Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Padma Awards 2024 Padma Vibhushan To Megastar Chiranjeevi Venkaiah Naidu This Is The Complete List

Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. పూర్తి జాబితా ఇదే..

Published Date :January 26, 2024 , 7:17 am
By Swathi Maddula
Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. పూర్తి జాబితా ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది.. ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన 132 మంది ప్రముఖులు పద్మ అవార్డుకు ఎంపికయ్యారు.. ఈ లిస్ట్ లోని 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కగా, 5 మందికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.. సినీ హీరో చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్లు ఉన్నాయి. తమిళనాడు నుంచి వైజయంతి మాల బాలికి కూడా పద్మవిభూషణ్ దక్కింది. మరో 17 మందిని పద్మభూషణ్‌ అవార్డులు వరించాయి. ఇక తమిళనాడుకు చెందిన స్వర్గీయ నటుడు విజయ్ కాంత్ కు పద్మభూషణ్ అవార్డు దక్కింది.. ఎవరెవరికి ఏ అవార్డులు దక్కాయో మొత్తం లిస్ట్ ను ఇప్పుడు ఒకసారి చూద్దాం..

పద్మవిభూషణ్ అవార్డులు 2024…

కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్‌.
వెంకయ్యనాయుడు ( పబ్లిక్ ఎఫైర్స్)- ఆంధ్రప్రదేశ్‌.
పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు.
వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు.
బిందేశ్వర్‌ పాఠక్‌ ( సామాజిక సేవ)- బీహార్‌.

పద్మభూషణ్ అవార్డులు 2024..

అశ్విని బాలచందర్ మోహత- మహారాష్ట్ర
సత్యబ్రత ముఖర్జీ – పశ్చిమ బెంగాల్
రామ్ నాయక్ – మహారాష్ట్ర
తేజస్ మధుసుదన్ పటేల్ – గుజరాత్
ఉషా ఉత్తప్ – బెంగాల్
విజయకాంత్ – తమిళనాడు(కళలు)
కుందన్ వ్యాస్ – మహారాష్ట్ర
అంబదాస్ రాజ్ దత్త్ – మహారాష్ట్ర
రాజగోపాల్ – కేరళ
రిన్ పోచే – లద్దాఖ్
ప్యారీలాల్ శర్మ – మహారాష్ట్ర
ప్రసాద్ ఠాకూర్ – బీహార్
ఫాతిమా బీవి – కేరళ
హర్ ముస్జీ ఎన్ కామా – మహారాష్ట్ర
మిథున్ చక్రబొర్తి – పశ్చిమబెంగాల్
సీతారామ్ జిందాల్ – కర్నాటక
యంగ్ లియూ – తైవాన్(వ్యాపార రంగం)

పద్మ శ్రీ అవార్డులు 2024..

ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ.

తెలంగాణకు చెందిన కేతావత్ సోమ్ లాల్(సాహిత్యం)కు పద్మ శ్రీ అవార్డు దక్కింది,

కళల విభాగంలో ఆనందా చారి (తెలంగాణ)కి పద్మ శ్రీ అవార్డు దక్కింది.

నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పకు(బుర్ర వీణ వాయిద్యకారుడు) పద్మశ్రీ.

తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ.

సాహిత్యం విభాగంలో నల్గొండ జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచార్యకు పద్మ శ్రీ దక్కింది.

చార్మీ ముర్ము(జార్ఖండ్) సెరైకెలా ఖర్సావాన్ ప్రాంతానికి చెందిన గిరిజన పర్యావరణవేత్త. 30 లక్షల మొక్కలను నాటేందుకు కృషి చేశారు.

గుర్విందర్ సింగ్(హర్యానా) నిరాశ్రయులైన, నిరుపేదలు, మహిళలు, అనాథలు, దివ్యాంగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. బాల్ గోపాల్ దామ్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

సత్యనారాయణ బేలేరి(కేరళ) కాసరగోడ్‌కు చెందిన రైతు. సంప్రదాయ వరి రకాలను సంరక్షించటంలో పేరు గాంచారు.

సంగంకిమా(పశ్చిమ బెంగాల్) ఐజ్వాల్‌కు చెందిన సామాజిక కార్యకర్తగా అవార్డుకు ఎంపిక అయ్యారు..

పార్వతి బారువా(అస్సాం) భారతదేశపు తొలి మహిళా ఏనుగు మావిటి. జంతు సంరక్షణలో చేసిన కృష్టికి అవార్డును అందుకున్నారు.

జగేశ్వర్ యాదవ్(ఛత్తీస్ ఘడ్) అట్టడుగున ఉన్న బిర్హోర్, పహాడీ కోర్వా గిరిజన తెగ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆయనకు అవార్డు దక్కింది..

కె చెల్లమ్మాళ్- దక్షిణ అండమాన్‌కు చెందిన ఆర్గానిక్ రైతు. సేంద్రియ వ్యవసాయాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. 5 దశాబాద్ధాలుగా సేంద్రియ వ్యవసాయ రంగంలో కృషి చేస్తున్నారు.

కళల విభాగంలో చూస్తే…. జానకీలాల్‌ (రాజస్థాన్‌), గోపీనాథ్‌ స్వైన్‌ (ఒడిశా),
స్మృతి రేఖ ఛక్మా – త్రిపుర,
ఓంప్రకాశ్‌ శర్మ – మధ్యప్రదేశ్‌,
భద్రప్పన్‌ – తమిళనాడు,
శాంతిదేవీ పాసవాన్‌,
శివన్‌ పాసవాన్‌ – బిహార్‌,
అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ – బిహార్‌,
బాబూ రామ్‌యాదవ్‌ – ఉత్తర్‌ప్రదేశ్‌,
నేపాల్‌ చంద్ర సూత్రధార్‌ – (పశ్చిమ బెంగాల్‌),
రతన్‌ కహార్‌ – పశ్చిమ బెంగాల్‌,
నారాయణన్‌ – కేరళ,
భాగబత్‌ పదాన్‌ – ఒడిశా,
జోర్డాన్‌ లేప్చా – సిక్కిం,
మచిహన్‌ సాసా – మణిపుర్‌,
బాలకృష్ణన్‌ సాధనమ్‌ పుథియ వీతిల్‌ – కేరళ,
వీరందరికి పద్మ శ్రీ అవార్డులు వరించాయి.

క్రీడా రంగంలో.. మహారాష్ట్రకు చెందిన ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండేకు పద్మ శ్రీ అవార్డను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

వైద్య విభాగంలో…. హేమచంద్‌ మాంఝీ – ఛత్తీస్‌గఢ్‌,

ప్రేమ ధన్‌రాజ్‌ – కర్ణాటక, యజ్దీ మాణెక్‌ షా( గుజరాత్‌)కు అవార్డు దక్కింది.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.. అలా మొత్తం 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • full list
  • latest news
  • Padma awards2024

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions