‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ అంటే యాక్షన్ ప్రియులకు ఎక్కడలేని క్రేజ్. అందుకు తగ్గట్టే ఆ ఫ్రాంఛైజ్ లో సాహసాలు, విన్యాసాలు కూడా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్యాన్స్ ‘ఎఫ్ 9’ ఎగ్జైట్ మెంట్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ గా ఇప్పటికే విడుదలై పాజిటివ్ రివ్యూస్ పొందినప్పటికీ హాలీవుడ్ థ్రిల్లర్ ఇంకా యూఎస్ లో రిలీజ్ కాలేదు. జూన్ 25న ముహూర్తం నిర్ణయించారు. అయితే, విడుదలకి ముందు ప్రిమీయర్ షో నిర్వహించగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ విన్ డీజిల్ ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి అందించాడు. పైగా అది ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’ గురించి కావటంతో సొషల్ మీడియా జనం మరింత ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
Read Also : ‘ఆహా’లో ఈ వారం ఒకటి కాదు రెండు!
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’లో పాప్ సింగర్ కార్డి బీ ప్రధాన పాత్రలో కనిపించబోతోందట. ఈ విషయం స్వయంగా విన్ డీజిల్ ప్రకటించాడు. ‘ఎఫ్ 9’లో కూడా కార్డి ఉంది. అయితే, ఆమె పాత్ర చాలా చిన్నది. అయినా ప్రఖ్యాత హిప్ హాప్ సింగర్ ఉత్సాహంగా మూవీలో నటించిందట. కార్డి ‘ఎఫ్ 9’ ఒప్పుకోవటానికి కారణం… ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’ అంటున్నారు హాలీవుడ్ జనం. తొమ్మిదో భాగంలో విన్ డీజిల్ పాత్రకి, కార్డి పాత్రిక ‘ఏదో సబంధం’ ఉందంటూ చిత్రాన్ని ముగిస్తారట. దానికి కొనసాగింపుగా పదో భాగంలో కార్డి బి రోల్ ఫుల్ లెంగ్త్ గా మారుతుంది. అంటే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’ కార్డి బీ స్పెషల్ గా రాబోతోందన్నమాట!
ఈ సంవత్సరం ఇప్పటి వరకూ కార్డి బీ ఒకే ఒక్క ‘సింగిల్’ విడుదల చేసింది. ‘అప్’ పేరుతో రిలీజైన సాంగ్ ఫ్యాన్స్ ని బాగా అలరించింది.