పోసానికి 14 రోజుల రిమాండ్.. న్యాయవాది పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, పోసాని కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఐటీ యాక్ట్ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది.. పోసానిపై త్రిబుల్ వన్ కేసు పెట్టడానికి వీలులేదన్నారు.. వర్గ వైశమ్యాలను రెచ్చగొట్టే సెక్షన్లు వల్లే రిమాండ్ ఉంటుంది.. ఐదు సంవత్సరాలలోపు శిక్షపడే కేసులకు రిమాండ్‌కు పంపాల్సిన అవసరం లేదన్నారు.. సుప్రీంకోర్టు జడ్జి ఆగ్నేష్ కుమార్ తీర్పు ప్రకారం రిమాండ్ కు పంపాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించాం.. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్.. స్టేట్ స్పాన్సెడ్ కేసు ఇది అని వ్యాఖ్యానించారు.. అన్ని వ్యవస్థలను స్టేట్ గుప్పెట్లో పెట్టుకుంది.. మా పోరాటం కొనసాగుతుందన్నారు.. కాగా, పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత రాజంపేట సబ్‌జైలుకు తరలించారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్నరాత్రి 9 గంటల 30 నిమిషాలకు రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. అయితే, తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన. రాజంపేట సబ్ జైలుకు తరలించాలని రైల్వే కోడూరు జడ్జి ఆదేశించడంతో.. రాజంపేట సబ్ జైలుకు పోసాని కృష్ణ మురళి తరలించారు.. పోసానికి 2261 నెంబర్ కేటాయించారు జైలు అధికారులు..
ఏపీ బడ్జెట్ 2025-26.. అభివృద్ధి పథకాలకు భారీగా నిధుల కేటాయింపు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది.. రూ.3,22, 359 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.. రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లుగా.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంది.. అయితే, వివిధ అభివృద్ధి పథకాలకు భారీగా నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం. బడ్జెట్‌లో డ్రిప్ ఇరిగేషనుకు పెద్ద పీట వేసింది.. 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు ఇచ్చింది.. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు బడ్జెట్‌లో వెల్లడించింది.. 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లల్లో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తైనట్టు స్పష్టం చేసింది.. మిగిలిన 1300 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్టు బడ్జెట్టులో ప్రస్తావించారు.. నరేగా ద్వారా 72 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. పోలవరం-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రణాళికలు వేసింది.. 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేలా పనులు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది.. ఇప్పటికే హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల వెడల్పు చేసే పనులు ప్రారంభమైనట్టు బడ్జెట్‌లో స్పష్టం చేసింది.. పాట్‌హోల్ ఫ్రీ ఆంధ్ర నినాదంతో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు.. మరమ్మత్తులు చేపట్టిన 20,059 కిలోమీటర్లలో, 17,605 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేసినట్టు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..
ఏపీ బడ్జెట్ 2025-26.. సభ్యులకు స్పీకర్ కీలక సూచనలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దీంతో, తొలిసారిగా రూ. 3 లక్షలు కోట్లు దాటింది రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటేసింది.. ఇక, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత.. సభలోని సభ్యులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని సూచించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు.. దాంతో పాటు.. ఇప్పటికే ఎన్నో బడ్జెట్‌లను సూచిన సభ్యులు కూడా ఉన్నారని తెలిపిన ఆయన.. బడ్జెట్ ను అందరూ చదవాలి.. బడ్జెట్ పత్రాలను అన్ని పెన్ డ్రైవ్ లో ఇస్తాం. సభ్యులు వాట్సాఅప్ గ్రూప్ లో పెట్టుకోవాలి. నియోజకవర్గ పరిధిలో సరళ మైన భాషతో బడ్జెట్‌పై చెప్పాలని సూచించారు.. బడ్జెట్ ను అందరూ స్టడీ చేయాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రతి ఒక్కరికి బడ్జెట్ పై అవగాహన ఉండాలన్నారు.. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో బడ్జెట్ ను సరళమైన భాష లో జనంలోకి తీసుకు వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు.. రాష్ట్ర అభివృద్ధిలో సహకారం అందించాలన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్.. కేటాయింపులు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. 2025 – 26 వార్షిక బడ్జెట్‌తో పాటు.. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే.. శాసన సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచారు.. ప్రకృతి వ్యవసాయం పై దృష్టి పెట్టాం.. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం పై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు.. వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తింపు ఉంది.. రాష్ట్రంలో భూమి కలిగిన వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ఇక, శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ 2025-26 ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు..
ఏపీ బడ్జెట్ 2025 – 26.. ఆదాయం.. అప్పులు..!
