Padma Shri: బాలనటుడుగా కెరీర్ ప్రారంభించి నలభై అయిదు సంవత్సరాల పాటు సినిమారంగంలో హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడని అలనాటి నటి రాజశ్రీ అన్నారు. హైదరాబాద్ లో సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కామెడీ ఫెస్టివల్ లో హాస్య నటుడు అలీని సంగమం- వివేకానంద లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు కింద వెండి కిరీటం, వెండి కంకణం బహుకరించారు.
Read Also: Durgam Chinnaiah : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ.. ‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. అతనిలో ఉన్న సేవా గుణం అందరికి స్ఫూర్తినిస్తుంది. అలుపెరగక కళా జీవితాన్ని గడుపుతున్న అలీ జన్మ ధన్యమైంది. అతనికి ‘పద్మశ్రీ’ వస్తే చూడాలని వుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటులు తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మి పాల్గొని అలీని అభినందించారు.
Read Also: Avika Gor: పాప.. నోరు అదుపులో పెట్టుకో .. మళ్లీ టాలీవుడ్ లో కనిపించవ్
ఈ సందర్భంగా అలనాటి కాంతారావు కుమారుడు రాజా, హాస్య నటి పాకీజా, కళాకారిణి హేమకుమారికి వ్యాపారవేత్త శ్రీ వె. రాజశేఖర్ పాతిక వేల ఆర్ధిక సాయాన్ని అందించారు. ‘సంగమం’ సంజయ్ కిషోర్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జయలలిత, పాకీజా, రాగిణి, శివారెడ్డి, సునామి సుధాకర్, బులెట్ భాస్కర్, నాటీ నరేష్, హరిబాబు, పేరడీ గురుస్వామి, సంకర నారాయణ ప్రదర్శించిన హాస్యవల్లరి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.