Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ టెండర్లలో కీలక పరిణామం..
విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. దీనిపై కీలక ప్రకటన చేశారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ ఎన్పీ రామ‌కృష్ణా రెడ్డి.. విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం ఇచ్చామని తెలిపారు.. గ‌రిష్టంగా 3 కంపెనీలు క‌లిసి జేవీగా టెండ‌ర్లు వేసుకునే అవ‌కాశం ఉందన్నారు.. ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వ‌చ్చిన విన‌తిపై ఈ నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు.. దీనివ‌ల్ల ఎక్కువ కంపెనీలు టెండ‌ర్లలో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది.. ప‌నుల‌ను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభ‌జించ‌డం వ‌ల్ల ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుందన్నారు.. ఇత‌ర మెట్రో ప్రాజెక్ట్ ల అధ్యయ‌నం త‌ర్వాత ప‌నుల‌ను చిన్న ప్యాకేజీలుగా విభ‌జించ‌కూడ‌ద‌ని నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు.. ఇక, రెండు ప్రాజెక్టులు రికార్డ్ టైమ్ లో పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు..

ఈ రోజు శుభదినం.. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోడీకి అభినందనలు..
ఈ రోజు భారతదేశానికి శుభదినం.. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. జీఎస్టీ నెక్స్ట్ జెన్ పేరుతో నరేంద్ర మోడీ చిత్రం ఉన్న టీ షర్టులు ధరించి శాసన సభ, మండలి సమావేశాలకు హాజరయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ.. భారతదేశానికి ఈ రోజు శుభదినం అని పేర్కొన్నారు.. ఇక, జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి నాలుగు స్లాబులను రెండు స్లాబులకు ప్రధాని తీసుకువచ్చారు.. దేశంలోని ప్రతి వర్గానికి మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.. అనేక వస్తువులను 12 శాతం, 18 శాతం నుంచి 5 శాతానికి తెచ్చారు అని వెల్లడించారు మంత్రి సత్య కుమార్ యాదవ్.. ప్రాణాధార ఔషధాలను సున్నా శాతం జీఎస్టీకి తెచ్చారు.. ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ కు కూడా తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు అన్నారు.. హెల్త్ ఇన్సూరెన్స్ లపై ఉన్న జీఎస్టీని 18 శాతం నుంచి 0 శాతానికి తీసుకురావడం శుభపరిణామం అన్నారు.. జీఎస్టీ స్లాబులు మార్పులతో దసరా ముందుగా వచ్చిందని రాష్ట్ర ప్రజల భావిస్తున్నారు.. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీఎస్టీ స్లాబ్ లను కుదించడంపై చేసిన తీర్మానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్..

భూ వివాదం.. కన్న కొడుకును చంపిన తల్లి.. కంట్లో కారం చల్లి, చీరతో ఉరివేసి..!
భూ వివాదంలో కన్న కొడుకు ప్రాణాలనే తీసింది ఓ తల్లి.. తరచూ పొలం విషయంలో గొడవ జరగడం.. తాజాగా మరోసారి కూడా అదే ఘర్షణ జరగడంతో.. కొడుకునే తల్లి దారుణంగా హత్య చేసిందని మృతుడి భార్య ఆరోపిస్తోంది.. మొత్తంగా నంద్యాల జిల్లా పొలం వివాదంలో తల్లి ఏకంగా కన్నా కొడుకునే హత్య చేసింది. వెలుగోడు మండలం మోతుకూరులో సుధాకర్ అనే 36 ఏళ్ల కొడుకును తల్లి శివమ్మ హత్య చేసింది. పొలం పంపకాల్లో తల్లి, కొడుకుల మధ్య వివాదం కొనసాగుతోంది.. సుధాకర్, భార్య జ్యోతి ఒక ఇంట్లో నివాసం ఉంటుండగా.. సుధాకర్ తల్లి వెంకట శివమ్మ, రెండవ కుమారుడితో వేరుగా కాపురముంది. కొంత కాలంగా పొలంలో ఆడపడుచులకు కూడా వాటా ఇవ్వాలని తల్లి, ఆడపడుచులు, సుధాకర్ ఘర్షణ పడుతున్నారు. అయితే, మరోసారి తల్లి శివమ్మతో పొలం పంచాలంటూ మరోమారు ఘర్షణకు దిగాడు సుధాకర్‌.. ఈ ఘర్షణలో సుధాకర్ మృతి చెందాడు. అయితే, తన భర్త సుధాకర్‌ కంట్లో కారం చల్లి , కట్టుకున్న చీరతోనే తన అత్త వెంకట శివమ్మ, ఆడపడుచులు కలిసి ఉరి వేసి చంపారని మృతుడి భార్య జ్యోతి ఆరోపిస్తుంది. ఈ వ్యవహారంపై సుధాకర్ భార్య జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తోపులాటలో సుధాకర్ కిందపడి చనిపోయాడని తల్లి శివమ్మ వాదిస్తోంది.. తన కన్న కొడుకును తానే ఎందుకు చంపుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తోంది శివమ్మ..

టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ ఆసక్తికర సమాధానాలు..
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల ప‌రిస్థితిపై ప‌లువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు స‌మాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.. వ‌చ్చే జూన్ నెలాఖ‌రులోపు 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం అని ప్రకటించిన ఆయన.. ఎక్కడైనా పూర్తయిన ఇళ్లను ప్రతి శ‌నివారం ల‌బ్దిదారుల‌కు అప్పగించాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లకు ఆదేశాలిచ్చాం అన్నారు.. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌళిక వ‌స‌తులకు, కాంట్రాక్టర్ల పెండింగ్ బ‌కాయిల‌కు క‌లిపి రూ.7,280 కోట్లు అవ‌స‌రం.. ఈ నిధుల‌ను హ‌డ్కో ద్వారా, వివిధ బ్యాంకుల నుంచి లోన్ లు సేక‌రిస్తున్నాం అన్నారు. 2014-19 లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించింది.. వీటిలో 5 ల‌క్షల‌ ఇళ్ల నిర్మాణానికి పాల‌నా అనుమ‌తులు తీసుకుని టెండ‌ర్లు పిలిచాం అన్నారు మంత్రి నారాయణ.. అయితే, గ‌త ప్రభుత్వం వీటిని 2,61,640 కు త‌గ్గించ‌డ‌మే కాకుండా… ఇళ్లను కూడా పూర్తి చేయ‌లేదని ఆరోపించారు.. అంటే మొత్తంగా 4,39,841 ఇళ్లను ర‌ద్దు చేసేసింది అని మండిపడ్డారు.. గ‌త ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడింది.. 39,520 మంది ల‌బ్దిదారుల‌కు అర్హత లేద‌ని ప‌క్కన పెట్టేసిందని మండిపడ్డారు.. ఇళ్లకు పార్టీ రంగులు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదని విమర్శించారు..

గాజులరామారంలో కూల్చివేతలపై మరోసారి స్పందించిన హైడ్రా కమిషనర్..
హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో క్లౌడ్ బరెస్ట్ జరుగుతుంది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మొన్న కుత్బుల్లాపూర్ లో 18 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం హైదరాబాద్ లో కురస్తుందన్నారు. నగర శివారులో కన్నా నగరంలో ఎక్కువ ఎండ కొడుతుంది.. ఈ ఎండ వల్ల జెనరేట్ అయిన హీట్ తో ఇక్కడ ఎక్కువ వర్షాపాతం నమోదు అవుతుంది అని తెలిపారు. కాబట్టి, అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తో ఇలాంటి ఫ్లడ్ ను కంట్రోల్ చేయవచ్చు.. ఇందులో భాగంగా నాలాల పునరుద్దరణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే 100 ఏళ్లకు అనుగుణంగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.. నాలాల విషయంలో కబ్జాలను అరికటాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. అలాగే, నగరంలో కాంక్ట్రెట్ పెరగడంతో వర్షపు నీరు కూడా ఎక్కువగా ఇంకే అవకాశం లేదని ఏవీ రంగనాథ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిజస్టర్ మేనేజ్మెంట్ కోసం 51 టీమ్స్ ఉన్నాయి.. వాటిని 71 DRF టీమ్స్ కు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. ఇంకా నాలాల్లో డీ సిల్టింగ్ కూడా చాలా ముఖ్యమైంది.. అందుకోసం డీ సిల్టింగ్ కు హైడ్రా పెద్ద పీట వేయాలని నిర్ణయించాం.. నాలాల్లో మొన్న ముగ్గురు కొట్టుకుపోయారు.. అందులో ఒక్కరి బాడీ వలిగొండలో దొరికింది.. మిగతా వారి కోసం హైడ్రా తీవ్రంగా శ్రమించింది అని గుర్తు చేశారు. అయితే, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో ఇంకా దొరకలేదు.. గేట్లు కూడా తెరవడంతో ఎక్కడో ఓ చోట దొరికే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ తెలిపారు.

