పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తి, శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో ‘పోతుగడ్డ’ అనే సినిమాను రక్ష వీరమ్ తెరకెక్కించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేసిన ఈ సినిమా ఈమధ్యనే ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది. వెంకట్ అనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్‌లో కనిపించిన ప్రశాంత్ కార్తి తన పాత్రకు వస్తోన్న స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. పోతుగడ్డ సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్న ప్రశాంత్ సినిమా ఆరంభం, ముగింపులో ఈ పాత్రలోని షేడ్స్ కనిపిస్తాయి, ఆ వేరియేషన్ నాకు చాలా నచ్చిందని అన్నారు.
అందుకే ఈ చిత్రానికి వెంటనే ఓకే చెప్పాను. ఇక ఇందులో నా పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా నా పాత్రలోని వేరియేషన్, యాక్టింగ్ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్ర సిద్దార్థ, చంద్రశేఖర్ యేలేటి వంటి వారు ప్రశంసించడం ఆనందంగా ఉందన్నారు. పోతుగడ్డ షూటింగ్ మొత్తం కూడా నైట్ టైంలోనే జరిగింది. అది కూడా పూర్తి చలికాలంలోనే షూటింగ్ చేశాం, టీం అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం.ఇక తరువాత రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీని చేస్తున్నాను. దాని వివరాలు త్వరలోనే ప్రకటిస్తా, మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయన్నారు.