లోక నాయకుడు కమల్ హాసన్.. లోక మాయకుడు చంద్రబాబు..!
సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు.. కమల్ హాసన్‌ను మించిపోయారని సెటైర్లు వేశారు.. లోక నాయకుడు కమల్ హాసన్ అయితే.. లోక మాయకుడు చంద్రబాబు అని.. దశవతారాలు చంద్రబాబు.. బాబు ఏక్ నెంబర్, బేటా దస్ నెంబర్ అంటూ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై హాట్ కామెంట్లు చేశారు.. ఇక, మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు అంటూ మరోసారి దుయ్యబట్టారు అమర్నాథ్.. గత రెండు రోజులుగా చంద్రబాబు, లోకేష్ లు.. వైఎస్ జగన్ పై, వైసీపీపై పడి ఏడుస్తున్నారు.. సింగపూర్ వెళ్లి సాధించింది ఏం లేక.. ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తేలిక జగన్ పై పడిపోతున్నారని విమర్శంచారు గుడివాడ అమర్నాథ్.. మంత్రి లోకేష్ బరువు తగ్గాడు తప్ప బుద్ధి పెరగలేదన్న ఆయన.. బాబుని మించి అబద్దాల కోరులా తయారయ్యాడు లోకేష్ అని మండిపడ్డారు.. సింగపూర్ లో ఎవరో ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ పెట్టారట.. తీరా ఆ కంప్లైంట్ ఎవరు పెట్టారు అంటే టీడీపీ సానుభూతి పరుడే పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.. ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఆధారాలు దొరకగానే బిగ్ బాస్ అరెస్ట్..! లిక్కర్ స్కామ్‌పై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారింది.. ఇప్పటికే కీలక వ్యాఖ్యలు అరెస్ట్ కాగా.. ఈ కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం జరగుతోంది.. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు.. ఏం ఆధారాలు లేకుండా ఎంపీని అరెస్టు చేయరన్నారు.. అయితే, బిగ్ బాస్ ను కూడా ఆధారాలు దొరకగానే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు.. ఈ స్కామ్ లో సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తుందని వెల్లడించారు పెమ్మసాని.. ఇక, సూపర్ సిక్స్ తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పథకాలకు యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు పెమ్మసాని చంద్రశేఖర్.. గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు ఫించన్ పెంచడానికే ఐదేళ్లు పట్టింది.. గత ప్రభుత్వం రైతు భరోసా పదమూడు వేలే ఇచ్చింది. మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పాం. కేంద్రంతో కలిపి మూడు విడతల్లో ఇస్తున్నాం అన్నారు… ఇక హామీలు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు.. ఏం అమలు చేయలేదు.. ఎక్కడో చెప్పండి అంటూ నిలదీశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
పొలంలోకి దిగి వరినాట్లు వేసిన హోం మంత్రి అనిత..
ఇప్పుడు అంతా వరి నాట్ల సీజన్.. ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదలతో రైతులు పొలం పనుల్లో మునిగిపోతున్నారు.. మరికొన్ని ప్రాంతాల్లో బావులు, బోరు బావుల నీటి సాయంతో వ్యవసాయం చేస్తున్నారు.. అయితే, నిత్యం కార్యక్రమాలతో బిజీగా ఉండే ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఒక్కసారిగా పొలంలోకి దిగి వరినాట్లు వేశారు.. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న హోంమంత్రి వంగలపూడి అనిత.. గజపతినగరం రైల్వే స్టేషన్ రోడ్డు పురిటిపెంట గ్రామంలో వరినాట్లు వేశారు.. వరి నాట్ల పరిశీనకు పురిటిపెంట విచ్చేసిన మంత్రి అనిత.. రైతులతో ముఖా-ముఖీలో పాల్గొని అనంతరం రైతులతో పాటుగా పంట పొలను పరిశీలించారు.. రైతు కష్టాలను అడిగి తెలుసుకున్నారు.. రైతులతో కలిసి మడిలో దిగి వరి నాట్లు వేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
లగ్జరీ కార్లలో దిగిపోతారు.. వాళ్లు చేసే పని చూస్తే షాక్ అవుతారు..!
ఖరీదైన కార్లలో వస్తారు.. అక్కడే గంటల తరబడి తిష్ట వేస్తారు.. కబుర్లు చెప్పుకొని వెళ్లిపోతున్నారేమో..? లేదా మందు ఏమైనా తాగుతున్నారా? ఓ దమ్ము లాంగిచి వెళ్తున్నారేమో.. అనుకుంటే పొరపాటే.. ఎందుకుంటే.. ఇంతకీ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ఫోకస్ పెట్టిన పోలీసులు.. అసలు విషయం చూసి షాక్ తిన్నారు… సికింద్రాబాద్‌లో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఆ దృశ్యాలను చూసి పోలీసులు షాక్ తిన్నారు.. ఖరీదైన కార్లలో కొందరు యువకుల వచ్చారు.. గంట పాటు అక్కడే ఉండి వెళ్లిపోయరు. వారేవరో అర్ధం కాక సీసీ కెమెరాలు గమనిస్తే అసలు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు.. సికింద్రాబాద్ బండిమేట్ ప్రాంతంలో కొందరు యువకులు రాత్రి సమయల్లో ఖరీదైన కారులో వచ్చారు. కొంత సమయనికి అక్కడ కొన్ని ఆవులు స్పహ లేకుండా పడిపోయి ఉండగా.. మరి కొన్ని ఆవులు కనిపించలేదు.. దీంతో, వెంటనే సీసీ టీవీ ఫుటేజ్‌ను స్థానికులు పరిశీలించగా.. కొందరు యువకులు ఆ ఖరీదైన కారులో ఆవులను బలవంతంగా తీసుకెళ్లినట్టు కనిపించింది.. ఈ మధ్య కాలంలో వరుసగా ఆవులు మాయం అవుతుండడంతో ఎటు వెళ్లిపోయయని భావించిన స్థానికులు.. ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆ యువకులపై చర్యలు తీసుకోవలంటూ మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
50 సార్లు ఢిల్లీకి సీఎం.. రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్..
హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో.. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు: మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం!, రెండో పని – ఢిల్లీకి పోవడం!, మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం! అని కేటీఆర్ రాసుకొచ్చారు. ఇక, రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు.. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. సాగు నీళ్లు రావు.. తాగునీళ్లు లేవు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు అని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు.. రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు.. రుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదు.. తులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదు.. గురుకులాల గోడు పట్టదు – గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు.. కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది..
దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది న్యాయవాదులే.. స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం.. న్యాయవాదులు కాంగ్రెస్ కు వెన్నుముక గా ఉన్నారు.. మీరు చేసిన త్యాగాలను ఇపుడు విధ్వంసం చేశారు.. ఎన్నికల విధానాన్ని పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.. బీజేపీ వరుస విజయాల వెనుక చీటింగ్ జరుగుతోంది.. ఇపుడు మన వద్ద ఆధారాలు ఉన్నాయి.. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మేం గెలిచాం.. అసెంబ్లీలో మేం ఓడాం.. ఎన్నికల కమిషన్ కాపీలు స్కాన్ ప్రొటెక్ట్ తో రూపొందించారు.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ.. ఎంపిక ఎప్పుడంటే..!
బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటినుంచో పార్టీ ఆలోచన చేస్తోంది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు పర్యాయాల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. ప్రతీ మూడేళ్లకోసారి ఎన్నిక జరుగుతుంటుంది. 2019 నుంచి 2024 వరకు రెండు సార్ల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందే కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని భావించారు. కానీ ఇప్పట్లో అది కుదిరే పనిలా కనిపించడం లేదు. ఇక జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 9నే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇందుకోసం పార్టీ విధేయుల్ని అధిష్టానం జల్లెడ పడుతుంది. సీనియర్లలో ఎవరు నమ్మకస్థులుగా ఉన్నారో వారిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ పనిలో బిజీగా ఉండడంతో బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నిక ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ తర్వాతే ఎన్నిక ఉండొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేయనుంది. ఒకవేళ అదే జరిగితే నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అన్నదాతలకు శుభవార్త.. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోడీ
అన్నదాతలకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ నిధులను విడుదల చేశారు. 0వ విడతలో భాగంగా 9.7 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లకుపైగా నగదును జమ చేశారు. అలాగే రూ. 2,200 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం వంటి బహుళ రంగాలకు ఉపయోగపడనున్నాయి.
గోల్డ్ లవర్స్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ప్రియులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు.. శనివారం అమాంతంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు.. ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా మళ్లీ ధరలు కొండెక్కుతున్నాయి. తులం బంగారం ధర రూ. 1,530 పెరిగింది. సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 1,530 రూపాయలు పెరిగి.. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,01,350 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 1,400 రూపాయిలు పెరిగి.. తులం బంగారం ధర రూ. 92,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 1,140 రూపాయిలు పెరిగి 10 గ్రాముల ధర రూ.76,010 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా.. వెండి ధరలు ఉపశమనం కలిగిస్తోంది.. కేజీ వెండి రూ.1,13,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రాంతాల వారీగా నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి.
టెస్లా కారులో ఆటో పైలట్ తప్పిదం.. రూ.2,100 కోట్ల జరిమానా
అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు భారీ జరిమానా పడింది. 2019లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ లోపమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో బాధితులకు పరిహారం చెల్లించాలని కంపెనీకి ఆదేశాలను జారీ చేసింది. దీంతో బాధితులకు 242 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2,100కోట్లు) చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. ఆనాటి ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 2019లో ఫ్లోరిడాలోని కీ లార్గోలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్జ్ మెక్‌గీ అనే వ్యక్తి టెస్లా కారును అధునాతన ఆటోపైలట్ మోడ్‌లో నడిపిస్తున్నాడు. మార్గమధ్యంలో అతని మొబైల్ ఫోన్ కిందపడి పోవడంతో దాన్ని తీసుకోవడానికి కిందకు వంగాడు. కారు ఆటోపైలట్‌లో ఉందని భావించిన మెక్‌గీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కన పార్క్ చేసిన వాహనాన్ని ఢీకొట్టడంతో పాటు ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. కాగా, ఈ ప్రమాదంలో 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే చనిపోగా.. ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమయంలో యువతి మృతదేహం 75 అడుగుల దూరంలో ఎగిరి పడిందని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.
జాతీయ అవార్డులపై నెటిజన్ల ఫైర్ !
ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులలో జాతీయ అవార్డులు కూడా ఒకటి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వివిధ విభాగాల్లో ఉత్తమ సినిమాలు, నటీనటులను పురస్కరించే జాతీయ అవార్డుల లిస్ట్ విడుదలైంది. అయితే ఈసారి ఈ అవార్డుల ఎంపిక పట్ల సినీ ప్రియులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మక చిత్రాలకూ, అవార్డుల జాబితాలో నిలిచే అవకాశమున్న నటీనటులకూ గుర్తింపు రాకపోవడం చూసి ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. ఈసారి ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ చేసిన పాత్రను మెచ్చుకోని వారే లేరు. అదే విధంగా మళయాళంలో ‘ఆడు జీవితం’ (The Goat Life) చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జీవించిన లైఫ్‌టైమ్ పెర్ఫామెన్స్ కూడా బహుమతుల జాబితాలో లేకపోవడం ప్రేక్షకులకు అసహ్యాన్ని కలిగించింది. పైగా 12th ఫెయిల్, సామ్ బహుదూర్ వంటి చిత్రాల్లో నటీనటుల ప్రదర్శన కూడా మెచ్చుకోదగినదే అయినప్పటికీ, అవార్డుల కూర్చీ దగ్గర దృష్టిలో పడకపోవడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెప్పు తెగుద్ది.. అంటూ బోల్డ్ కామెంట్లపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్
టాలీవుడ్ యాక్ట్రెస్, పాపులర్ యాంకర్ అనసూయ మరోసారి అభిమానులపై మండిపడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న అనసూయ పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను చూసి అసహజంగా కామెంట్లు వేస్తూ అశ్రద్ధగా ప్రవర్తించడంతో.. ఆమె ఏ మాత్రం వెనుకాడకుండా వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పింది. “చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య ఉంటే వాళ్లని కూడా ఇలాగే కామెంట్లు చేస్తారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పించలేదా?’ అంటూ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె ధైర్యంగా నిలబడి స్పందించిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచింది. రంగమ్మత్త రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయను వ్యాఖ్యాలపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈజ్ ఆర్ స్పోక్ పర్సన్!’ అంటూ ఫీమెల్ సేఫ్టీ విషయంలో ఆమె స్పందనను ప్రశంసిస్తున్నారు. ఒక పబ్లిక్ ఫిగర్‌గా ఆమె చూపిన తెగువ, స్పష్టత, సోషల్ సెన్సిబిలిటీ నిజంగా ప్రశంసనీయం.
ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్..
వివిధ జానర్లతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓ పవిత్రమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుని మహిమను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘జై హనుమాన్’. హనుమంతుని జీవితం, ధైర్యం, భక్తి అన్నీ కలిసిన ఓ సాంకేతిక కాంభినేషన్‌గా తెరకెక్కించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయింది, వీఎఫ్‌ఎక్స్ ఆధారిత ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. ఇక హీరో రిషబ్ షెట్టి ప్రజంట్ ‘కాంతార 2’ కంప్లీట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఆయన వస్తే వెంటనే షూటింగ్ ప్రారంభించడమే.