అబ్దుల్లాపూర్‌మెట్టులో రూ. 100 కోట్ల స్కామ్.. లక్ష గజాల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్
మెట్టులో రూ. 100 కోట్ల విలువైన లక్ష గజాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగి సహా పలువురి పేర్లపై ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్టు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. బాట సింగారం రెవెన్యూ పరిధి 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టింది. శ్రీమిత్ర డెవలపర్స్ ప్రజా ప్రయోజనార్ధం వదిలి వేసిన లక్ష గజాల భూమిని స్థానిక లీడర్లు మింగేశారు. అయితే, నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్ తో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ RDO ప్రొసీడింగ్ అని తేల్చిన అబ్దుల్లాపూర్ మెట్టు రెవెన్యూ అధికారులు.. దీనిపై అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక, శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై కేసు నమోదు అయింది. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక ప్రజా ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు.

బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం
బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లభించకపోవడం దేవుడు తనకు ఇచ్చిన అతి పెద్ద వరం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన హల్బా సమాజ్ మహాసంఘ్ స్వర్ణోత్సవ వేడుకల్లో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. తాను కులాన్ని గానీ మతాన్ని గాని నమ్మనని చెప్పారు. కులం, మతం లేదా భాష కారణంగా ఏ మానవుడు గొప్పవాడు కాదని వ్యాఖ్యానించారు. వారి.. వారి లక్షణాల కారణంగానే మాత్రమే గొప్పవారు అవుతారని పేర్కొన్నారు. దేవుడు తనకు ఇచ్చిన అతి పెద్ద ఉపకారం ఏంటంటే రిజర్వేషన్ ఇవ్వకపోవడమే అన్నారు. ఇదే విషయాన్ని తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రిజర్వేషన్లు, కోటా ఉద్యమం నడుస్తోంది. ఇలాంటి నిరసనల సమయంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించున్నాయి. ఇక విద్యావంతులకు, సంపన్నులకు కీలక పిలుపునిచ్చారు. సమాజ పురోగతి కోసం ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నేటినుంచి 5 రోజులు అమెరికాలో పాక్ ప్రధాని పర్యటన.. ట్రంప్‌ను కలవనున్న షెహబాజ్ షరీఫ్
ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ సమావేశాల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన బృందం నేటి నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో 80వ ఐరాస కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఇందుకోసం తన బృందంతో కలిసి సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు షెహబాజ్ షరీప్ అమెరికాలో ఉండనున్నారు. పర్యటనలో భాగంగా షరీఫ్.. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలవనున్నారు. షరీఫ్ వెంట విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఇతర మంత్రులు, సీనియర్ నాయకులు ఉండనున్నారు. ‘‘ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్ సమావేశం అవుతారు.’’అని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

పసిడి ప్రియులకు షాక్.. నేడు ఎంత పెరిగిందంటే..!
ట్రంప్ సుంకాల ప్రభావమో.. లేదంటే హెచ్ 1బీ వీసాల ప్రభావమో తెలియదు గానీ.. బంగారు ధరలు మాత్రం పైపైకి వెళ్లిపోతున్నాయి. ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ప్రియులకు రోజురోజుకు ధరలు షాకిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం కొనడం కలగానే మారిపోయేలా ఉంది. సోమవారం తులం గోల్డ్‌ ధరపై రూ.430 పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బంగారం ప్రియులు వామ్మో.. అంటూ గుండె మీద చేయి వేసుకుంటున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.430 పెరగడంతో రూ.1, 12, 580 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 పెరగడంతో రూ.1, 03, 200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.330 పెరగడంతో రూ.84,440 దగ్గర అమ్ముడవుతుంది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరగడంతో రికార్డ్ స్థాయిలో రూ. 1,38, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,48,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,38, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఆధిపత్యాన్ని నిరూపించుకున్న ‘ట్రిన్‌బాగో నైట్ రైడర్స్’.. ఐదోసారి టైటిల్ కైవసం
కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025 ఫైనల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మరోసారి విజేతగా నిలిచింది. దీనితో ఈ టోర్నమెంట్లో తమ జట్టు ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ సారథ్యంలోని నైట్ రైడర్స్ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి కప్‌ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు చేపట్టిన గయానా అమెజాన్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులకే పరిమితమైంది. ఇక గయానా అమెజాన్ వారియర్స్ ఇన్నింగ్స్ లో ఇఫ్తికార్ అహ్మద్ (30), బెన్ మెక్‌డెర్మాట్ (28), డ్వైన్ ప్రిటోరియస్ (25) నిలకడగా రాణించారు. అయితే మిగితావారు పెద్దగా రాణించలేక పోవడంతో తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. ఇక నైట్ రైడర్స్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ మూడు వికెట్లు పడగొట్టగా, అకేల్ హోసిన్ రెండు వికెట్లు తీశాడు. అలాగే ఉస్మాన్ తారిఖ్, ఆండ్రీ రస్సెల్ చెరో వికెట్ సాధించారు.

