మరో నాలుగు రోజులు వడగళ్ల వాన..! వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. చేతికి అందివచ్చిన పంట.. అకాల వర్షం నేలపాలు చేసింది.. వేలాది ఎకరాల్లో పంట నష్ట వాటిల్లింది.. అయితే, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి.. ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని.. ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వడగళ్ల వాన పడుతుందని పేర్కొంది.. ఇక, విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోంది.. బంగాళాఖాతంలో బలంగా విస్తరిస్తోంది ద్రోణి.. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలుల కారణంగా ఏర్పడుతున్న క్యుములో నింబస్ మేఘాలతో వర్షం, వడగళ్ల వాన, పిడుగులు పడతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.. పంట పొలాల్లో ఉండే వాళ్లు వర్షం కురిసే సమయంలో.. చెట్లకు దూరంగా ఉండాలని.. సూచించారు.
శ్రీశైలానికి పోటెత్తిన కన్నడ భక్తులు.. సెల్ సిగ్నల్ దొరకడం లేదు..!
శ్రీశైలం మల్లన్న ఆలయానికి కన్నడ భక్తులు పోటెత్తారు భక్తుల రద్దీతో ఇప్పటికే ఉగాది ఉత్సవాలకు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విస్తృత ఏర్పాట్లు చేశారు.. ఈనెల 27 నుండి 31వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండడంతో మల్లన్న ఆలయానికి కన్నడ భక్తజనం బారులు తీరారు. అయితే, ఉగాది మహోత్సవాలకు వారం ముందు నుంచే కన్నడ భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. దానికి తోడు ఈనెల 26 వరకు మాత్రమే కన్నడ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అనుమతించారు. 27 నుండి ఉగాది మహోత్సవాల సందర్భంగా 31వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీమల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడంతో ఈనెల 26 లోపే శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దానికి తోడు ప్రత్యేక కావడిలో తమ ఇంటి ఆడపడుచుగా భావించే భ్రమరాంబాదేవి అమ్మవారికి పసుపు, కుంకుమతో పాటు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి భక్తుల రద్దీతో తలపోటు వచ్చిందేమోనని మిరియాల చూర్ణాన్ని సాంప్రదాయంగా కావడిలో తీసుకొని లక్షలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజామునే పవిత్ర పాతాళగంగలో పుణ్యాస్నానాలు ఆచరించి శ్రీమల్లికార్జునస్వామి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్స్ లో మంచినీరు, పాలు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తూ భక్తులకు సేవలందిస్తున్నారు. దీనితో శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి 3 గంటల సమయం అలానే శ్రీస్వామి అలంకార దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.
రైతులను పట్టించుకోరా..? ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి..
ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షం, వడగళ్ల, గాలికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. పార్ణపల్లె, ఏగువపల్లె, కోమటీనూతల, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో 4000 ఎకరాల్లో వర్షానికి అరటి పంటలు దెబ్బతిన్నాయి.. దాదాపుగా రైతన్నలు 15 లక్షలు చొప్పున నష్ట పోయారని పేర్కొన్నారు.. అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు.. 2023 – 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు.. అయితే, 2024 ఖరీఫ్ ప్రీమియంను చంద్రబాబు కట్టేందుకు మేం ప్రయత్నిస్తున్నాం అన్నారు వైఎస్ జగన్.. ఈ క్రాఫ్ కింద ఉచిత పంటల బీమా ఉందా లేదా ? అని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు నాయుడు పుణ్యాన ఖరీఫ్ లో పంట నష్టం చూశాం.. వెంటనే ప్రభుత్వం మనవతాదృక్పదంతో స్పందించాలి.. వర్షం వల్ల నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని.. రైతు భరోసా కింద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. సున్నా వడ్డీని ఎత్తేశారని ఆరోపించారు.. రాష్ట్రంలో పులివెందుల అరటి సాగుకు నెంబర్ వన్.. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ మా ప్రభుత్వంలో నిర్మించాం.. కానీ, యూజర్ ఏ జెన్సీని ఎంపిక చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. మా ప్రభుత్వ హయాంలో అరటిని ఎక్స్‌పోర్ట్ చేశాం.. నెల క్రితం 26 వేలు పలికిన అరటిని ప్రస్తుతం అడిగేవారు లేరు.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు.. మిర్చి, శనగలు, మినుములు.. ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని విమర్శించారు.. 4000 ఎకరాల అరటి రైతులకు మేం అండగా ఉంటామని హామీ ఇస్తున్నా.. ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తా అన్నారు వైఎస్ జగన్..
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక, మే 1వ తేదీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది. దీంతో మార్చి 28వ తేదీన నోటిఫికేషన్ విడదల కానుండగా.. ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించారు. అలాగే, నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడానికి ఏప్రిల్ 9వ తేదీన చివరి అవకాశం. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది అని ఈసీ తెలిపింది. ఇక, ఏప్రిల్ 25వ తేదీన తుది ఫలితాల వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొనింది. అయితే, హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని అటు అధికార కాంగ్రెస్ చూస్తుండగా.. మరోసారి ఎమ్మెల్సీ పదవీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఇక, భాగ్యనగరంలో బోణీ కొట్టాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తుండగా.. పతంగి పార్టీ మాత్రం తన మార్క్ చూపించాలని యోచిస్తుంది.
కునాల్ కమ్రా వ్యాఖ్యలపై స్పందించిన అజిత్ పవార్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇప్పటికే శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. ఇక శివసేన కార్యకర్తలు.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ అంశంపై ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ఎవరూ కూడా చట్టం పరిధి దాటి వ్యవహారించకూడదని సూచించారు. రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి మాట్లాడాలని హితవు పలికారు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అంతమాత్రాన హద్దులు దాటి మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఎవరైనా పరిమితుల్లోనే మాట్లాడాలన్నారు. అనుచిత వ్యాఖ్యలు కారణంగా పోలీస్ శాఖ జోక్యం చేసుకోవల్సి వచ్చిందన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గానీ.. డిప్యూటీ సీఎం షిండేగానీ స్పందించలేదు.
సత్‌ఫలితాల్ని ఇస్తున్న న్యూరాలింక్ చిప్.. తొలి వ్యక్తి ఏమన్నాడంటే..!
ఎలోన్ మస్క్‌కు సంబంధించిన న్యూరాలింక్ పరికరం సత్‌ఫలితాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. పక్షవాతానికి గురైన ఎనిమిది సంవత్సరాల తర్వాత 2024, జనవరిలో 30 ఏళ్ల నోలాండ్ అర్బాగ్‌కు యూఎస్ న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్ పరికరాన్ని మొదడులో అమర్చారు. ఇప్పుడా వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా అర్బాగ్ స్పందిస్తూ.. మునుపటి కంటే తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఎలోన్ మస్క్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తన ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రిస్తున్నట్లు పేర్కొన్నాడు. మొదడులో చిప్ పెట్టుకోకముందు తన పరిస్థితి ఘోరంగా ఉందని.. అన్ని విషయాల్లో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేదన్నాడు. కానీ ఇప్పుడు చిప్ కారణంగా తన మెదడు మెరుగుపడడంతో చదువుతో పాటు వీడియో గేమ్‌లు కూడా ఆడగల్గుతున్నట్లు అర్బాగ్ పేర్కొన్నాడు.
ఏప్రిల్ 17న 300 పరుగులు పక్కా.. డేల్ స్టెయిన్ జోస్యం!
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తన మొదటి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (106 నాటౌట్; 47 బంతుల్లో 11×4, 4×6) మెరుపు సెంచరీ చేయగా.. ట్రావిస్ హెడ్ (67; 31 బంతుల్లో 9×4, 3×6), హెన్రిచ్ క్లాసెన్ (34; 14 బంతుల్లో 5×4, 1×6), నితీశ్ కుమార్ రెడ్డి (30; 15 బంతుల్లో 4×4, 1×6)లు మెరుపులు మెరిపించారు. గతేడాది భారీ స్కోర్లతో మూడుసార్లు అలరించిన ఎస్ఆర్‌హెచ్.. ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లోనే 300 పరుగులకు కొద్ది దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న ఎస్ఆర్‌హెచ్ 300 పరుగులు చేస్తుందని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ జోస్యం చెప్పాడు. ఆదివారం ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంచనాలకు ఏమాత్రం తగ్గేదే లేదని ఎస్ఆర్‌హెచ్ చాటింది. ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్ల మెరుపులకు హైదరాబాద్ అభిమానులతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ అనంతరం డేల్ స్టెయిన్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘చిన్న అంచనా. ఏప్రిల్ 17న ఐపీఎల్‌లో మొదటిసారి 300 పరుగులు మనం చూస్తాము. ఎవరికి తెలుసు, అది చూడటానికి నేను కూడా అక్కడ ఉండవచ్చు’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఏప్రిల్ 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియన్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. గతేడాది వాంఖడేలో హైదరాబాద్ 277 పరుగులు చేయగా.. ముంబై 246 రన్స్ చేసింది.
