NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

గంజాయి డోర్‌ డెలివరీ.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ అరెస్ట్..
గంజాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అరెస్ట్‌ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. కొర్లగుంట మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఘా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన సత్తుపతి శ్రీనివాసరావుగా గుర్తించారు. అతను స్థానిక మారుతీనగర్‌లో ఉంటూ.. స్విగ్గీ బాయ్ గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన యువకుడు అక్రమ సంపాదన కోసం గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పూనుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి తిరుపతికి తీసుకొచ్చే పరిచయస్తుల ద్వారా కిలో 10 వేలకు కొనుగోలు చేస్తాడు. చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 300 చొప్పున తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తాడు. యువతను మత్తుకు బానిసలుగా మార్చుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. అలవాటు పడ్డవారు ఫోన్ చేస్తే నేరుగా ఇంటికే తీసుకెళ్లి అందిస్తున్నాడు. స్విగ్గీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాది నాల్గోసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత..
ఈ ఏడాది కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లను ఈ ఏడాదిలో ఈ రోజు నాల్గోసారి ఎత్తారు నీటిపారుదలశాఖ అధికారులు.. ఇన్‌ఫ్లో తగ్గడంతో బుధవారం రోజే శ్రీశైలం గేట్లను మూసివేశారు అధికారులు.. అయితే, మరోసారి క్రమంగా వరద ఉధృతి పెరడంతో.. ఈ రోజు శ్రీశైలం డ్యామ్‌లోని ఒక గేటును ఎత్తారు.. ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు నీటిని విడిచిపెడుతున్నారు.. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో నాలుగోవ సారి రేడియల్ క్రెస్టు గేట్‌ ఎత్తివేశారు అధికారులు.. జలాశయం ఒక గేట్‌ 10 అడుగులు మేర ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,38,833 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 96,081 క్యూసెక్కులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే.. ప్రస్తుతం నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది.. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 212.9198 టీఎంసీలుగా ఉంది.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.. మొత్తంగా.. ఇన్ ఫ్లో రూపంలో ప్రాజెక్టులోకి 1,38,833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఒక గేటు ఎత్తడం.. జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 96,081 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తోంది..

ఏపీ మంత్రికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం..
ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది.. విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలోని భూసాయవలస వద్ద మంత్రి సంధ్యారాణి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం సంభవించింది.. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో.. ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం.. ఓ వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురుతోపాటు ఇద్దరు గన్‌మెన్లకు.. మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.. ఇక, వెంటనే క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు మంత్రి సంధ్యారాణి.. మెంటాడ మండలం తమ్మి రాజుపేట గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి తల్లి మరణించడంతో పరామర్శించడానికి బయల్దేరి వెళ్లారు మంత్రి సంధ్యారాణి.. కానీ, భూశాయవలస – ఆరికతోట మధ్యలో మంత్రి కాన్వాయ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది..

బిల్లులు చెల్లించండి.. ప్రభుత్వ పాఠశాలకు తాళాలు వేసిన కాంట్రాక్టర్..
కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ తాళాలు వేసిన ఘటన సంచలనంగా మారింది. బిల్డింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు తాళాలు తీయమని తేల్చి చెప్పాడు. పాఠశాల యాజమాన్యం ఎంత చెప్పిన కాంట్రాక్టర్‌ మాటలు పట్టించుకోలేదు. పిల్లలు ఎండలో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని, కొద్దిరోజులు గడువు ఇవ్వాలని యాజమాన్యం కోరిన కాంట్రాక్టర్‌ పాఠశాలకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆరు, ఏడు తరగతి విద్యార్థులకు చెట్ల కింద కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్నోసార్లు డిఇఓ దృష్టికి తీసుకెళ్లిన ప్రిన్సిపల్ ఫలితం లేదని చెప్పాడని వాపోయారు. పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు తాళం వేయడం వలన విద్యార్థులు ఎండలో అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వ అధికారులు పట్టించుకుని కాంట్రాక్టర్‌ తో మాట్లాడి పాఠశాలను తిరిగి తెరిపించాలని కోరారు. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని కోరుతున్నారు. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.

ముంబైలో హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్.. బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు! (వీడియో)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సొంత దేశం సెర్బియాకు నటాషా వెళ్లిపోయారు. అక్కడే తన కుమారుడు అగస్త్య నాలుగో బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలోనే ఉన్న నటాషా.. గతవారం ముంబైలో అడుగుపెట్టారు. ముంబైలో దిగగానే కుమారుడు అగస్త్యను తన మాజీ భర్త హార్దిక్ పాండ్యా వద్ద వదిలిన నటాషా స్టాంకోవిక్.. బాయ్‌ఫ్రెండ్‌ అలెక్సాండర్‌ ఇలాక్‌తో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. వైట్‌ జాకెట్‌ వేసుకున్న నటాషా.. రాత్రి వేల ఓ జిమ్‌ వద్ద ఫొటోగ్రాఫర్లకు చిక్కారు. అలెక్సాండర్‌ చీర్స్ చెబుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం నటాషా స్వయంగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ : హేమా
బెంగుళూరు రేవ్ పార్టీ కేస్  ఛార్జ్ షీట్ లో నటి హేమా పేరును చేర్చారు పోలీసులు.  హేమతో పాటు మరో  88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో హేమా పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ ఛార్జ్ షీట్ పై స్పందించిన హేమా.. Ntv తో ఫోన్ లో మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, బెంగళూరు పోలీసుల ఛార్జ్ షీట్ లో నా పేరు వచ్చినట్టు ఇప్పుడే  తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం, పోలీసుల చార్జ్ షీట్ నాకు వచ్చాక నేను దీనిపై స్పందిస్తాను, నాకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటివ్ అని చార్జ్ షీట్ లో వేశారు. MDMA నేను డ్రగ్స్ తీసుకోలేదు. కొన్ని మీడియా సంస్థల వల్ల నా పేరు ఛార్జ్ షీట్ లో పెట్టారు” అని తెలిపింది హేమా.

ఎన్టీఆర్ పై అభిమానం చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఈ పేరు అంటేనే ఆయన అభిమానులకు ఓ వైబ్రేషన్. ఎన్టీయార్ ఈ సెప్టెంబరు 2న ఫ్యామిలీతో కలిసి కుటుంబంతో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్ళాడు. కర్ణాటకలోని తారక్ అమ్మ షాలిని సొంత ఊరు కుందపురాలోని ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే కేశవనాథేశ్వర స్వామి దర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. తారక్ తో పాటు హోంబాలే ఫిలింస్ నిర్మాత కిరంగదూర్, కన్నడ నటుడు రిషబ్ శెట్టి, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, అయన సతీమణి, సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ కుడా ఉన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ రవి బస్రూర్‌ స్టూడియోకు వెళ్ళాడు. తన అభిమాన నటుడు తన స్టూడియోలో మొదటి సారి అడుగు పెట్టినందుకు ఆనందం వ్యక్తం చేసిన రవి తనదైన శైలి సాంగ్‌ కంపోజ్ చేసి తారక్ కు కానుకగా ఇచ్చారు.‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ తారక్ పై ఓ పాటతో అభిమానాన్ని చాటుకున్నారు రవి బస్రూర్‌. ప్రస్తుతం ఈ సాంగ్ ను తారక్ ఫ్యాన్స్తెగ షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి రవి బస్రూర్‌ మ్యూజిక్ అందించనున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం తారక్ దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దేవర రిలీజ్ తర్వాత ఎన్టీఆర్-నీల్ సినిమా పట్టాలెక్కునుంది. తారక్ తో సినిమా పూర్తి చేసుకున్న తరువాతే ప్రశాంత్ నీల్ సలార్ 2 పై దృష్టి పెట్టనున్నాడు

ప్లీజ్ డాక్టర్స్.. ‘దేవర’ చూసేవరకైనా నన్ను బతికించండి: ఎన్టీఆర్‌ అభిమాని
‘ప్లీజ్ సర్.. దేవర చిత్రం చూసేవరకైనా నన్ను బతికించండి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ వీరాభిమాని ఒకరు డాక్టర్లను కోరుతున్నాడు. గత కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్‌ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్‌ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నాడు. దేవర చిత్రంను చూడడమే కౌశిక్‌ చివరి కోరిక. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్‌ ఫాన్స్, నెటిజెన్స్.. అతడి కోరిక నెరవేరావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్‌ అంటే కౌశిక్‌కు చిన్నప్పటినుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తెలిపారు. ‘చిన్నప్పటినుంచి ఎన్టీఆర్‌ అంటే కౌశిక్‌కు చాలా ఇష్టం. నా కొడుకు బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అయినా కూడా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడు. సెప్టెంబర్‌ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. దేవర చూడడమే కౌశిక్‌ ఆఖరి కోరిక’ అని ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.