కలెక్టరేట్ తరలింపు అంశంపై వివాదం
జిల్లాల పునర్విభజన తర్వాత భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైంది. పాలనకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో భీమవరం సమీపంలోని ప్రైవేటు కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కలెక్టరేట్ కోసం 20 ఎకరాల భూమి, 100 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2022 ఏప్రిల్ నాలుగు నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడిన సమయంలో ఏడో వార్డులోని ప్రైవేట్ కళాశాల భవనంలో కలెక్టరేట్ ఏర్పాటు చేశారు అన్ని శాఖల జిల్లా అధికారులు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం భీమవరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులోని 20 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది.. AMC కి సంబంధించిన భూమిని మార్కెటింగ్ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు బదిలాయిస్తూ 2023 మార్చి 24 జీవో జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ రికార్డులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మార్పులు చేసి 80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు.. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ గెజిట్ రద్దు చేసింది.
కట్టలేరు వాగుకు మళ్లీ పోటెత్తిన వరద.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్..!
బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగుకు మరోసారి పోటెత్తింది వరద ప్రవాహం.. గంపలగూడెం మండలం వినగడప – తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరదతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. గత రెండు వారాల క్రితం వచ్చిన భారీ వరదలకు గండ్లు పడ్డాయి.. మీటర్ల మేర కోతకు గురైంది తాత్కాలిక రహదారి.. ఇటీవలే రోడ్లు మరమ్మత్తుల అనంతరం రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి.. కానీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రవాహంతో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువున నుంచి వస్తున్న వరదలకు తోడు ఇక్కడ కురుస్తున్న వర్షాలు జతకావడంతో మళ్లీ పోటెత్తుతుంది వరదనీరు.. ఇక, కట్టలేరు వాగు వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. 20 గ్రామాల ప్రజలపై దీని ప్రభావం పడింది.. అత్యవసర సమయంలో నూజివీడు విజయవాడ వెళ్లాలి అంటే… అదనంగా 30 కిలో మీటర్లు తిరిగి తిరువూరు మీదగా వెళాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు, ఎవరు కట్టలేరు వైపు వెళ్లకుండా పీకెట్ ఏర్పాటు చేశారు పోలీస్ అండ్ రెవిన్యూ అధికారులు… ఇక, తిరువూరు నియోజవర్గంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో… వరద ప్రవాహం మరింత పెరుగుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి..
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు.. తెలంగాణకు నిలిచిన రాకపోకలు
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. ఒడిశా తీరాన్ని అనుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేస్తోంది.. అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా విస్తరించింది రుతుపవన ద్రోణి… దీని ప్రభావంతో.. రాగాల ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ వర్షాల ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. జగ్గయ్యపేటలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలో వరి, పత్తి, పొలాలు నీట మునిగాయి. కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో పెనుగంచిప్రోలు నుండి తెలంగాణ మధిరకు రాకపోకలు నిలిచాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈరోజు ఉదయం ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. నల్లవాగు ఉధృతంగా ప్రవహించడంతో నందిగామ – చందర్లపాడు మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక, మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు వద్ద ఏనుగు గడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో చిలుకూరు, దాములూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏనుగు గడ్డ వాగుకు పై ప్రాంతాల నుండి నీరు అధికంగా వస్తుండటంతో చిలుకూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నంకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమానుషం.. 8వ తరగతి విద్యార్థిపై టీచర్ దాడి.. మూడు చోట్ల విరిగిన ఎముకలు..!
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ కోల్పోతున్నారు.. విద్యార్థులపై విరుచుకుపడుతున్నారు.. అప్పడప్పుడు ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘటన బయటపడింది.. విశాఖపట్నం మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది… సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి చేయి విరగొట్టాడు ఉపాధ్యాయుడు.. ఇనుప బల్ల కేసి చితకబాది.. ఆపై పిడుగులు గుద్ధి చేయి విరగగొట్టాడు అని విద్యార్థి తల్లితండ్రులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మూడు చోట్ల బాలుడి ఎముకలు విరిగాయి.. దీంతో, శస్త్ర చికిత్స కోసం విద్యార్థిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.. విద్యార్థిపై దాడికి కారణమైన సోషల్ మాస్టర్ మోహన్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.. ఈ ఘటనపై నిలదీయగా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారట స్కూల్ ప్రిన్సిపల్ పిళ్లా శివ సత్యనారాయణ.. స్కూల్ మేనేజ్మెంట్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు… ఇక, స్కూల్ వద్ద సదరు విద్యార్థి తల్లిదండ్రులు, కాలనీవాసుల ఆందోళనకు దిగారు.. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది…
వాగులో చిక్కుకున్న రైతులను రక్షించిన SDRF టీం.. కుటుంబ సభ్యులను హత్తుకొని భావోద్వేగం
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) పోతారెడ్డిపేట పెద్ద చెరువు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ఉదృతిలో చిక్కుకుపోయారు. రాత్రంతా రైతులు గోపాల్, సుదర్శన్, రాజు వాగులోనే ఉన్నారు. తమను రక్షించాలని అధికారులను వేడుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ముగ్గురు రైతులని రక్షించేందుకు రంగంలోకి SDRF టీం దిగింది. పోతారెడ్డిపేట వాగులో చిక్కుకున్న రైతులను బోటులో వెళ్లి రక్షించింది SDRF టీం. సురక్షితంగా బయటపడగా అంతా ఊపిరిపీల్చుకున్నారు. కుటుంబ సభ్యులను హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు రైతులు. తిరిగి వస్తారు అనుకోలేదు అంటూ బోరున ఏడ్చారు కుటుంబ సభ్యులు. ఆ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబాలు పోలీసులు, SDRF సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
నోయిడా వరకట్నం కేసులో బిగ్ ట్విస్ట్.. అక్క ఫిర్యాదు అలా, చెల్లి మరణ వాంగ్మూలం ఇలా!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రేటర్ నోయిడా వరకట్న వేధింపుల మృతి కేసులో బిట్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్తింటివారే ఆమెపై కిరోసిన్ పోసి లైటర్ తో నిప్పంటించారని మృతురాలి సోదరి కంప్లైంట్ చేయగా, చనిపోయే ముందు నిక్కీ భాటి డాక్టర్లకు ఇచ్చిన మరణ వాంగ్మూలం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నట్లు సమాచారం. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతోనే తనకు తీవ్ర గాయాలు అయ్యాయని నిక్కీ చెప్పినట్లు ఫోర్టిస్ హస్పటల్ వైద్యులు, నర్సులు పోలీసులకు వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. అయితే, తీవ్ర గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి నిక్కీ తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె శరీరం 80 శాతం కాలిన గాయాలైనట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఈ ఘటనపై నిక్కీ సోదరి కంచన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తన ఆరేళ్ల కుమారుడి ముందే నిక్కీ భర్త విపిన్ భాటి, తన తల్లిదండ్రులతో కలిసి ఆమెను హత్య చేశారని ఆరోపించింది. పెళ్లి సమయంలో ఎస్యూవీ కారుతో పాటు విలువైన వస్తువులు ఇచ్చినా, అదనపు కట్నం కోసం నిక్కీని చాలా వేధించేవారని ఫిర్యాదులో వెల్లడించింది.
స్టాలిన్‌ది కపట రాజకీయం.. బీహార్ టూర్‌పై అన్నామలై విమర్శలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘం.. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక బుధవారం రాహుల్‌గాంధీకి మద్దతిచ్చేందుకు స్టాలిన్ బీహార్ వెళ్లారు. ఒకే వాహనంపై తేజస్వి యాదవ్, స్టాలిన్, రాహుల్ గాంధీ కనిపించిన ఫొటో వైరల్ అయింది. ఈ ఫొటోపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీహారీయులపై గతంలో స్టాలిన్ వ్యాఖ్యలను, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను, డీఎంకే నేత దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీజేపీ నేత అన్నామలై సోషల్ మీడియాలో విమర్శించారు. గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి బీహార్‌లో గుర్తు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.
నోబెల్ బహుమతి కోసం ట్రంప్ కేబినెట్ లాబీయింగ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఘర్షణ జరిగినా.. అక్కడ వాలిపోయి పంచాయితీలు చేస్తున్నారు. ఆయనను ఒక శాంతి దూతగా చిత్రీకరించేందుకు వైట్ హౌస్ లోని కార్యవర్గం తెగ ప్రయత్నిస్తుంది. మా అధ్యక్షుడు సగటున నెలకో శాంతి సంధిని కుదురుస్తున్నారంటూ వరుస ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అసలు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం ఉందా?.. అతడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దేశాల యుద్ధాలను ఆపాడు, ఎంత మంది ప్రాణాలను రక్షించాడు? అనే దానిపై ట్రంప్ కేబినెట్ జోరుగా ప్రచారం చేస్తుంది.
బ్లూ కలర్ గుడ్డు పెట్టిన కోడి.. ఆశ్చర్యపోయిన అధికారులు!
సాధారణంగా కోడిగుడ్లు తెలుపు లేదా ముదురు గోధుమ కలర్ లో ఉంటాయి. ఇవే మార్కెట్లో కూడా ఎక్కువగా దర్శనమిస్తాయి. కర్ణాటకలోని ఒక కోడి మాత్రం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కోడి పెట్టిన గుడ్డు బ్లూ కలర్ లో ఉండటంతో స్థానికంగా సంచలనం రేపింది. అయితే, దేవనగరి జిల్లా నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ కోళ్ల పెంపకందారుడు. అతడి దగ్గర 10 నాటుకోళ్లు ఉన్నాయి. ఇందులో ఒక కోడి ఇటీవల నీలి రంగు గుడ్డు పెట్టడంతో పాటు సాధారణ గుడ్ల కంటే భిన్నంగా ఉండటంతో తొలుత సయ్యద్ నూర్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ గుడ్డును జాగ్రత్తగా భద్రపర్చాడు.. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల గ్రామాలకు పాకింది.
గూగుల్ పిక్సెల్ ఫోన్ పై క్రేజీ డీల్.. రూ. 10 వేల డిస్కౌంట్..
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ సేల్స్ నేటి నుంచి (ఆగస్టు 28) ప్రారంభమవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో గూగుల్ తన పిక్సెల్ 10 సిరీస్‌లో నాలుగు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది – పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్. పిక్సెల్ 10 ఇప్పుడు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ, పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో వస్తుంది. దీనితో పాటు, ఇతర ఫోన్లలో కూడా అనేక అప్గ్రేడ్లు అందించారు. గూగుల్ పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ.79,999. ఈ ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది 12GB RAM + 256GB స్టోరేజ్. మీరు HDFC కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే, మీకు రూ.7000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. పిక్సెల్ 10 ప్రో 16GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.1,09,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌పై మీకు రూ. 10,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ధర రూ. 1,24,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 16 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు. దీనిపై మీకు రూ. 10,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ఉంది. మీరు ఈ హ్యాండ్సెట్లను ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్, గూగుల్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఓవర్సీస్ లో దేవరని కొట్టే సినిమా ఇప్పట్లో రాదేమో.. కొద్దిలో మిస్ అయిన OG
టాలీవుడ్ సినిమాకు రెండు తెలుగు స్టేట్స్ తో పాటు సమానంగా వసూళ్లు రాబట్టే ప్లేస్ అంటే ఓవర్సీస్ అనే చెప్పాలి. కొన్ని సినిమాలైతే తెలుగు స్టేట్స్ ని మించి భారీ వసూళ్లు ఓవర్సీస్ లో రాబట్టిన రోజులు ఉన్నాయి. ఇక స్టార్ హీరోలకు ఇండియాన్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ వసూళ్లు కూడా చాలా ముఖ్యం. నార్త్ అమెరికాలో మిలియన్ వసూళ్లు వస్తుంటాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మిలియన్ కలెక్షన్స్ రాబట్టి మేజర్ కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి. కాగా ఇప్పడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ OG మరికొద్ది రోజుల్లో రిలిజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో USA లో అడ్వాన్సు బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఓవరాల్ గ 3 లొకేషన్స్ లో 46 షోస్ కు గాను 2845 టికెట్స్ తో $82,681 కలెక్ట్ చేసింది. అయితే ఓవర్సీస్ లో అడ్వాన్స్ సేల్స్ లో ఫాస్టెస్ట్ 100K రికార్డును OG కొద్దిలో మిస్ చేసుకుంది. ఈ రికార్డ్ ఇప్పటివరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట ఉంది. ఎన్టీఆర్ నటించిన దేవరా USA ప్రీమియర్ ప్రీ-సేల్స్ లో కేవలం 12 గంటల్లో $100K వసూలు చేసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పటికీ ఇది ఆల్ ఇండియా ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంది. ఇక ఇప్పట్లో ఈ రికార్డ్ ను బద్దలు కొట్టే సినిమా లేదనే చెప్పాలి. ఇక పవర్ స్టార్ లేటెస్ట్ సినిమా OG రిలీజ్ నాటికి అడ్వాన్స్ బుకింగ్స్ లో 1 మిలియన్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
కాబోయే భర్తను పరిచయం చేసిన ‘నివేద పేతురేజ్’.. ‘లక్కీ బాయ్’
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై భామ అయిన నివేదా పేతురాజ్ ”మెంటల్ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.. రామ్ తో రెడ్, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం, చిత్రలహరి, ధమ్కీ వంటి సినిమలతో హిట్స్ అందుకుంది. కానీ ఎందుకనో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయింది నేవేత. ఇటీవల తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె తన కాబోయే భర్త మరియు చిరకాల ప్రియుడు రాజ్‌హిత్ ఇబ్రాన్ ను పరిచయం చేసింది. చాలా కాలంగా నివేదా – రాజ్‌హిత్ తో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. రాజ్‌హిత్ దుబాయ్ లో హాస్పిటాలిటీ రంగంలో ఉన్నతమైన వ్యాపారవేత్త అని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో నివేద – రాజ్‌హిత్ ల వివాహం ఉండొచ్చుని తెలుస్తోంది. అయితే తమకు ఈ పాటికే ఎంగేజ్మెంట్ అయినట్టు నివేద ఇండైరెక్ట గా తెలిపింది. ఇన్‌స్టాలో తనకు కాబోయే భాగస్వామి రాజ్‌హిత్ ఇబ్రాన్ను పరిచయం చేస్తూ ‘ఇప్పటినుంచి జీవితమంతా ప్రేమమయమే..’ అనే క్యాప్షన్‌తో రాజ్‌హిత్ దిగిన ఫొటోలను షేర్ చేసింది. అలాగే నివేద – రాజ్‌హిత్ ఈ వివాహం కేవలం కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో జరిగే ఒక చిన్న వేడుకలాగా చేసుకోబోతుందట. ఈ జంట త్వరలోనే పెళ్లి డేట్ ను అధికారకంగా ప్రకటించనున్నారు.