మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కసరత్తులు మొదలు పెట్టాడు. ఏదో రొటీన్ ప్రిపరేషన్ కాదు… ‘బాక్సర్’గా బాక్సాఫీస్ బద్ధలుకొట్టేందుకు కండలు ఇనుమడింపజేస్తున్నాడు. భారీ వ్యాయామాలు చేస్తూ మన ఆజానుబాహుడు జిమ్ లో హల్ చల్ చేస్తోన్న వీడియో సొషల్ మీడియాలో న్యూ హైలైట్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ‘గని’ భాయ్ వర్కవుట్ ని తెగ పొగిడేస్తున్నారు!
కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా ఎంటర్టైనర్ కోసం ప్రిపర్ అవుతున్నాడు. బాక్సర్ ‘గని’గా కనిపించేందుకు మన టాల్ అండ్ టాలెంటెడ్ స్టార్ హార్డ్ కోర్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ‘ఎఫ్ 3’ షూట్ పూర్తి చేసిన వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మెగా ప్రిన్స్ మూవీని అల్లు బాబీ, సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు…