త్వరలో ఆహా నుంచి మరో సరికొత్త ఒరిజినల్ ‘తరగతి గది దాటి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు సినిమాలే కాదు… వెబ్ సీరిస్ లు సైతం రీమేక్ అవుతున్నాయి. అందులో భాగంగా టి.వి.ఎఫ్. ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’ తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో రీమేక్ అవుతోంది. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో ఈ వెబ్ సీరిస్ తెలుగులో రాబోతోంది. దీనిని ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ తో చక్కని గుర్తింపు తెచ్చుకున్న మల్లిక్ రామ్ ‘తరగతి గది దాటి’ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ విడుదలైంది.
ఇక ‘తరగతి గది దాటి’ తెలుగు వర్షన్ విషయానికి వస్తే… ఇది రాజమండ్రిలో జరిగే కథ. గోదావరి, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోని జీవనాన్ని తెలియజేస్తుంది. కృష్ణ అలియాస్ కిట్టు అనే యువకుడు చుట్టూ తిరిగే కథ. కిట్టు తల్లిదండ్రులైన శంకర్, గౌరి ఓ కోచింగ్ సెంటర్‌ను నడుపుతుంటారు. కృష్ణకు లెక్కలంటే చాలా ఇష్టం. విద్యార్థిగా మంచి తెలివితేటలుంటాయి. కానీ చదువుపై దృష్టి పెట్టడు. వాళ్ల కోచింగ్ సెంటర్లో జాస్మిన్ అనే అమ్మాయి జాయిన్ అయిన తర్వాత అతని ప్రపంచం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే కథ. ఐదు ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్‌లో కృష్ణ, జాస్మిన్ మధ్య ప్రేమ, టీనేజ్ గందరగోళాలెలా ఉంటాయనే వీక్షకులు చూడొచ్చు. ఈ ఏడాది విడుదలైన ‘మెయిల్’ వెబ్ మూవీతో హర్షిత్ రెడ్డి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. భిన్న, సింగపెన్నె వంటి కన్నడ, తమిళ వెబ్ సిరీస్‌ల్లో నటించిన పాయల్ రాధాకృష్ణన్ నటిగా తనెంటో ప్రూవ్ చేసుకుంది. ఉయ్యాల జంపాల, బాహుబలి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన నిఖిల్ దేవాదుల పరిణితి గల నటుడిగా ప్రేక్షకులను మెప్పించనున్నాడు.
Also Read
గతంలో టి.వి.ఎఫ్ ఒరిజినల్ ‘పర్మనెంట్ రూమ్మేట్స్’ ను మన నెటివిటీకి తగినట్లు మార్చి ‘కమిట్‌మెంటల్’ తీశారు. అందులో ఉద్భవ్ రఘునందన్, పునర్నవి భూపాలం ప్రధాన పాత్రలు పోషించారు. కమిట్ మెంటల్ తర్వాత టి.వి.ఎఫ్ నుంచి ‘ఫ్లేమ్స్’ను తరగతి గది దాటిగా ఆహా రీమేక్ చేస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
India’s Most Powerful Women 2026: దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరు?.. ఏకంగా రూ.39 లక్షల కోట్ల ఆస్తులు!
-
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 31 వరకే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!