డయల్ 100కు ఫోన్.. సీఎంను గంటలో చంపుతానంటూ వార్నింగ్..!
లిక్కర్‌లో రకరకాల ప్లేవర్స్.. టేస్టులు ఉన్నట్టుగానే.. మందు బాబుల్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి.. మందు లోపలికి వెళ్లిన తర్వాత.. తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నేవాళ్లు కొందరైతే.. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా వేలు పెట్టేవారు మరికొందరు.. ఇంకా కొందరైతే.. తన గురించి.. తానే గొప్పగా ఊహించుకుంటారు.. ఇంకా కొందరు గమ్మున ఉంటే.. మరికొందరు.. పక్కనోడిని గెలికేస్తుంటాడు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే. మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా సీఎంను గంటలో చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు.. మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన నాగేశ్వరరావు ఫుల్లుగా మందుతాగి.. డయల్ 100కు ఫోన్ చేశాడు. గంటలో సీఎంను చంపుతానని చెప్పాడు. దీంతో ఫోన్ కాల్ వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే, కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయాలు ఇస్తానని మీడియేటర్ మోసం చేశాడట.. 4 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి మోసం చేశాడని పొంతనలేని సమాధానం చెప్పడంతో నాగేశ్వరరావును ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు పోలీసులు..
ప్రపంచమంతా మళ్లీ భారతీయ వైద్య విధానం వైపు..
ప్రపంచమంతా మరలా భారతీయ వైద్య విధానం వైపు చూస్తుందన్నారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఆయూష్ డాక్టర్ల ఆత్మీయ సన్మానంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆయుష్ డాక్టర్ల స్టైఫండ్ ను పెంచిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.. ప్రపంచమంతా మరలా భారతీయ వైద్య విధానం వైపు వస్తోందని.. ఆయుష్ కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని పేర్కొన్నారు.. 2.5 కోట్ల మంది మన రాష్ట్రంలో ఒకేరోజు యోగా చేసేలా ఏపీ ప్రభుత్వం చేసింది.. విజయవాడ ఆయుర్వేద కాలేజీ అభివృద్ధికి 3 కోట్లు ఇచ్చాం.. కాకినాడ, విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నాం అన్నారు సత్యకుమార్.. ఇక, 2021 నుంచి 2024 వరకు మూడు ఆర్ధిక సంవత్సరాలు ఆయుష్ నిధులకు ప్రతిపాదనలే పంపలేదు అని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు సత్యకుమార్ యాదవ్.. ధర్మవరంలో కొత్త ఆయుష్ కాలేజీ రాబోతోంది.. 34 ప్రొఫెసర్లను, 54 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ఆయుష్ లో నియామకం చేస్తున్నాం అని వివరించారు.. సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ ను అమరావతిలో నిర్మించబోతున్నారు.. గత ప్రభుత్వం రీసెర్చ్ సెంటర్ కు ఇచ్చిన స్ధలాన్ని వైఎస్ఆర్ కాలనీకి ఇవ్వడానికి లాక్కున్నారని మండిపడ్డారు.. అయితే, కేరళకు రాబోయో రోజుల్లో ఏపీని మోడల్ గా మార్చాలని సూచించారు.. స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద 166 కోట్లు ఆయూష్ కు ఏర్పాటు చేసాం.. 100 మంది ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను నియమిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తా..!
ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తా అని వ్యాఖ్యానించారు ఎంపీ సీఎం రమేష్.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం చూడలేక వైఎస్ జగన్ భయంకర వాతావరణ సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు పోయినా ఇంకా జగన్ మారలేదన్నారు.. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న ఆయన.. గుజరాత్‌లో విజయవంతంగా నడుస్తున్న PPP విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తుందన్నారు.. 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న అయ్యన్నపాత్రుడు గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్పీకర్ అయ్యన్నపాత్రుని ఎదుర్కొనే ధైర్యం ఉంటే జగన్ ఒకసారైనా అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు.. నీ కోసం ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరతానని తెలిపారు సీఎం రమేష్.. వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తే తన ప్రభుత్వంలో చేసిన అక్రమాలు బయటపడతాయన్న భయం ఉందని దుయ్యబట్టారు.. అసెంబ్లీని ఫేస్ చేయలేని ప్రతిపక్ష నాయకుడు జగన్ అని సెటైర్లు వేశారు.. అయితే, జగన్ ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్తే నేను జగన్ కు సెల్యూట్ చేస్తా అని ప్రకటించారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్..
సుప్రీంకోర్టులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్‌కు నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఆ తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.. కాగా, అక్రమ మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. దీంతో, విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్ర, సిద్ధార్థ అగర్వాల్.. వాదనల తర్వాత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులోకీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నివేదిక తమకు ఇవ్వటం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయేషా మీరా పేరెంట్స్ పిటిషన్ వేయగా విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయినా సీబీఐ నివేదిక ఇవ్వకపోవడంతో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు ఆయేషా మీరా తల్లిదండ్రులు.. దీంతో, విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఈ నెల 31వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ.. విచారణ వాయిదా వేసింది. కాగా, ఆయేషా మీరా హత్య కేసు పై సీబీఐ నమోదు చేసిన రెండు FIRలు, DNA నమూనాలు, సాక్షుల స్టేట్‌మెంట్లు అన్నీ ఇస్తేనే అభ్యంతరాలు వ్యక్తం చేయగలమని కోర్టుకు తెలిపారు ఆయేషా మీరా పేరెంట్స్.. సాక్ష్యాల ధ్వంసంపై నమోదైన FIR తమకు సంబంధం లేదని సీబీఐ చెబుతున్నట్టు కోర్టుకు తెలిపారు ఆయేషా మీరా తరఫు లాయర్..
బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా.. రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్..
హైడ్రా బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో కేటాయించింది ప్రభుత్వం. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకొని పహరా కాస్తున్నాడు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. అనేక నివప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజ
తమిళనాడులో అవయవాల అక్రమ రవాణా కేసు.. సీబీఐ వద్దు సిట్తోనే విచారణ
తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అవయవాల అక్రమ రవాణా, అక్రమ కిడ్ని మార్పిడి కేసులపై సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు ఈరోజు ( అక్టోబర్ 10న) నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎలాంటి జోక్యానికి అర్హమైనది కాదని, దాని పరిశీలనలు ఇతర అధికారుల పనితీరు లేదా ప్రవర్తనపై ఎటువంటి ప్రభావం చూపవని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక, సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు, దాని కూర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని తమిళనాడు సర్కార్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. సిట్ కు ఎంపికైన అధికారులు వేర్వేరు జిల్లాలకు చెందినవారు, దీని వల్ల వారు ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టమవుతుంది.. విచారణ సమయంలో సిట్ లోని అధికారులు 200–300 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు.
భారతీయులకు ట్రంప్ మావా మరో షాక్.. హెచ్-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు
కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు ఇప్పటికే భారత్‌లోని ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమయంలో హెచ్-1బీ వీసాలో మరిన్ని మార్పులు చేసేందుకు ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ‘రిఫార్మింగ్ ది హెచ్-1బీ నాన్‌ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్’ కింద ఈ కొత్త ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదు అయ్యాయి. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల మేరకు.. వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై, థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి పెట్టింది. ఈ మార్పులు హెచ్-1బీ వీసాతో యూఎస్ కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పించడం కోసం తీసుకొచ్చిందని ఆ ప్రతిపాదనల్లో తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మదురైలో క్రికెట్ స్టేడియంను ప్రారంభించిన ధోని!
తమిళనాడులో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు మహేందర్ సింగ్ ధోని. ముంబై నుంచి ఓ ప్రైవేట్ విమానంలో మధురై చేరుకున్న ధోనిని చూసేందుకు అభిమానులు తెల్లవారుజాము నుంచే విమానాశ్రయం వద్ద భారీగా గుమిగూడారు. వేలమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సహకారంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ స్థాయి స్టేడియం కోసం రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియం, ప్రాంతీయ క్రికెట్ కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం దీని సీటింగ్ సామర్థ్యం 7,300 కాగా, భవిష్యత్తులో దీనిని 20,000కు పెంచే ప్రణాళికలు ఉన్నాయి. ఇక స్టేడియం ప్రత్యేకతల విషయానికి వస్తే.. ప్రపంచ స్థాయి క్రికెట్ మైదానంలో ఉండాల్సిన సౌకర్యాలను పొందుపరిచారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పిచ్, LED ఫ్లడ్‌లైట్లు, ఆధునిక ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్‌లు, డిజిటల్ స్కోర్‌బోర్డు, ప్రాక్టీస్ నెట్‌లు, జిమ్నాసియం, మీడియా, VIP గ్యాలరీలు ఇలా అన్నిటిని పొందుపరిచారు. ఇక విమానాశ్రయంలో దిగిన తర్వాత, ధోని తన ఐకానిక్ జెర్సీ నంబర్ ‘7’ ఉన్న తెల్లటి కారులో స్టేడియంకు చేరుకున్నారు. భారీ జన సందోహాన్ని నియంత్రించడానికి పెద్దెత్తున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం తర్వాత గ్రౌండ్ లో కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అభిమానులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ తర్వాత ధోని మళ్లీ ‘7’ నంబర్ ఉన్న నీలిరంగు కారులో విమానాశ్రయానికి వెళ్లి, ప్రైవేట్ చార్టర్‌లో ముంబైకి తిరిగి వెళ్లారు.
ఆ క్రేజీ సిరీస్ కి షాకింగ్ రన్ టైం తో ఒకో ఎపిసోడ్?
తాజాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్‌నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ . నాలుగు బ్లాక్‌బస్టర్ సీజన్లతో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌కి ఇప్పుడు మరింత హైప్ పెరిగింది. తాజాగా ఐదో సీజన్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సీజన్ 5ని రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సీజన్‌లో ప్రతి ఎపిసోడ్ రన్‌టైమ్ ఏకంగా రెండు గంటలు ఉంటుందని సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో సరికొత్త ఎగ్జైట్మెంట్ మొదలైంది. సాధారణంగా వెబ్ సిరీస్‌ల ఎపిసోడ్లు గంట సమయాన్ని కూడా దాటవు, కానీ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ మాత్రం సినిమాల తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కే సుమారు 50 నుండి 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నందున విజువల్‌గా మరింత గ్రాండియర్ అనిపించేలా సిరీస్‌ను తీర్చిదిద్దుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సీజన్ మొదటి వాల్యూమ్‌ను నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఒక్కో ఎపిసోడ్ రన్‌టైమ్ నిజంగానే రెండు గంటలదా లేక రూమర్ మాత్రమేనా అన్నది అప్పుడే తేలనుంది. ఏదేమైనా, ఈ సీజన్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
నేడు దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మొదటగా చెప్పుకొనే పేరు దర్శకధీరుడు రాజమౌళి. నేడు ఆయన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో రాజమౌళికి విషెస్ తెలిపారు. మహేష్ బాబు ఈ ఫోటోను పంచుకుంటూ.. ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శక ధీరుడు రాజమౌళి.. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ అద్భుతాలే అంటూ.. మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రాబోతుంది అని మహేష్ బాబు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు జక్కన్న అంటూ ‘లోడ్స్ ఆఫ్ లవ్’ అండ్ తన ట్విట్టర్ అకౌంట్లో విశేష్ తెలిపాడు. అలాగే రామ్ చరణ్ తేజ కూడా దర్శక ధీరుడు రాజమౌళికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మా రోజుల్లో అతిపెద్ద ఫిలిం మేకర్, దగ్గరి వ్యక్తి అయిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలిపారు.
