హిలేరియస్ గా ‘ఏక్ మినీ కథ’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు బాణీలు సమకూరుస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ‘ఏక్ మినీ కథ’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ దాదాపు 240 టెర్రటరీస్ లో విడుదల చేయబోతోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. సైకలాజికల్ ప్రాబ్లమ్ తో సైజ్ విషయంలో ఇన్ సెక్యూర్ గా ఫీలయ్యే ఓ అబ్బాయి పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన కూడా మైండ్ లోంచి చెరిపేసుకుంటాడు. అయితే అతడు అమృత అనే అమ్మాయిని కలసి ఆమెతో ప్రేమలో పడ్డాక ఏం జరిగిందన్నది ఈ చిత్రం కథ. అడల్ట్ కామెడీ తో హిలేరియస్ గా ఉన్న ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ‘ఏక్ మినీ కథ’ ట్రైలర్ ను వీక్షించండి.
Also Read
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!