ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలేకి ముహూర్తం దగ్గరపడుతోంది. అయితే, ఇంకా టాప్ 4 కంటెస్టెంట్స్ ఎవరో క్లియర్ కాలేదు. ప్రస్తుతం రేసులో ఏడుగురు గాయకులున్నారు. పవన్ దీప్ రజన్, అరుణిత కంజిలాల్, షణ్ముఖప్రియ, నిహాల్ తౌరో, మహ్మద్ దానిష్, ఆశిష్ కులకర్ణి, సయాలీ కాంబ్లీ. అయితే, వీరిలో ఒక్కొక్కరు రానున్న రోజుల్లో షో నుంచీ తప్పుకోవాల్సి ఉంటుంది. ఫైనల్లో టాప్ 4 కంటెస్టెంట్స్ పోటీ పడతారు. వారెవరు అన్న దానిపై ప్రస్తుతం సొషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కొన్ని పోల్స్ కూడా నిర్వహిస్తున్నారు…
Read Also: నెటిజన్స్ కోసం… బికినీలో జాన్వీ నాటి పిక్స్!
సోనీ టీవీలో ప్రసారం అయ్యే ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా బాగా క్రేజ్ ఉంటుంది. ఈ యేడు కూడా ప్రేక్షకులు యాక్టివ్ గా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే, సొషల్ మీడియాలోనూ ఇండియన్ ఐడల్ 12 ఎవరు అవుతారని జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా ఓ పోల్ లో ‘సయాలీ కాంబ్లీ, పవన్ దీప్ రజన్, ఆశిష్ కులకర్ణి, అరుణిత కంజిలాల్’ టాప్ 4 కంటెస్టెంట్స్ గా 33శాతం ఓట్లు సంపాదించారు. ఈ లిస్టులో మన తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ చోటు సంపాదించలేకపోయింది. అయితే, రెండో స్థానంలో 29శాతం ఓటింగ్ స్వంతం చేసుకున్నారు… ‘పవన్ దీప్, షణ్ముఖ, సయాలీ, దానిష్’.
సొషల్ మీడియాలో నెటిజన్స్ వేసే ఓట్లు, పోలింగ్ రిజల్ట్స్ సంగతి ఎలా ఉన్నా… అధికారికంగా టాప్ 4 కంటెస్టెంట్స్ పేర్లు తెలిసే అవకాశం మరికొద్ది రోజుల్లోనే ఉంది. ఇండియన్ ఐడల్ 12 హోస్ట్ గా వ్యవహరించే ఆదిత్య నారాయణ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ చేశాడు. తమ సింగింగ్ రియాల్టీ షో చివరి నాలుగు వారాల్లోకి వచ్చేసిందని ఆయన అన్నాడు. అంటే, మరో మూడు వారాల్లో ఫైనలిస్టుల విషయంలో క్లారిటీ వస్తుంది. జూలై చివరికల్లా ఇండియన్ ఐడల్ 12 ఎవరో తెలిసిపోవచ్చు…