NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

9am News Head Lines

9am News Head Lines

తెలంగాణలో ఐటీ రైట్స్‌..
హైదరాబాద్‌లోని వంశీరామ్‌ బిల్డర్స్‌ కార్యాలయం, ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. వంశీరామ్‌ బిల్డర్స్‌ సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

నేడు అఖిల పక్ష సమావేశం
ఢిల్లీలో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో భేటీ నిర్వహించనున్నారు. సమావేశాలకు సహకరించాల్సిందిగా పార్టీలను కోరనుంది కేంద్రం. అఖిలపక్షాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధాని మోడీ.

తిరుమలలో సర్వదర్శనానికి 6 గంటలు
తిరుమలలో టోకెన్‌లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,020 మంది భక్తులు దర్శించుకున్నారు. అయితే.. 29,195 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో మరో కొత్త పథకం..

తెలంగాణలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. రానున్న ఎన్నికలకు ముందే కేసీఆర్‌ గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.. సొంత స్థలం ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం పథకం అమలు చేయనున్నారు.. సొంత స్థలం ఉంటే 3 లక్షల రూపాయాలు ప్రభుత్వ సాయం చేయనుంది.. 10న జరిగే కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయనున్నారు.. అన్ని నియోజకవర్గాల్లో అర్హులను గుర్తించి.. 15 రోజుల్లోనే నిధులను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.. అయితే, ఎంతమందికి ఈ పథకం వర్తింపు జేయాలి.. లాంటి పూర్తి వివరాలను కేబినెట్‌ సమావేశంలో ఖరారు చేయనున్నారు

దేవినేని అవినాష్‌ ఇంట్లో సోదాలు

విజయవాడలో.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి.. ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. మొత్తం ఐదు బృందాల అధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.. వైఎస్సార్‌సీపీ నేత అయిన దేవినేని అవినాష్‌.. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు.. ఇవాళ ఉదయం నుంచి విజయవాడ గుణదలలోని ఆయన నివాసంతో పాటూ మరికొన్ని చోట్ల ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, ఏ కేసులో ఈ సోదాలు సాగుతున్నాయి.. ఐదు బృందాలు ఎందుకు రంగంలోకి దిగాయి అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది..

పాత కలెక్టర్ కార్యాలయం కూల్చివేత

నిజమాబాద్‌లోని పాత కలెక్టర్ కార్యాలయంలో భారీ భవంతుల కూల్చివేత పక్రియ పూర్తి అయ్యింది. శిథిలావస్థకు చేరిన భవనాలతో పాటు ఇటీవల నిర్మించిన కట్టడాల కూల్చివేశారు అధికారులు. దీంతో చరిత్రగా మిగిలిపోయింది పాత కలెక్టర్ కార్యాలయం. పాత కలెక్టర్ కార్యాలయంలో ఇందూరు కళా భారతి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. పాత కలెక్టర్, ప్రగతి భవన్ భవనాలు నిజాం కాలంలో నిర్మించినవి. అయితే.. ప్రగతి భవన్ కూల్చివేత దృశ్యాలు వైరల్ గా మారాయి. పూర్తి స్థాయిలో నేలమట్టమైన భవంతులు.