పల్నాడులో రోడ్డు ప్రమాదం.. తిరుపతికి చెందిన డాక్టర్ సహా ఇద్దరు మృతి..
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు, అతని కూతురు మృతిచెందారు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతికి చెందిన వైద్యుడు కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో గుంటూరు బయల్దేరి వెళ్తుండగా.. తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిది.. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న కిషోర్ అక్కడిక్కడే మృతిచెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా కిషోర్ కూతురు మృతి చెందింది. కారులో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అసెంబ్లీ ఆవరణలో నూతన భవనం ప్రారంభం..
అసెంబ్లీ ఆవరణలోని నూతన భవనాన్ని ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.. ఈ సందర్భంగా నూతన అసెంబ్లీ భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.. అసెంబ్లీ ఆవరణలో రూ.3.55 కోట్లతో ఈ భవనం నిర్మాణం చేశాం. మొదటి ఫ్లోర్ లో విప్ లకు కేటాయించాం.. మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ భవనాన్ని ప్రారంభించడం మా అందరికీ ఆనందం.. ఈ భవన నిర్మాణం కోసం మంత్రి నారాయణ కృషి చేశారి ప్రశంసించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఈ భవనం 5 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించినా.. కేవలం రూ.3.50 కోట్లతోనే నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు మంత్రి నారాయణ.. గతంలో దీని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన పూర్తి ఆలస్యం అయ్యింది.. త్వరలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం చేపడతాం.. డిజైన్లు పూర్తి అయ్యాయి.. త్వరలో అవి అందరికి విడుదల చేస్తాం అన్నారు మంత్రి పొంగోరు నారాయణ.. ఇక, శాసన సభలో మరో భవనం నిర్మాణం పూర్తి చేశాం… అసెంబ్లీ అవసరాలను నిధుల విడుదలకు ఇబ్బంది లేదన్నారు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్..
ఐదు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం..
అసెంబ్లీలో మున్సిపల్ శాఖకు సంబంధించిన 5 బిల్లులను ప్రవేశపెట్టారు మంత్రి పొంగూరు నారాయణ.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాలు సవరణ-1, సవరణ-2, సవరణ-3, సవరణ-4 బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టారు.. ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్టీల చట్టం సవరణ బిల్లు 2025ను కూడా సభలో ప్రవేశపెట్టారు మంత్రి నారాయణ.. ఇక, మొత్తం ఐదు బిల్లులకు శాసనసభ ఆమోదం
ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. ఆమోదం పొందిన బిల్లుల వివరాలు..
1. నాలా చట్టం రద్దుతో మున్సిపాల్టీలు అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలకు సంబంధించి చట్ట సవరణకు ఆమోదం.
2. బహుళ అంతస్తుల భవనాల ఎత్తును 18 మీటర్లకు బదులు 24 మీటర్లకు మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం.
3. నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించేలా చట్ట సవరణకు ఆమోదం.
4. ఏపీలో పట్టణ, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ గా నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న జనవరి 1వ తేదీ గడువుకు బదులు ఇకపై ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 గా మారుస్తూ చట్ట సవరణ బిల్లు.. ఆమోదం.
5. వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ పేరును తాడిగడప మున్సిపాల్టీగా మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం….
ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం.. సురేష్ బాబు సవాల్..
తాను ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ చేశారు కడప మాజీ మేయర్ సురేష్ బాబు.. తనపై రాష్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు.. జిల్లా అధ్యక్షుడిగా వాసు చేసిన వ్యాఖ్యలకు సిగ్గు పడాలని ఫైర్ అయ్యారు. నీ కార్యకర్తలపై ఎలా మాట్లాడాలో తెలియదా..? అని ప్రశ్నించారు. సురేష్ బాబు, అంజాద్ బాషా అవినీతి చేసి కడప భ్రష్టు పట్టించారని వాసు ఆరోపించారు.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎంత దోచుకుందో అందరికీ తెలుసు.. 2024 కూటమి అధికారంలోకి ఎమ్మెల్యే నియంతలా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.. నీరు చెట్టు కింద బుగ్గవంక పనులు చేసి కార్పొరేషన్ నిధులు వాడుకున్నారు.. ఇక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రోడ్డు వేయలేదు.. బుగ్గవంక సుందరీకరణ పేరుతో దోచుకొని మహానాడు కోసం ఖర్చు చేశారు అని ఆరోపించారు. తాను ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.. అధికారుల తప్పిదం వల్ల మా కుటుంబం పేరిట అభివృద్ధి పనులు కేటాయించారన్నారు.. ఇక, కొందరు కార్పొరేటర్లు స్వార్థం కోసం మా పార్టీని వీడి టీడీపీలో చేరారు.. కార్పొరేషన్ లో కుర్చీ కోసం నన్ను అడ్డు తొలగించుకున్నారు.. కానీ, ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోవడం జరగనివ్వను అంటూ ఛాలెంజ్ చేశారు కడప మాజీ మేయర్ సురేష్‌బాబు..
