కనుమ ఎఫెక్ట్.. రద్దీగా మారిన నాన్ వెజ్ మార్కెట్లు..
సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నాయి పల్లెలు.. ఆటలు, పాటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గుండాటలు.. ఇలా అంతా కోలాహలంగా సాగుతోన్న పండుగ చివరి రోజుకు చేరుకుంది.. ఇక, కనుమ పండుగ సందర్భంగా నాన్‌వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.. చికెన్, మటన్, చేపలు ఇలా నాన్‌వెజ్‌ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివస్తున్నారు జనం.. కనుమ రోజు అతిధులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు గోదావరి జిల్లా వాసులు. . దీంతో.. నాన్‌వెజ్ అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాన్ వెజ్ మార్కెట్లలో రద్దీ వాతావరణం నెలకొంది. భోగి, సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్న జిల్లా వాసులు కనుమ రోజు నాన్‌వెజ్ వంటకాలతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో చికెన్, మటన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువైంది. ఫిష్ మార్కెట్లు బిజీగా కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ నుంచో తరలివచ్చిన అతిధుల కోసం ప్రత్యేక వంటకాలు చేసే పనిలో జిల్లా వాసులు నిమగ్నమయ్యారు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది..
మోహన్‌బాబు వర్సిటీకి మంచు మనోజ్.. MBU దగ్గర టెన్షన్, టెన్షన్..!
మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం ఇప్పుడిప్పుడే చల్లబడినట్టు కనిపిస్తోంది.. ఈ మధ్యే గతం గతహా.. నిన్న జరిగింది మార్చిపోవాలి, ఈ రోజు ఏం చేయాలో అది చేయాలంటూ మంచు మోహన్‌బాబు పేర్కొన్నారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ మొదలైంది.. నేడు మంచు మనోజ్ తిరుపతి పర్యటనకు వచ్చేస్తున్నారు.. ఇప్పటికే రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు మనోజ్.. ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు స్వాగతం పలికారు.. ఈ పర్యటనలో మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ రానున్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.. దీంతో.. మనోజ్ పర్యటన ఆసక్తికరంగా మారింది.. అయితే, మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటు ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు వున్నట్లు సమాచారం.. మరోవైపు.. యూనివర్సిటీలోనే భోగి, సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంచు విష్ణు.. నిన్నే బయల్దేరి వెళ్లిపోయారట.. ప్రస్తుతం క్యాంపస్‌లోనే ఉన్నారు మోహన్‌బాబు.. ఇప్పటికే పోలీసులకు కోర్టు ఉత్తర్వుల గురించి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. కానీ, మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గరకు మనోజ్ వస్తారనే సమాచారం.. ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది..
పండుగపూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.. అనారోగ్యంతో ఓ వృద్ధుడు కన్నుమూస్తే.. మద్యం సేవించి కుమారుడు, అతడి బామ్మర్ది గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట మండలం చామర్రు గ్రామంలో గౌతుకట్ల కోటయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడు అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు.. అయితే, అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మద్యం కొనుగోలు చేశారు మృతుని కుమారుడు నాగేశ్వరరావు, అతను బామ్మర్ది తెల్ల మేకల నాగేశ్వరరావు.. మద్యం సేవించి ఆ ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.. గంట వ్యవధిలో ఇరువురూ ప్రాణాలు విడిచారు.. దీంతో.. పండగ పూట ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో చామర్రులో విషాదం నెలకొంది.. అయితే, మద్యంలో గౌతుకట్ల నాగేశ్వరరావు, తెల్లమేకల నాగేశ్వరరావు ఎలుకల మందు కలుపుకుని తాగారనే ప్రచారం గ్రామంలో గుప్పుమంటోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత..
మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. తన కుమారుడు మంచు మనోజ్.. ఎంబీయూకు వస్తారన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించారు మోహన్‌బాబు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో.. పోలీసులకు ఆ కోర్టు ఉత్తర్తుల గురించి సమాచారం ఇచ్చారు మోహన్ బాబు.. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉన్నారు.. అయితే, మోహన్ బాబు సమాచారం మేరకు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. కాసేపట్లో మంచు మనోజ్.. ఎంబీయూ వద్దకు రానున్న నేపథ్యంలో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది..
సుప్రీంకోర్టులో పిటిషన్ విత్ డ్రా చేసుకున్న కేటీఆర్..
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. తాజాగా విచారణ జరిగింది. కేటీఆర్ తరఫున సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ముఖుల్ రోహిత్గి హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. “విచారణ ప్రాథమిక దశలోనే ఉంది.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేం.. ప్రత్యామ్నాయ మార్గాలు మీకు ఉన్నాయి కదా..” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కేటీఆర్ తరఫు న్యాయవాది క్వాష్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ముందుగానే స్పందించింది. ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసి, హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని కోరింది. పిటిషన్ విత్ డ్రా చేసుకోవడంతో ఏసీబీ, ప్రభుత్వం సఫలీకృతమయ్యాయి.
యుద్ధనౌకలు, జలాంతర్గామినీ జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
భారతదేశంలో అధునాతన యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఈరోజు నౌకలను నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ యుద్ధనౌకలతో భారత నేవీ బలం మరింత పెరిగినట్లైంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలనే టార్గెట్ దిశగా భారత్ ముందుకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారుతుందన్నారు. భద్రమైన సముద్ర మార్గాల కోసం ట్రై చేస్తున్నాం.. ఈ మూడు మేడిన్ ఇండియా.. మేము విస్తరణవాదంతో కాదు.. వికాసవాదంతో పని చేస్తున్నామని తెలిపారు. రక్షణ రంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతం అవుతోందని చెప్పారు. అలాగే, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అంటూ ప్రధాని పేర్కొన్నారు. ఇక, ఈ మూడు యుద్ధ నౌకలు భారత్‌కు మరింత శక్తినిస్తాయన్నారు. అంతర్జాతీయ కార్గో మార్గాలను భారత్ సురక్షితంగా కాపాడుతోంది. నేవీ బలోపేతం వల్ల ఆర్థికంగా ప్రగతి సాధిస్తామని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
జాతీయ జెండాకు నమస్కరించని ఆర్ఎస్ఎస్.. దేశం గురించి మాట్లాడుతుంది..
అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ ను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భగవత్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం.. అయితే, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దేశ ప్రజలందరినీ అవమానించారు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక, బ్రిటీష్ వారిపై పోరాడిన యోధులందరినీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కించపరిచారంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇకనైనా ఆర్ఎస్ఎస్ చేసే ఇలాంటి పిచ్చి మాటలు వినడం ఆపాలి అన్నారు. అయితే, కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. తమ పోరాటంలో న్యాయం ఉంది, దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం గురించి స్పందిస్తూ.. ఈ కొత్త భవనం పార్టీ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది అన్నారు.. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెందుతుంది అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఇంటిని సినిమా హాలులా మార్చే టీవీ వచ్చేసిందోచ్
ప్రపంచం మొత్తం టెక్నాలజీ విషయంలో ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే సినిమా హాల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అవును, మీరు చదివింది నిజమే. ఇందుకోసం TCL అనే కంపెనీ భారతదేశంలో సినిమా థియేటర్ సైజు లాగా ఏకంగా 115 అంగుళాల అతి పెద్ద స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీని పేరు ‘115X99 మాక్స్’. ఈ టీవీ ధర అక్షరాలా రూ.29,99,900. ఈ టీవీ కావాలంటే కాస్త భారీగానే ఖర్చు చేయాలి. ఈ టీవీని మీరు రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ టీవీలో ఉన్న ఫీచర్లు చూస్తే ఈ ధర కూడా తక్కువే అనిపిస్తుంది
ఏంటి భయ్యా.. ఆయనను కపిల్ దేవ్ అంత మాట అనేశాడు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, టీమిండియా మాజీ ఆటగాడు యోగ్‌రాజ్ సింగ్ మధ్య పాత వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. యోగ్‌రాజ్ సింగ్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై కపిల్ దేవ్ ఇచ్చిన స్పందన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్, కపిల్ దేవ్ తనను జట్టు నుండి అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. “కౌన్ హైన్?” అని సింపుల్‌గా ప్రశ్నించారు. యోగ్‌రాజ్‌ని గుర్తు చేయడానికి కొంత సమయం తీసుకున్న కపిల్ దేవ్, ఆ తరువాత “మరెవైనా ప్రశ్నలుంటే అడగండి” అని ప్రశాంతంగా చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెత్తిన వైరల్ గా మారింది. యోగ్‌రాజ్ సింగ్, కపిల్ దేవ్ తనను జట్టు నుండి తొలగించడానికి కారణం తనను అతను ఇష్టపడకపోవడమే అని ఆరోపించారు. అంతేకాకుండా, కపిల్ దేవ్ ఇంటికి తుపాకీతో వెళ్లినట్లు కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపాయి. కపిల్ దేవ్ యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలపై ప్రశాంతంగా స్పందించడం ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఆయన యోగ్‌రాజ్‌ను గుర్తు చేయడానికి కొంత సమయం తీసుకోవడం, ఆయన ఆరోపణలను తీవ్రంగా తీసుకోలేదని ఇట్టే అర్థమవుతుంది.
మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అంటూ పోస్ట్
ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్నస్ లాబుషేన్ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతను తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన భార్య రెబేకా గర్భవతి అని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోటీలను ఆయన షేర్ చేశారు. ఈ జంటకి ఇప్పటికే ఒక కూతురు ఉంది. లాబుషేన్ తన ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో.. వచ్చే ఏప్రిల్‌లో మా కుటుంబంలో మరో సభ్యుడు (అబ్బాయి) చేరబోతున్నాడు. మా కుటుంబం ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అని పేర్కొన్నారు. ఇకపోతే లాబుషేన్, రెబేకా ఇద్దరూ క్రిస్టియన్ కుటుంబాలకు చెందినవారు. వారిద్దరి పరిచయం బ్రిస్బేన్‌లోని గేట్‌వే బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగింది. చిన్న వయసు నుంచే వారు మంచి స్నేహితులు. కొంతకాలానికి వారి స్నేహం కాస్త ప్రేమగా మారి.. 2017లో వివాహం చేసుకున్నారు. ఇకపోతే, లాబుషేన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు కీలక ఆటగాడుగా ఉన్నాడు. ఆయన త్వరలో జరగబోయే శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడనున్నారు. లాబుషేన్ మాత్రమే కాకుండా, ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా త్వరలో తండ్రి అవుతున్నారు. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొద్ది రోజుల క్రితం తండ్రి అయ్యారు. ఇక లాబుషేన్ తన భార్య గర్భవతి అని తెలిపిన తర్వాత సోషల్ మీడియాలో జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు వారి కుటుంబానికి పెద్దెత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వెంకీ మామ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్.. ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందంటే
సంక్రాంతికి వస్తున్నాం మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు నమోదు చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తొలిరోజు ఈ సినిమా రూ.45కోట్లను కొల్లగొట్టింది. ఇప్పటి వరకు వెంకీ కెరీర్ లో ఫస్ట్ డే ఇంత కలెక్ట్ చేసిన మూవీ మరొకటి లేదు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన వెంకటేష్ సైంధవ్ మూవీతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం పదింతల వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఓవర్‌సీస్‌లోనూ కలెక్షన్లను కుమ్మేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నరేష్, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమాయో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. సినిమాకు పాటలు మంచి హైప్ తీసుకొచ్చాయి. భార్యభర్తల మధ్య ఉండే అపోహలు, గొడవలకు ఓ కిడ్నాప్ డ్రామాను జోడించి దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కథను రాసుకున్నాడు. లాజిక్స్‌తో సంబంధం లేకుండా ఆరంభం నుంచి ముగింపు వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో భార్యకు, మాజీ ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో వెంకీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించగా…మాజీ లవర్‌గా మీనాక్షి చౌదరి కనిపించింది.
ధూమ్ -4లో ప్రభాస్, అల్లు అర్జున్.. దుమ్ము రేపే క్రేజీ కాంబో కదా
ధూమ్ ఫ్రాంఛైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫ్రాంచైజీ పై భారతీయ ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి గురించి తెలిసిందే. ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇందులో ధూమ్ 2 పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం నమోదు చేసింది. అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, హృతిక్ రోషన్ నటించిన ధూమ్ 2 స్థాయి విజయం సాధించకపోయినా కానీ, ఫ్రాంఛైజీ చిత్రంగా అది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టింది. అయితే ధూమ్ చిత్రంతో జాన్ అబ్రహాం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అతడి నెగెటివ్ పాత్ర అందరినీ ఆకట్టుకోగా, అదే బాటలోనే హృతిక్, అమీర్ ఖాన్ కూడా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలను ఫ్రాంఛైజీలో కొనసాగించారు. ఫస్ట్ రెండు పార్టులకు సంజయ్ గద్వి దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ నటించిన మూడో భాగం మాత్రం విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చింది. ఇకపోతే ధూమ్ ఫ్రాంఛైజీ నుంచి ధూమ్ 4 తెరకెక్కనుందని తెలుస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ ఈసారి కూడా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం ఉంది. కానీ ఈ సినిమా కాస్టింగ్ విషయంలో బ్యానర్ ఎందుకో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ధూమ్ 4లో ప్రధాన పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి? అనే డైలమాలోనే చాలా కాలంగా ఉంది. నెగెటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర కోసం రణబీర్ కపూర్ ని ఎంపిక చేసుకుని ముందుకు సాగుతోంది ఈ బ్యానర్. యానిమల్ లాంటి పాన్ ఇండియా హిట్టు కొట్టిన రణబీర్ కి ధూమ్ 4లో ఛాన్స్ ఇవ్వడం యష్ రాజ్ బ్యానర్ తీసుకున్న సరైన నిర్ణయంగా భావించాలి.