Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

సుగాలి ప్రీతి కేసు.. డిప్యూటీ సీఎం షాకింగ్‌ కామెంట్స్..
సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. తాను, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని గుర్తుచేసుకున్నారు.. ఆ పాపకి న్యాయం జరగాలి ఏమీ ఏమీ జరిగింది అని అడిగా? సుగాలి ప్రీతి కేసు త్వరిత పరిష్కారం కోసం నేను సిఫారసు చేశాను.. సీఐడీ చీఫ్‌, డీఐజీ, హోం మంత్రికి వెంటనే ఆదేశాలు ఇచ్చాను.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని నేను స్పష్టంగా చెప్పాను అన్నారు. అయితే, అప్పట్లో ఎవరైతే కుట్ర వెనుక ఉండి చెపుతున్నారో DNA తారుమారు చేశారు.. ఒత్తిడి చేసి భూములు అన్ని ఇచ్చేసి సాక్ష్యాలు తారుమారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. DNA సాక్ష్యాలు మ్యాచ్ కావడం లేదు అని పోలీసులు చెపుతున్నారు ఇది వాస్తవం.. వివేకానందరెడ్డి గారిని చంపేశారు అని అందరకి తెలుసు.. ఎవరు అయితే నిందితులు ఉన్నారో ఒక్కొక్కరిని చంపేస్తున్నారు.. మరి గత ఐదు సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళానికే పూనుకున్నాం.. ఒక్కొక్క కేసును పరిష్కరిస్తామని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

రుషికొండ ప్యాలెస్‌కు పవన్‌ కల్యాణ్‌.. బాత్ రూమ్స్ చూసి ఆశ్చర్యపోయిన డిప్యూటీ సీఎం..
విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్… గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను పరిశీలించారు.. జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను తిలకించారు పవన్‌.. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది” అంటారు.. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే రుషికొండపై 1 కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రుషికొండ టూరిజం భవనాలు పరిశీలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌.. అత్యధునిక బెడ్ రూమ్స్, బాత్ రూమ్స్ చూసి ఆశ్చర్యపోయారు పవన్‌ కల్యాణ్‌.. అవన్ని పాడైపోతున్నాయి.. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.. గతంలో హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఏడు కోట్లు ఆదాయం వచ్చేదని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు వివరించారు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్.. కానీ, ఇప్పుడు మెంటినెన్స్ కు కోటి రూపాయలు బకాయి పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, గ్రీన్ ట్రిబ్యునల్‌లో సైతం కేసు నడుస్తుందని వివరించారు అధికారులు.. అయితే, రుషికొండ భవనాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలన్నారు పవన్‌ కల్యాణ్‌.. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించేందుకు ప్రయత్నించారు పవన్‌ కల్యాణ్‌.. దీంతో, ఆయన్ని అడ్డుకున్నారు పోలీసులు.. రుషికొండపై ప్యాలెస్‌తో పర్యావరణాన్ని దెబ్బతిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. కాగా, రాషికొండ ప్యాలెస్‌ బడ్జెట్‌, అందులో వాడిన అత్యాధునిక టెక్నాలజీ, బెడ్‌రూమ్స్‌, బాత్‌రూమ్స్ పై పెద్ద వివాదం నడిచిన విషయం విదితమే.. ఇక, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మరోసారి రిషికొండ ప్యాలెస్‌ను పవన్‌ కల్యాణ్ పరిశీలించిన విషయం విదితమే..

సుగాలి ప్రీతి కేసుపై స్పందించిన జనసేన.. అసలు పవన్‌ నోరెత్తకపోతే..!
తన కూతురు సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించడం సంచలనంగా మారింది.. అయితే, దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేయగా.. జనసేన పార్టీ కూడా సుగాలి ప్రీతి కేసుపై స్పందించింది.. సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో… సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవడం అంతే తప్పు… అవుతుందని కౌంటర్‌ ఇచ్చింది.. అసలు పవన్ అనే వ్యక్తి నోరెత్తక పోతే సమాజంలో ప్రతీ రోజు జరిగే అనేక సంఘటనల్లాగా “సుగాలి ప్రీతి” అంశం కనుమరుగైపోయేది అనేది వాస్తవం అని పేర్కొంది జనసేన.. 2019 లో ఘోర పరాజయం పొందిన పార్టీ కార్యాలయానికి వచ్చి బాధితురాలి తల్లితండ్రులు వచ్చి ఘటన గురించి చెప్పిన వెంటనే చలించి స్పందించిన వ్యక్తి పవన్.. 2017 ఆగస్ట్ 18వ తేదీన జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం 2019 డిసెంబర్ లో మొట్టమొదటి సారి పవన్ దృష్టికి వచ్చింది. ఆమె తల్లి పార్వతిదేవి.. పవన్ కళ్యాణ్ కలసి తమ బిడ్డ హత్య, తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఈ సందర్భంగాపవన్ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కేసుపై అసెంబ్లీలో చర్చించకుంటే కర్నూలు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారని గుర్తుచేశారు..

భారత్‌లో చేయండి.. ప్రపంచం కోసం చేయండి.. టోక్యో ఎకనామిక్ ఫోరంలో మోడీ పిలుపు
ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా గురువారం టోక్యో చేరుకున్నారు. అనంతరం ఇండియా-జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరంలో మోడీ ప్రసంగించారు. ‘‘కమ్ మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఫర్ ది వరల్డ్’’ అనే ఆహ్వానాన్ని వ్యాపార వేత్తలకు అందించారు. భారతదేశంలో తయారు చేయండి.. ప్రపంచం కోసం తయారు చేయాలని వ్యాపార నాయకులను కోరారు. రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ కంపెనీలు భారత్‌లో 40 బిలియన్‌కు పైగా పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఇది బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు విశ్వాసాన్ని పెంపొదిస్తుందని తెలిపారు. సాంకేతిక, మౌలిక సదుపాయాలు, తయారీ వంటి కీలక రంగాలకు సామర్థ్యాన్ని పెంచుకుందని పేర్కొన్నారు.

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. మెట్రో సేవలు లేక ప్రయాణికులతో కిక్కిరిసిన స్టేషన్లు
దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా ఉద్యోగస్థులంతా మెట్రో రైలుపైనే ఆధారపడ్డారు. అయితే భారీ వర్షాలు కారణంగా పలు స్టేషన్లలో మెట్రో రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులతో స్టేషన్లు కిటకిటలాడాయి. అంతేకాకుండా 170 విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన ప్రయాణికులంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
బీహార్‌లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న ముగియనుంది. ఈ యాత్రలో భాగంగా దుర్భంగా పట్టణంలో నిర్వహించిన సభలో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు మోడీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను బీజేపీ, మిత్రపక్షాలు ఖండించాయి. నితీష్ కుమార్, అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్రంగా ఖండించారు.

గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్తుల దాడి.. పోలీసుల రంగ ప్రవేశంతో..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్థులు దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రాత్రివేళ కార్లలో వచ్చి దొంగతనాలు చేస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి, పరిచయం లేని వాహనాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.. ఆగస్టు 28వ తేదీన గూగుల్ టీమ్‌ రోడ్డుపై మ్యాపింగ్ కోసం కెమెరా అమర్చిన వాహనంలో సర్వే చేస్తుండగా, అనుమానం వచ్చిన స్థానిక ప్రజలు వారిని అడ్డుకుని.. వారిపై కొంతమంది గ్రామస్థులు దాడి చేశారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, సర్వే టీమ్‌తో పాటు గ్రామస్థులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

మళ్లీ బంగారం, వెండి ధరల్లో మార్పులు.. ఈరోజు ధరలు ఇవే
పుత్తడి ధరల్లో నేడు మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు భారీగా పెరిగి షాకివ్వగా.. నేడు స్వల్పంగా పెరిగి ఊరటనిచ్చాయి. తులంపై జస్ట్ రూ. 10 పెరిగింది. కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,261, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,406 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది. దీంతో రూ.94,060 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది. దీంతో రూ. 1,02,610 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,210 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,760 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,29,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,19,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

BTech పాసైతే చాలు.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 1543 జాబ్స్ రెడీ..
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1543 పోస్టులను భర్తీ చేయనున్నారు. పవర్ గ్రిడ్ ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి BE, BTech, BSc ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇది కాకుండా, అభ్యర్థులు ఇతర నిర్దేశిత అర్హతలను కూడా కలిగి ఉండాలి.