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.. రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు.. ఇక, తొలిసారి రూ. 3 లక్షల కోట్లు దాటింది ఏపీ వార్షిక బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటేసింది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. అయితే, ఏపీకి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయంతో పాటు.. వ్యయాలు కూడా ఓసారి పరిశీలిస్తే.. పన్నుల ద్వారా ఏపికి సొంతంగా వచ్చే ఆదాయం రూ.1,09,007 కోట్లు.. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయం రూ.19,119 కోట్లు. కేంద్ర పన్నుల వాటా రూ. 57,566 కోట్లుగా ఉంది..
అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ హరీశ్ రావు స్పందిస్తారు!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు? అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కి హరీష్ రావు వంద వాహనాల్లో యుద్ధానికి వెళ్లినట్టు వచ్చారు. అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ ఆయన స్పందిస్తారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేకపోయారు. డబ్బులు లేక తవ్వలేదా ఎస్‌ఎల్‌బీసీ లేదా.. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని తవ్వలేదా?. హరీష్ సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడు. ప్రమాదం జరగగానే హరీష్ ఎందుకు రాలేదు. నేను ఒక్కడినే టన్నెల్ లోపలికి వెళ్ళాను. టన్నెల్‌లోకి వాటర్, బురద వచ్చి ముసుకుని పోయింది. అది తీస్తే మరలా వరద వస్తది కదా. 8 మందిని తీయడానికి 100 మంది లోపలికి పోయారు. బురద, నీళ్లు వస్తున్నప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగితే.. ఇంకో ఘటన జరుగుతుంది కదా?. జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జాతీయ సంస్థలు అన్నీ వచ్చాయి, ఆ సంస్థలు చెప్పినట్టు చేస్తున్నాం’ అని మంత్రి జూపల్లి తెలిపారు.
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయండి.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించండని సూచించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపీలతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాల ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఆప్‌కు మరో ఝలక్.. ఆస్పత్రులపై కాగ్ రిపోర్ట్ వెల్లడి
ఢిల్లీలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. గత ఆప్ ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీలో కాగ్ రిపోర్టులను బీజేపీ బహిర్గతం చేస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బయటపెట్టారు. రూ.2 వేల కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. తాజాగా వైద్య రంగానికి సంబంధించిన రిపోర్టును బహిర్గతం చేశారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా వదిలేసిందని ఆరోపించింది. ఆరోగ్య భద్రత, మౌలిక వసతుల కల్పనలో గత సర్కార్ పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, కరోనా సమయంలోనూ నిధులను సక్రమంగా వినియోగించలేకపోయిందని సంచలన విషయాలు వెల్లడించింది. గత ఆరేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాల్లో తీవ్ర అవినీతికి పాల్పడిందని కాగ్ పేర్కొంది. మొహల్లా క్లినిక్స్‌లో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం దగ్గరి నుంచి అత్యవసర నిధులను వినియోగించకపోవడం దాకా ఎన్నో వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఢిల్లీలో ఉన్న 27 ఆస్పత్రుల్లో 14 హాస్పిటల్స్‌లో ఐసీయూ సదుపాయం లేదని వెల్లడించింది. 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు లేవని పేర్కొంది. ఎనిమిది ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదని తెలిపింది. పదిహేన్నింటిలో మార్చురీ సదుపాయాల్లేవని వెల్లడించింది. 12 ఆస్పత్రులకు ఆంబులెన్స్ సదుపాయాలు లేవని స్పష్టం చేసింది.
బీజేపీకి దగ్గరవుతున్నారన్న ఆరోపణలపై డీకే.శివకుమార్ క్లారిటీ
శివరాత్రి వేడుకల్లో ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వేదిక పంచుకోవడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతల నుంచి డీకే.శివకుమార్‌పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తితో ఎలా చెట్టాపట్టా్ల్ వేసుకుని తిరుగుతారంటూ డిప్యూటీ సీఎంపై విమర్శలు వెల్లువెత్తాయి. మీ తీరుతో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని ఏఐసీసీ కార్యదర్శి మోహన్ అన్నారు. అంతేకాకుండా బీజేపీలో చేరేందుకు దగ్గరవుతున్నారని కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై డీకే.శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. మహా శివరాత్రి వేడుకలకు స్వయంగా సద్గురు ఆహ్వానించడంతో మైసూర్ వెళ్లినట్లు తెలిపారు. ఇది తన వ్యక్తిగత నమ్మకం అని చెప్పారు. తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదినని నొక్కి చెప్పారు. బీజేపీకి దగ్గరవుతున్నట్లు వస్తున్న వార్తలను డీకే.శివకుమార్ కొట్టిపారేశారు. తనను ఆహ్వానించినందుకే కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు.
మార్కెట్‌లో ఒడిదుడుకులు.. భారీ నష్టాల్లో ట్రేడ్‌అవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో ఈ వారమంతా ఇలానే ట్రేడ్ అయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 985 పాయింట్లు నష్టపోయి 73, 627 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 307 పాయింట్లు నష్టపోయి 22, 237 దగ్గర కొనసాగుతోంది. ఇక అన్ని రంగాల సూచీలు ఐటీ, ఆటో, మీడియా, టెలికాం 2-3 శాతం పడిపోయాయి. నిఫ్టీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ప్రధాన నష్టాల్లో ఉండగా.. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం తగ్గాయి.
సంజయ్ దత్.. సరికొత్తగా.. కలిసొచ్చేనా..?
ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ బాయ్ సంజయ్ దత్‌ను కొత్తగా ప్రజెంట్ చేశాయి కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు. కేజీఎఫ్ వన్ అండ్ టూలో నెగిటివ్ రోల్స్‌లో ఇరగదీశాడు సంజూ. ఇక అక్కడ నుండి సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ స్టార్‌గా మారిపోయాడు మున్నాభాయ్. తమిళ్, తెలుగు, కన్నడ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టేస్తున్నాడు. అలాగే ఛాన్స్ వచ్చినప్పుడల్లా బీటౌన్‌లో హీరోగానూ తన ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నాడు. ప్రజెంట్ సంజయ్ దత్ ఖాతాలో అరడజను సినిమాలున్నాయి. అయితే ఇవన్నీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాలు. కాగా, ఇప్పుడు సరికొత్త జోనర్ లోకి ఎంటరయ్యాడు. నార్త్ బెల్ట్‌లో ప్రజెంట్ ట్రెండీగా నిలుస్తోన్న హారర్ కామెడీ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు. ద భూత్నీ అనే మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్లీ మూవీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగిని ఫేం మౌనీరాయ్ దెయ్యంగా కనిపించబోతుంది. భూతాలపై యుద్దం చేసే యోధుడిగా స్టైలిష్ లుక్కులో మెస్మరైజ్ చేశాడు సంజూ. సన్నీసింగ్, పలక్ తివారీ, ఆసిఫ్ ఖాన్ కీ రోల్స్ చేస్తోన్న ది భూత్నీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హార్రర్ కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు సిద్దాంత్ సచ్ దేవ్. ఇక ఇవే కాకుండా కేడీ అనే కన్నడ మూవీలో, బాప్, వెల్కమ్ టూ ది జంగిల్, బాగ్ 4తో పాటు ఓ పంజాబీ చిత్రంలో నటిస్తున్నాడు మున్నాభాయ్. మొత్తానికి సౌత్, నార్త్ బెల్ట్ చుట్టేస్తోన్న సంజూ.. న్యూ జోనర్ ది భూత్నీతో ఎంటర్ టైన్ చేస్తాడో లేదో రెండు నెలల్లో తెలుస్తుంది.
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటుడు
అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా డెకాయిట్. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఈ సినిమా ఒకటి. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటి వామిక గబ్బి ముఖ్య పాత్రలో నటిస్తోంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించారు. తాజాగా ఈ సినిమా నుండి ఇప్పుడు మరో ప్రధాన పాత్రను పరిచయం చేసారు మేకర్స్. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అవినీతిని సహించని, ధైర్యవంతుడైన అయ్యప్ప భక్తుడైన నిర్భయ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించనున్నాడు అనురాగ్. ఈ సందర్భంగా అనురాగ్ తన సంతోషాన్ని తెలియజేస్తూ “అయ్యప్ప భక్తుడైన పోలీస్ అధికారిగా నటించడం సరదాగా మరియు సవాలుతో కూడుకున్నది. విధికి వ్యతిరేకంగా ధర్మం యొక్క చిక్కులు ముడి తొలగిస్తూ ఈపాత్ర చేయడం అద్భుతంగా ఉంది. ఈ పాత్రను రెండు భాషలలో పోషించడానికి నేను నిజంగా ఎదురు చూస్తున్నాను, హిందీలో మరియు తెలుగులో చిత్రీకరించడం. రెండు భాషలలో ఒకే ఎమోషన్స్ ను పండించడం సవాలుతో కూడిన భాగం, నేను పూర్తిగా ఆనందిస్తున్న విషయం.” అని అన్నారు. ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది, కథ మరియు స్క్రీన్‌ప్లేను అడివి శేష్ మరియు షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. ప్రస్తుతం, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది, తరువాత మహారాష్ట్రలో విస్తృతమైన షెడ్యూల్ జరుగుతోంది.