Dussehra 2023: దసరా డబుల్ ధమాకా.. రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోల సినిమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ లో సినిమాల జాతర మొదలుకానుంది.. ఎప్పుడూ సంక్రాంతికి సినిమా జాతర ఉంటే ఇప్పుడు దసరాకు బాక్సాఫీస్ షేక్ అవ్వబోతుంది.. ప్రస్తుతం జవాన్ మేనియా కొనసాగుతుంది.. విడుదలైన వారం రోజులకు రూ.600 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.. మరో వారం కలెక్షన్స్ ఇలానే కొనసాగానున్నాయని ఇండస్ట్రీలో టాక్.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పాజిటిల్ రెస్పాన్స్ అందుకుంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం. ఇక ఇప్పుడు సినీ ప్రియుల అందరి దృష్టి దసరా లపై పడింది. అక్టోబర్ మూడో వారంలో ఒకటి కాదు రెండు కాదు.. మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. దళపతి విజయ్, నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ దసరాకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. మరీ ఎవరెవరి చిత్రాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఓపారి చూసేద్దామా..
రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970ల నాటి నేపథ్యంలో సాగే స్టూవర్టుపురం దొంగ, బందిపోటు టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని గా తీసుకువస్తున్నారు. ఇందులో టైటిల్ పాత్రలో రవితేజ పోషిస్తున్నారు. ఇందులో నూపూర్ సనన్, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా ఈ సినమాను సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు..
Also Read
అలాగే నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రం భగవంత్ కేసరి. కాజల్, శ్రీలీల కీలకపాత్రలు పోషిస్తున్న ఈ ను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. యాక్షన కామెడీ చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. కొలివుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం లియో. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. మొత్తానికి దసరాకు సినీ అభిమానులకు డబుల్ ధమాకానే..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!