లంకమల అభయారణ్యంలో పులుల గణన..
కడప జిల్లా సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ లోని లంకమల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. సిద్ధవటం రేంజ్ లో 64 ప్రాంతాలను గుర్తించి 128 అత్యాధునిక డిజిటల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మద్దూరు, కొండూరు, ముత్తుకూరు, పొన్నపల్లి, గొల్లపల్లె అటవీ ప్రాంతాలలో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు.. రాష్ట్రస్థాయి పులుల గణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పులులు ఘనన చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారిని కళావతి తెలిపారు. కెమెరాలలో నిక్షిప్తమైన డాటాను నాగార్జునసాగర్ లోని టైగర్ రిజర్వు విభాగం అధికారులకు పంపనట్లు ఆమె వివరించారు. ఈ సర్వే ద్వారా సిద్ధపటం అటవీ ప్రాంతంలో పులులు ఉన్నాయా లేదా అనే వివరాలు వెల్లడి కానున్నాయి.. అటవీ ప్రాంతంలోని నీటి సౌకర్యం కలిగిన ప్రాంతాలలో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు తాము కొన్ని ఫులుల పాదముద్రలను గుర్తించినట్లు ఆమె వివరించారు…
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై స్పందించిన బుద్దా వెంకన్న.. ఆసక్తికర వ్యాఖ్యలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.. ఐదు స్థానాలను ఎన్నికలు జరగనుండగా.. జనసేన, బీజేపీకి తలో సీటు కేటాయించి.. మిగతా మూడు స్థానాలకు కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా.. కాసేపటి క్రితమే సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది బీజేపీ.. అయితే, గత ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన బుద్దా వెంకన్నకు సర్దుబాట్లలో భాగంగా సీటు దక్కలేదు.. కానీ, ఈ సారి ఎమ్మెల్సీ సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆయనకు అది సాధ్యం కాలేదు.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తనకు రాకపోవటంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నాకు దేవుడు.. నేను ఆయన భక్తుడిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడు.. కానీ, నాకు పదవి వచ్చినా.. రాకపోయినా.. అంకిత భావంతో పనిచేస్తాను అని స్పష్టం చేశారు.. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడగా అభివర్ణించిన ఆయన.. ఒక్కోసారి పదవి వస్తుంది.. ఒక్కోసారి రాదు.. ఏ సందర్భంలో నైనా నేను ఒకేలా ఉంటాను అని పేర్కొన్నారు.. నాకు పదవి రాకపోయినా బాధ పడను అని వ్యాఖ్యానించారు.. ఇక, అనేక ఈక్వేషన్స్ తో ఎమ్మెల్సీల ఎన్నిక జరిగిందన్నారు.. కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వటం సరైందే అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..
ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ.. కాసేపట్లో నామినేషన్..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎట్టకేలకు బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది.. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే జనసేన నాగబాబును అభ్యర్థిగా ప్రకటించడం.. నామినేషన్ దాఖలు చేయడం జరిగిపోయాయి.. ఇక, ఆదివారం రోజు కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నామినేషన్ వేసేందుకు టీడీపీ అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగయనున్న నేపథ్యంలో.. ఈ రోజు తమ అభ్యర్థి సోము వీర్రాజు అంటూ బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.. మొత్తానికి గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన.. సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది బీజేపీ.. ఈ రోజే నామినేషన్లకు చివరి రోజు కావడంతో.. ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో టీడీపీకి 3, జనసేన, బీజేపీ ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.. ఇక, సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చిన సందర్భంలో సరయిన సమయంలో సరైన అవకాశం ఇస్తామని బీజేపీ అగ్రనాయత్వం ఆయనకు హామీ ఇచ్చిందట.. అందులో భాగంగానే సోము వీర్రాజును శాసన మండలికి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. పలువురు ఆశావాహుల మధ్య ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయింపుపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ కేంద్ర అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ కేంద్ర పెద్దల వద్ద తన పట్టు సోము వీర్రాజు నిలుపుకుంటూ మరోసారి ఎమ్మెల్సీ కానున్నారు. రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు నాలుగు దశాబ్దాలుగా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఏబీవీపీ, యువమోర్చా… విభాగాల్లో పనిచేసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ పెద్దలు ఏ సమీకరణ ఆధారంగా సోమును ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉన్న విషయం విదితమే.
కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు నిర్మిస్తాం..
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దారు కార్యాలయాలను నిర్మిస్తాం అని తెలిపారు రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు శాసనసభలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తాం అన్నారు.. రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నందున దాతల సహాయంతో నిర్మాణాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నాం అని వెల్లడించారు. దాతల నుండి నిధులు ఎలా సేకరించాలి, ఎలా ఖర్చు పెట్టాలనే అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వారి పార్టీ కార్యాలయాలను కట్టకోవాలనే తపన తప్ప కొత్త కలెక్టరేట్లు కట్టాలన్న ఆలోచన చేయలేదు అని మండిపడ్డారు.. ఇక, వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఆందోళనల నుండి ప్రజల దృష్టిని మరల్చించేందుకు అశాస్ర్తీయంగా జిల్లాల విభజన చేశారు. కానీ, జిల్లాల విభజనలో గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న లోపాలను వరుసగా సరిచేస్తున్నామని వెల్లడించారు ఏపీ రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.
పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా.. వర్మ విషయం టీడీపీ అంతర్గతం..!
జనసేన ఆవిర్భావోత్సవానికి పిఠాపురం సిద్ధమవుతోన్న వేళ.. ఓవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని పేర్కొన్న ఆయన.. ఇక, వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. వాళ్ల పార్టీ.. ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.. వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న ఆయన.. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం మాకు ఏమి ఉంటుంది? అని ప్రశ్నించారు. ఇక, పవన్ కల్యాణ్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్‌మెంట్‌తో పాటు పార్టీ పరంగా మేం కూడా చూసుకుంటాం.. సభా ప్రాంగణంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం అన్నారు.. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభం అవుతుందన్నారు నాదెండ్ల మనోహర్.. భాష, సంస్కృతిని గౌరవించుకునేలా సభ జరుగుతుంది.. సభ పూర్తయిన తర్వాత పారిశుద్ధ్యం భాద్యత కూడా మేమే తీసుకుంటాం.. భారత దేశంలో ఏ పార్టీ కూడా ఈ విధంగా పర్యావరణం కూడా ఆలోచించి ఉండదన్నారు జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్..
సంచలన తీర్పు.. ప్రణయ్ హత్య కేసులో ఆరుగురికి జీవితఖైదు, ఒకరికి ఉరి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటుచేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. అప్పట్లో ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారం రేపింది. ఇక ఈ హత్య ఘటనలో భాగంగా.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు, మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఎనిమిది మందిపై 302, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేపట్టి, 2019 జూన్ 12న 1600 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. 5 సంవత్సరాల 9 నెలలపాటు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం సాక్షులను, పోస్టుమార్టం రిపోర్టులను, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లను పరిశీలించి తుది తీర్పు వెలువరించింది. ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు తీవ్ర డిప్రెషన్‌కు గురై, 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
జమ్మూ కాశ్మీర్‌లో అర్ధనగ్న ఫ్యాషన్ షోపై దుమారం.. విచారణకు సీఎం ఆదేశం
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో జరిగిన అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. పురుషులు, మహిళలు చిన్న చిన్న దుస్తులతో ర్యాంప్‌పై నడిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి షోలకు ఎలా అనుమతి ఇస్తారని విపక్షాల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాకుండా అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఇక నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక విలువలను నాశనం చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫ్యాషన్ షో ద్వారా ప్రజలు షాక్‌కు గురయ్యారని… ప్రజల కోపాన్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని అబ్దుల్లా తెలిపారు. ఈ పరిణామంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని అబ్దుల్లా హామీ ఇచ్చారు.
ఓటర్ల జాబితాపై అన్ని అనుమానాలే.. దీనిపై లోక్‌సభలో చర్చ జరగాలి
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షం చర్చ నిర్వహించాలని కోరుకుంటుందని తెలిపారు. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఓటర్ల జాబితాపై చర్చ జరగాలన్నారు. మొత్తం ఓటర్ల జాబితాపై చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన మాజీ కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా ఇదే అంశంపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
హిస్టారికల్ మూవీతో రాబోతున్న గోపీచంద్ !
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి పరిచయం అక్కర్లేదు. విలన్‌గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం హీరోగా వరుస సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆయన వరుస పరాజయాలు అందుకుంటున్నాడు. ఇక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా గోపీచంద్ తాజాగా దర్శకుడు సంకల్ప్ రెడ్డితో చేతులు కలిపాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనుండగా, గోపీచంద్ కెరీర్ లో 33వ సినిమాగా రానున్న ఈ చిత్రాని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమంతో నటీనటులు, చిత్ర సిబ్బంది మధ్య ఈ సినిమా లాంచ్ అయింది. కాగా ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 7వ శతాబ్దంలో జరిగిన ఓ ముఖ్యమైన చారిత్రక సంఘటనల ఆధారంగా చేసుకుని స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో గోపీచంద్ రోల్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, రోల్స్‌కు సంబంధించిన వివరాలు వెళ్ళడించనున్నారు.
అదిదా సర్ప్రైజ్ ప్రోమో.. మల్లెపూలతో మత్తెక్కిస్తున్న ‘కేతిక కెవ్వు కేక’
స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేయమని ఆఫర్ చేస్తే ఆమడ దూరం పరిగెత్తే వాళ్లు స్టార్ హీరోయిన్లు. అది వన్స్ అపాన్ ఎ టైమ్ మాట. కానీ జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారీద్దరు. ఇక పుష్ప 2లో కూడా ఆడిపాడింది శ్రీలీల. కిస్సిక్ సాంగ్‌తో బాలీవుడ్ చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇప్పుడు బీటౌన్ లో కార్తీక్ ఆర్యన్ తో జోడీ కట్టే ఛాన్స్ కొల్లగొట్టింది. అలాగే తెలుగులో రెండు స్పెషల్ సాంగ్స్ చేసిన పూజా హెగ్డే తమిళంలో తొలిసారిగా కూలీలో ఆడిపాడనుంది. పూజా, సమంత, శ్రీలీల బాటలోనే నడుస్తోంది అందాల బ్యూటీ కేతిక శర్మ. ఇప్పటి వరకు గ్లామర్ తో కట్టిపడేసిన ఈ సోయగం ఫస్ట్ టైం తన అందచందాలతో కుర్రకారు మతిపొగొట్టేయబోతుంది. నితిన్- శ్రీలీల జంటగా నటిస్తోన్న రాబిన్ హుడ్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. బ్రో తర్వాత తెలుగులో కనిపించకుండా పోయిన అమ్మడు ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ తో తళుక్కున మెరిసింది. అదిదా సర్ప్రైజ్ అనే ఐటం సాంగ్ చేస్తోంది. కాసేపటి క్రితం ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. ప్రజెంట్ తమిళంలో ఓ సినిమా బాలీవుడ్ లో ఓ సినిమా చేసున్న కేతిక అదిదా సర్ప్రైజ్ సాంగ్ తిరిగి బాలీవుడ్, టాలీవుడ్ లో సర్పైజ్ కెరీర్ ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ.
డబ్బు కోసం రోడ్డు మీద డ్యాన్స్ చేశా..
వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీ లో ఎదిగిన తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఎప్పుడు అవకాశాల కోసం తన తండ్రి పేరు ఉపయోగించుకోలేదు. ఇలాంటి వారసులు ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు. తన సొంత టాలెంట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ తమిళంలోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. అయితే తాజాగా ఒక డాన్స్ షో లో పాల్గొన్న వరలక్ష్మి తనకు సంబంధించిన రహస్యాన్ని పంచుకుంది. వరలక్ష్మి రీసెంట్ గా ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయినటువంటి ఒక మహిళా ఎవ్వరూ ఊహించని రీతిలో అద్భుతమైన డ్యాన్స్ చేసి తన సత్తా చాటింది. అనంతరం ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆమెకు సర్ది చెప్పే క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, ఎవరికీ తెలియని రహస్యలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘మీతో నేను ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. సినిమాల్లోకి రాకముందు నేను మొట్టమొదటిసారి ఒక ప్రముఖ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. అందుకు నాకు వారు రూ.2500 ఇచ్చారు. అలాంటి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఎన్నడూ కూడా రోడ్డు మీద డ్యాన్స్ చేయడం తప్పుగా భావించవద్దు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది