టిడ్కో ఇళ్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి..
టిడ్కో ఇళ్లపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి నారాయణ.. అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై క్వశ్చన్ అవర్‌లో సభ్యులు ప్రశ్నలు వేశారు.. బ్యాంక్ లోన్ కట్టలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆవేదిన వ్యక్తం చేశారు సభ్యులు మాధవి రెడ్డి.. కొండబాబు.. సింధూర రెడ్డి.. జోగేశ్వర రావు.. లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సభ్యులు కోరారు.. వడ్డీలు కట్టలేక.. అటు అద్దె ఇళ్లల్లో ఉండలేక ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు.. ఇక, సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ.. టిడ్కో ఇళ్లపై క్లారిటీ ఇచ్చారు. 7 లక్షలకు పైగా ఇళ్లు టిడ్కోలో మంజూరు అయ్యాయి. 4 లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచాం.. వాటిలో గత ప్రభుత్వం కొన్ని ఇళ్లు రద్దు చేసిందని మండిపడ్డారు మంత్రి నారాయణ.. కేవలం గత ప్రభుత్వం 57 వేల ఇళ్ల నిర్మాణం చేసింది.. టిడ్కో ఇళ్లలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. రోడ్లు. పార్కులు. స్కూళ్లు.. షాపింగ్ కాంప్లెక్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అప్పట్లో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల దగ్గర ఎకనామిక్ ఆక్టివిటీ ఉండాలన్నారు.. 2 ఎకరాలు టిడ్కో ఇళ్ల కాంప్లెక్స్ దగ్గర ఉంచితే అది కూడా గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు.. ఇల్లు ఇవ్వకుండానే లోన్ తీసుకున్నారు. 77 వేల మందిపై గత ప్రభుత్వం లోన్ తీసుకుని ఇళ్లు ఇవ్వలేదు.. ప్రస్తుతం ప్రభుత్వం 140 కోట్లు బాంక్ లోన్ కట్టాలి. కొన్ని ఇళ్లను రద్దు చేసి వేరేవారికి గత ప్రభుత్వం ఇచ్చింది. వీటికి సంబంధించి కూడా మార్పులు చేస్తాం అన్నారు మంత్రి నారాయణ..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు పవిత్రంగా భావించే.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింటి సిట్.. ఇక, కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్ బృందం.. అయితే, సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారులో ఆందోళన మొదలైంది.. మార్కెటింగ్ విభాగంలో పనిచేసి ఆక్రమాలుకు పాల్పడిన అధికారులుపై చర్యలకు సిద్ధం అవుతోంది సిట్.. కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్ వేశారు..
సాయిరెడ్డిపై అమర్నాథ్ కౌంటర్ ఎటాక్.. ఆత్మ పరిశీలన చేసుకోండి..!
విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్.. విజయసాయిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించిన ఆయన.. మొన్నటి వరకు సాయిరెడ్డి చెప్పిన పూజారుల్లో ఆయన ఒకరు కదా…? అని ప్రశ్నించారు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది… జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి.. అది ప్రతీ వ్యవస్థలో భాగం.. మొన్నటి వరకు కోటరీలో వున్న సాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని ఫైర్ అయ్యారు.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఇంత కంటే గొప్పగా మాట్లాడతారని భావించలేం అంటూ సాయిరెడ్డిపై సెటైర్లు వేశారు అమర్నాథ్.. మరొకరి మీద ప్రేమ పుడితేనే మనసులు విరిగిపోతాయి.. రాజీనామా తర్వాత ఇక ఏ రాజకీయ పార్టీలో చేరనని చెప్పిన మాటలకు నిన్నటి వ్యాఖ్యలకు తేడా కనిపించిందన్నారు. 2024లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి వుంటే ఇప్పుడు వెళ్లిపోయిన వాళ్లు.. ఎలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు.. ఈ విధంగా స్పందించే వాళ్లా..? అని నిలదీశారు.. ప్రతీ మంగళవారం అప్పులు చెయ్యడం కోసం బటన్ నొక్కుతున్నారు.. తప్ప ప్రజలకు మేలు చేసేందుకు మాత్రం చంద్రబాబుకు చేతులు రావడం లేదన్నారు.. ఎన్నికల కోడ్ కారణంగా మా ప్రభుత్వం హయంలో విద్యాదీవెన ఒక్క క్వార్టర్ మాత్రమే పెండింగ్ వుంది… 4 వేల 500 కోట్లు తక్షణం విడుదల చెయ్యాలని తల్లిదండ్రులు, విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో అధికార, విపక్షలతో పాటు ప్రభుత్వ పక్షం అనే టీమ్ ఒకటి తిరుగుతోంది.. అటువంటి బ్యాచ్ లకు అధికారంలో ఉన్న వాళ్లు తప్ప రాజకీయాలతో సంబంధం ఉండన్నారు..
దండం పెట్టి, గుంజీలు తీసిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్..
విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి మండలం పెంటగ్రామలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణ ఆవేదన ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. పిల్లలు ఏమీ చదవడం లేదని.. అక్షరం ముక్క కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆ ప్రభుత్వ టీచర్.. మీకు మేము ఏమీ చేయలేకపోతున్నందుకు నాకు నేనుశిక్షించుకుంటున్నానంటూ.. పిల్లలను క్షమాపణ కోరుతూ మేం ఏమి చేయలేం నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వాళ్లకి బుద్ధి నేర్పే పద్ధతిలో మేం చెప్తే మా పైన అధికారులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారు.. మేం ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మమ్మల్ని క్షమించండి అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండం పెట్టారు.. స్టేజ్‌పై గుంజీలు తీశారు.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నందుకే ఈ విధంగా గుంజీలు తీసున్నానని పేర్కొన్నారు.. మేం కొట్టలేం.. తిట్టలేం.. ఏమీ చేయలేం.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. అంటూ ఆ హెచ్‌ఎం చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.. దీంతో.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది..
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వల్లభనేని వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.. బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు వంశీ తరుపున న్యాయవాది సత్య శ్రీ.. ఇక, ఈ కేసుకు వంశీకు ఎలాంటి సంబంధంలేదని కూడా వాదించారు.. ఇది కేవలం రాజకీయంగా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందని.. అందుకే వంశీపై కేసుపెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు.. ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించింది ప్రభుత్వం.. వంశీ తరపుపు న్యాయవాది వాదనలు ముగిసిన తర్వాత.. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు..
అసెంబ్లీలో ఉద్రిక్తత.. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండడు స్పీచ్.. 15 నెలల పాలననీ.. 36 నిమిషాల్లో చదివేశారు.. రైతులకు రుణమాఫీ చేశారా..? అని ప్రశ్నించారు. మహా లక్ష్మీ పథకాన్ని అమలు చేశారా?.. రైతు కూలీలకు 12 వేలు రూపాయలు ఇచ్చారు మీరు?.. అధికారం కోసం లక్షల అబద్ధాలు చెప్పారు మీరు.. తొందర పడొద్దని జగదీష్ రెడ్డి అడిగారు. ఇక, జగదీష్ రెడ్డికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మా ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల రుణా మాఫీ చేసింది అన్నారు. పేదలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అమలులో ఉంది.. అవన్నీ ఆయనకు కలిపించడం లేదు అన్నారు. అలాగే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు మూడు ఎకరాల ఇస్తాం అన్నావు ఇచ్చావా అని ప్రశ్నించారు. దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే లేకుండా చేశారు.. డబుల్ బెడ్ రూం ఇచ్చావా.. లక్ష అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన మీరు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. దీంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. మంత్రులు ఇలా మద్యలో అడ్డొచ్చి.. నువ్వెంత..నేను ఎంత అనుకుంటే సభ నడుస్తదా అని అడిగారు.
స్పీకర్ ను అవమానపరిచినందుకు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..
తెలంగాణ అసెంబ్లీ మాజీ మత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. బీఆర్ఎస్ అహంకారం ఇంకా తగ్గలేదు.. బీఆర్ఎస్ పార్టీకి దళిత స్పీకర్ పై గౌరవం లేదు అన్నారు. దళిత స్పీకర్ కాబట్టే నువ్వు అంటూ సంభోదిస్తున్నారు.. దళిత స్పీకర్ కాబట్టే ఏకవచంతో పిలుస్తున్నారు అని మండిపడింది. గతంలో గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు ఆయన కాళ్ళు మొక్కే వాళ్ళు.. బీఆర్ఎస్ నాయకులకు మహిళా గవర్నర్ అంటే గౌరవం లేదు.. ఆదివాసీ రాష్ట్రపతి అంటే గౌరవం లేదు… బీఆర్ఎస్ నాయకుల అహంకారం ఇంకా ఎప్పుడు తగ్గుతుందో మరి అని సీతక్క అన్నారు. ఇక, స్పీకర్ ప్రసాద్ కుమార్ ను అవమానిస్తూ మాట్లాడిన జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.. గవర్నర్ ను స్పీకర్ ను అవమానిస్తున్నారు.. కేసీఆర్ చుట్టపు చూపుగా 6 నెలలకు సభకు వచ్చిండు.. సీఎం రేవంత్ రెడ్డి దమ్మున్న ముఖ్యమంత్రి.. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ప్రతి ఊరు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని చెప్పాడు.. తీసుకుంటే సిగ్గు పోతుందని దొంగ దారిలో సభను రద్దు చేశారు అని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీ దక్షిణాదిపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమొళి, రాజాలు సమావేశం అయ్యారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం గురించి నేతలు చర్చించనున్నారు. ఈ నెల 22వ తేదీన చెన్నైలో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ కు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ పగబట్టింది అని విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతోంది.. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం.. ఈ నెల 22వ తేదీన స్టాలిన్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటాం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కోల్‌కతాకు తుఫాన్ ముప్పు.. మరో 18 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
కోల్‌కతాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఇరాక్-బంగ్లాదేశ్ కేంద్రంగా తుఫాన్ ఏర్పడిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్ సహా మరో 18 రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది. తుఫాన్ కారణంగా ఉత్తర భారతదేశంతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 15 వరకు జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో హిమపాతంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సుంది. మార్చి 13న పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. ఇక మార్చి 15 వరకు రాజస్థాన్‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే తూర్పు రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో మార్చి 15 వరకు వర్షాలు కురుస్తాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం సంభవించవచ్చని పేర్కొంది.
