NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

Top Headlines @9AM: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి

వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. గల్లీ గల్లీలో గణేశుడిని కొలిచి పూజిస్తారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అందుకు భిన్నంగా ఉంది. ఖైరతాబాద్ గణేశుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? ఆయన ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారనే చర్చ సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి మొదలైంది. చవితికి ఒకరోజు ముందే ఖైరతాబాద్ గణేశ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలిపూజ ప్రారంభమవుతుంది. గవర్నర్ తమిళిసై ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనున్నారు. మరోవైపు వినాయకుడి పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఖైరతాబాద్ గణపతిని ఒక్కసారైనా దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు.. క్రమంగా ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది.

11 రోజులు, ఈ రూట్లలో వాహనాలకు అనుమతి లేదు

హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నేటి నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నగరంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే మనకు గుర్తొస్తాయి. ఖైరతాబాద్ వినాయకుడు. ఖైరతాబాద్ గణేశుడు నగరంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ప్రసిద్ధి చెందాడు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు మృతి!

ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో విశాఖలోని ఒమిని ఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నూకరాజు మృతితో కాకర కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పాయకరావుపేట నియోజకవర్గంకు మూడుసార్లు కాకర నూకరాజు ఎమ్మెల్యేగా తమ సేవలు అందించారు. జనాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. కాకర నూకరాజు చివరి చూపు కోసం అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. రాజకీయ నాయకులు ఆయన మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు.

సముద్రంలో చైనాకు గట్టి పోటీ ఇవ్వనున్న భారత్

భారత్-చైనాల మధ్య భూసరిహద్దులోనే కాకుండా సముద్రంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొని ఉండడంతో ఇరు దేశాలు పరస్పరం ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇరు దేశాల మధ్య పోటీ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తన నౌకాదళాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉంది. భారత నౌకాదళం 68 యుద్ధనౌకలు, నౌకలను ఆర్డర్ చేసింది. వాటి మొత్తం విలువ రూ.2 లక్షల కోట్లు. రాబోయే సంవత్సరాల్లో నౌకాదళాన్ని బలోపేతం చేయడమే భారత్ లక్ష్యం. 143 విమానాలు, 130 హెలికాప్టర్లతో పాటు 132 యుద్ధనౌకలను కొనుగోలు చేసేందుకు నావికాదళానికి అనుమతి లభించింది. ఇది కాకుండా 8 తదుపరి తరం కొర్వెట్‌లు (చిన్న యుద్ధనౌకలు), 9 జలాంతర్గాములు, 5 సర్వే నౌకలు, 2 బహుళ ప్రయోజన నౌకల నిర్మాణానికి ఆమోదం లభించింది. రానున్న కాలంలో వీటిని సిద్ధం చేయనున్నారు. కానీ 2030 నాటికి నేవీ వద్ద 155 నుంచి 160 యుద్ధ నౌకలు ఉంటాయి. 2035 నాటికి కనీసం 175 యుద్ధనౌకలను తన నౌకాదళంలో చేర్చుకోవడమే భారత నావికాదళం నిజమైన లక్ష్యం. దీని ద్వారా వ్యూహాత్మక ప్రయోజనం సాధించడమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన పరిధిని కూడా బలోపేతం చేయవచ్చు. ఈ కాలంలో యుద్ధ విమానాలు, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్‌ల సంఖ్యను పెంచడంపై కూడా దృష్టి పెట్టనుంది.

ఆర్మీ జవాన్ మృతి.. కిడ్నాప్ చేసి మరీ..

మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ పశ్చిమ జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ ఆర్మీలో యువ సైనికునిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈమధ్యనే సెలవు పైన ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో అతను శనివారం కిడ్నాప్ అయ్యాడు. అతని కుమారుడు చెప్పిన సమాచారం ప్రకారం.. సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ తన కుమారిడితో కలిసి వరండాలో పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ ఇంటికి వచ్చారు. వరండాలో పనిచేస్తున్న సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ తలపైన గన్ పెట్టి బెదిరిస్తూ బలవంతంగా తెల్ల వ్యాన్ లో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. కాగా నిన్న ఉదయం అతని మృత దేహం లభ్యమైంది. పోలీసుల సంచారం ప్రకారం అతని తలమీద ఒక బులెట్ గాయం మాత్రమే వుంది. ఈ ఘటన మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన సైనుకునికి 10 సంవత్సరాల కొడుకు మరియు కూతురు ఉన్నారు.