రిటైర్‌మెంట్ సీక్రెట్ రివీల్ చేసిన అశ్విన్
గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ రెండ్రోజుల క్రితం ఐపీఎల్‌కూ రిటైర్మెంట్ చెబుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అతడి నిర్ణయంపై సర్వత్రా చర్చ కొనసాగింది. చెన్నై సూపర్ కింగ్స్‌ వచ్చే మినీ వేలానికి ముందే అశ్విన్ ను తప్పిస్తుందనే వార్తలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఇతర జట్లూ తీసుకొనేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని, అందుకే రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు క్రికెట్ పండితులు అంచనా వేశారు. తాజాగా తాను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను యూట్యూబ్ ఛానల్‌లో తెలియజేశాడు. ఐపీఎల్ కోసం దాదాపు 3 నెలల పాటు వేచి చూసేంత ఎనర్జీ తనకు లేదని అర్థమైందన్నాడు. ఇక, నేను వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ ఆడగలనా? అని ఆలోచించాను.. 3 నెలలు ఐపీఎల్‌ నాకు ఎక్కువగా అనిపించింది అని అశ్విన్ తెలిపాడు. అందుకే, ఎంఎస్ ధోనీ లాంటి క్రికెటర్‌ను చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తుంది.. వయస్సు పెరిగేకొద్దీ ఎవరికైనా ఐపీఎల్‌ ఆడేందుకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కానీ, మహేంద్ర సింగ్ ధోనీకి అలాంటిదేమీ లేదు.. ఆట కోసం వేటగాడిలా నా కొత్త ప్రయాణం ప్రారంభం కానుందని రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్ చేశాడు.

‘OG’ ఆల్ టైమ్ రికార్డ్.. పవర్ స్టార్.. పవర్ స్ట్రోమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న OG వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేసారు. కాగా ఓవర్సీస్ లో ఈ సినిమా హంగామా కాస్త ముందుగానే స్టార్ట్ అవబోతుంది. సెప్టెంబర్ రిలీజ్ కానున్న సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తోంది OG. ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమాలు రికార్డులను బద్దలు కొడుతూ అత్యంత వేగంగా 50k, 200k దాటి 250K డాలర్స్ వసూలు చేసింది. మొత్తం 174లొకేషన్స్ లో 631 షోస్ కు గాను 9004 టికెట్స్ బుక్ అయి $267,231 డాలర్స్ వసూలు చేసి ఓవర్సీస్ న్యూ రికార్డుల కింగ్ గా పవర్ స్టార్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే రిలీజ్ నాటికి అడ్వాన్క్ సేల్స్ రూపంలోనే అటు ఇటుగా 3.5 మిలియన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఓవర్సీస్ లో OGని ప్రత్యంగిరా సినిమాస్ భారీ ధరకు కొనుగోలు చేసింది.

ట్రైలర్ రిలీజ్ తర్వాత తగ్గిన హైప్.. మరో మూడు నెలల్లో రిలీజ్
హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్‌ జేమ్స్ కామెరూన్ మరోసారి తన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అవతార్‌ ఫ్రాంఛైజీలో మూడో భాగం అవతార్‌ ‘ఫైర్‌ అండ్‌ యాష్’ ట్రైలర్‌ను చాలా రోజుల కిందట రిలీజ్‌ చేశారు. సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ట్రైలర్‌ వచ్చాక ఈ సినిమాకి ఉన్న హైప్ కాస్త తగ్గిందట. జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత ఆవిష్కరణ ‘అవతార్‌’ మొత్తం ఐదు భాగాలతో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు భాగాలు అత్యధిక ప్రేక్షదారణ పొందాయి. అవతార్‌ ప్రకృతి ఒడిలో రూపొందగా అవతార్‌2 కథ వాటర్‌లో సాగింది. మూడో భాగం వచ్చేసరికి అగ్ని చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈ పార్ట్‌కు ‘అవతార్‌ ఫైర్‌ అండ్‌ యాష్‌’ అన్న టైటిల్‌ పెట్టారు.

Exit mobile version