‘అందరూ బావుండాలి…’ థియేటర్లో మనందరం ఉండాలి: ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. 1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్లో నిర్మిస్తోన్న తొలి చిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో దీనిని తీశారు. మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.
Read Also : భార్యలతో పాటు స్టార్స్ అంతా ఒకేచోట… పిక్ వైరల్
Also Read
ఆయన మాట్లాడుతూ ‘‘అలీ గారు అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్‌ని పెట్టి సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్ సౌండ్ బావుంది. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన రాకేశ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారట. అలీ,నరేశ్ గార్లతో పాటు టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. అలీ మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌తో నేను ‘యోగి’, ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’,‘ బిల్లా’, ‘రెబల్’ ఇలా అనేక చిత్రాల్లో నటించిన పరిచయంతో మా సినిమా మొదటి సాంగ్ రిలీజ్ చేయాలి అని అడిగాను. ప్రభాస్ ఇండియాలో లేనప్పటికి నా మీద అభిమానంతో మా సినిమా గురించి మాట్లాడుతూ వీడియో చేసి పంపించారు. మా ‘అందరూ బావుండాలి…’ సినిమా ప్రమోషన్‌ను ప్రభాస్‌తో ప్రారంభించటం ఆనందంగా ఉంది. మా సినిమా మొదటి పాట లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలవుతుంది. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. పరిస్థితులు చక్కదిద్దుకోగానే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రంలో శివబాలాజీ, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, శివారెడ్డి, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
- Tags
తాజావార్తలు
-
Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
-
Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
-
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
-
Faria Abdullah: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. బోనాల నుంచి ఇస్లాం వరకు ఏం జరిగిందో చెప్పిన చిట్టి!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!