ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ గాయకుడు, స్వర్గీయ ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే ఆయనకు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే చాలా కాలంగా ఘంటసాల రత్నకుమార్ కిడ్నీ సమస్యతో డయాలసిస్ పై ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘంటసాల అమర గాయకుడిగా పేరు గడిస్తే, ఆయన కుమారుడైన రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్ళలో తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ గాయకుడు కావాలని తపించానని, కానీ బ్రేక్ రాలేదని రత్నసాగర్ చెబుతుండేవారు. అదే సమయంలో తమిళ చిత్రం కంచి కామక్షికి తెలుగులో డబ్బింగ్ చెప్పానని, ఆ సినిమా దాదాపు వందరోజులు ప్రదర్శితం కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయని రత్నకుమార్ అన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ లో వేయికి పైగా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, సంస్కృత చిత్రాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. పది వేలకు పైగా తమిళ, తెలుగు టీవీ సీరియల్ ఎపిసోడ్స్ కు గాత్రాన్ని ఇచ్చారు. యాభైకు పైగా డాక్యుమెంటరీలకు వాయిస్ ఓవర్ అందించారు రత్నకుమార్. గతంలో ఎనిమిది గంటల పాటు నిరవధికంగా డబ్బింగ్ చెప్పి ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. అలానే అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ ఆయన పేరు నమోదైంది. గాయకుడిగా సినిమా రంగంలో గుర్తింపు దక్కకపోయినా పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన లలిత సంగీతాన్ని ఆలపించేవారు. అలానే చాలా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును ఘంటసాల రత్నకుమార్ అందుకున్నారు. ఘంటసాల రత్నకుమార్ దాదాపు యాభై అనువాద చిత్రాలకు రచన కూడా చేశారు. ఆయన కుమార్తె పూజా గాయనిగా రాణిస్తోంది.
Also Read
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- లవ్ ఎమోషనల్ రైడ్ గా ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
తాజావార్తలు
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్రెడ్డి హర్షం
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!