వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసుల నోటీసులు..
కడప జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు ఈ మేరకు నోటీసులు అంటించారు పోలీసులు.. పలు కేసులలో రాఘవ రెడ్డి, వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి అనుమనితులుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.. అయితే, విచారణకు సహకరించాలని నోటీసులలో పేర్కొన్నారు పోలీసులు. అయితే, ఏపీలో ఇష్టం వచ్చినట్టుగా నేతలను టార్గెట్ చేస్తూ.. పోస్టులు పెడుతున్న వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది.. తప్పుడు కేసులు బనాయించి భయపెడుతున్నారని.. అరెస్ట్‌లు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతుల మండిపడుతున్నారు. మరోవైపు.. కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ పీఏ రాఘవరెడ్డి.. అయితే, రాఘవరెడ్డి పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.. కాగా, గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. పీఏ రాఘవరెడ్డి.
చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. హుటాహుటిన హైదరాబాద్‌కి లోకేష్..
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట రామ్మూర్తి నాయుడు.. అయితే, తన చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం అందుకున్న మంత్రి నారా లోకేష్.. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని.. అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు.. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల కొనసాగుతున్నాయి.. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. అయితే, చిన్నాన్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారం తెలియగానే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని వెంటనే హైదరాబాద్‌కు బయల్దేరారు మంత్రి నారా లోకేష్..
సోదరుడికి సీరియస్.. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు..
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. అయితే, ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది.. కానీ, సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దు చేసుకున్నారు.. తన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు రామ్మూర్తి నాయుడు.. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలో కాంక్లేవ్ ముగియగానే.. హైదరాబాద్ బయల్దేరనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్న ఆయన.. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.. మరోవైపు.. తన చినాన్న రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారం అందుకున్న మంత్రి నారా లోకేష్.. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన అమరావతి నుంచి హైదరాబాద్ బయల్దేరిన విషయం విదితమే..
భారీ నీటి ప్రాజెక్ట్‌లకు రూ.15,513 కోట్లు.. చిన్న ప్రాజెక్టులకు రూ.1,227 కోట్లు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. 2024-25 సంవత్సరానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయంపుపై అసెంబ్లీలో నోట్ ఆన్ డిమాండ్స్ ప్రవేశపెట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు.. భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్ లకు 15,513 కోట్ల రూపాయలు కేటాయింపు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు నిమ్మల.. అలాగే చిన్న నీటి తరహా ప్రాజెక్టులకు 1,227 కోట్ల రూపాయల నిధులు కేటాయంపు కోరుతూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు.. ఇక, టిడ్కో ఇళ్ళ నిర్మాణాలపై శాసన సభలో చర్చ కొనసాగుతోంది.. మరోవైపు.. జలవనరులు శాఖ మంత్రి రామానాయుడుతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భేటీ అయ్యారు.. రాయచోటి నియోజకవర్గ నీటి సమస్యలపై చర్చించారు.. శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్ బ్యాలెన్స్ పనులు పూర్తికి 156 కోట్లు మంజూరు చేయాలని కోరారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కాగా, ఈ రోజు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.. ఏపీ శాసనసభ మాజీ సభ్యులు కెంబూరి రామ్మోహనరావు, పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, అడుసుమిల్లి జయప్రకాష్, శ్రీమతి మాగుంట పార్వతమ్మ మరియు శ్రీ రెడ్డి సత్యనారాయణ మరియు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాప తీర్మానం పెట్టారు.. మృతులకు సంతాపంగా రెండు నిముషాల మౌనం పాటించింది అసెంబ్లీ..
రేపటి నుంచే గ్రూప్–3 పరీక్షలు.. రెండు రోజుల పాటు 3 పరీక్షల నిర్వహణ ..
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు రెండు పరీక్షలు, రెండో రోజు ఒక పరీక్షలు నిర్వహిస్తారు. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.పేపర్-3 పరీక్ష 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్-3 పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ విడుదలైంది.