‘బ్యాడ్‌ గర్ల్‌’ అశ్లీలం కాదు..వివాదం పై స్పందించిన వార్షా భరత్
సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విడుద‌లతో పాటు వివాదాలు, విమర్శలు, కోర్టు తీర్పులు అన్నీ ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో, దర్శకురాలు వర్షా భరత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి స్పష్టత ఇచ్చారు. వర్షా భరత్ మాట్లాడుతూ.. ‘ ‘బ్యాడ్ గర్ల్’ టీజర్ విడుదలైన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్ లో ప్రదర్శించాం. అక్కడ అవార్డును సొంతం చేసుకున్నాం, ప్రశంసలు కూడా లభించాయి. కానీ ఇక్కడ కొన్ని విమర్శలు వచ్చాయి, ఈ సినిమా చెత్తగా ఉందని, అశ్లీలం అని అనుకున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులు మాత్రం దీన్ని గుర్తించారు. అది నా కోసం దిక్కుతోచని అనుభవం గా నిలిచింది. ” అని తెలిపారు. తమిళ్ లో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన పాజిటివ్ రివ్యూలు ఆమెకు ధైర్యం కలిగించాయని, సినిమా విడుదలపై వారం తర్వాత కుటుంబ సభ్యులను థియేటర్‌కి తీసుకెళ్లినప్పుడు వారు విమర్శించలేదని చెప్పి, ప్రజల ఆలోచన తీరు అర్థమైంది అని వర్షా చెప్పారు.

ఇన్నర్ వేర్ కనిపించేలా రెచ్చిపోయిన తమన్నా.. ఫ్యాన్స్ ఫైర్
తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో గ్లామర్‌ క్వీన్‌గా పేరుపొందిన తమన్నా భాటియా తాజాగా ఒక ప్రమోషనల్ సాంగ్ ద్వారా ఫ్యాన్స్ ముందు మరింత రెచ్చిపోయిన లుక్‌లో కనిపించారు. ఈ సాంగ్‌లో ఆమె ఇన్నర్ వేర్ స్పష్టంగా కనిపించేలా డ్రెస్ ఎంచుకున్నట్లు సోషియల్ మీడియా ద్వారా ట్రెండ్ అవుతోంది. దీంతో తమన్నా ఈ కొత్త లుక్‌పై పలువురు అభిమానులు, ఫాలోవర్లు కామెంట్లతో ఫైర్ చేస్తున్నారు. “ఇంతా ఆఫర్స్ కోసం చేస్తారా?”, “ఈ మాదిరిగా డ్రెస్ పెట్టడంలో అవసరం ఉన్నదా?” వంటి ప్రశ్నలతో కొంత మంది ఆమెకు విరోధాన్ని వ్యక్తం చేశారు. తమన్నా ఇటీవల ‘ఓదెల్-2’లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, ఈ సాంగ్ ద్వారా మరింత గ్లామరస్ లుక్‌ చూపించడం, కొంతమంది ఫ్యాన్స్ కోసం షాక్‌గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేగంగా స్పందిస్తూ, తమన్నా ఇలాంటి డ్రెస్ ఎంపికపై వివాదాలు రేపింది. ఇలాంటి పరిణామం, హీరోయిన్స్ ఫ్యాన్స్ మరియు మీడియా మధ్య గ్లామర్ లుక్ పై డీబేట్ ను మరింత పెంచింది. కానీ, కొంతమంది అభిమానులు తమన్నా నేచురల్ బ్యూటీ మరియు స్టైల్ ను ప్రశంసిస్తూ పాజిటివ్ రియాక్షన్స్ కూడా ఇచ్చారు. మరి తమన్నా భవిష్యత్ ప్రాజెక్ట్స్‌లో ఈ గ్లామర్-డోస్ పై ఆమె స్పందిస్తుందో, లేదా అటువంటి లుక్‌కు మార్పు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Exit mobile version