కెరీర్ మొదట్లో యాక్టింగ్ రాదంటూ తెగ విమర్శలు ఎదుర్కొంది జాక్విలిన్ ఫెర్నాండెజ్. అయితే, ఈ శ్రీలంక భామ క్రమంగా బాలీవుడ్ లో స్థిరంగా సెటిలైపోయింది. ఇప్పుడు జాకీ బీ-టౌన్ బిజీ బేబ్స్ లో ఒకరు. అయితే, చేతి నిండా సినిమాలతో కళకళలాడుతోన్న మిస్ ఫెర్నాండెజ్ ఓ సౌత్ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో మునిగిందని టాక్! ఆ దక్షిణాది అందగాడు ఎవరో ఇప్పటికైతే సస్పెన్స్ కానీ జాక్విలిన్ తో కలసి అతను ముంబైలో ఇల్లు కూడా కొనేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే కొత్తింట్లో కాపురం పెడతారట!
బాలీవుడ్ లో ఈ మధ్య లివిన్ రిలేషన్స్ ఎక్కువైపోయాయి కాబట్టి జాక్విలిన్ పెళ్లాడి కొత్తింట్లో కుడి కాలుపెడుతుందో… లేక డేటింగ్ అంటూ డేరింగ్ గా రొమాన్స్ షురూ చేస్తుందో చూడాలి! అయితే, ప్రొఫెషనల్ గా మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉంది ఈ ఫారిన్ బ్యూటీ. వరుస చిత్రాలు చేస్తోన్న ఆమె ‘అటాక్’ అనే టైటిల్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ లో జాన్ అబ్రహాంతో ఆడిపాడింది. లెటెస్ట్ గా తను డబ్బింగ్ చెబుతుండగా క్యాప్చర్ చేసిన పిక్స్ ని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. “ద మెనీ మూడ్స్ ఆఫ్ డబ్బింగ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అటాక్’ ఆగస్ట్ 13న ఇండిపెండెన్స్ డే మూడ్ లో ప్రేక్షకులుండగా… బాక్సాఫీస్ వద్దకు రానుంది. జాన్ అబ్రహాం కమాండోగా నటించిన ఈ సినిమా ఓ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన స్టోరీ. దేశభక్తి ప్రధానంగా సాగటంతో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల చేస్తున్నారు.
ఇంతకు ముందు జాన్ అండ్ జాకీ ‘డిషుమ్, హౌజ్ ఫుల్ 2, రేస్ 2’ చిత్రాల్లో కలసి నటించారు. నాలుగోసారి ‘అటాక్’లో రొమాంటిక్ గా ఒకర్నొకరు అటాక్ చేసుకోబోతున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందో… చూడాలి మరి!