సుధీర్ బాబు విడుదల చేసిన ‘జ’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా సోమవారం ‘జ’ మూవీ ట్రైలర్‌ను హీరో సుధీర్‌బాబు విడుదలచేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది.
ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ ”ఫెర్‌ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో ఈ సినిమాను అంగీకరించాను. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు” అని అన్నారు. దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ ”జ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి కథా బలం ఉన్న మూవీ. మా ప్రొడ్యూసర్ గోవర్ధన్ రెడ్డి నా మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేందర్ సహకారం మరువలేనిది” అని అన్నారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..