మధ్య ప్రదేశ్ లో వర్ష బీభత్సం

మధ్యప్రదేశ్‌లో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వానకు వరద పరిస్థితి తలెత్తింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మాల్వా, నిమార్ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో వరదలకు 8,700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈరోజు కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నీముచ్, మందసౌర్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇండోర్, ఖాండ్వా, ఖర్గోన్, బర్వానీ, బుర్హాన్‌పూర్ జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా నీటి ఎద్దడి కారణంగా ఎస్డీఆర్ఎఫ్ 89 రెస్క్యూ ఆపరేషన్‌లు నిర్వహించి 8,718 పౌరులు, 2,637 పశువులను రక్షించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించిందని మధ్యప్రదేశ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం మొత్తం 610 మంది సైనికులు, 801 మంది హోంగార్డు సైనికులను మోహరించినట్లు ఆయన తెలిపారు.

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం

దక్షిణాఫ్రికాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతులు మైనింగ్ కంపెనీ డి బీర్స్ ఉద్యోగులుగా చెబుతున్నారు. దేశంలోని అతిపెద్ద వజ్రాల గనులలో ఒకటైన వెనిషియా గని నుండి కార్మికులను బస్సు తీసుకువెళుతున్నట్లు దేశంలోని ఉత్తరాన లింపోపో ప్రావిన్స్‌లోని రవాణా అధికారి తెలిపారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. గని నుండి 25 కిలోమీటర్ల (15 మైళ్ళు) దూరంలో జింబాబ్వే సరిహద్దులో ఉన్న ముసియాన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని వొంగాని చౌకే ఏఎఫ్పీకి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన దక్షిణాఫ్రికా ఖండంలోని అత్యంత అభివృద్ధి చెందిన రహదారి నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది.

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓవర్‌

క్రికెట్ ఆటలో కొన్ని రికార్డులు చాలా అరుదుగా నమోదు అవుతుంటాయి. బ్యాటర్ ట్రిపిల్ సెంచరీ చేయడం లేదా డబుల్ సెంచరీ చేయడం.. బౌలర్ 5 వికెట్స్ తీయడం లాంటివి అరుదుగా నమోదవుతుంటాయి. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం కూడా అలాంటిదే. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌ ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఓవర్‌ను ఆసియా కప్ 2023 ఫైనల్లో వేశాడు. ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో ఈ అద్భుతం జరిగింది. మొహ్మద్ సిరాజ్‌ ఒక్కో బంతిని ఒక్కోలా వేసి బ్యాటర్లను సునాయాసంగా బుట్టలో వేసుకున్నాడు. 1, 3, 4, 6 బంతులకు వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్‌ దక్కకపోయినా.. నిప్పులు చెరిగే బంతులు వేశాడు. మొదటి బంతిని ఆఫ్‌స్టంప్‌ ఆవల వేయగా.. కవర్‌డ్రైవ్‌ ఆడేందుకు ప్రయత్నించిన నిశాంక పాయింట్‌లో జడేజాకు చిక్కాడు. మూడో బంతిని లోపలికి స్వింగ్‌ చేసిన సిరాజ్‌.. సమరవిక్రమను వికెట్ల ముందు అవుట్ చేశాడు. ఆ తర్వాత ఫుల్‌ బంతితో అసలంకను ఔట్‌ చేశాడు. బంతిని కట్‌ చేయాలని అసలంక ప్రయత్నించగా.. బంతి ఇషాన్‌ చేతిలో పడింది. ఐదవ బంతికి ధనంజయ డిసిల్వా ఫోర్‌ కొట్టాడు. దూరంగా వెళ్తున్న చివరి బంతిని వెంటాడి డిసిల్వా కీపర్‌కు చిక్కాడు.

షారుఖ్ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…

బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన పఠాన్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన జవాన్ ఇటీవల విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఈ మూవీతో వరల్డ్ స్టార్ అయ్యాడు షారుఖ్.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కూడా ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు రూ.6000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు షారుఖ్. ఇటీవల జవాన్ సక్సెస్ సెలబ్రెషన్స్ లో షారుఖ్ లుక్ అందరిని ఆకట్టుకుంది. బ్లాక్ సూట్ లో మరింత స్టైలీష్ లుక్ చిత్రంలో కనిపించారు షారుఖ్. చాలా కాలం తర్వాత బాద్ షా ఖాతాలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ చేరాయి. పఠాన్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్.. ఇప్పుడు జవాన్ తో మరోసారి సత్తా చాటారు..

సిడి ప్రియులకు భారీ షాక్..

మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో పాటు, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 10 చొప్పున పెరుగుదల కనిపించింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 54,910కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900కి చేరింది.
Manufacturing in India: మోడీ బర్త్ డే రోజు రెండు గుడ్ న్యూస్‎లు.. చైనా స్థానాన్ని భర్తీ చేయనున్న భారత్