Site icon NTV Telugu

అన్నీ బయటపడతాయి అంటున్న ప్రియమణి…!

Family Man-2 : Priyamani Says that all that will be revealed in this Season

రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించింది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” జూన్ 4న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణిల ట్రాక్ సీజన్ వన్ లో ప్రశంసలు అందుకుంది. భర్తగా నటించిన మనోజ్ బాజ్‌పాయ్ తో సమస్యలు ఉన్న భార్య పాత్రలో ప్రియమణి నటించింది. అయితే ఫస్ట్ సీజన్ లో ప్రియమణి పాత్రకు సంబంధించిన ఒక విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. ప్రియమణి తన కొలీగ్ లో ఎఫైర్ నడుపుతుందా ? లేదా ? అన్నదే ఆ సస్పెన్స్. ఇప్పుడు “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఆ సస్పెన్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రియమణి రెండో సీజన్‌లో అన్నీ బయటపడతాయని, ప్రేక్షకులు సీజన్-2 కోసం ఇలా ఆతృతగా ఎదురు చూడటం చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పారు.

Exit mobile version