వెలుగులోకి రన్యారావు వాంగ్మూలం.. భలే కట్టుకథ అల్లిందే?
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావుకు సంబంధించిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం బెయిల్ పిటిషన్‌పై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం ఎదుట అధికారులు ఉంచారు. యూట్యూబ్ చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నట్లు తెలిపింది. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఉండగా ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని.. బంగారాన్ని బెంగళూరు డెలివరీ చేయాలని చెప్పినట్లుగా అధికారులకు తెలిపింది. రెండు ప్లా్స్టిక్ కవర్లలో బంగారాన్ని ఇచ్చారని.. దాన్ని దాచేందుకు బ్యాండేజ్‌లు, కత్తెర సమీపంలో ఉన్న స్టేషనరీలో కొనుగోలు చేసినట్లు తెలిపింది. రెస్ట్‌రూమ్‌కు వెళ్లి బంగారం బిస్కెట్లను అతికించుకున్నట్లు తెలిపింది. ఇదంతా యూట్యూబ్ చూసే నేర్చుకున్నట్లు వాంగ్మూలంలో తెలిపింది. అయితే బంగారం ఇచ్చిన వ్యక్తి మాత్రం తనకు తెలియదని.. అతడి భాషను బట్టి ఆఫ్రికన్-అమెరికన్‌లా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇంతకముందు ఎప్పుడు బంగారం తీసుకురాలేదని.. ఇదే తొలిసారి అని పేర్కొంది. బెంగళూరు ఎయిర్‌పోర్టులోంచి బయటకు వచ్చాక.. ఒక ఆటోలో పెట్టేసి వెళ్లిపోవాలని చెప్పారని అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు తెలిపింది.
గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పసిడి కనీవినీ ఎరుగని రీతిలో పెరిగి.. భారత మార్కెట్‌లో కొత్త రికార్డులు నెలకొల్పింది. నేటికీ బంగారం పెరుగుదల ఆగడం లేదు. ఈ క్రమంలోనే 89 వేలకు చేరువైంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.490 పెరగగా.. నేడు రూ.600 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.450, రూ.550 పెరిగింది. గురువారం (మార్చి 13) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,580గా.. 22 క్యారెట్ల ధర రూ.81,200గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండో రోజు సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి. కిలో వెండిపై నిన్న 2 వేలు పెరగగా.. ఈరోజు వెయ్యి పెరిగింది. గురువారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,01,000గా కొసనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 10 వేలుగా ఉంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,01,000గా నమోదైంది. బంగారం, వెండి ధరలు ఆయా రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ ధరలు ఈరోజు ఉదయం 10 గంటలకు నమోదయ్యాయి.
ఆశలు రేకెత్తిస్తున్న కొత్త కెప్టెన్.. ఈసారి పంజాబ్ రాత రానేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కప్ కొట్టని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నా.. ఇప్పటివరకు టైటిల్ ముద్దాడలేదు. ఆరంభ సీజన్‌లో సెమీస్ చేరిన పంజాబ్.. 2014లో ఫైనల్ చేరి కోల్‌కతా చేతిలో ఓటమిపాలైంది. ఈ రెండు ప్రదర్శనలు మినహాయిస్తే.. మరోసారి కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోయింది. ప్రాంచైజీ పేరు మార్చినా, వేర్వేరు కెప్టెన్లను ప్రయత్నించినా ఫలితం మాత్రం లేకపోయింది. ఇటీవలి సీజన్లలో పేలవ ప్రదర్శన కారణంగా.. సగటు అభిమానికి ప్లేఆఫ్స్ అంచనాలు కూడా పంజాబ్ జట్టుపై లేకుండా పోయాయి. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో జట్టులో జరిగిన భారీ మార్పులు పంజాబ్ రాత మారేలా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024లో కోల్‌కతాకు టైటిల్ అందించిన భారత స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. వేలంలో అతడిని రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ పంజాబ్ జట్టు యజమానుల ఆశలు రేకెత్తిస్తున్నాడు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. గత ఏడాది కోల్‌కతా కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టడం ఒకటైతే.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో సూపర్ ఫామ్‌లో ఉండడం రెండోది. ఫామ్ లేమితో తంటాలు పడిన సమయంలో దేశవాళీల్లో రాణించి.. భారత జట్టులోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలవడంలో శ్రేయస్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న శ్రేయస్.. పంజాబ్ జట్టును ముందుండి నడిపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. సహచరుల నుంచి మంచి ప్రదర్శన రాబట్టడం శ్రేయస్ ప్రత్యేకత.
ఈ మంగపతి గుర్తుండిపోతాడు..!
హీరో శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం అవకాశాలు తగ్గడంతో ఆయన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొన్ని సంవత్సరాలు ఆయన కృషి చేశారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ షో ద్వారా ఆయన వ్యక్తిత్వం చూసి అనేకమంది ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఆయనకు అభిమానులు గా మారిపోయారు. ఇక ఈ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ‘#90స్’ అనే వెబ్ సిరీస్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి శివాజీ తాజాగా నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో రూపొందించిన ‘కోర్ట్’ అనే సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మర్చి 14న విడుదల కానుంది. కానీ తాజాగా ఈ సినిమాను మీడియాకు రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. కాగా ఈ మూవీ లో మంగపతి అనే పాత్రలో శివాజి నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పవచ్చు. స్క్రీన్ మీద శివాజీ కనపడిన ప్రతిసారీ ఆయన నటన, ఆయన డైలాగ్ డెలివరీకి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అంతేకాక ఒక్కోసారి శివాజీ నటన చూసి చప్పట్లు చరుస్తూ అభినందిస్తున్నారు. అంటే దీని బట్టి ఆయన ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. విశ్లేషకులు సైతం తమ రివ్యూస్ లో శివాజీ నటన గురించి ప్రస్తావిస్తున్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం అందరూ చేస్తున్నారు. కానీ ఇలాంటి ఒక సాలిడ్ పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వడం శివాజీకే చెల్లిందేమో. శివాజీ పాత్రకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వడం పక్క. ఇక ఈ పాత్ర దెబ్బతో శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లో మరికొన్ని పాత్రలు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్‌ని క్వశ్చన్ చేసిన నెటిజన్
ఒక్కప్పుడు ప్రేక్షకాభిమానులు హీరో, హీరోయిన్స్ ని కలవాలి, మాట్లాడాలి అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. సినిమాలో చూడటం తప్పించి నేరుగా వారిని చూడటం చాలా తక్కువ. ఇప్పుడు రోజులు మారిపోయాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత నటినటులు అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. కానీ ఒక్కోసారి ఆ మాటలు సెలబ్రెలకు తలనొప్పిగా కూడా మారుతాయి. ఎందుకంటే నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు నోటికొచ్చింది అడిగేస్తారు. ఇలాంటి టైంలో సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా హీరోయిన్‌లకు ఈ సోషల్ మీడియా ఓ వేదికే కాదు, పలు సందర్భాల్లో వారికి ఇబ్బందికరమైన అనుభవాలకూ కూడా కారణమవుతుంది. సినిమాల్లో ఎంత బోల్డ్‌గా కనిపించినా, వ్యక్తిగతంగా కొన్ని హద్దులు ఉండాలని భావించే హీరోయిన్ల కూడా ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ మాళవిక మోహనన్ ఒక్కరు. తమిళం నుంచి బాలీవుడ్ వరకు తన అందంతో, నటనతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కెరీర్ పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మళవిక. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రీసెంట్‌గా ఆమె ఓ ట్విట్టర్ సెషన్‌లో ముచ్చటించగా అందులో ఫ్యాన్స్ కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగితే, మరికొంతమంది మాత్రం హద్దులు మీరేలా ప్రశ్నలు అడిగారు. ఓ నెటిజన్ తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే, ఇంతలోనే మరో నెటిజన్ మరింత దారుణం.. ‘మీరు వర్జినా?’ అంటూ ప్రశ్నించాడు. ఇది చూసి మాళవిక షాక్ అయ్యింది. ‘ఇలాంటి అసభ్యకరమైన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. చెత్త ప్రవర్తన మానేయండి’ అంటూ తిప్పికొట్టింది.