సృష్టి ఆసుపత్రిపై ఈడీ కేసు నమోదు..
సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడిన సృష్టి ఆసుపత్రి గురించి ఇదివరకు అనేక విషయాలు తెలిసాయి. ఆసుపత్రి సంబంధించిన వారు పేద కుటుంబాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మకాలు జరిపేవారు. ఇలా నాలుగేళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సరోగసి పేరుతో పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి ఏకంగా 50 లక్షల వరకు వసూలు చేసింది సృష్టి ఆసుపత్రి యాజమాన్యం. ఈ వ్యాపారం దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో జరిపారు. ముఖ్యంగా గ్రామీణ దంపతులను ట్రాప్ చేసి పిల్లల్ని కొనుగోలు చేసిన సృష్టి ఆసుపత్రి వారి దగ్గరకు వచ్చే కస్టమర్స్ కు అమ్మేసేవారు. కొనుగోలు చేసిన పిల్లల్ని సరోగసి పేరుతో 50 లక్షల వరకు దంపతులకు అమ్మినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఇక సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి పేరుతో డాక్టర్ నమత్ర భారీగా నగదు వసూలు చేసింది. తాజాగా ఈ కేసు వ్యవహారంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది.
డాక్టర్ కొంపముంచిన డేటింగ్ యాప్.. ఓయో రూమ్‌లో ఏకంగా?
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఓ డాక్టర్ డేటింగ్ యాప్ ద్వారా మోసానికి గురయ్యారు. గ్రీండర్ (Grindr) అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు వైద్యుడిపై అఘాయిత్యం చేసి, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. సదరు డాక్టర్ మరో యువకుడితో డేటింగ్ యాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకుని, మాదాపూర్‌లోని ఓయో రూమ్‌లో కలుసుకున్నారు. అయితే, కలుసుకున్న తర్వాత ఆ యువకుడు వైద్యుడిపై అఘాయిత్యానికి పాల్పడటానికి ప్రయత్నించగా.. దానికి డాక్టర్ దానిని ప్రతిఘటించారు. దీంతో కోపంతో ఆ యువకుడు డాక్టర్ పై దాడి చేశాడు. ఆ తర్వాత, ఆ యువకుడు డాక్టర్‌ను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.
హిందూ వితంతువు మరణిస్తే..ఆమె ఆస్తి భర్త వారసులకే..
హిందూ వారసత్వ చట్టం ప్రకారం పిల్లలు లేని హిందూ వితంతవు మరణిస్తే..ఆమె ఆస్తి తన పిల్లలకు..ఒక వేళ పిల్లలు లేకపోతే తన భర్త కుటుంబంలోని వారసులకు వెళుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంతానం లేని హిందూ వితంతువు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తిని ఎవరు వారసత్వంగా పొందుతారు అనేది అనేక పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.. COVID-19 కారణంగా ఒక యువ జంట మరణించిన కేసు సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో పురుషుడు, స్త్రీ యొక్క ఇద్దరు తల్లులు ఆస్తి కోసం కోర్టుకు వెళ్లారు. ఆ ఆస్తి మొత్తం ఆ పురుషుడి తల్లి దంపతుల మొత్తం ఆస్తిపై తనకు హక్కు ఉందని కోర్టుకు తెలిపింది. ఆ స్త్రీ తల్లి తన కుమార్తె కూడబెట్టిన సంపద మరియు ఆస్తిని వారసత్వంగా పొందాలని కోరుకుంటుంది. అలాంటి మరొక కేసులో, ఒక జంట పిల్లలు లేకుండా మరణించిన తర్వాత, ఆ వ్యక్తి సోదరి వారు వదిలి వెళ్ళిన ఆస్తిని తమదని క్లెయిమ్ చేస్తోంది. ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయమని… దీనిపై సుప్రీంకోర్టు జోక్యం అవసరమని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.
నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టం.. జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం సీఎం హెచ్చరిక
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి సూచించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. జుబీన్ గార్గ్ మృతికి కారణమైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. దర్యాప్తు బృందానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు పేర్కొన్నారు. ఒకవేళ సిట్ విఫలమైతే మాత్రం సీబీఐకి అప్పగిస్తామని వెల్లడించారు. జుబీన్ గార్గ్ మరణం అందరి హృదయాలను కలిచి వేస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయంటూ గతంలోనే సీఐడీ అప్పగించనున్నట్లు చెప్పుకొచ్చారు. సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌కు జుబీన్ గార్గ్ వెళ్లారు. అయితే సెప్టెంబర్ 19న సముద్రంలో బోటింగ్ చేస్తున్నారు. అనంతరం లైఫ్ జాకెట్ ధరించి ఈత కొట్టేందుకు దూకారు. కానీ కొద్దిసేపటికే ఇబ్బందికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురయ్యారు. కానీ కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు వార్త ప్రకటించారు. దీంతో అస్సామీయులు, అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణవార్త తెలియగానే దు:ఖంలో ముగినిపోయారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.
రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండించాలి.. యూఎన్‌లో జెలెన్‌స్కీ పిలుపు
ప్రస్తుత మానవ చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశంలో జెలెన్‌స్కీ ప్రసంగించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని.. ఈ తీరు మారాలని కోరారు. యుద్ధం ముగింపునకు ప్రపంచ దేశాలు సహకరించాలని కోరారు. శాంతికి సహకరిస్తారా? లేదంటే రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తారో మీరే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. తమపై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోందని.. ఈ తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ యుద్ధం మరింత విస్తరిస్తోందని పేర్కొన్నారు. యూరప్ అంతటా రష్యా డ్రోన్లు ఎగురుతున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని వాపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని ఆపలేకపోయారని చెప్పుకొచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు.
4K సపోర్ట్, డాల్బీ విజన్ లాంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Pro Mini LED 2026 Series లాంచ్.. ధర ఎంతంటే?
షియోమీ గ్లోబల్ మార్కెట్స్‌లో కొత్త TV లైన్‌అప్ Xiaomi TV S Pro Mini LED 2026 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 55 అంగుళాల, 65 అంగుళాల, 75 అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్స్ 4K రిజల్యూషన్‌తో పాటు QD-Mini LED ప్యానెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలు గూగుల్ టీవీ మీద రన్ అవుతూ quad-core Cortex-A73 ప్రాసెసర్ తో వస్తాయి. 3GB ర్యామ్, నారో బజెల్స్, డ్యూయల్ 15W స్పీకర్స్ డాల్బీ ఆటమ్స్ అండ్ హర్మాన్ AudioEFX ట్యూనింగ్‌తో అందించబడుతున్నాయి. ఈ సిరీస్ టీవీలు 4K (2160×3840 pixels) రిజల్యూషన్‌తో వస్తాయి. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండగా అదే గేమ్ బూస్ట్‌లో 288Hz వరకు పెరుగుతుంది. 120Hz Motion Estimation Motion Compensation (MEMC) సపోర్ట్ చేస్తూ, 94% DCI-P3 కలర్ కవరేజ్ అందిస్తుంది. HDR సపోర్ట్ Dolby Vision, HDR10+, HLG లతోపాటు ఫిలింమేకర్ మోడ్‌ను కలిగి ఉంది. టీవీలు క్వాడ్ కోర్ కార్టెక్స్-A73 ప్రాసెసర్, Mali-G52 MC1 GPU, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్‌తో రన్ అవుతాయి. ఆడియో కోసం డ్యూయల్ 15W స్పీకర్స్, డాల్బీ ఆటమ్స్, హర్మాన్ AudioEFX ట్యూనింగ్ అందించబడింది. వీటికి Auto Low Latency Mode (ALLM), Variable Refresh Rate (VRR), eARC (Dolby Atmos Passthrough) సపోర్ట్ కూడా ఉంది.
ఢిల్లీ హైకోర్టుకు సినీ నటుడు నాగార్జున.. వెంటనే ఆ వీడియోలు తొలగించండి..!
టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరు, అభిమానులు టాలీవుడ్ కింగ్ గా పిలుచుకునే అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం.. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఇలా నటులు పిటీషన్ దాఖలు చేయడం కొత్తగా ఏమి కాదు. పర్శనాలిటీ రైట్స్ కోసం గతంలో కూడా ఢిల్లీ హైకోర్టును అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ తదితరుల బాలీవుడ్ నటులు ఆశ్రయించారు. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హీరో అక్కినేని నాగార్జున పిటీషన్ ను జస్టిస్ తేజస్ కారియా విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తీర్పును ఇచ్చారు. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతాం అని తీర్పు ఇచ్చింది హై కోర్ట్.
బాలీవుడ్ యంగ్ లవ్ బర్డ్స్ కు సీనియర్ నిర్మాత సలహా
బాలీవుడ్‌లో యంగ్ భామలంతా సోలోగా లేరు. ఎవరితో ఒకరితో మింగిల్ అవుతున్నారు. అందులోనూ యంగ్ బ్యూటీస్ అస్సలు ఖాళీగా లేరు. జాన్వీ శిఖర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో ఉంటే ఆమె సోదరి ఖుషీ కపూర్ యంగ్ హీరో వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తుందని టాక్. వీరి ఫ్రెండ్ అనన్య పాండే కూడా ఖాళీగా లేదు. తారా సుతారియా వీర్ పహారియాతో విహరిస్తుంటే అప్ కమింగ్ బ్యూటీ షారూఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్.. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందతో లవ్ ట్రాక్ నడుపుతుందని టాక్. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరింది మరో బ్యూటీ. సైయారాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న అనీత్ పద్దా కోస్టార్ అహన్ పాండేతో రియల్ లైఫ్‌లో కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. సైయారాతో బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న అహన్ పాండే- అనీత్ పద్దా ఇష్క్ .. కాదల్ అంటూ ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారట. ఇద్దరు కలిసి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారన్నది బీటౌన్ లేటెస్ట్ బజ్. అయితే మీ ప్రేమను బయటకు చెప్పొద్దని సలహా ఇచ్చాడట ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా. అందుకే రహస్యంగా ప్రేమించుకుంటున్నారన్నది టాక్. సైయారా షూటింగ్ టైంలోనే వీరి పరిచయం ప్రేమగా చిగురించిందని తెలుస్తుంది. సైయారాతోనే హీరోగా ఎంట్రీగా ఇచ్చాడు అనన్య పాండే సోదరుడు అహన్ పాండే. అనీత్ పద్దాకు ఇది సెకండ్ ఫిల్మైనా ఫీమేల్ లీడ్‌గా ఫస్ట్ మూవీ. అహన్ పాండే నెక్ట్స్ ప్రాజెక్ట్ టాక్స్ జరుగుతున్నాయి. అనీత్.. మడాక్ ఫిల్మ్ బ్యానర్‌లో నటించబోతోందని తెలుస్తోంది. బీటౌన్‌లో రోజుకొక కొత్త లవ్ స్టోరీ పురుడు పోసుకుంటూనే ఉంటుంది. అయితే ఆ లవ్ పెళ్లి పీటల వరకు రావటం కష్టం. వీళ్లు కచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్న జంటలు విడిపోయాయి. వీళ్లది టైమ్ పాస్ ప్రేమలు అని ఎక్స్ పెక్ట్ చేసినవి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టినవి ఉన్నాయి. మరి వీరి ప్రేమ ఎంత వరకు సాగుతుందో చూడాలి.
బ్యాంకు రుణం క్లియర్ చేయకపోవడంతో.. జయం రవి ఇల్లు జప్తు
చెన్నై ఇంజంబక్కంలో నివసిస్తున్న నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ ఇల్లు ప్రస్తుతం పెద్ద వివాదాల్లో చిక్కుకుంది. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి భారీ రుణం తీసుకున్నప్పటికీ, నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో మొత్తం రూ.7.60 కోట్లకు పైగా బకాయిలు పెరిగినట్లు సమాచారం. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు ఇప్పటికే అనేకసార్లు రిమైండర్ లేఖలు పంపినా ఫలితం లేకపోవడంతో చివరికి ఇంటి గోడలకు నోటీసులు అంటించి, ఆ ఇంటిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. మరోవైపు జయం రవి పేరు ఇటీవల సినిమా ఒప్పందాల వివాదంలోనూ వినిపించింది. టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థ ఆయన పై ఆరోపణలు చేస్తూ, రెండు సినిమాలకు సుమారు రూ.6 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ ఆ ప్రాజెక్టుల్లో నటించకుండా ఇతర సినిమాలకు ఒప్పుకున్నారని వెల్లడించింది. ఈ కారణంగా ఆ సంస్థ కూడా ఆయన ఇంటిని జప్తు చేయాలని డిమాండ్ చేసింది. వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజ్ పెంచుకున్న జయం రవి ప్రస్తుతం ఈ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ ఆరోపణలపై జయం రవి ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. మరి ఈ వ్యవహారం ఏ దిశగా వెళ్తుందో, ఆయన తన బకాయిలను క్లియర్ చేస్తారా లేదా అనేది చూడాలి.
‘తెలుసు కదా’ ఓటీటీ డీల్ క్లోజ్.. జాక్ పాట్ కొట్టిన నిర్మాత
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఒక సరికొత్త కథ, కథాంశంతో తెలుసు కదా వస్తున్నట్టు యూనిట్ చెప్తూ వస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాశి కన్నా, సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా దట్టించారు. పోటా పోటీగా అందాలు ఆరబోశారు రాసి, శ్రీనిధి. ఈ చిత్రం నుండి రిలీజ్ అయినా మల్లిక గంధ ఫస్ట్ లిరికల్ సాంగ్ కు చాట్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 22 కోట్లకు తెలుసుకదా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసింది. జాక్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ సినిమాకు అంత ధర పలికిందంటే సూపర్ డీల్ అనే చెప్పాలి. ఓటీటీ రూపంలో నిర్మాతకి జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న తెలుసు కదా ఈ ఏడాది అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో రిలీజ్ కానుంది.
