NTV Telugu Site icon

రేపు వరుణ తేజ్‌ ‘గని” టీజర్‌.. అందులో బిగ్‌ సర్‌ప్రైజ్‌

మెగా అభిమానులే కాదు, స్టోర్ట్స్‌ లవర్స్‌ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న గని. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు వరుణ్‌తేజ్‌. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను అప్పుడప్పుడు చిత్ర యూనిట్‌ విడుదల చేస్తూ, ఈ సినిమా అంచనాలు అమాంతంగా పెంచుతున్నాయి. గని ప్రపంచం అంటూ విడుదల చేసిన వీడియోలో నదియా, ఉపేంద్ర, తనికళ భరణి, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర లు కనిపించారు.

ఈ సినిమాలో వీరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వీడియోలోనే నవంబర్‌ 15న టీజర్‌ విడుదల చేస్తామని తెలిపారు. చెప్పినట్టుగానే రేపు టీజర్‌ విడుదల చేస్తున్నట్లు మరోసారి పేర్కొన్నారు. రేపు ఉదయం 11.08 గంటలకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో ఉన్న గని సినిమా టీజర్‌ విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ తెలిపింది.