బంగాళాఖాతంలో అంచనాలకు భిన్నంగా కదులుతోన్న అల్ప పీడనం..!
వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బల హీనపడుతుందని అంచనాలు వున్నాయి. ఇక, తీవ్ర అల్పపీడనం కారణంతో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులకు పైగా వదలకుండా… విడవ కుండా వున్న ముసురు రైతులకు ముప్పుగా మారింది. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం వుంది. కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలుచోట్ల వర్గాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనం కాస్త బలహీనపడుతున్న దశలో మరోటి ఏర్పడే అవకాశం వుంది. ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో డిసెంబర్ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడటం ఇదే తొలిసారి.
ఐపీఎస్ అధికారులపై వరుస కేసులు.. మరో ఐపీఎస్‌పై కేసు, వేటు..!
ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ లు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుని సస్పెండ్ అవుతోన్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. పోలీసు అనే పేరు వింటేనే.. ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది.. అక్రమాలు.. ఎక్కడ జరిగిన గుర్తొచ్చేది పోలీసు.. ఇక ఐపీఎస్ పాస్‌అయి డ్యూటీలో ఉంటే వేరే లెవెల్.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరే లా ఉంది.. మొన్న జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్ అయ్యారు.. కాంతి రానా టాటా.. విశాల్ గున్ని.. పీఎస్సార్ ఆంజనేయులు.. తాజాగా మరో అధికారి సంజయ్ సస్పెండ్ అయ్యారు.. ఇలా వరసగా ఐపీఎస్‌లు సస్పెండ్ అవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.. సాధారణంగా ఐపీఎస్‌లు అంటే ఎంతో బాధ్యతతో ఉంటారు.. ఉండాలి కూడా.. ప్రభుత్వం అధికారులపై సహజంగా కొంత ఒత్తిడి తెస్తుంది. వీటిని తట్టుకోలేక.. నిలబడక.. తప్పులు చేస్తే ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ప్రస్తుతం సస్పెండ్ అయిన అధికారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ముంబై నటి కాడంబరి జత్వానీ వ్యవహారంలో ఇరుక్కుని ముగ్గురు అధికారులు సస్పెండ్ అవ్వడం నిజంగా సంచలనమే.. రాష్ట్రంలో అత్యుత్తమ విధులు నిర్వహించే అధికారులు ఇలాంటి విషయాల్లో విధులకు దూరం.. అయితే చులకన భావం ఏర్పడుతుంది. ప్రజలకు సేవ చేయడంలో అక్రమాలు అరికట్టి సరైన న్యాయం చేయడంలో ముందుండాలి.. అలాంటిది ఐపీఎస్ అధికారులే కేసులో ఇరుక్కుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. తాజాగా, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ ఎన్. సంజయ్‌పై కూడా ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. అగ్నిమాపక శాఖ డీజీగా, సీఐడీ అదనపు డీజీగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్వహించిన విచారణలో, అగ్నిమాపక శాఖలో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు, ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం సంజయ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, విజయవాడను వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది.. ఏసీబీ కేసు నమోదు చేసింది.
జాతి గర్వించదగిన నేత వాజ్ పేయి.. ఆయన ఆలోచన తీరు విలక్షణం
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్‌లో పుష్పాంజలి ఘటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పలువురు కేంద్ర మంత్రులు.. ఇక, వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. “భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి.. వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను.. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది. ‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను.. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నాను..” అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
డెడ్‌బాడీ హోమ్ డెలివరీ కేసులో బిగ్ ట్విస్ట్..
సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ హోమ్ డెలివరీ కేసులో ట్విస్టులమీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమగోదావరిజిల్లా యండగండిలో ఈనెల 19వ తేదీన సాగి తులసి అనే మహిళ ఇంటికి చేరిన పార్సిల్ డెడ్‌బాడీ కేసులో పోలిసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది.. ఎందుకంటే.. ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మ రెండో భార్య రేవతి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. భర్తకు దూరమై ఒంటరిగా ఉంటున్న అక్క తులసికి చెందాల్సిన ఆస్తిని కొట్టేసేందుకు భర్త సుధీర్ వర్మతో కలసి ప్లాన్ డెడ్‌బాడీ పార్సిల్ పథకాన్ని రచించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇంటికి అరిష్టం పట్టిందని, పూజలు చేసేందుకు డబ్బు అవసరమని తల్లిదండ్రులను రేవతి ఒప్పించి.. ఆస్తి కొట్టేయాలని ప్రయత్నం చేసిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.. ఈన ప్లాన్‌లో భాగంగానే ఎలాంటి సంబంధంలేని పర్లయ్యను హత్యచేసి పార్సిల్ చేసారా? అనే కోణంలో ఆధారాలు సేకరించే పనిలో పడిపోయారు పోలీసులు..
టీడీపీ మాజీ నేతలను కలిపిన పాత కేసు.. ఒకే దగ్గరకు ఏపీ, తెలంగాణ నేతలు..
రాజకీయ పార్టీల్లో నేతల వలసలు కామన్.. కొందరు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో కొనసాగితే.. మరికొందరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వారికి ఉన్న అవకాశాలతో కూడా పార్టీలు మారిన సందర్భాలు ఉంటాయి.. అయితే, వారినిపై నమోదైన కేసులు మాత్రం అంత తొందరగా వదలవు కదా..? కొన్ని కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చింది.. తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది. ఓ కేసుకు సంబంధించి విచారణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీలో ఉండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. కొందరు మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రివర్యులు.. వివిధ పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు.. ప్రభుత్వాలలో కీలక భూమిక పోషిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, కోర్టుకు హాజరైన నేతల విషయానికి వస్తే.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాగం జనార్దన్ రెడ్డి వీరంతా ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా ఉన్నారు.. చంద్రబాబు ఆదేశాలతో ఎన్నో పోరాటాలు చేశారు. కలిసిమెలిసి తిరిగారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నేతలు టీడీపీని వదిలి వేర్వేరు పార్టీల్లోకి వలస పోగా, ఏపీ నేతలు మాత్రం ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వీరంతా మంగళవారం ఒక్కసారిగా కలిశారు. 2007లో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసులో నమోదైన కేసుకు సంబంధించి విచారణ ఉండటంతో అంతా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరయ్యారు. చాలా కాలం తర్వాత పాత నేతలు అంతా ఒకే చోట చేరడంతో కోర్టు ఆవరణ సందడిగా మారిపోయింది. ఆ నేతలు కూడా ఏ పార్టీలో ఉన్నా.. అంతా అప్యాయంగా పలకరించుకుంటూ మట్లాడుకున్నారు..
తెలంగాణపై అల్పపీడన ప్రభావం.. రెండు రోజులు వానలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం తెలంగాణపై కూడా అల్పపీడనం ప్రభావం చూపనుంది. దీంతో రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఇవాళ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో వాన కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి అక్కడక్కడా వర్షం కురుస్తుంది. మంగళవారం రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు ఆవరించి చల్లటి గాలులు వీచాయి. మరోవైపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. నల్గొండ జిల్లా మాథూరులో 1.1 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1.1 సెం.మీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మళ్లీ బలపడుతుందా.. బలహీనపడుతుందా అన్నది తేలలేదు. ప్రస్తుతం తీరం సమీపంలో కదులుతుండడంతో మేఘాలు కమ్ముకుని చిరు జల్లులు కురుస్తున్నాయి. దీనికి తోడు చలి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ దూకుడు.. కీలక పరిణామాలు..
ఫార్ములా-ఈ రేసు కేసులో కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారణ ప్రారంభించనున్నారు. దాన కిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీన పరుచుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి దాన కిషోర్ వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరికే డబ్బులు బదిలీ చేసినట్లు వెల్లడించారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండీఏ ద్వారా ఎఫ్ఈఓ కు డబ్బులు బదిలీ చేసినట్లు వెల్లడించారు. రూ.55 కోట్ల రూపాయల నగదును ఏపీవోకు బదిలీ చేసినట్లు దాన కిషోర్ పేర్కొన్నారు. దానకిషోర్ వాంగ్మూలం ఆధారంగా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు ప్రారంభించనుంది. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్‌లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ వాంగ్మూలాన్ని బట్టి వారిద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. దానకిషోర్ వద్ద తీసుకున్న పత్రాలను వారి ముందు ఉంచడం కూడా వుంచే అవకాశం కూడా ఉంది. ఫార్ములా-ఇ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మోడీ
నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి. ఢిల్లీలోని ఆయన సమాధి సదా అటల్ వద్ద నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు నేతలు వచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రధాని మోడీ స్మరించుకున్నారు. ఈ డిసెంబర్ 25వ తేదీ భారత రాజకీయాలకు, భారత ప్రజలకు సుపరిపాలన దృఢమైన రోజుగా ఆయన అభివర్ణించాడు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్టీ అధినేత జేపీ నడ్డా, ఎన్ చంద్రబాబు నాయుడు, కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు వంటి ప్రముఖులు ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు వాజ్‌పేయి జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు బెత్వా ప్రాజెక్టుకు కెన్ శంకుస్థాపన చేయనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆయనకు నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి నాయకుడు దేశానికి లభించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు.
మెర్రీ క్రిస్మస్… దేశం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపిన మోడీ
నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశమంతా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, మంగళవారం క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సందేశాన్ని ఇచ్చారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభువైన యేసు బోధనలు ప్రతి ఒక్కరికీ శాంతి, శ్రేయస్సుకు మార్గాన్ని చూపుతాయి. సిబిసిఐతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నిస్వార్థ సేవా మార్గాన్ని యేసు ప్రపంచానికి చూపించారన్నారు. ఈ రోజు సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్‌ల స్ఫూర్తితో దేశం ముందుకు సాగాలని, దేశం ముందుకు సాగాలని, ఇది మన వ్యక్తిగత బాధ్యత, సామాజిక బాధ్యత అని నేను నమ్ముతున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. ఈ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ.. అనేక సమస్యలు ఉన్నాయని, అవి ఎప్పుడూ దృష్టి సారించలేదు కానీ వ్యక్తిగత దృక్కోణం నుండి చాలా ముఖ్యమైనవి. ప్రతి పేదవాడికి శాశ్వత ఇల్లు, ప్రతి గ్రామానికి కరెంటు రావాలి, ప్రజల జీవితాల్లో చీకట్లు పోవాలి, ప్రజలకు తాగడానికి స్వచ్ఛమైన నీరు అందాలి. చికిత్సకు ఎవరూ దూరం కాకూడదన్నారు.
ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. విమానాలు ఆలస్యం.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) హెచ్చరిక జారీ చేసింది. ఈ సలహాలో, దట్టమైన పొగమంచు కారణంగా విమాన కార్యకలాపాలలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా విమానాశ్రయం ప్రయాణికులకు తెలియజేసింది. CAT III కంప్లైంట్ విమానాలు లేని విమానాలు ఆలస్యం లేదా రద్దులను ఎదుర్కొంటాయని ఢిల్లీ విమానాశ్రయం తెలిపింది. ఇదిలా ఉంటే, ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు విమాన స్థితిని తనిఖీ చేయాలని సూచించింది. బుధవారం (25 డిసెంబర్ 2024) ఉదయం నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దట్టమైన పొగమంచు ఉంది. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. రహదారిపై ట్రాఫిక్ కూడా నెమ్మదిగా కొనసాగింది. ఘజియాబాద్, నోయిడా మరియు గురుగ్రామ్‌కు వెళ్లే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వంటి మార్గాలలో విజిబిలిటీ తక్కువగా ఉంది, దీని కారణంగా డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని మార్గాల్లో పొగమంచు కారణంగా జామ్‌లు కూడా ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. అదే సమయంలో పొగమంచుతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే 20 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రభావిత రైళ్లలో గోవా ఎక్స్‌ప్రెస్, పూర్వా ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్, రేవా-ఆనంద్ విహార్ టెర్మినల్ ఎస్ ఎఫ్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ.. పెరుగుతూ.. స్థిరంగా ఉంటూ పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఇక రెండు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్ నిన్న తగ్గగా.. నేడు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (డిసెంబర్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,000గా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వెండి కూడా గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తోంది. నిన్న స్థిరంగా ఉన్న వెండి.. నేడు స్వల్పంగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 పెరిగి.. రూ.91,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 99 వేలుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.91,500గా ఉంది.
తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కొత్త ఆటగాడికి అవకాశం!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్ జట్లు బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆసీస్ తన తుది జట్టును ప్రకటించింది. 19 ఏళ్ల సామ్ కాన్ట్సాస్‌కు అవకాశం ఇచ్చింది. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ రెండు మార్పులు చేసింది. ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో యువ ఆటగాడు సామ్ కాన్ట్సాస్‌కు అవకాశం ఇచ్చింది. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్‌ను మూడో ప్రధాన పేసర్‌గా తీసుకుంది. బొలాండ్ రెండో టెస్ట్ ఆడిన విషయం తెలిసిందే. గాయపడిన హేజిల్‌వుడ్ రావడంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఫిట్‌నెస్ టెస్టులో పాస్ కావడంతో తుది జట్టులో చోటు దక్కింది. భారత్‌తో వార్మప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు తరఫున సామ్ కాన్ట్సాస్ ఆడాడు. 97 బంతుల్లో 107 రన్స్ చేశాడు. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వంటి బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు. ఇక బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తరఫున ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను ఆరంబించనున్నాడు. మెక్‌స్వీనీ విఫలమైన వేళ కాన్ట్సాస్ ఎలా ఆడుతాడో చూడాలి.
నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్ టీజర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను సైతం డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నేడు క్రిస్మస్ సందర్భంగా టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సూర్య, కార్తిక్ సుబ్బరాజుల సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్ ఖరారు చేశారు. హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతున్న సీన్‌తో టీజర్ ఓపెన్ అయింది. నీ ప్రేమ కోసం ఈ రౌడీయిజం వదిలేస్తున్నా, నాది స్వచ్ఛమైన ప్రేమ అని సూర్య చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు యాక్షన్.. మరోవైపు లవ్ స్టోరీతో టీజర్‌ను కట్ చేశారు. ప్రస్తుతం తమిళ టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే మిగతా భాషల టీజర్స్ విడుదల కానున్నాయి. 2025 వేసవిలో రెట్రో విడుదల కానుంది. ఈ మూవీ సూర్యకు చాలా ముఖ్యం. ఎందుకంటే మూడేళ్లుగా కంగువ కోసం కష్టపడినా అందుకు తగ్గ ఫలితం రాలేదు. రెట్రోపై అతడు భారీ ఆశలు పెట్టుకున్నాడు.
అలియా, కియారాలతో తప్పుగా ప్రవర్తించలేదు: వరుణ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్‌లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంతో వరుణ్ ధావన్‌ను నెటిజెన్స్ ఏకిపారేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందిస్తూ.. అలియా, కియారాలతో తప్పుగా ప్రవర్తించలేదన్నారు. శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో వరుణ్ ధావన్ మాట్లాడుతూ… ‘నేను సినిమా షూటింగ్ సమయంలో నా సహచర నటీనటులందరితో ఒకేలా ఉంటాను. నా సహచర నటీనటులతో ఎన్నోసార్లు సరదాగా ప్రవర్తించాను. అయితే ఆ విషయం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. ఇప్పుడు నాపై వస్తున్న విమర్శలపై ప్రశ్న అడిగినందుకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తాను. నేను అందరి ముందు కియారాను కావాలనే ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్ కోసం అలా చేశాం. ఆ క్లిప్‌ను నాతో సహా కియారా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలియా నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు సరదాగా అలా చేశాను. అది సరసం మాత్రం కాదు. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే’ అని చెప్పుకొచ్చాడు.