క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో ‘మై డాక్టర్’ భాగస్వామ్యం!
ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో ప్రముఖ పెయిన్ రిలీఫ్ బ్రాండ్ ‘మై డాక్టర్’ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంతో మరింత శక్తివంతంగా మారింది. ఆరోగ్యం, క్రీడ, వినోదాన్ని కలిపిన ఈ విప్లవాత్మక ముందడుగు.. ఇండియన్ ఓటీసీ రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వార్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్నర్‌తో ‘మై డాక్టర్’ భాగస్వామ్యం చేసుకుంది. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ సందర్భంగా డేవిడ్ వార్నర్‌తో ‘మై డాక్టర్’ డైరెక్టర్ శ్రీ రఘునందన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మై డాక్టర్ అని ఉన్న బ్యాట్‌పై వార్నర్ సంతకం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇది భారతదేశంలో ఓ విశిష్టమైన భాగస్వామ్యం. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టార్‌తో కలిసి పనిచేయడం మాకు గర్వకారణం. డేవిడ్ వార్నర్ మాతో చేరడం వలన బ్రాండ్‌కు ఎనర్జీ, విజిబిలిటీ రెండూ గణనీయంగా పెరుగుతాయనే నమ్మకం ఉంది’ అని శ్రీ రఘునందన్ తెలిపారు.
బాలీవుడ్‌లో మరో బ్రేకప్.. బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టిన హీరోయిన్
బాలీవుడ్ ఇండస్ర్టీలో బ్రేకప్‌లు, విడాకులు కామన్. ఇప్పటికే అలా విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం. తర్వాత విడిపోవడం మరోకరితో జతకట్టడం అక్కడి వారికి అలవాటే. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అంతే కాదు మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురుగా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే హీరోయిన్ గా తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకుది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమా తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది అమ్మడు. ఇక అనన్య పర్స్‌నల్ విషయానికి వస్తే ఈ అమ్మడుకు లవ్ స్టోరీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముందుగా అనన్య పాండే ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్ వంటి హీరోలతో డేటింగ్ చేసింది. ప్రజంట్ మాత్రం పీకలోతు ‘ఆశికీ 2’ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో అనన్య పాండే రిలేషన్‌లో ఉందనే వార్తలొచ్చాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆదిత్యరాయ్ కపూర్‌కు బ్రేకప్ చెప్పిందట ఈ బ్యూటీ.
హిట్ డైరెక్టర్ తో మరోసారి నితిన్
నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులతో సతమతమౌతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు. భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలనే నమ్ముకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న నితిన్ తన అప్ కమింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ షేర్ చేసుకున్నాడు. నితిన్ ప్రజెంట్ తమ్ముడు సినిమా చేస్తున్నాడు. అలాగే బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మకు కమిటయ్యాడు. ఈ రెండు డిఫరెంట్ జోనర్స్. తమ్ముడు యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇక ఎల్లమ్మ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ఈ రెండే కాకుండా ఇష్క్ ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రీసెంట్ ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు నితిన్. విక్రమ్ చెప్పిన కథ చెప్పినట్లు స్క్రీన్ పైకి వస్తే తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే బొమ్మ అవుతుందని స్ట్రాంగ్‌గా చెప్పాడు నితిన్. ఇష్క్ తర్వాత విక్రమ్ కె కుమార్‌తో పుష్కర కాలం తర్వాత వర్క్ చేయబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో. సై తర్వాత నితిన్ నటించిన ఇంచు మించు డజను సినిమాలు ప్లాప్స్ అయ్యాయి. యంగ్ హీరో గ్రాఫ్ డౌన్ అవుతున్న సమయంలో విక్రమ్ కె కుమార్ నితిన్ కెరీర్‌కు ఇష్క్ రూపంలో భారీ యూటర్న్ ఇచ్చాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతుంది. ఈ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు టాక్. అలాగే యువి ప్రొడక్షన్ భారీగా ప్లాన్ చేస్తుందని సమాచారం.
జపాన్ లో దేవర ప్రమోషన్స్.. ఎన్టీఆర్ ఫొటోస్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దేవర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగ ఇప్పుడు దేవర జపాన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ లో దేవర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. జపాన్ లో దేవర భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ కు జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారి కోసమే స్వయంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లి మరి దేవరను ప్రమోట్ చేస్తున్నాడు.