VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు

Vtk Rao

Vtk Rao

నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహ వేడుక ఘనంగా సాగింది. భారత వైమానిక దళ మాజీ కమాండర్, నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల పెళ్లి నియో కన్వెన్షన్‌లో వైభవంగా జరిగింది. మే ఒకటో తేదీన జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా, కళాకారుడిగా ఎందరికో ఆదర్శం. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్న ఘనత ఆయనది. రిటైర్మెంట్ తర్వాత అజైల్ గ్రూప్ ద్వారా ఏకంగా 32 వేల మందికి ఉపాధి కల్పించారు. బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసిన నిర్మాతగా రావుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను సాధించాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ చిత్రంతో నిర్మాతగా మరో నందిని అందుకుని అతి తక్కువ కాలంలోనే చిత్రసీమలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు.