్కర్ ఎక్కడ బోర్ కొట్టనివ్వదు..
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ గెలవాలని కోరుకుంటాడు. చూసే సాధారణ ప్రేక్షకులు భాస్కర్ పాత్రలో తమని తాము చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడం ఉండదు. తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు. ఇది సందేశాత్మక చిత్రం కాదు. తెలుగులో వస్తున్న ఒక విభిన్న చిత్రం. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ఫైట్స్ ఒకటే కాదు. ఫైట్స్ లేకుండానే ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తుంది. సినిమా చూసి, ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. నాకు, త్రివిక్రమ్ గారితో సహా మా అందరికీ సినిమా బాగా నచ్చింది. అందరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం.అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లక్కీ భాస్కర్ సినిమా చూసి కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోండి’ అని అన్నారు.

అమరన్ భారీగా అడ్వాస్స్ బుకింగ్స్.. కారణమేంటి..?
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ+ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని అడ్వాన్స్ బుకింగ్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అమరన్ తో పాటుగా రిలీజైన క, లక్కీ భాస్కర్, బఘీర సినిమాలను మించి ఈ సినిమా బుకింగ్స్ అదరగొడుతుంది. ఒక్క హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే కిరణ్ అబ్బవరం ‘క’ : 27 లక్షలు, శివకార్తికేయన్ ‘అమరన్’ : రూ.1.02 కోట్లు, దుల్కర్ సల్మాన్ ‘ లక్కీ భాస్కర్’ : రూ. 54 లక్షలు, శ్రీమురళి భఘీర : రూ. 10 లక్షలుగా ఉన్నాయి. శివకార్తికేయన్ సినిమాకు రావడం పట్ల ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇందుకు పలు రకాల కారణాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అమరన్ సినిమా బయోపిక్ కావడం, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడం, సాంగ్స్ సూపర్ హిట్ కావడం, మరిముఖ్యంగా ఈ సినిమాలో సాయిపల్లవి నటించడం తో ఈ సినిమాకు ఇంతటి భారీ కలెక్షన్స్ వస్తున్నాయని ట్రేడ్ అంచనా వేస్తుంది. సూపర్ హిట్ తెచ్చుకోవడంతో ఈ ఈసినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది