NTV Telugu Site icon

సిరివెన్నెల మృతిపై సినీ ప్రముఖుల సంతాపం..

తెలుగు చిత్ర పరిశ్రమ సాహిత్య శిఖరం సిరివెన్నల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈ నెల 24న న్యూమోనియాతో బాధపడుతూ కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల లేకపోవడంల నాకు తీరని లోటు.. బాలసుబ్రమణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం రాలిపోయిందనుకున్నా.. ఇప్పుడు నా ఎడమ భుజం కూడా రాలిపోయింది. నాకు ఏం చేయాలో కూడా అర్థకావడం లేదు.. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలి – కే విశ్వనాథ్‌


సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను.- నందమూరి కళ్యాణ్‌ రామ్‌

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణవార్త తెలిసి దిగ్భ్రాంతి, బాధ కలిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌, సైరా కోసం ఆయన చేసిన విలువైన మాటలు నా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సాహిత్యం, తెలుగు సినిమాకి ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌

వసంతలాగా వంచిన సిరివెన్నెలాంటి వ్యక్తి మళ్లీ అందకుండా తిరిగి గగనానికి ఎగిరిపోయారు. ఏదో పనిఉన్నట్టుగా.. ఎవ్వరో పిలుస్తున్నట్టుగా మనందరినీ విడిచిపెట్టి సిరివెన్నెల వెళ్లిపోయారు. సిరివెన్నెల మరణం సాహిత్య, తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటు. సిరివెన్నెల కుటుంబాని ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను- సంగీత దర్శకులు రఘు కుంచె

ఇంకెక్కడి వెన్నెల.. తెలుగు పాటకు అమావాస్య – దర్శకుడు హరీశ్‌ శంకర్‌

తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన అసమానమైన సహకారానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మీతో కలిసి పనిచేయడం గొప్ప విషయం. ప్రశాంతంగా ఉండండి సార్.- హీరో రామ్‌ పోతినేని

ది లెజెండ్‌ ఇక లేరు. ప్రశాంతంగా ఉండండి సార్‌ – సంగీత దర్శకుడు తమన్‌