సైబర్ వలలో చిక్కకున్న మంత్రి.. ఏకంగా రూ.2 కోట్ల 8 లక్షలు మోసం
దేశంలో సైబర్ మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ గుప్తా నంది సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్ల 8 లక్షలు మోసం చేశారు. మంత్రి నంది కుమారుడి పేరుతో సైబర్ దుండగులు అకౌంటెంట్‌ను ట్రాప్ చేసి మోసానికి పాల్పడ్డారు. మోసానికి గురైనట్లు తెలుసుకున్న వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవ సమాచారం ప్రకారం.. మంత్రి నంది కుమారుడిగా చూపించి సైబర్ దుండగులు మోసం చేశారు. మంత్రి కుమారుడిలా నటిస్తూ… “నేను బిజినెస్ మీటింగ్‌లో ఉన్నాను. డబ్బు కావాలి. త్వరగా డబ్బులు పంపండి.”అని చెప్పాడు సైబర్ నేరగాడు. దీంతో మంత్రి కుమారుడు డబ్బులు బదిలీ చేయమని అడుగుతున్నట్లు గుర్తించిన అకౌంటెంట్ సైబర్ దుండగులు ఇచ్చిన నంబర్‌కు నగదు బదిలీ చేశాడు. అకౌంటెంట్ డబ్బును ఒకటి కాదు మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. మోసగాళ్లకు డబ్బును బదిలీ చేసిన తర్వాత.. అతను డబ్బు పంపిన నంబర్లు మంత్రికి లేదా అతని కుమారుడికి సంబంధించినవి కాదని గుర్తించాడు. అతను భయపడి సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయమై సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇండియా-మయన్మార్ సరిహద్దులో నత్తనడకన ఫెన్సింగ్ పనులు.. కారణమేంటంటే?
1643 కిలోమీటర్ల పొడవైన భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందులో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో అతిపెద్ద సమస్య ఒకటి. అంటే ప్రవేశించలేని ప్రాంతాల్లో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయడానికి కూలీలు సులభంగా అందుబాటులో ఉండరు. దీని కారణంగా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసే ఈ పని ఊపందుకోవడం లేదు. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ కోసం పని చేయవద్దని ఆయా ప్రాంతాల్లోని పలు సంస్థలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. 1643 కి.మీ మేర విస్తరించి ఉన్న భారత్-మయన్మార్ సరిహద్దులో 520 కి.మీ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్, 510 కి.మీ మిజోరం, 398 కి.మీ మణిపూర్, 215 కి.మీ ప్రాంతం నాగాలాండ్‌లో కలుస్తుందని భద్రతా సంస్థలు తెలిపాయి. ఈ సరిహద్దు ప్రాంతాలన్నింటిలో ఫెన్సింగ్ పనులు జరగాల్సి ఉంది. కానీ ఈ ప్రాంతాల్లోని రోడ్లు, పర్వతాలు, నదులు కూడా ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆటంకంగా మారుతున్నాయి. ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్లు అందుబాటులో ఉన్నా, కూలీలు అంత తేలికగా దొరకడం లేదు.
చైనాకు షాక్.. భారత్‌తో బలమైన సంబంధాల కోసం శ్రీలంక ప్రయత్నాలు!
శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకేకు పార్లమెంటులో మెజారిటీ లభించింది. ఇది ఆయన ఆర్థిక సంస్కరణల ఎజెండాను బలోపేతం చేసింది. భారతదేశంతో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, భారత హైకమిషనర్ సంతోష్ ఝాతో దిసానాయకే సమావేశమయ్యారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ సహకారం కోరారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఈ చర్యకు చైనా ఖచ్చితంగా షాక్ అయ్యింది. ఎందుకంటే చైనా చూపు నిరంతరం శ్రీలంకపైనే ఉంటుంది. అయితే శ్రీలంక కొత్త అధ్యక్షుడు భారత్‌కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో 225 స్థానాలకు గాను 159 స్థానాలను గెలుచుకోవడం ద్వారా దిసానాయకే పార్టీ ఎన్‌పీపీ అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు పోలైన ఓట్లలో 62 శాతం ఓట్లు దిసానాయకే పార్టీకి వచ్చాయి. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస పార్టీకి 18 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత, భారత హైకమిషనర్ సంతోష్ ఝా ట్విటర్‌లో ఒక పోస్ట్‌లో శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే పార్లమెంటరీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
సంజూ శాంసన్ భారీ సిక్స్.. మహిళా అభిమాని ముఖానికి తగిలిన బంతి.. వీడియో
దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ విచిత్రమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఒక మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. మరో రెండు మ్యాచ్‌లలో డకౌట్ కాగా.. చివరి మ్యాచ్‌లో మళ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో సంజూ బ్యాట్ ఝులిపించాడు. సంజూ శాంసన్ 56 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శాంసన్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ ఒక మాన్‌స్టర్ సిక్స్ కొట్టాడు. బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. ఆ బంతి గ్రౌండ్‌ను తాకిన అనంతరం వెళ్లి ఓ మహిళా అభిమాని ముఖంపై తాకింది. దాని కారణంగా ఆమె ఏడవడం ప్రారంభించింది. మహిళ బంతిని తగలడంతో సంజూ శాంసన్ కూడా కాస్త భయపడ్డాడు. అతని మొహం చూస్తుంటే చాలా పశ్చాత్తాపం పడుతున్నట్టు అనిపించింది.
అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన శ్రీలీల
టాలీవుడ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అమ్మడుకి కెరియర్ లో ఇప్పటి వరకు ధమాకా తర్వాత ఒక్క సక్సెస్ లభించలేదు. దీని తర్వాత ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్ అయ్యి ఉంటే అమ్మడి రేంజ్ మారిపోయేది. అయితే సినిమాలో ఆమె డాన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది కానీ మూవీ స్ట్రాంగ్ గా పబ్లిక్ కి నచ్చేలేదు. దీంతో శ్రీలీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె నితిన్ కి జోడీగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. అంతకంటే ముందు డిసెంబర్ 5న రిలీజ్ కాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగులో ఆమె కనిపించబోతోంది. రీసెంట్ ఈ సాంగ్ ను శ్రీలీల పూర్తి చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డాన్సర్స్ లలో ఒకడైన అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల ఈ సాంగ్ కోసం అదిరిపోయే స్టెప్పులు వేయడంతో అందరికి ఆసక్తి క్రియేట్ అయింది. ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్లు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేస్తుంటే చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ పూర్తి అయిన తర్వాత శ్రీలీల అల్లు అర్జున్ తో పాటు అతని భార్య స్నేహారెడ్డి, వారి పిల్లలకి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చింది. కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలని రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రాంలో వాటిని షేర్ చేసి శ్రీలీలకి థాంక్స్ చెప్పాడు. ఆమెని డ్యాన్సింగ్ క్వీన్ గా అభివర్ణిస్తూ అల్లు అర్జున్ స్టేటస్ పెట్టడం విశేషం. నువ్వు పంపించిన గిఫ్ట్స్ ఇప్పుడే చూశాను. అందులో నువ్వు రాసిన లెటర్ నా మనసుని తాకింది. నీ ప్రేమకి నా కృతజ్ఞతలు అంటూ బన్నీ మెన్షన్ చేశాడు. అలాగే ఆమె రాసిన లెటర్స షేర్ చేశాడు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా శ్రీలీల పంపించిన లెటర్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో స్నేహా రెడ్డి ఆతిథ్యానికి శ్రీలీల థాంక్స్ చెప్పింది. తనని అద్భుతంగా ఆదరించిన ఫ్యామిలీ మొత్తానికి శ్రీలీల లెటర్ థాంక్స్ చెప్పింది. ‘పుష్ప 2’ మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తూ ఉంటానని మరో లెటర్ కూడా అల్లు అర్జున్ కి పంపించింది.
సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ సింగర్స్..
ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కడం చూస్తూనే ఉన్నాం. స్టార్ డైరెక్టర్ క్రిష్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తన ప్రియురాలితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తాజాగా మరో సినీ సెలబ్రిటీ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆయన మరెవరో కాదు గాయకుడు అనురాగ్ కులకర్ణి. అవును ఈ స్టార్ సింగర్ చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చేశారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే ఆయన మరో స్టార్ సింగర్ ను పెళ్లాడారు. నిన్న సాయంత్రం (శుక్రవారం నవంబర్ 15) మరో గాయని రమ్య బెహరాను పెళ్లాడినట్లు తెలుస్తోంది. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనురాగ్ సన్నిహితులు కూడా ఈ ఫోటోను షేర్ చేస్తూ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన అనురాగ్ ‘ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8’లో విజయం సాధించి ఫేమస్ అయ్యాడు. రామ్ నటించిన ‘హైపర్’ సినిమాలోని ‘బేబీ డాల్’ పాటతో సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.