గౌతమికి ‘అన్నీ మంచి శకునములే!’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకురాలు నందినీరెడ్డి ఎట్టకేలకు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఖాళీగా లేకుండా ఆహా కోసం ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని, ఓటీటీ కోసం ‘పిట్టకథలు’ ఆంథాలజీని చేసినా… ఈ యూత్ ఫుల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ మూవీని టేకప్ చేయడం సంతోషించదగ్గది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి మూవీ చేయబోతోందనే ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ అది ఇప్పుడు సెట్స్ పైకి వెళుతోంది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించే ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే’ అనే పేరు కూడా పెట్టేశారు. అందులో నటిస్తున్న మిగిలిన నటీనటుల సంగతి ఏమో కానీ సీనియర్ నటి గౌతమికి మాత్రం ఈ సినిమాతో అన్నీ మంచి శకునాలే ఎదురవుతాయని పిస్తోంది.
గౌతమి జూలై 2న 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మూడు రోజులకే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఒకప్పుడు నాయికగా నటించిన గౌతమి ఇప్పడు చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. కమల్ తో కలిసి ఉన్న సమయంలో ‘పాపనాశం’లో అతని భార్యగా నటించింది. ఆ తర్వాత సంవత్సరం తెలుగులో మోహన్ లాల్ సరసన ‘మనమంతా’లో చేసింది. ఈ సినిమా వచ్చి కూడా ఐదేళ్ళు గడిచిపోయింది. అయితే మధ్యలో తమిళ చిత్రం ‘తుప్పరివాలన్ -2’లో నటించడానికి అంగీకరించింది కానీ రకరకాల సమస్యల కారణంగా ఆ సినిమా పని వేగంగా సాగడం లేదు.
Also Read
ఇప్పుడు తెలుగు సినిమా ‘అన్నీ మంచి శకునములే’ లో నటించడం మాత్రం చెప్పుకోదగ్గ పరిణామమే! ఎందుకంటే నందినీ రెడ్డి సినిమాలలో హీరోయిన్ల పాత్ర చాలా స్ట్రంగ్ గా ఉంటుంది. అంతేకాదు… హీరో లేదా హీరోయిన్ తల్లి పాత్రలను సైతం నందినీ రెడ్డి ఎంతో మనసు పెట్టి రాయిస్తారు. ‘అలా మొదలైంది’లో రోహిణి, ‘జబర్దస్త్’లో ప్రగతి, ‘కళ్యాణ వైభోగమే’లో రాశి, ‘ఓ బేబీ’లో లక్ష్మీ పాత్రలు అలాంటివే. ఇప్పుడు గౌతమి కోసం కూడా ‘అన్నీ మంచి శకునములే’లో అలాంటి పాత్ర రాయించారని తెలుస్తోంది. కమల్ హాసన్ కు దూరమైన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడటానికి గట్టి కృషి చేస్తోంది గౌతమి. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సదరన్ స్టేట్స్ రివైజింగ్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నారు. ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ కు సేవ చేస్తున్నారు. ఈ సమయంలో నందినీరెడ్డి సినిమాలో మంచి పాత్రను పొందడం ద్వారా గౌతమి మరోసారి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరికినట్టే! ఆ రకంగా తెలుగులో మరింత బిజీ అయ్యే ఆస్కారం కూడా ఉంది!!

తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..